sri lanka womens team
-
40 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్.. 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2024లో శ్రీలంక వరుసగా రెండో విజయం నమోదు చేసింది. దంబుల్లా వేదికగా మలేషియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక బౌలర్ల దాటికి కేవలం 40 పరుగులకే కుప్పకూలింది.శ్రీలంక బౌలర్లలో శశినీ గిమ్హాని 3 వికెట్లతో మలేషియా పతనాన్ని శాసించగా.. కావ్యా, కవిష్క తలా రెండు వికెట్లు, ప్రియదర్శిని, కంచనా చెరో వికెట్ సాధించారు. మలేషియా బ్యాటర్లలో హంటర్(10) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.సెంచరీతో చెలరేగిన లంక కెప్టెన్.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అతపత్తు రికార్డులకెక్కింది. లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. మిథాలీ రాజ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా మలేషియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అతపత్తు ఆజేయ సెంచరీతో చెలరేగింది. మలేషియా బౌలర్లకు అతపత్తు చుక్కలు చూపించింది. దంబుల్లా మైదానంలో ఆతపత్తు బౌండరీల వర్షం కురిపించింది. ఓవరాల్‌గా 69 బంతులు ఎదుర్కొన్న చమరి.. 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ సాధించింది.లంక బ్యాటర్లలో చమరితో పాటు హర్షిత మాధవి(26), సంజీవని(31) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఆతపత్తు పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.ఆతపత్తు సాధించిన రికార్డులు ఇవే..⇒మహిళల ఆసియాకప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా ఆతపత్తు నిలిచింది. ఇప్పటివరకు మహిళల ఆసియాకప్‌లో ఎవరూ సెంచరీ సాధించలేకపోయారు.⇒అదే విధంగా మహిళల ఆసియాకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ప్లేయర్‌గా కూడా ఆతపత్తు రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(97) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో మిథాలీ ఆల్‌టైమ్ రికార్డును ఆతపత్తు బ్రేక్ చేసింది.⇒అంతర్జాతీయ టీ20ల్లో ఆతపత్తుకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. -
రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
ఐసీసీ అండర్-19 టి20 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక మహిళా క్రికెటర్ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్. విషయంలోకి వెళితే.. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్ చివరి బంతిని అమీ స్మిత్ లాంగాఫ్ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హామిల్టన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్ ఎండ్ వైపు విసిరింది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్ రనౌట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్ అడ్డుకోకపోయుంటే హామిల్టన్ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆసీస్ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్ నిరాశగా పెవిలియన్ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్ 36, సియాన్నా జింజర్ 30 పరుగులు, కేట్ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాగీ క్లార్క్ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్
మహిళల ఆసియాకప్ టి20 టోర్నీలో శ్రీలంక వుమెన్స్ ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం పాకిస్తాన్ వుమెన్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మరి ఒక్క పరుగు విజయంతో ఫైనల్‌కు చేరామంటే ఆ సంతోషం మాములుగా ఉండదు కదా. అందుకే మ్యాచ్ గెలిచిన ఆనందంలో శ్రీలంక మహిళా క్రికెటర్లు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఆటగాళ్లంతా ఒకేసారి కలిసి స్టెప్పులేస్తూ ఆడిపాడారు. ప్రస్తుతం లంక క్రికెటర్స్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక వుమెన్స్.. టీమిండియా మహిళలతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత నెలలో జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నీ విజేతగా షనక నేతృత్వంలోని శ్రీలంక గెలిచింది. ఈ విజయం ఆ దేశానికి పెద్ద ఊరటను ఇచ్చింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా లంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి బయటపడుతున్న లంకకు క్రికెట్ కొత్త ఊపిరినిస్తుంది. నెల వ్యవధిలోనే అటు పురుషుల టీమ్ ఆసియా కప్‌ను గెలవగా.. ఇటు మహిళల టీమ్ కూడా ఫైనల్‌కు చేరుకుంది. మరి లంక వుమెన్స్ టైటిల్ గెలుస్తుందా లేక టీమిండియా మహిళలకు దాసోహమంటారా చూడాలి. #ApeKello celebrating in style 💃 Sri Lanka qualified for the finals of the Women’s #AsiaCup2022 after winning against Pakistan by 1 run. pic.twitter.com/WXHkGcQJdd — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022 చదవండి: ఎఫ్-1 రేసులో అపశృతి.. రేసర్ వెన్నుముక విరిగింది -
శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
పల్లెకెలె వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సరిగ్గా 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రేణుక సింగ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా.. మేఘనా సింగ్,దీప్తి శర్మలు చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో కాంచన 47 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 25.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(94),షఫాలీ వర్మ (71) పరుగులతో చెలరేగారు. ఇక ఇరు జట్లు మధ్య అఖరి వన్డే గురువారం జరగనుంది. చదవండి: Rishabh Pant: టెస్టుల్లో పంత్ అరుదైన రికార్డు.. 49 ఏళ్ల తర్వాత..! -
శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విశ్మి గుణరత్నే 45, కెప్టెన్ ఆటపట్టు 43 పరుగులు మాత్రమే రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. జట్టు స్కోరులో 75 శాతం స్కోరు ఈ ఇద్దరిదే కావడం విశేషం. టీమిండియా మహిళల బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుక సింగ్, రాదా యాదవ్, పూజా వస్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన 39 పరుగులు చేయగా.. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 31 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రంగా మారిన మూడో టి20 జూన్ 27న(సోమవారం) జరగనుంది. చదవండి: Virat Kohli Tattoos: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
శ్రీలంకతో రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన భారత్
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళల జట్టు రెండో టీ20కు సిద్దమైంది. దంబుల్లా వేదికగా శనివారం జరగునున్న ఈ మ్యాచ్‌లో తొలి టీ20 జోరును కనబరిచి సిరీస్ కైవసం చేసుకోవాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 అధిక్యంలో ఉంది. ఇక బౌలింగ్, బ్యాటింగ్ పరంగా భారత్ పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ రాణిస్తుండగా.. బౌలింగ్‌లో రాధా యాదవ్,దీప్తీ శర్మ, పుజా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: India Vs Ireland T20: రాహుల్ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు! -
ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!
భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా నేడు(జూన్ 23)న ప్రారంభమైంది. అయితే భారత్-శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. ఈ విషయంపై బీసీసీఐ సైతం పత్యేక చొరవ తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. ఇదేనా మహిళల క్రికెట్ అభివృధ్ది అంటూ బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.ఇక మ్యాచ్‌ల ప్రసారంపై బీసీసీఐ ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. శ్రీలంక క్రికెట్ మాత్రం తమ అభిమానులు వీక్షించేందుకు పలు వేదికలను ఏర్పాటు చేసింది. "శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్, డైలాగ్ టెలివిజన్, ఛానల్ వన్ ఎన్ఈ లో వీక్షించొచ్చు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. India Women Tour of Sri Lanka 2022, 3 T20Is & 3 ODIs, from 23rd June to 7th July. 👀 Catch the action LIVE on Sri Lanka Cricket YOUTUBE and ThePapare platforms ⬇️#SLvIND #SLWomens pic.twitter.com/3uP4chbFFR — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 22, 2022 ముందుకు వచ్చిన ఫ్యాన్‌కోడ్ ఇక చివరగా భారత్- శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ ముందుకు వచ్చింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఫ్యాన్‌కోడ్ వెల్లడించింది. The wait is finally over! And we've got something better in store!🤩 How will the Women in Blue fare against the Sri Lankan lionesses on their home soil?🤔 Watch all the action FOR FREE from @BCCIWomen tour of @OfficialSLC LIVE on #FanCode👉https://t.co/324zYTfups . .#SLvIND pic.twitter.com/iUyaenWM3f — FanCode (@FanCode) June 22, 2022 -
కివీస్‌ను గెలిపించిన డివైన్
