మహిళల ప్రంపచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ మెరుపు వేగంతో అద్భుతమైన స్టంపింగ్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాక్ ఇన్నింగ్స్ 30 ఓవర్ వేసిన రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో.. అలియా రియాజ్ కాస్త క్రీజును వదిలి భారీ షాట్‌కు ప్రయత్నించింది. అయితే అది మిస్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ రిచా చేతికి వెళ్లింది. అయితే వెంటనే రిచా మెరుపు వేగంతో స్టంప్స్‌ను పడగొట్టింది.
దీంతో అలియా రియాజ్ పెవిలియన్‌కు చేరక తప్పలేదు. ఇక రిచా స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిచా స్టంపింగ్‌కు అభిమానులు ఫిదా అవుతోన్నారు. అంతే కాకుండా లేడీ ధోని అంటూ.. రిచాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లతో పాటు ఒక స్టంప్‌ఔట్ చేసింది. దీంతో ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఔట్లు చేసిన తొలి క్రికెటర్‌గా రిచా నిలిచింది.
చదవండి: IND vs SL: 'కోహ్లి సెంచరీ సాధించే వరకు నేను పెళ్లి చేసుకోను'
Comments
Please login to add a commentAdd a comment