భారత మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియాకప్‌లో అత్యధిక స్టంపౌట్‌లు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో రీతూ మూనీని స్టంపౌట్ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.
రిచా ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఏడు స్టంప్‌లు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాటియా ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(55 పరుగులు), షఫాలీ వర్మ 26 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
— hiri_azam (@HiriAzam) July 26, 2024
Comments
Please login to add a commentAdd a comment