
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా అక్కడి స్టేడియం ధోని నామస్మరణతో మార్మోగిపోవడం చూస్తున్నాం. తాజాగా శనివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ వారి సొంతగ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరిగినప్పటికి ధోని అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోయింది. మ్యాచ్‌లో సీఎస్‌కే ఏడు వికెట్ల తేడాతో ముంబైపై విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ముచ్చటించడం ఆసక్తి కలిగించింది. ఈ నేపథ్యంలో ధోని సూర్యకు విలువైన బ్యాటింగ్ టెక్నిక్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ధోని నుంచి విలువైన పాఠాలు అందుకున్నాడు.. ''ఇక వచ్చే మ్యాచ్ నుంచి సూర్య బాదుడు మొదలుపెట్టడం ఖాయమని'' అభిమానులు కామెంట్ చేశారు.
ఇక సూర్యకుమార్ ఐపీఎల్‌లోనూ తన పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన సూర్య.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో వైడ్ అనుకొని బంతిని వదిలేయగా.. అది గ్లోవ్స్‌ను తాకుతూ కీపర్ ధోని చేతుల్లో పడడం.. ధోని వెంటనే క్యాచ్‌పై రివ్వూ వెళ్లి ఫలితం సాధించాడు. దీంతో డీఆర్‌ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూ ఫ్యాన్స్ పేర్కొన్నారు.
Not the result I wanted but lucky to catch glimpses of dhoni and Surya... pic.twitter.com/HOURfO3Wul
— Ashish (@ghalkeashish) April 8, 2023