Richa Ghosh
-
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్‌తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్‌కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్‌ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్‌పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్‌పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్‌లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్‌పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్‌లో యార్క్‌షైర్ డైమండ్‌పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే! -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్‌కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్‌లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్‌ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా... మరో ఎండ్‌లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్‌లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్‌లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్‌కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్‌దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్‌ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో రిచా మ్యాచ్‌ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్‌లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్‌తో వెస్టిండీస్‌ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
12th exams : న్యూజిలాండ్‌తో సిరీస్‌కు టీమిండియా క్రికెటర్ దూరం (ఫొటోలు)
-
IND Vs PAK: 'లేడీ ధోని' కళ్లు చెదిరే క్యాచ్.. పాక్ బ్యాటర్ మైండ్ బ్లాంక్( వీడియో)
మహిళల టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ సంచలన క్యాచ్‌తో మెరిసింది. కళ్లు చెదిరే క్యాచ్‌తో పాక్ కెప్టెన్ ఫాతిమా సానాను రిచా పెవిలియ్నకు పంపింది. పాక్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన ఆశా శోభన ఐదో బంతిని ఫాతిమాకు లూపీ డెలివరీగా సంధించింది.అప్పటికే స్వీప్ ఆడి వరుసగా రెండు బౌండరీలు బాదిన ఫాతిమా.. ఆ డెలివరీని కూడా స్లాగ్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని వైడ్ ఔట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ రిచా తన కుడివైపు పక్షిలా డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకుంది. దీంతో పాక్ కెప్టెన్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ రిచా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా రిచాను అభిమానులు ముద్దుగా లేడి ధోని అని పిలుచుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పాక్ 105 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పేసర్ అరుంధతి రెడ్డి మూడు వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ రెండు, రేణుకా, దీప్తి శర్మ, ఆశా తలా వికెట్ సాధించారు. పాక్ బ్యాటర్లలో నిధా ధార్(28) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.చదవండి: సురేష్ రైనా సిక్సర్ల వర్షం.. దద్దరిల్లిన మైదానం(వీడియో) pic.twitter.com/jsqeOCpCAv— Cricket Cricket (@cricket543210) October 6, 2024 -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్‌ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్‌కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్‌కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
చరిత్ర సృష్టించిన 'లేడీ ధోని'.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
భారత మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియాకప్‌లో అత్యధిక స్టంపౌట్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో రీతూ మూనీని స్టంపౌట్ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.రిచా ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఏడు స్టంప్‌లు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాటియా ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(55 పరుగులు), షఫాలీ వర్మ 26 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. pic.twitter.com/zkbz9CR5ub— hiri_azam (@HiriAzam) July 26, 2024 -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
