భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.
నవీ ముంబైలో
ఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.
స్మృతి ధనాధన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.
రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమం
అయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్‌లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది.
అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.
రాధా యాదవ్ దూకుడు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.
చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ
A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏
Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024
Comments
Please login to add a commentAdd a comment