Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య జరిగిన మ్యాచ్‌లో హీరో ఎవరని అడిగితే వినిపించే పేరు అజింక్యా రహానేదే. ముంబై ఇండియన్స్ చేసిన 158 పరుగులు అనేది కాపాడుకోగలిగిన లక్ష్యమే. కానీ ఇవాల రహానే చేసిన విధ్వంసానికి ముంబై విధించిన లక్ష్యం చిన్నదైపోయింది.
ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే రహానేలో ఇంత ఫైర్ దాగుందా అన్నట్లుగా ఆడిన అతను పెను సంచలనమే చేశాడు. బంతి పడిందే ఆలస్యం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న రహానే పనిలో పనిగా సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 19 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకున్న రహానే జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితేనేం అప్పటికే తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ముంబై నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ ధోని బ్యాటింగ్‌కు ముందు తనకు ఏం చెప్పి పంపించాడో రివీల్ చేయడం ఆసక్తి కలిగించింది. రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు ఆటను బాగా ఎంజాయ్ చేశాను. టాస్‌కు కొద్ది నిమిషాల ముందే నేను తుది జట్టులో ఉన్నట్లు తెలిసింది. మొయిన్ అలీ ఈ మ్యాచ్ ఆడడం లేదని.. అతని స్థానంలో నువ్వు ఆడుతున్నావని కోచ్ ప్లెమింగ్ చెప్పాడు. ఆడింది రంజీ ట్రోపీ అయినప్పటికి ఈ సీజన్‌లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాను. ఇవాళ్టి మ్యాచ్‌లో దానిని కొనసాగిలంచాలనుకున్నా.
ఇక మహీ బాయ్ నేను బ్యాటింగ్ రావడానికి ముందు ఒకటే చెప్పాడు. ''బాగా ప్రిపేర్ అవ్వు.. నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపిస్తున్నా.. వెళ్లి ఆటను ఎంజాయ్ చెయ్యు.. ఒత్తిడిని మాత్రం దరి చేరనీయకు.. మేమంతా నీకు సపోర్ట్‌గా ఉన్నాం.. ఈరోజు ఆట నీది.. బాగా ఆడు'' అని చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు.
The fastest 50 of the season so far and it's from @ajinkyarahane88 💪#MIvCSK #TATAIPL #IPLonJioCinema #IPL2023 | @ChennaiIPL pic.twitter.com/PZzmJJ999V
— JioCinema (@JioCinema) April 8, 2023
చదవండి: శాంతంగా కనిపించే రహానే ఉగ్రరూపం.. సీజన్‌లోనే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ
Comments
Please login to add a commentAdd a comment