Womens Asian Cup
-
నరాలు తెగే ఉత్కంఠ: పాక్‌ను ఓడించిన లంక.. ఫైనల్‌కు సై
మహిళల ఆసియా కప్-2024 టోర్నీలో శ్రీలంక సత్తా చాటింది. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత మహిళా క్రికెట్ జట్టును ఢీకొట్టనుంది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక.. పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.నిదా రాణించినాఈ క్రమంలో ఓపెనర్లు గుల్ ఫెరోజా 25, మునీబా అలీ 37 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ అమీన్(10) పూర్తిగా నిరాశపరిచింది. కెప్టెన్ నిదా దర్ 17 బంతుల్లో 23 పరుగులతో రాణించగా.. అలియా రియాజ్(16), ఫాతిమా సనా(23) ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 140 పరుగులు చేసింది.శ్రీలంక బౌలర్లలో ప్రభోదని, కవిషా దిల్హారీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సైదా ఇక్బాల్ బౌలింగ్‌లో ఓపెనర్ విష్మీ గుణరత్నె డకౌట్‌గా వెనుదిరిగింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్షిత విక్రమసింహ సైతం సైదా బౌలింగ్‌లో 12 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ చమరి ఆటపట్టు మాత్రం హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.నలభై ఎనిమిది బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 63 పరుగులు చేసి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. మిగతావాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అనుష్క సంజీవని 24 పరుగులతో రాణించింది. అయితే, ఆఖరి ఓవర్లో లంక విజయానికి 3 పరుగులు అవసరం కాగా.. చేతిలో మూడు వికెట్లు ఉన్నాయి.తీవ్ర ఉత్కంఠఈ క్రమంలో పాక్ కెప్టెన్ నిదా దర్ డాట్ బాల్‌తో ఆరంభించి.. రెండో బంతికే సుగందిక కుమారి(10)ని బౌల్డ్ చేసింది. మరుసటి బంతికి కూడా శ్రీలంక పరుగు రాబట్టలేకపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. నాలుగో బంతికి అచిని కులసూర్య సింగిల్ తీసింది. అనంతరం నిదా వైడ్ వేయగా.. ఇరు జట్ల స్కోరు సమమైంది. ఈ క్రమంలో ఐదో బంతికి సంజీవని సింగిల్ తీయడంతో పాక్ కథ సమాప్తమైంది.ఫైనల్లో భారత్‌తో ఢీనిదా దర్ బృందంపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆతిథ్య శ్రీలంక ఆసియా టీ20 కప్-2024 ఫైనల్‌కు దూసుకువెళ్లింది. టైటిల్ కోసం ఆదివారం హర్మన్‌ప్రీత్ కౌర్ సేనతో ఆటపట్టు జట్టు తలపడనుంది. కాగా పాక్‌పై గెలుపు ఖరారు కాగానే లంక ఆటగాళ్ల సంబరం అంబరాన్నంటింది. మైదానంలోకి దూసుకువచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది శ్రీలంక మహిళా క్రికెట్ జట్టు. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న చమరి ఆటపట్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది.చదవండి: ఫైనల్లో టీమిండియా𝗦𝗿𝗶 𝗟𝗮𝗻𝗸𝗮 𝗵𝗮𝘀 𝗱𝗼𝗻𝗲 𝗶𝘁 𝗮𝗴𝗮𝗶𝗻! 🇱🇰🔥#ChamariAthapaththu & co. have defeated Pakistan in consecutive #WomensAsiaCup semi-finals 💪On to the finals, they go! 😍#SLvIND | SUN, JUL 28, 2:30 PM | #WomensAsiaCupOnStar (Only available in India) pic.twitter.com/epH8JJkQq2— Star Sports (@StarSportsIndia) July 26, 2024 -
చరిత్ర సృష్టించిన 'లేడీ ధోని'.. ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
భారత మహిళ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ఆసియాకప్‌లో అత్యధిక స్టంపౌట్లు చేసిన భారత వికెట్ కీపర్‌గా రిచా ఘోష్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో రీతూ మూనీని స్టంపౌట్ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకుంది.రిచా ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఏడు స్టంప్‌లు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ తానియా భాటియా(6) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బాటియా ఆల్‌టైమ్ రికార్డును రిచా బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేధించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన(55 పరుగులు), షఫాలీ వర్మ 26 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో శ్రీలంక లేదా పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. pic.twitter.com/zkbz9CR5ub— hiri_azam (@HiriAzam) July 26, 2024 -
ఫైనల్లో టీమిండియా
మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది.వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.చెలరేగిన భారత బౌలర్లుపేసర్ రేణుకా సింగ్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్‌ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఓపెనర్లే పూర్తి చేశారుస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
40 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్.. 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2024లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్(10) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది.లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..⇒మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.⇒అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్ రికార్డును ఆతపత్తు బ్రేక్ చేసింది.⇒అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. -
యూఏఈతో మ్యాచ్.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్‌ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్‌ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్‌చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్ -
ఆసియాకప్‌లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్‌లో క్యాచ్‌ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్‌తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్‌తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. -
8 జట్లు.. 15 మ్యాచ్‌లు.. ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదే?
