S Badrinath
-
అదే జరిగితే పుండు మీద కారం చల్లినట్లే..!
ఐపీఎల్ 16వ సీజన్‌ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్‌కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్కేతో మ్యాచ్‌కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్‌కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్కేతో మ్యాచ్‌కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్కేకు సానుకూలాంశంగా మారనుంది. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్‌కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్సీబీతో మ్యాచ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్‌సన్‌లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది. -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తోంది. దీని ప్రభావం క్రీడారంగంపై భారీగా పడింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 టోర్నీలో పాల్గొన్న ఇండియా లెజెండ్స్ జట్టు ఆటగాళ్లు రోజుకొకరు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వైరస్ బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో మరో ప్లేయర్ చేరాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోమవారం ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.. తన సోదరుడు యూసుఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో తాను కూడా పరీక్ష చేయించుకున్నానని ఇర్ఫాన్ వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నాని ఆయన ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో భారత క్రికెటర్‌కు కరోనా
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తొలుత సచిన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆతరువాత యూసఫ్ పఠాన్, తాజాగా సుబ్రమణ్యం బద్రీనాధ్ వైరస్ పీడిత జాబితాలో చేరారు. బద్రీనాధ్.. వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడంతో టెస్టు చేయించుకున్నాని, కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తమిళనాడుకు చెందిన బద్రీనాధ్.. భారత్ తరఫున 2008-2011 మధ్యలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో వరుసగా టైటిల్లు సాధించడంలో బద్రీనాధ్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత లెజెండ్స్ సభ్యుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వైరస్ బారిన పడ్డ క్రికటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. -
క్రికెట్‌కు బద్రీనాథ్ గుడ్‌బై
చెన్నై: టీమిండియా మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన 38 ఏళ్ల ఈ మిడిల్డార్ బ్యాట్స్‌మన్ బద్రీనాథ్ రెండు టెస్ట్‌లు, ఏడు వన్డేలు, ఓ టీ-20లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 145 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలున్నాయి. బద్రీనాథ్ రంజీల్లో హైదరాబాద్, విదర్భలకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. దాదాపు ఏడేళ్ల క్రితం భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడిన బద్రీనాథ్.. ఇక క్రికెట్‌కు దూరంగా ఉండేందుకు ఇదే సరైన సమయం అని భావించి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రధానంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెబుతున్నట్లు స్పష్టం చేశాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 2010-11 సీజన్ అత్యుత్తమంగా బద్రీనాథ్ పేర్కొన్నాడు. ఆ సమయంలోనే అత్యధిక శతకాలు సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. -
క్రికెటర్ బద్రీనాథ్ అరుదైన ఘనత
వల్సాడ్ (గుజరాత్):హైదరాబాద్ క్రికెట్ కెప్టెన్ సుబ్రమణియన్ బద్రీనాథ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో పదివేల పరుగుల క్లబ్లో చేరాడు. చత్తీస్‌గఢ్‌తో మ్యాచ్ సందర్భంగా బద్రీనాథ్(134) శతకం బాది పదివేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఫస్ట్ క్లాస్‌ల్లో పదివేల పరుగులను పూర్తి చేసుకున్న 47వ భారతీయ క్రికెటర్‌గా బద్రీనాథ్ నిలిచాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 55.19 సగటుతో 10,045 పరుగులు బద్రీనాథ్ సాధించాడు. 2000-01 సీజన్లో తమిళనాడు రాష్ట్రం తరపున బద్రీనాథ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 250. 2009లో ముంబైపై అత్యధిక స్కోరు బద్రీనాథ్ సాధించాడు. ఇదే తన కెరీర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అని బద్రీనాథ్ తాజాగా పేర్కొన్నాడు. దాంతో పాటు రంజీల్లో తమిళనాడు జట్టును మూడుసార్లు ఫైనల్‌కు చేర్చడంలో తన పాత్రను గుర్తు చేసుకున్నాడు.ఆ తరువాత తాను విదర్భ జట్టుకు ఆడానని, తాను ఆ జట్టు తరపున పాల్గొన్న తొలి సీజన్లోనే నాకౌట్ అర్హత సాధించామన్నాడు. ఇవన్నీ తన కెరీర్లో మరిచిపోలేనివని బద్రీనాథ్ స్పష్టం చేశాడు.