'రిచా' ది వారియర్.. లేడీ ధోని! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్-2024లో భాగంగా ఆదివారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విరోచిత పోరాటం మాత్రం అందరని అకట్టుకుంది. ఆఖరివరకు రిచా అద్భుతంగా పోరాడనప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయింది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే కెప్టెన్ స్మృతి మంధాన (5) పెవిలియన్‌కు చేరింది. సోఫీ మోలినెక్స్ (30), ఎలీస్ పెరీ (49) బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే ఇద్దరూ ఓవర్ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. బౌండరీల వర్షం కురిపిస్తూ బౌలర్లపై ఒత్తడి పెంచింది. సోఫీ డివైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఆ తర్వాత డివైన్ ఔటైనప్పటికీ రిచా జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఆర్సీబీ విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమయ్యాయి. 18వ ఓవర్లో రిచా ఘోష్, జార్జియా (12) చెరో బౌండరీ సాధించడంతో 12 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్లో జార్జియాను షికా పాండే ఔట్ చేయడంతో బెంగళూరు విజయ సమీకరణం 6 బంతుల్లో 17 పరుగులుగా మారింది. చివరి ఓవర్లో జొనాస్సెన్ వేసిన తొలి బంతిని రిచా ఘోష్ సిక్సర్‌గా మలిచింది. రెండో బంతికి పరుగేమి లభించలేదు. మూడో బంతికి దిశా రనౌటైంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రిచా.. ఐదో బంతిని స్టాండ్స్‌కు తరలించింది. దీంతో ఆఖరి బంతికి ఆర్సీబీ విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అయితే స్ట్రైక్‌లో రిచా ఉండడంతో ఆర్సీబీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆఖరి బంతికి రిచా రనౌట్ కావడంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఇది చూసిన కోట్ల మంది ఆర్సీబీ ఆభిమానుల గుండె బద్దలైంది. కన్నీరు పెట్టుకున్న రిచా.. ఇక ఆఖరి వరకు పోరాడి జట్టును గెలిపించలేకపోయిన రిచా కన్నీరు పెట్టుకుంది. మైదానంలోనే కన్నీటి పర్యంతం అయింది. ఢిల్లీ క్రికెటర్లు షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్ ఆమె వద్దకు వెళ్లి ఓదర్చారు. ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ సైతం రిచాను హగ్ చేసుకుని ఓదార్చింది. ఇక అద్బుతమైన పోరాట పటిమ చూపిన రిచాపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. లేడి ధోని అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం రిచాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రిచా ఘోష్ ఫొటోతో 'యూ ఆర్ ఏ స్టార్' అంటూ సూర్య రాసుకొచ్చాడు. A nail-biting finish to #DCvRCB🔥#DelhiCapitals seal a narrow win ✌#TATAWPL #TATAWPLonJioCinema #TATAWPLonSports18#JioCinemaSports #CheerTheW pic.twitter.com/qbCSX4KF4B — JioCinema (@JioCinema) March 10, 2024 Another Classic in #TATAWPL @DelhiCapitals win the match by 1 RUN! They jump to the top of points table 🔝 Scoreboard 💻 📱 https://t.co/b7pHKEKqiN#DCvRCB pic.twitter.com/znJ27EhXS6 — Women's Premier League (WPL) (@wplt20) March 10, 2024 -
మంధాన క్రేజ్.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్
WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ సోఫీ డివైన్(1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. వన్‌డౌన్ బ్యాటర్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. Captain Smriti Mandhana on fire. 🔥pic.twitter.com/vfvhMozwsk — Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024 ఈ నేపథ్యంలో రెండో ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్, ఫోర్‌తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్ తొలి బంతికే మెగ్రాత్ బౌలింగ్‌లో వ్రిందా దినేశ్‌కు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఆమె తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్ కీపర్ రిచా ఘోష్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. Brilliant half-century for Sabbhineni Meghana in front of a massive crowd! Can she power @RCBTweets to a match-winning total? Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/geoj3JWH61 — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 Richa Gosh reaches her maiden FIFTY for #RCB 💪🔥 Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/9QtU8s27Hk — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్ కాగా.. సోఫీ మొలినెక్స్ 9, శ్రెయాంక పాటిల్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హ్యారిస్, తహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. Smriti Mandhana was impressed with Home Crowd 😂❤️ ❤️#RCB pic.twitter.com/4vbwccmhDG — RCB Xtra. (@Rcb_Xtra) February 24, 2024 -
రిచా ఘోష్ వీరోచిత పోరాటం వృధా.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోయింది. రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్‌ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు. అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. -
బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్‌పై వేటు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి. వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు. -
T20 WC: అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు!