శ్రీలంక వేదికగా మహిళల ఆసియాకప్-2024కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. జూలై 19(శుక్రవారం) దంబుల్లా వేదికగా నేపాల్, యూఏఈ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 8 జట్లను రెండు గ్రుపులగా విభిజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈలు ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్ జట్లు గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఆసియాకప్-2024 షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలను తెలుసుకుందాం.ఆసియాకప్ షెడ్యూల్ ఇదే.. జూలై 19, శుక్రవారం - యూఏఈ వర్సెస్ నేపాల్ - 2:00 PMజూలై 19, శుక్రవారం - భారత్ వర్సెస్ పాకిస్తాన్ - 7:00 PMజూలై 20, శనివారం - మలేషియా వర్సెస్ థాయిలాండ్ - 2:00 PMజూలై 20, శనివారం - శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ - 7:00 PMజూలై 21, ఆదివారం - భారత్ వర్సెస్ యూఏఈ - 2:00 PMజూలై 21, ఆదివారం - పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 22, సోమవారం - శ్రీలంక వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 22, సోమవారం - బంగ్లాదేశ్ వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 23, మంగళవారం - పాకిస్తాన్ డ యూఏఈ - 2:00 PMజూలై 23, మంగళవారం - భారత్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 24, బుధవారం - బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 24, బుధవారం - శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 1 - 2:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 2 - 7:00 PMజూలై 28, ఆదివారం - ఫైనల్ - 7:00 PMఆసియాకప్‌లో పాల్గోనే జట్లు ఇవే.. భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్ - ట్రావెలింగ్ రిజర్వ్‌లు: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్థాయిలాండ్: తిపట్చా పుట్టావాంగ్ (కెప్టెన్), సువనన్ ఖియాటో (వాక్), నన్నపట్ కొచరోయెంకై (వాక్), నట్టయా బూచతం, ఒన్నిచా కమ్‌చోంఫు, రోసెనన్ కానో, ఫన్నితా మాయ, చనిదా సుత్తిరువాంగ్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ ఫొనాంగ్టానా చాపతన్సేన్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ బూంతన్సాన్సన్, చపతన్సేన్, కోరనిత్ సువంచోంరతి, అఫిసర సువంచోంరతిమలేషియా: వినిఫ్రెడ్ దురైసింగం (కెప్టెన్), ఐనా నజ్వా (వికెట్ కీపర్), ఎల్సా హంటర్, మాస్ ఎలిసా, వాన్ జూలియా (వికెట్ కీపర్), అయిన హమీజా హషీమ్, మహిరా ఇజ్జతీ ఇస్మాయిల్, నూర్ అరియానా నాట్యా, ఐస్యా ఎలీసా, అమలిన్ సోర్ఫినా, ధనుశ్రీ ముహునాన్, ఇర్డ్నా బెహనాన్ , నూర్ ఐషా, నూర్ ఇజ్జతుల్ సయాఫికా, సుయాబికా మణివణ్ణన్నేపాల్: ఇందు బర్మా (కెప్టెన్), సీతా రాణా మగర్, రాజమతి ఐరీ, రుబీనా ఛెత్రీ, డాలీ భట్టా, మమతా చౌదరి, కబితా జోషి, కబితా కున్వర్, కృతికా మరాసిని, పూజ మహతో, బిందు రావల్, రోమా థాపా, సబ్నమ్ రాయ్, సంజన ఖడ్కా, (వికెట్ కీపర్)యుఎఈ: ఇషా ఓజా (కెప్టెన్), తీర్థ సతీష్ (వికెట్ కీపర్), ఎమిలీ థామస్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, లావణ్య కెనీ, ఖుషీ శర్మ, ఇంధుజా నందకుమార్, రినిత రజిత్, రిషిత రజిత్, వైష్ణవే మహేష్, సురక్షా కొట్టె, హీనా హాట్చందనీ, మెహక్చందనీ, రితికా రజిత్పాకిస్థాన్: నిదా దార్ (కెప్టెన్), ఇరామ్ జావేద్, సాదియా ఇక్బాల్, అలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునీబా అలీ, సిద్రా అమీన్, నజిహా అల్వీ, సయ్యదా అరూబ్ షా, నష్రా సుంధు, తస్మియా రుబాబ్, ఒమైమా సోహైల్, తుబా హసన్ .శ్రీలంక: చమరి అతపత్తు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, కావ్య కవింది, సుగండికా కుమారి, అచ్చిని కులసూర్య, కవీషా దిల్హరి, విష్మి గుణరత్నే, శనివా గుణరత్నే, శనివాణి సక్షిలా గిమ్హానిబంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), షోర్నా అక్టర్, నహిదా అక్టర్, ముర్షిదా ఖాతున్, షోరిఫా ఖాతున్, రీతు మోని, రుబ్యా హైదర్ ఝెలిక్, సుల్తానా ఖాతున్, జహనారా ఆలం, దిలారా అక్టర్, ఇష్మా తంజిమ్, రబేయా ఖాన్, రుమానా అహ్మద్, సబికున్ అక్టర్, నహర్ జెస్మిన్మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో కూడా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా ఓపెనర్
మహిళల ఆసియా కప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీ (44 బంతుల్లో 55; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదిన షెఫాలీ.. అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు గతంలో టీమిండియాకే చెందిన జెమీమా రోడ్రిగ్స్ పేరిట ఉండేది. రోడ్రిగ్స్ 21 ఏళ్ల 32 రోజుల వయసులో 1000 పరుగుల మైలురాయిని అందుకోగా.. షెఫాలీ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆ రికార్డును అధిగమించింది. ఈ రికార్డుతో పాటు షెఫాలీ ఇదే మ్యాచ్‌లో మరో రికార్డు కూడా సాధించింది. టీ20 అరంగేట్రం తర్వాత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. షెఫాలీ 3 ఏళ్ల 14 రోజుల్లో ఈ ల్యాండ్మార్కును చేరుకోగా.. గతంలో ఆసీస్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ 3 ఏళ్ల 87 రోజుల్లో ఈ మైలురాయిని చేరుకుంది. పై రెండు రికార్డులతో పాటు షెఫాలీ ఈ మ్యాచ్‌లో మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 1000 పరుగుల పూర్తి చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. షెఫాలీ 1000 పరుగులను కేవలం 735 బంతుల్లోనే పూర్తి చేసి, మరే మహిళా క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. టాప్ త్రీ బ్యాటర్లు షెఫాలీ వర్మ (55), కెప్టెన్ మంధాన (47), జెమీమా రోడ్రిగ్స్ (35 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. రేణుక సింగ్, స్నేహ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళలు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంక వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం పక్కనబెడితే.. థర్డ్ అంపైర్ చీటింగ్‌కు టీమిండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌కు అన్యాయంగా బలవ్వాల్సి వచ్చింది. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రిప్లేలో ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకుంది. అచిని కౌలసూరియా వేసిన ఓవర్ ఐదో బంతిని పూజా వస్త్రాకర్ కవర్స్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన పూజా రెండో పరుగు కోసం ప్రయత్నించింది. పూజా క్రీజులో బ్యాట్ పెట్టగానే కీపర్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. రిప్లేలో చూస్తే పూజా క్రీజుకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వడం షాక్‌కు గురిచేసింది. ఇది చూసిన పూజాకు కాసేపు ఏమి అర్థం కాలేదు. థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్ ఇచ్చాడేమోనని ఎదురుచూసింది. కానీ బిగ్‌స్క్రీన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె స్క్రీన్‌నే చూడడం గమనార్హం. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఓ మై గుడ్నెస్ ఇట్స్ ఔట్.. హౌ'' అంటూ కామెంట్ చేయడం స్పష్టంగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''పూజా వస్త్రాకర్ రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ కోశానా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు.. '' అంటూ కామెంట్ చేశారు. కాగా పూజా వస్త్రాకర్ ఔటైన తీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ''థర్డ్ అంపైర్‌ది వెరీ పూర్ డెసిషన్. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఔట్ ఇచ్చి ఉంటాడు.'' అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. pic.twitter.com/lRDMOGYF6U — cricket fan (@cricketfanvideo) October 1, 2022 చదవండి: ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే.. జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా మహిళలు శుభారంభం -
జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు. ఇక 76 పరుగులతో రాణించిన రొడ్రిగ్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక భారత మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను(అక్టోబర్ 3న) మలేషియా ఉమెన్స్‌తో ఆడనుంది. చదవండి: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
ఆసియా కప్‌కు టీమిండియా మహిళల జట్టు.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
అక్టోబర్ ఒకటి నుంచి జరగనున్న మహిళల ఆసియా కప్ టి20 టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును బుధవారం ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టులో ఉన్న ఆటగాళ్లలో దాదాపు అందరూ ఆసియా కప్ టోర్నీకి ఎంపికయ్యారు. గాయంతో ఇంగ్లండ్ టూర్‌కు దూరమైన జెమిమా రోడ్రిగ్స్ తిరిగి జట్టులోకి వచ్చింది. రేణుకా సింగ్, మేఘనా సింగ్, పూజా వస్రాకర్లు పేస్ బాధ్యతలు మోయనుండగా.. రాజేశ్వరి గైక్వాడ్, రాదా యాదవ్, స్నేహ్ రాణాలు స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో దీప్తి శర్మ సేవలందించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి మందాన, షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, దయాలన్ హేమలత, కేపీ నేవిగర్లు బ్యాటర్లుగా ఎంపిక చేసింది. ఇక తాంతియా బాటియా, సిమ్రన్ దిల్ బహుదూర్లను స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది. మహిళల ఆసియా కప్ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ సంఘం అధ్యక్షుడు జై షా మంగళవారం విడుదల చేశారు. ఇక అక్టోబర్ 1న బంగ్లాదేశ్ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. 15 రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఏడు జట్లు పోటీపడుతున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, థాయ్‌లాండ్, మలేషియాలు మొదట రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడుతాయి. వీటిలో టాప్-4లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుతాయి. టీమిండియా మహిళలు టోర్నీలో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 1న శ్రీలంకతో ఆడనుంది. ఆపై చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 7న తలపడనుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న బంగ్లాదేశ్‌తో, 10న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఆసియాకప్‌కు టీమిండియా మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి వస్త్రాకర్, పూజా వస్త్రాకర్ గయాక్వాడ్, రాధా యాదవ్, కె.పి. నవగిరే స్టాండ్‌బై ప్లేయర్లు: తానియా సప్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్ 🚨 NEWS 🚨: Team India (Senior Women) squad for ACC Women’s T20 Championship announced. #TeamIndia | #WomensAsiaCup | #AsiaCup2022 More Details 🔽 https://t.co/iQBZGVo5SK pic.twitter.com/k6VJyRlRar — BCCI Women (@BCCIWomen) September 21, 2022 చదవండి: ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి..? పిల్లలు జడుసుకుంటారు! భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్‌సీఏలో టికెట్ల రగడ -
‘ఆసియా’ మనదే...
పదమూడేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత మహిళల జట్టు రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. కొన్నాళ్లుగా భారత పురుషుల జట్టు సాధిస్తున్న విజయాలకు దీటుగా మహిళల జట్టు కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆసియా కప్‌లో అజేయంగా నిలవడమేకాకుండా సగర్వంగా కప్‌ను హస్తగతం చేసుకుంది. రెండు వారాల క్రితం ఢాకాలో జరిగిన పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టు టైటిల్ సొంతం చేసుకోగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా విజేతగా నిలువడంతో హాకీ ఇండియా ‘డబుల్’ ధమాకా సృష్టించింది. కకమిగహర (జపాన్): కొత్త కోచ్ హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో భారత మహిళల జట్టు అద్భుత ఫలితం సాధించింది. 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాణి రాంపాల్ నాయకత్వంలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేవరకు రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున 25వ నిమిషంలో నవ్‌జ్యోత్ కౌర్ గోల్ చేయగా... చైనా జట్టుకు తియాన్‌తియాన్ లియో గోల్ సాధించింది. స్కోరు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్లో చైనా క్రీడాకారిణుల రెండు షాట్లను భారత గోల్‌కీపర్ సవిత అడ్డుకొని జట్టుకు విజయం ఖాయం చేసింది. ఈ టోర్నమెంట్లో భారత్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా చాంపియన్ కావడం విశేషం. టోర్నీ మొత్తంలో కేవలం ఐదు గోల్స్ మాత్రమే సమర్పించుకున్న సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డును గెల్చుకుంది. ఈ విజయంతో ఆసియా చాంపియన్ హోదాలో భారత్ వచ్చే ఏడాది లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. 2010 తర్వాత భారత్ ప్రపంచకప్‌కు అర్హత పొందింది. ఫైనల్ చేరే క్రమంలో అజేయంగా నిలిచిన భారత్‌కు తుది పోరులో చైనా నుంచి గట్టిపోటీనే లభించింది. రెండో నిమిషంలోనే చైనాకు పెనాల్టీ కార్నర్ వచ్చింది. అయితే గోల్‌కీపర్ సవిత దానిని అడ్డుకోగా... తిరిగి వచ్చిన బంతిని దీప్ గ్రేస్ ఎక్కా బయటకు పంపించింది. ఆ తర్వాత నవ్‌నీత్ కౌర్, వందన కటారియా చక్కని సమన్వయంతో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోనికి చొచ్చుకు వెళ్లారు. కానీ చైనా రక్షణ పంక్తిని బోల్తా కొట్టించలేకపోయారు. తొలి క్వార్టర్ చివరి క్షణాల్లో చైనాకు రెండో పెనాల్టీ కార్నర్ వచ్చింది. దీనిని కూడా భారత గోల్‌కీపర్ సవిత నిర్వీర్యం చేసింది. దాంతో తొలి క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్లో భారత్ తమ దాడుల్లో పదును పెంచింది. 17వ నిమిషంలో నవ్‌జ్యోత్ డైవ్ చేస్తూ కొట్టిన షాట్... కెప్టెన్ రాణి రాంపాల్ షాట్లు లక్ష్యానికి దూరంగా వెళ్లాయి. ఎనిమిది నిమిషాల తర్వాత రాణి రాంపాల్ అందించిన పాస్‌ను నవ్‌జ్యోత్ గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో క్వార్టర్లోనూ భారత్ ఆధిక్యంలో ఉండగా... చివరి క్వార్టర్లోని 47వ నిమిషంలో చైనా గోల్ సాధించి స్కోరును సమం చేసింది. ఆ తర్వాతి 13 నిమిషాల్లో రెండు జట్లు మరో గోల్ చేసేందుకు విశ్వప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయాయి. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియా 1–0తో జపాన్‌పై విజయం సాధించింది. ప్రశంసల వెల్లువ... ఆసియా చాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు మహిళల జట్టును అభినందించారు. ‘ఆసియా కప్ నెగ్గిన భారత మహిళల జట్టుకు అభినందనలు. ఇదే ప్రదర్శనను వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లోనూ పునరావృతం చేయాలని ఆశిస్తున్నాను’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్విటర్లో పేర్కొన్నారు. పెనాల్టీ షూటౌట్ సాగిందిలా.. చైనా స్కోరు భారత్ 4 లియాంగ్ మియు 11 4 రాణి రాంపాల్ 4 జు వెన్యు 22 4 మోనిక 4 వాంగ్ నా 33 4 నవ్‌జ్యోత్ కౌర్ 4 చెన్ యి 44 4 లిలిమా మింజ్ 7కియుజియా