పెర్త్: కెప్టెన్ సోఫీ డివైన్ (55 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి అటపట్టు (41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, జెన్సెన్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించింది. కెప్టెన్‌కు తోడుగా మ్యాడీ గ్రీన్ (20 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. డివైన్ 46 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20ల్లో డివైన్ వరుసగా ఆరో మ్యాచ్‌లో కనీసం అర్ధసెంచరీ సాధించడం విశేషం. విండీస్ చేతిలో థాయ్‌లాండ్ ఓటమి... తొలిసారి ప్రపంచకప్ బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌కు మొదటి మ్యాచ్‌లో చుక్కెదురైంది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (3/13, 37 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ముందుగా థాయ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 78 పరుగులే చేయగలిగింది. అనంతరం విండీస్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 80 పరుగులు చేసింది. -
కేక పెట్టించిన లంక
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్ : ఆరు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు భారతదేశ పర్యటనకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ నెల 19 నుంచి 28 వరకు మూడు వన్డేలు..మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడేం దుకు వచ్చిన శ్రీలంక మహిళా జట్టు వార్మప్ మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుపై 12 పరుగుల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. విజ యనగరం సమీపంలోని నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టుతో తలపడిన శ్రీలంక ప్రధాన జట్టు 12 పరుగుల తేడా తో గెలుపొందింది. నిర్ణీ త 50 ఓవర్లకు నిర్వహిం చిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్-ఎ మహి ళా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక జట్టు బ్యాటింగ్‌కు దిగింది. మ్యాచ్‌లో 49.5 ఓవర్లలో శ్రీలంక మహిళా జట్టు 10 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగలిగింది. జట్టు బ్యాటింగ్ విభాగంలో యశోదా మెండిస్ 62 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 53 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా... మిగిలిన క్రీడాకారుల ఆటపట్టు 30, దీపిక 17, శిరివర్ధనే 11 పరుగులతో రాణిం చారు. మ్యాచ్‌లో తొలి వికెట్ భాగస్వామ్యానికి ఆటపట్టు, యశోదా మెండిస్ 87 పరుగులు జోడించారు. బౌలింగ్ విభాగంలో భారత్-ఎ జట్టు క్రీడాకారిణులు ప్రీతి బోస్ మూడు వికెట్లు దక్కించుకుంది. అనంతరం లక్ష్య సాధన కోసం బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఎ జట్టు 47.3 ఓవర్లలో కేవలం 174 పరుగులతో మొత్తం వికెట్లు కోల్పోవటంతో 12 పరుగులు తేడాతో ఓటమి పాలైంది. జట్టులో స్మృతిమందానా 49 పరుగులు, వేదాకృష్ణమూర్తి 19, స్నేహా మోరే 27, షికాపాండే 32 పరుగులతో రాణించారు. భారత్-ఎ జట్టులో క్రీడాకారి ణులు స్నేహామోరే, షికా పాండేలు ఏడో వికెట్ భాగస్వామ్యానికి 38 పరుగులు జోడించి పర్వాలేదని పించారు. బౌలింగ్‌లో శ్రీలంక జట్టు క్రీడాకారిణులు ఒషాది రనషింగ్ రెండు వికెట్లు దక్కించుకుంది. భారత్-ఎ జట్టులో భారత ప్రధాన జట్టులో ఉన్న వేదాకృష్ణమూర్తి వార్మప్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా... స్మృతి మందానా అనే మరో క్రీడాకారిణి ఆడారు. జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి... క్రీడలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయనగరానికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కింది. ఇప్పటికే వివిధక్రీడాంశాల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పలు పతకాలు దక్కించుకోవటం ద్వారా జిల్లా కీర్తి ప్రతిష్టలు ఎల్లలు దాటిస్తుండగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఆ ఖ్యాతి మరింత పెరగనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 28 వరకు శ్రీలంక మహిళా జట్టు భారత పర్యటనలో భాగంగా ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుండగా అందులో ఒక వార్మప్ మ్యాచ్‌తో పాటు మరో రెండు టీ-20 మ్యాచ్‌లు జిల్లాకు సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నట్లు ఏసీఏ మీడియా ఇన్చార్జి ప్రకటించారు. తద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పెరగటంతో పాటు జిల్లా క్రికెట్ అభివృద్ధికి ఇటువంటి మ్యాచ్‌లు దోహదపడనున్నాయి. టీ-20 మ్యాచ్‌లకు ఆతిథ్యం... శ్రీలంక మహిళా జట్టు భారత్ పర్యటనలో భాగంగా ఆడనున్న రెండు టీ-20 మ్యాచ్‌లకు నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ మీడియా ఇన్‌ఛార్జి సిఆర్.మోహన్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించారు. శ్రీలంక మహిళా జట్టుతో భారత మహిళా జట్టు మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా అందులో మొదటి, రెండవ మ్యాచ్‌లు విజయనగరం సమీపంలో గల నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీలో జరగనున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.