Women's T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్), వెస్టిండీస్‌పై 44(నాటౌట్), ఇంగ్లండ్‌పై 47(నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. అదే విధంగా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్‌లో రిచా ఘోష్ భాగస్వామ్యమైంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఇదే(బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. తజ్మీన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా)- 186 పరుగులు సగటు 37.20 2. అలిసా హేలీ(వికెట్ కీపర్- ఆస్ట్రేలియా)- 189 పరుగులు సగటు 47.25, నాలుగు డిస్మిసల్స్ 3. లారా వాల్వర్ట్(సౌతాఫ్రికా)- 230 పరుగులు సగటు 46 4. నాట్ సీవర్- బ్రంట్(కెప్టెన్- ఇంగ్లండ్)- 216 పరుగులు సగటు 72 5. ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా)- 110 పరుగులు 36.66, 10 వికెట్లు 6. రిచా ఘోష్(ఇండియా)- 136 పరుగులు సగటు 68 7. సోఫీ ఎక్లిస్టోన్(ఇంగ్లండ్)- 11 వికెట్లు 8. కరిష్మ రామ్హరక్(వెస్టిండీస్)- 5 వికెట్లు 9. షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 8 వికెట్లు 10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా)- 7 వికెట్లు 11. మేగన్ షట్(ఆస్ట్రేలియా)- 10 వికెట్లు 12: ఓర్లా ఫ్రెండర్గాస్ట్(ఐర్లాండ్)- 109 పరుగులు సగటు 27.25. సెమీస్‌లోనే.. ఇక భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన అండర్-19 కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ సీనియర్ టీమ్ వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం అంచనాల మేర రాణించలేకపోయారు. ఇక ఈ ఈవెంట్లో హర్మన్ సేన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది -
RCB: స్మృతి మంధాన సహా ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే.. పర్సులో ఎంత ఉందంటే?
WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్ లీగ్-2023 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌ను భారీ మొత్తం చెల్లించి హైలైట్‌గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే.. ►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు ►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు ►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు ►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు ►సోఫీ డివైన్- రూ.50 లక్షలు ►హీతెర్ నైట్- రూ.40 లక్షలు ►మేగన్ షుట్- రూ.40 లక్షలు ►కనిక అహుజ- రూ.35 లక్షలు ►డేన్‌వాన్ నికెర్క్- రూ.30 లక్షలు ►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు ►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు ►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు ►ఆశ శోభన- రూ.10 లక్షలు ►దిశ కాసత్ - రూ.10 లక్షలు ►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు ►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు ►సహన పవార్- రూ.10 లక్షలు ►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు ►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి. -
పాకిస్తాన్‌పై దుమ్మురేపింది.. వేలంలో ఊహించని ధర! ఎంతంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత వికెట్ యువ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు ఊహించని ధర దక్కింది. ఈ వేలంలో రిచా ఘోష్ రూ.1.9 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. రిచా కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి ఆర్సీబీ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో రిచా తన కనీస ధరను రూ.50 లక్షలగా రిజిస్టర్ చేసుకోవడం గమానార్హం. కాగా రిచా ఘోష్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆమె సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. 