Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్‌సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది.
అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్‌కేతో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్‌లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్‌కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్‌కేకు సానుకూలాంశంగా మారనుంది.
అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్‌కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు.
అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment