Photo: IPL Twitter
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే పేరు చెప్పగానే ప్రశాంతతకు మారుపేరు అని టక్కున చెప్పేస్తుంటాం. రహానే కూడా అలానే కనిపిస్తుంటాడు. మ్యాచ్‌లో అయినా.. మ్యాచ్ బయట అయినా అతను ఒకే విధంగా వివాదాలకు దూరంగా ఉంటాడు. అలాంటి రహానే ఇవాళ మాత్రం తనలో దాగున్న ఉగ్రరూపాన్ని బయటపెట్టాడు. అసలు ఆడుతుంది రహానేనా లేక ఇంకెవరైనా అన్నట్లుగా సాగిన బ్యాటింగ్ దెబ్బకు ఐపీఎల్ 16వ సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది.
శనివారం ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన రహానే ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రహానే సీజన్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీని అందుకున్నాడు.
కాగా జాస్ బట్లర్, శార్దూల్ ఠాకూర్‌లు ఈ సీజన్‌లో 20 బంతుల్లో అర్థశతకం మార్క్‌ను అందుకోగా.. తాజాగా వీరిద్దరిని అధిగమించిన రహానే సీజన్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అర్షద్ ఖాన్ వేసిన 4వ ఓవర్లో రహానేకు పూనకం వచ్చిందా అన్నట్లుగా చెలరేగాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు.
ఇక సీఎస్‌కే తరపున ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన రెండో ఆటగాడిగా రహానే నిలిచాడు. రహానే కంటే ముందు సురేశ్ రైనా(16 బంతుల్లో) తొలి స్థానంలో ఉన్నాడు. మొయిన్ అలీ కూడా 19 బంతుల్లోనే అర్థశతకం సాధించి రహానేతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉండగా.. ఇక ధోని, అంబటి రాయుడులు 20 బంతుల్లో ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నారు.
ఇక ముంబై ఇండియన్స్‌పై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రహానే నిలిచాడు. తొలి స్థానంలో పాట్ కమిన్స్(14 బంతుల్లో), రిషబ్ పంత్(18 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V
— JioCinema (@JioCinema) April 8, 2023
Comments
Please login to add a commentAdd a comment