మహిళల ఆసియాకప్-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది.
ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..
⇒మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.
⇒అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్ రికార్డును ఆతపత్తు బ్రేక్ చేసింది.
⇒అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment