![Sanath Jayasuriya Fastest ODI Fifty Completes 22 Years - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/7/Sanath-Jayasuriya.jpg.webp?itok=PMypvCbH)
రికార్డులంటే ఇప్పటి ఆటగాళ్లకి.. చూసే ప్రేక్షకులకు మాములుగా అనిపిస్తుందేమోగానీ... ఒకప్పుడు వాటికి చాలా క్రేజ్.. గుర్తింపు ఉండేవి. వన్డే ఫార్మట్‌లో పరుగులు సాధించటమే గగనమైన రోజుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ద్వారా శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య రికార్డు సృష్టించారు. కేవలం 17 బంతుల్లోనే అర్థ శతకం సాధించి.. రికార్డుల జాబితాలో తన పేరును లిఖించుకున్నారు. ఆ ఘట్టానికి నేటితో సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యింది. (నడవలేని స్థితిలో జయసూర్య)
1996లో సింగపూర్ వేదికగా పాకిస్థాన్‌తో శ్రీలంక వన్డే మ్యాచ్‌లో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 215 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక లక్ష్య చేధనలో విఫలమైంది. 172 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓడిపోయింది. అయితే జయసూర్య ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ చరిత్రలో స్థిరపడిపోయింది. మొత్తం 28 బంతులు ఎదుర్కున్న స్టార్ ప్లేయర్ 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు సాధించారు. ఆ సమయంలో నమోదైన రికార్డును గుర్తు చేస్తూ ఐసీసీ తన ట్విటర్‌లో ఓ ట్వీట్ చేసింది.
#OnThisDay in 1996, Sri Lanka's @Sanath07 blitzed 76 off 28 balls against Pakistan in Singapore, reaching 50 off 17 balls - the fastest ODI half-century at the time! pic.twitter.com/lSh5AldI0f
— ICC (@ICC) 7 April 2018
Comments
Please login to add a commentAdd a comment