20 బంతుల్లో 31 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. అమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. అదేవిధంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొట్ట తొలి అండర్-19 ప్రపంచకప్‌లో కూడా 19 ఏళ్ల రిచా దుమ్మురేపింది. స్మృతి మంధానపై కాసుల వర్షం ఈ వేలంలో స్మృతి మంధానపై కాసుల వర్షం కురిసింది. ఆమెను ఏకంగా రూ.3.4 కోట్ల ధరకు ఆర్సీబీనే సొంతం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(రూ.2కోట్లు), భారత పేసర్ రేణుకా సింగ్(రూ.1.5కోట్లు), ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీని (రూ.1.7 కోట్లు)ని ఆర్సీబీ దక్కించుకుంది. చదవండి: WPL 2023 Auction: స్మృతి మంధానకు జాక్ పాట్.. ఎన్ని కోట్లంటే? -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
T20 WC 2023: పాక్‌పై ఇదే అత్యధిక ఛేదన.. విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో శుభారంభం చేసిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేనకు శుభాభినందనలు తెలిపాడు. అద్భుత ఆట తీరుతో ముందుకు సాగుతూ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడాడు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించాడు. భారత్ వర్సెస్ పాక్ దక్షిణాఫ్రికా వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 10)న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభమైంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఆదివారం(ఫిబ్రవరి 12) చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఇక భారత్ లక్ష్య ఛేదనకు దిగిన క్రమంలో.. ఓపెనర్ యస్తికా భాటియా(17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. అదరగొట్టిన జెమీమా- రిచా మరో ఓపెనర్ షఫాలీ వర్మ 25 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు సాధించింది. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగెస్ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16 పరుగులకే పెవిలియన్ చేరిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపింది. ఇదే అత్యధిక ఛేదన జెమీమా(53)- రిచా(31) జోడీ అద్భుతంగా రాణించి ఆఖరి వరకు అజేయంగా నిలవడంతో 19 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు సాధించి ప్రపంచకప్ ప్రయాణాన్ని గెలుపుతో ఆరంభించింది. కాగా.. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత మహిళా జట్టుకిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అంతేకాదు.. టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం. వాట్ ఏ విన్ ఈ నేపథ్యంలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లి ఇన్‌స్టా వేదికగా భారత మహిళా జట్టు ఫొటో షేర్ చేస్తూ వారిని అభినందించాడు. ‘‘తీవ్ర ఒత్తిడిలోనూ.. పాకిస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించారు. వాట్ ఏ విన్’’ అని కొనియాడాడు. ప్రతి టోర్నమెంట్లోనూ సత్తా చాటుతూ ఆటను ఉన్నత శిఖరాలకు చేరుస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబులిచ్చాడు. చదవండి: SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్న సన్‌రైజర్స్ ధర్మశాల టెస్టు వైజాగ్‌లో? View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
T20 WC: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం
India W vs Bangladesh Women- Richa Ghosh- స్టెలెన్బాస్చ్ (దక్షిణాఫ్రికా): టి20 ప్రపంచకప్‌కు ముందు ఆఖరి వార్మప్ మ్యాచ్‌లో భారత అమ్మాయిలు జోరుగా ప్రాక్టీస్ చేశారు. రిచా ఘోష్ (56 బంతుల్లో 91 నాటౌట్; 3 ఫోర్లు, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడింది. దీంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగుల భారీస్కోరు చేసింది. రిచా, జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్సర్) నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఆఖరి రెండు ఓవర్లలో అయితే రిచా, పూజ వస్త్రకర్ (13 నాటౌ ట్; 2 సిక్సర్లు) జోడీ ఏకంగా 46 పరుగులు సాధించడం విశేషం. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులే చేసింది. శుక్రవారం ప్రపంచకప్ మొదలుకానుండగా... భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆదివారం పాకిస్తాన్‌తో ఆడుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ స్కోర్లు భారత్- 183/5 (20) బంగ్లాదేశ్- 131/8 (20) చదవండి: Pat Cummins: గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! నాగ్‌పూర్ పిచ్ ఎలా ఉందంటే.. ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్‌మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా -
2005 వరల్డ్‌కప్ టైమ్‌లో పుట్టినోళ్లు! కుల్దీప్ యాదవ్ కోచ్ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
దాదాపు 18 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై భారత మహిళల జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్థాయిలో, ఏ ఫార్మాట్లో కూడా మన టీమ్ వరల్డ్‌కప్ గెలవలేకపోయింది. నాటి జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆఫ్ స్పిన్నర్ నూషీన్ అల్ ఖదీర్ ఇప్పుడు యువ మహిళల టీమ్‌కు కోచ్. ఇప్పుడు అదే దక్షిణాఫ్రికా గడ్డపై మరో ఫైనల్ ఆడిన భారత బృందం ఈసారి విజేతగా నిలిచింది. దాదాపు 2005 వరల్డ్‌కప్ జరిగిన సమయంలోనే పుట్టిన అమ్మాయిలంతా ఇప్పుడు విశ్వవిజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తున్న సమయంలో అండర్–19 జట్టు కూడా తమ స్థాయిని ప్రదర్శించడం శుభపరిణామం. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న వర్ధమాన ప్లేయర్లలో బీసీసీఐ తొలి వరల్డ్‌కప్ కోసం టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే ఎలాగైనా వరల్డ్‌కప్ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే సీనియర్ టీమ్‌లో ఆడిన షఫాలీ వర్మ, రిచా ఘోష్‌లను జట్టులోకి తీసుకుంది. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. అమ్మాయిలందరూ తమపై ఉన్న అంచనాలకు అనుగుణంగా రాణించడం విశేషం. శ్వేత సెహ్రావత్ 139.43 స్ట్రయిక్‌రేట్‌తో 297 పరుగులు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా, షఫాలీ (172 పరుగులు), తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (116 పరుగులు) అండగా నిలిచారు. బౌలింగ్‌లో పార్శవి చోప్రా (11 వికెట్లు), మన్నత్ కశ్యప్ (9 వికెట్లు) కీలకపాత్ర పోషించారు. సీనియర్ టీమ్‌లో జూనియర్‌గా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టిన షఫాలీ ఈ టోర్నీ ద్వారా తన నాయకత్వ ప్రతిభను కూడా ప్రదర్శించడం విశేషం- సాక్షి క్రీడావిభాగం వరల్డ్‌కప్ సాధించిన బృందం గురించి సంక్షిప్తంగా... షఫాలీ వర్మ (కెప్టెన్): హరియాణాలోని రోహ్తక్కు చెందిన షఫాలీ భారత్ సీనియర్ జట్టు సభ్యురాలిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత్ తరఫున 74 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. రిచా ఘోష్: బెంగాల్‌కు చెందిన కీపర్ రిచా కూడా సీనియర్ టీమ్ సభ్యురాలిగా 47 మ్యాచ్‌లు ఆడింది. పార్శవి చోప్రా: యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన లెగ్‌స్పిన్నర్. తండ్రి ఫ్లడ్ లైట్ సౌకర్యాలతో సొంత గ్రౌండ్ ఏర్పాటు చేసి మరీ కూతురును ఆటలో ప్రోత్సహించాడు. ఎండీ షబ్నమ్: విశాఖపట్నానికి చెందిన షబ్నమ్ తల్లిదండ్రులు నేవీలో పని చేస్తారు. శివశివాని స్కూల్లో పదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయసులోనే 110 