క్యూ 44 7నవ్‌నీత్ కౌర్ 7లియాంగ్ మియు 45 4 రాణి రాంపాల్ భారత్ జైత్రయాత్ర సాగిందిలా.. తొలి లీగ్ మ్యాచ్ : సింగపూర్‌పై 10–0తో గెలుపు రెండో లీగ్ మ్యాచ్ : చైనాపై 4–1తో విజయం మూడో లీగ్ మ్యాచ్ : మలేసియాపై 2–0తో గెలుపు క్వార్టర్ ఫైనల్ : కజకిస్తాన్‌పై 7–1తో ఘనవిజయం సెమీఫైనల్ : జపాన్‌పై 4–2తో గెలుపు ఫైనల్ : చైనాపై 5–4తో విజయం ఆసియా కప్ విజేతగా నిలువడం భారత్‌కిది రెండోసారి. తొలిసారి 2004లో టీమిండియా ఈ టైటిల్‌ను సాధించింది. మరో రెండుసార్లు రన్నరప్‌గా (1999, 2009), రెండుసార్లు మూడో స్థానంలో (1994, 2013), మరో రెండుసార్లు నాలుగో స్థానంలో (1989, 2007)నిలిచింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మా ప్రదర్శన ద్వారా, ఆసియా చాంపియన్ హోదాలో వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందినందుకు గర్వంగా ఉంది. మా జట్టులో చాలా మంది యువ క్రీడాకారిణులున్నారు. వారందరూ చివరి క్షణం వరకు అద్భుతంగా పోరాడారు. చైనాతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. ఏ దశలోనూ మేము నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఆడాం. సడెన్‌డెత్‌లో చైనా క్రీడాకారిణి షాట్‌ను గోల్‌కీపర్ సవిత అడ్డుకోవడం... తర్వాతి షాట్‌ను నేను గోల్‌గా మలచడంతో చాలా ఆనందంగా ఉంది. మాకు అత్యుత్తమ సౌకర్యాలు అందిస్తున్న హాకీ ఇండియాకు, భారత స్పోర్ట్స్ అథారిటీకి జట్టు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఇదే జోరును కొనసాగించి పతకాలు గెలవాలని పట్టుదలతో ఉన్నాం. – రాణి రాంపాల్, భారత కెప్టెన్ -
భారత్ 10.. సింగపూర్ 0
కకామిగహారా(జపాన్):మహిళల హాకీ ఆసియా కప్ లో భాగంగా భారత్ తన ఆరంభపు మ్యాచ్ లో దుమ్ములేపింది. పూల్-ఎ లో శనివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 10-0 తేడాతో సింగపూర్ పై సంచలన విజయం సాధించింది. భారత జట్టులో నవనీత్ కౌర్(3,41 నిమిషాల్లో), రాణి(15, 18 నిమిషాల్లో), నవజోత్ కౌర్(30, 50 నిమిషాల్లో) తలో రెండు గోల్సో తో సత్తా చాటగా, లాల్‌రెమ్ సియామి(18 నిమిషం), దీప్ గ్రేస్ ఎక్కా(25 నిమిషం), గుర్జిత్ కౌర్(41 నిమిషం), సోనికా(45నిమిషం) ఒక్కో గోల్ చొప్పున చేసి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. భారత జట్టు ఆది నుంచి సింగపూర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడికి దిగుతూ పాయింట్ల సంఖ్యను పెంచుకుంటూ పోయింది. ప్రధానంగా సింగపూర్ రక్షణ శ్రేణిని చెల్లాచెదురు చేసి గోల్స్ వర్షం కురిపించింది. తొలి 20 నిమిషాల్లోనే భారత జట్టు నాలుగు గోల్స్ సాధించడంతో సింగపూర్ డీలా పడిపోయింది. అదే ఊపును కడవరకూ కొనసాగించిన భారత్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, సింగపూర్ కడవరకూ పోరాటం చేసినా కనీసం గోల్ కూడా సాధించలేదు. -
ఫైనల్లో భారత్
శ్రీలంకపై విజయం ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో వరుస విజయాలతో అదరగొడుతున్న భారత జట్టు ఫైనల్‌కు చేరింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 62; 6 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు ఏక్తా బిస్త్ (3/8),ప్రీతి బోస్ (3/14) చెలరేగడంతో భారత్ 52 పరుగుల తేడాతో గెలిచింది. నేడు (శుక్రవారం) జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు నేపాల్‌తో తలపడుతుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసింది. రెండో వికెట్‌కు వేద కృష్ణమూర్తి (23 బంతుల్లో 21; 3 సిక్స్)తో కలిసి మిథాలీ 50 పరుగులు జోడించింది. మరో ఓపెనర్ స్మృతి మందన (28 బంతుల్లో 21; 1 ఫోర్) ఆకట్టుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 69 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురంగిక (32 బంతుల్లో 20), వీరక్కోడి (14 బంతుల్లో 14; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి నాలుగు పరుగుల వ్యవధిలో లంక తమ చివరి నాలుగు వికెట్లను కోల్పోరుుంది.