వన్డేల్లో డివిల్లీర్స్ రెండు ప్రపంచ రికార్డులు
జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిల్లీర్స్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఒకే మ్యాచ్లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. ఢివిల్లీర్స్ వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బంతుల్లో), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బంతుల్లో) చేసి రికార్డుల పుటలకెక్కాడు.
వెస్టిండీస్తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో డివిల్లీర్స్ (44 బంతుల్లో 16 సిక్సర్లు, 8 ఫోర్లతో 149) ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిని ఏబీ మరో 15 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కోరీ అండర్సన్ (36 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ, శ్రీలంక ఆటగాడు జయసూర్య (17 బంతుల్లో) నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డులు కనుమరుగయ్యాయి.
విండీస్తో మ్యాచ్లో సఫారీలు నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లకు 439 పరుగులు సాధించారు. ఆమ్లా (153), రొసొవ్ (128) కూడా సెంచరీలు చేశారు.