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సౌమ్య తివారి: స్వస్థలం భోపాల్. టాప్ ఆర్డర్ బ్యాటర్... కోహ్లిని ఇష్టపడే సౌమ్య అతనిలాగే కవర్‌డ్రైవ్ అద్భుతంగా ఆడుతుంది. టిటాస్ సాధు: బెంగాల్‌కు చెందిన టిటాస్ తండ్రి ఒక క్రికెట్ అకాడమీ నడపిస్తాడు. బెంగాల్ సీనియర్ టీమ్‌కు ఇప్పటికే ఆడింది. గొంగడి త్రిష: భద్రాచలంకు చెందిన త్రిష హైదరాబాద్‌లో స్థిర పడింది. తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్లోకి అడుగుపెట్టి 8 ఏళ్ల వయసులోనే అండర్–16లో ప్రాతినిధ్యం వహించింది. మన్నత్ కశ్యప్: పటియాలాకు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్. ఇటీవల వరుసగా ‘మన్కడింగ్’లు చేసి గుర్తింపు తెచ్చుకుంది. శ్వేత సెహ్రావత్: ఢిల్లీకి చెందిన బిగ్ హిట్టర్. ఆర్థికంగా మెరుగైన నేపథ్యం ఉన్న కుటుంబం. సొప్పదండి యశశ్రీ: హైదరాబాద్‌కు చెందిన మీడియం పేసర్. టోర్నీ లో ఒక మ్యాచ్ ఆడింది. గాయంతో తప్పుకున్న హర్లీ గలా స్థానంలో జట్టులోకి వచ్చింది. అర్చనా దేవి: ఆఫ్‌స్పిన్నర్. యూపీలోని ఉన్నావ్ స్వస్థలం. కడు పేదరికం. తండ్రి ఎప్పుడో చనిపోయాడు. కుల్దీప్ యాదవ్ కోచ్ కపిల్ పాండే దత్తత తీసుకొని ముందుకు నడిపించాడు. సోనమ్ యాదవ్: యూపీ లెఫ్టార్మ్ స్పిన్నర్. తండ్రి ఫిరోజాబాద్‌లో చేతి గాజులు తయారు చేసే పరిశ్రమలో కార్మికుడు ఫలక్ నాజ్: స్వస్థలం యూపీలోని ప్రయాగ్‌రాజ్. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ తండ్రి ఒక ప్రైవేట్ స్కూల్లో ప్యూన్. రిషిత బసు: వికెట్ కీపర్, బెంగాల్‌లోని హౌరా స్వస్థలం. అద్భుతమైన మెరుపు షాట్లు ఆడుతుంది. మాజీ క్రికెటర్ లక్ష్మీరతన్ శుక్లా తన అకాడమీలో ఉచిత శిక్షణ ఇస్తున్నాడు. చదవండి: Novak Djokovic: తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే! Hockey World Cup 2023: హాకీ జగజ్జేత జర్మనీ From #TeamIndia to #TeamIndia🇮🇳 Well done!!! We are so proud of you! 🤝 pic.twitter.com/YzLsZtmNZr — BCCI Women (@BCCIWomen) January 29, 2023 -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
T20 Series: అదరగొట్టిన షబ్నమ్.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
India Women Under-19s tour of South Africa, 2022-23- ప్రిటోరియా: వచ్చే నెలలో జరిగే అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి టి20లో భారత్ 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళలను ఓడించింది. మొదట భారత అండర్–19 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ షఫాలీ వర్మ (0) డకౌట్ కాగా, శ్వేత (39 బంతుల్లో 40; 5 ఫోర్లు), సౌమ్య (46 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. రిచా ఘోష్ 15 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో హ్లుబి, కేలా రేనకె చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా అండర్–19 జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేసింది. ఆంధ్ర సీమర్ షబ్నమ్ షకీల్ (3/15)తో పాటు అర్చన దేవి (3/14) కూడా చెలరేగి ప్రత్యర్థిని పడగొట్టారు. జనవరి 14 నుంచి 29 వరకు తొలి సారి అండర్–19 మహిళల టి20 దక్షిణాఫ్రికాలోనే జరగనుంది. చదవండి: IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు #TeamIndia clinch a comprehensive 5️⃣4️⃣-run win against SA U19 Women at the Steyn City Ground & take a 1️⃣-0️⃣ lead in the 5️⃣-match #SAvIND T20I series 👏🏻👏🏻 4️⃣0️⃣ runs each with the bat from Shweta Sehrawat & Soumya Tiwari 👌🏻 3️⃣ wickets apiece for Shabnam Shakil & Archana Devi 🙌🏻 pic.twitter.com/5cjRF5TzPP — BCCI Women (@BCCIWomen) December 27, 2022 -
Ind Vs Pak: దాయాది చేతిలో భారత్‌కు తప్పని భంగపాటు.. అప్పుడు అలా! ఇప్పుడిలా!
