ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. బుధవారం పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆర్చర్ బౌలింగ్‌ను ఒక ఆట ఆడుకున్నారు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆర్చర్ 56 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆర్చర్ వీక్‌నెస్ ఏంటో తెలిసిన లివింగ్‌స్టోన్ హ్యాట్రిక్ సిక్సర్లతో స్వాగతం పలికాడు. దీంతో దెబ్బకు ఆర్చర్ ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకోవడం ఆర్చర్‌కు ఇదే తొలిసారి.
అసలు వేస్తుంది ఆర్చరా లేక దేశవాలీ క్రికెటర్ ఎవరైనానా అన్న సందేహం కలిగింది. ఏ మాత్రం పసలేని బౌలింగ్‌తో ఆర్చర్ ముంబై ఇండియన్స్‌ను ముంచాడు. జాసన్ బెహండార్ఫ్‌ను కాదని ఆర్చర్‌ను నమ్మి రోహిత్ తప్పు చేశాడు. పూర్తిగా గతి తప్పిన బౌలింగ్‌తో ఆర్చర్ మ్యాచ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం స్పష్టంగా కనిపించింది.
ఇక ఆర్చర్ బౌలింగ్ చూశాకా అర్జున్ టెండూల్కర్ నయం అని చాలామంది అభిమానులు అభిప్రాయపడ్డారు. మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ 9.3 ఎకానమీతో మూడు వికెట్లు తీశాడు. అయితే ఆర్చర్‌తో పోలిస్తే అర్జున్ బౌలింగ్ బెటర్‌గా ఉందని.. అతనికి అవకాశం ఇచ్చినా బాగుండేదని పేర్కొన్నారు.
Liam Livingstone hits 6,6,6 vs Jofra Archer in 3 balls.
— CricketMAN2 (@ImTanujSingh) May 3, 2023
Liam Livingstone - What a beast, what a striker! pic.twitter.com/Pnx91jGohd
Comments
Please login to add a commentAdd a comment