fastest 50
-
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసిన జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. సంప్రదాయ క్రికెట్లో ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించిన ఈ లెఫ్టాండర్.. తాజాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు సందర్భంగా మరో రికార్డు నమోదు చేశాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ శతకం బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు.ఈ క్రమంలో భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను జైస్వాల్ అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై టెస్టులో 280 పరుగులతో గెలిచిన టీమిండియా.. కాన్పూర్ వేదికగా రెండో మ్యాచ్ ఆడుతోంది. గ్రీన్‌పార్క్ స్టేడియంలో శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌కు తొలిరోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. ఈ క్రమంలో రెండు, మూడో రోజు ఆట రద్దు కాగా.. సోమవారం మ్యాచ్ మళ్లీ మొదలైంది.ఆది నుంచే దూకుడుగాఈ నేపథ్యంలో 107/3 స్కోరుతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 11 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. 209కి పైగా స్ట్రైక్‌రేటుతో ఆకట్టుకున్నాడు.టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం ‘బజ్‌బాల్’ తరహా ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. తద్వారా టీమిండియా తరఫున టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై బ్యాటర్.. 12 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72 పరుగులు రాబట్టాడు.టీమిండియా తరఫున టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం సాధించినది వీరే👉రిషభ్ పంత్- బెంగళూరులో 2022 నాటి శ్రీలంకతో మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 50 రన్స్👉కపిల్ దేవ్- కరాచిలో 1982 నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 30 బంతుల్లోనే 50 రన్స్👉శార్దూల్ ఠాకూర్- ఓవల్‌లో 2021 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉యశస్వి జైస్వాల్- కాన్పూర్‌లో 2024 నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మీద 31 బంతుల్లోనే 50 రన్స్👉వీరేంద్ర సెహ్వాగ్- చెన్నైలో 2008 నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మీద 32 బంతుల్లో 50 రన్స్.ప్రపంచ రికార్డుఇక ధనాధన ఇన్నింగ్స్‌తో అలరించిన రోహిత్ శర్మ- యశస్వి జైస్వాల్ జోడి టెస్టుల్లో హయ్యస్ట్ స్కోరింగ్ రేటు(14.34) పార్ట్నర్షిప్ సాధించిన తొలి జంటగా అరుదైన ఘనత సాధించింది. ఇద్దరూ కలిసి 23 బంతుల్లోనే 55 పరుగులు సాధించి ఈ ఫీట్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్ జోడీ బెన్ స్టోక్స్- బెన్ డకెట్(44 బంతుల్లో 87 నాటౌట్), వాగ్నర్- ట్రెంట్ బౌల్ట్(27 బంతుల్లో 52) ఉన్నారు. చదవండి: రాహుల్ ద్రవిడ్ కుమారుడికి షాక్.. ఇకపై ఆ జట్టుకు ఆడలేడు! View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం అయ్యింది. వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, అప్పటివరకు సోల్‌గా ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును హోల్డ్ చేసిన కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ సరసన చేరింది. 2015 ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సోఫీ కూడా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌కు ముందు ఎల్లిస్ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు అర్ధసెంచరీతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (13 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కూడా చెలరేగడంతో ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు బెత్ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్లాండ్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, షమీలియా కొన్నెల్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి వృధా.. ఆసీస్ ప్లేయర్ లిచ్‌ఫీల్డ్ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టితో చెలరేగినప్పటికీ విండీస్‌పై ఆసీస్ విజయం సాధించలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ సూపర్ సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మాథ్యూస్‌కు జతగా స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా విండీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగన్ షట్ 2, జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 అక్టోబర్ 5న జరుగుతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. -
యశస్వి జైశ్వాల్ చరిత్ర.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో శివతాండవం ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసి చరిత్రకెక్కాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకుని రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు దేశవాళీలో మంచి ఫామ్ కనబరిచిన జైశ్వాల్ కూడా జైస్వాల్ అదరగొట్టాడు. అదే ఫామ్‌ను ఐపీఎల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. 13 బంతుల్లోనే జైస్వాల్ ఫిఫ్టీ మార్క్ అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.. ఇక ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు యువరాజ్ సింగ్ పేరిట ఉంది. 12 బంతుల్లోనే యువరాజ్ ఈ ఫీట్ సాధించాడు. ఇక యువరాజ్ తర్వాత జైస్వాల్ రెండో స్థానంలో నిలిచాడు. 2007 టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై యువీ 12 బాల్స్ లోనే ఫిఫ్టీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్ లు బాదిన రికార్డు కూడా ఉంది. The Yashasvi effect❤️🔥 - FASTEST 50 in #TATAIPL history!! 🤯💪#KKRvRR #IPL2023 #IPLonJioCinema | @rajasthanroyals @ybj_19 pic.twitter.com/WgNhYJQiUN — JioCinema (@JioCinema) May 11, 2023 చదవండి: KKR VS RR: చరిత్ర సృష్టించిన చహల్ -
శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు అని టక్కున చెప్పేస్తుంటాం. రహానే కూడా అలానే కనిపిస్తుంటాడు. మ్యాచ్‌లో అయినా.. మ్యాచ్ బయట అయినా అతను ఒకే విధంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి రహానే ఇవాళ మాత్రం తనలో దాగున్న ఉగ్రరూపాన్ని బయటపెట్టాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అన్నట్లుగా సాగిన బ్యాటింగ్ దెబ్బకు ఐపీఎల్ 16వ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. శనివారం ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రహానే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రహానే సీజన్లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీని అందుకున్నాడు. కాగా జాస్ బట్లర్, శార్దూల్ ఠాకూర్లు ఈ సీజన్లో 20 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకోగా.. తాజాగా వీరిద్దరిని అధిగమించిన రహానే సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రహానేకు పూనకం వచ్చిందా అన్నట్లుగా చెలరేగాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. ఇక సీఎస్కే తరపున ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కంటే ముందు సురేశ్ రైనా(16 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. మొయిన్ అలీ కూడా 19 బంతుల్లోనే అర్థశతకం సాధించి రహానేతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా.. ఇక ధోని, అంబటి రాయుడులు 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రహానే నిలిచాడు. తొలి స్థానంలో పాట్ కమిన్స్(14 బంతుల్లో), రిషబ్ పంత్(18 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు. The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V — JioCinema (@JioCinema) April 8, 2023 చదవండి: అక్కడుంది జడ్డూ.. బంతి మిస్సయ్యే చాన్స్ లేదు -
#Lord Shardul: ఆర్సీబీకి చుక్కలు.. తొలి ఫిఫ్టీతోనే రికార్డులు
ఐపీఎల్ 16వ సీజన్లో కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. తన బ్యాటింగ్ పవర్ చూపించిన శార్దూల్ ఐపీఎల్లో తొలి అర్థసెంచరీ సాధించాడు. కేవలం 20 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న శార్దూల్ ఠాకూర్ ఈ సీజన్లో జాయింట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించి రికార్డులకెక్కాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా 20 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ఇక కేకేఆర్ తరపున ఏడు, ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి 50ప్లస్ స్కోరు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు. ఇంతకముందు ఆండ్రీ రసెల్ ఐదుసార్లు, పాట్ కమిన్స్ మూడుసార్లు, సాహా, శార్దూల్ ఠాకూర్లు ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఇక ఏడు ఆ తర్వాత స్థాన్లాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఐపీఎల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ శార్దూల్ చోటు సంపాదించాడు. ఓవరాల్‌గా శార్దూల్ 29 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఒక దశలో 150 కూడా కష్టమనుకున్న తరుణంలో రింకూ సింగ్(33 బంతుల్లో 46 పరుగులు)తో కలిసి ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించి కేకేఆర్ స్కోరు 200 మార్క్ అందుకునేలా చేశాడు. Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
టీ20ల్లో మొయిన్ అలీ అరుదైన రికార్డు.. ఇంగ్లండ్ తొలి ఆటగాడిగా!
బుధవారం బ్రిస్టల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్లతో అలీ హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా అలీ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్‌పై 17 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన లియామ్ లివింగ్‌స్టోన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ రికార్డును అలీ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. అతడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సౌతాఫ్రికాపై ఇంగ్లండ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జానీ బెయిర్ ప్టో(90) పరుగులతో చేలరేగగా.. మొయిన్ అలీ(52) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 193 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ట్రిస్టన్ స్టాబ్స్( 28 బంతుల్లో 72 పరుగులు), రీజా హెండ్రిక్స్(57) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో రిచర్డ్ గ్లెసన్ 3, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్ రెండు వికెట్లు తీయగా.. మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: Shikhar Dhawan: ప్రపంచకప్ జట్టులో ధావన్ ఉండాలి! అవసరం లేదు! -
ఆ వీరవిహారానికి 22 ఏళ్లు పూర్తి
రికార్డులంటే ఇప్పటి ఆటగాళ్లకి.. చూసే ప్రేక్షకులకు మాములుగా అనిపిస్తుందేమోగానీ... ఒకప్పుడు వాటికి చాలా క్రేజ్.. గుర్తింపు ఉండేవి. వన్డే ఫార్మట్‌లో పరుగులు సాధించటమే గగనమైన రోజుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ద్వారా శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య రికార్డు సృష్టించారు. కేవలం 17 బంతుల్లోనే అర్థ శతకం సాధించి.. రికార్డుల జాబితాలో తన పేరును లిఖించుకున్నారు. ఆ ఘట్టానికి నేటితో సరిగ్గా 22 ఏళ్లు పూర్తయ్యింది. (నడవలేని స్థితిలో జయసూర్య) 1996లో సింగపూర్ వేదికగా పాకిస్థాన్‌తో శ్రీలంక వన్డే మ్యాచ్‌లో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 215 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక లక్ష్య చేధనలో విఫలమైంది. 172 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓడిపోయింది. అయితే జయసూర్య ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ చరిత్రలో స్థిరపడిపోయింది. మొత్తం 28 బంతులు ఎదుర్కున్న స్టార్ ప్లేయర్ 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు సాధించారు. ఆ సమయంలో నమోదైన రికార్డును గుర్తు చేస్తూ ఐసీసీ తన ట్విటర్లో ఓ ట్వీట్ చేసింది. #OnThisDay in 1996, Sri Lanka's @Sanath07 blitzed 76 off 28 balls against Pakistan in Singapore, reaching 50 off 17 balls - the fastest ODI half-century at the time! pic.twitter.com/lSh5AldI0f — ICC (@ICC) 7 April 2018 -
వన్డేల్లో డివిల్లీర్స్ రెండు ప్రపంచ రికార్డులు
-
వన్డేల్లో డివిల్లీర్స్ రెండు ప్రపంచ రికార్డులు
జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. ఢివిల్లీర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో) చేసి రికార్డుల పుటలకెక్కాడు. వెస్టిండీస్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో డివిల్లీర్స్ (44 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో 149) ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిని ఏబీ మరో 15 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కోరీ అండర్సన్ (36 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ, శ్రీలంక ఆటగాడు జయసూర్య (17 బంతుల్లో) నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డులు కనుమరుగయ్యాయి. విండీస్‌తో మ్యాచ్‌లో సఫారీలు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లకు 439 పరుగులు సాధించారు. ఆమ్లా (153), రొసొవ్ (128) కూడా సెంచరీలు చేశారు.