Womens Asia Cup T20 2022- India Vs Pakistan: మహిళల ఆసియా కప్- 2022 టీ20 టోర్నీలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు ఆరేళ్ల తర్వాత తొలిసారిగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రీతిలో సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేనకు భంగపాటు తప్పలేదు. 13 పరుగుల తేడాతో గెలుపొందిన పాక్ మహిళా జట్టు.. సుదీర్ఘకాలం తర్వాత పొట్టి ఫార్మాట్లో భారత్‌పై తొలి విజయం నమోదు చేసింది. ఆదుకున్న నిదా బంగ్లాదేశ్‌లోని సెల్హెట్ వేదికగా శుక్రవారం భారత్- పాకిస్తాన్ మహిళా జట్లు ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్లు దీప్తి శర్మ మూడు వికెట్లు, పూజా వస్త్రాకర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మరూఫ్ 32 పరుగులతో రాణించగా.. ఆల్‌రౌండర్ నిదా దర్ 56 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో దీప్తికి మూడు, పూజాకు రెండు, రేణుకకు ఒక వికెట్ దక్కాయి. ఒకరిద్దరు మినహా భారత ఓపెనర్లు సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించారు. మూడో స్థానంలో వచ్చిన జెమీమా(2) పూర్తిగా నిరాశపరచగా.. హేమలత 20 పరుగులతో రాణించింది. మిగతా వాళ్లలో దీప్తి 16, హర్మన్‌ప్రీత్ కౌర్ 12, రిచా ఘోష్ 26 పరుగులు(13 బంతుల్లో) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేయగలిగారు. దీంతో 19.4 ఓవర్లలో 124 పరుగులకే భారత జట్టు ఆలౌట్ అయింది. పాక్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాట్‌తోనూ, బంతితోనూ రాణించిన నిదా దర్(37 బంతుల్లో 56 పరుగులు, రెండు వికెట్లు)ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. అప్పుడలా.. ఇప్పుడిలా కాగా టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు 13 సార్లు తలపడగా భారత మహిళా జట్టుపై పాక్ టీమ్‌కు ఇది మూడో విజయం. 2016 తర్వాత ఇదే తొలి గెలుపు. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో హర్మన్‌ప్రీత్ బృందం మూడింట గెలిచింది. మరోవైపు పాక్‌కు ఇది రెండో విజయం. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్-2022 ఈవెంట్లో లీగ్ దశలో పాక్‌పై గెలుపొందిన రోహిత్ సేన.. కీలకమైన సూపర్-4 దశలో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది ఈ డిఫెండింగ్ చాంపియన్. చదవండి: T20 WC 2022: ప్రపంచకప్ టోర్నీ.. ప్రాక్టీసు మొదలుపెట్టిన టీమిండియా IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్' -
‘లేడీ ధోని’.. సూపర్ స్టంపింగ్.. వీడియో వైరల్
మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాక్ ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో.. అలియా రియాజ్ కాస్త క్రీజును వదిలి భారీ షాట్‌కు ప్రయత్నించింది. అయితే అది మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిచా చేతికి వెళ్లింది. అయితే వెంటనే రిచా మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో అలియా రియాజ్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఇక రిచా స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిచా స్టంపింగ్‌కు అభిమానులు ఫిదా అవుతోన్నారు. అంతే కాకుండా లేడీ ధోని అంటూ.. రిచాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లతో పాటు ఒక స్టంప్ఔట్ చేసింది. దీంతో ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఔట్లు చేసిన తొలి క్రికెటర్‌గా రిచా నిలిచింది. చదవండి: IND vs SL: 'కోహ్లి సెంచరీ సాధించే వరకు నేను పెళ్లి చేసుకోను' View this post on Instagram A post shared by ICC (@icc) -
వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ.. తొలి భారత క్రికెటర్‌గా!
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా ఘోష్ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్‌లో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనత సాధించింది. అంతకుమందు 2018లో దక్షిణాఫ్రికాపై వేదా కృష్ణమూర్తి 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అదే విధంగా న్యూజిలాండ్‌లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కూడా రిచాదే కావడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత జట్టుపై 63 పరుగుల తేడాతో ఘన విజయం న్యూజిలాండ్ సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128 పరగులకే ఆలౌటైంది. చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్!? Richa Ghosh brings up the fastest fifty by an Indian batter in Women's ODI 🔥 She needed just 26 balls to reach the milestone 👏 Watch all the #NZvIND action LIVE or on-demand on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺 pic.twitter.com/ad34maGg4A — ICC (@ICC) February 22, 2022