మహిళల ఆసియాకప్ టి20 టోర్నీలో శ్రీలంక వుమెన్స్ ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం పాకిస్తాన్ వుమెన్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మరి ఒక్క పరుగు విజయంతో ఫైనల్‌కు చేరామంటే ఆ సంతోషం మాములుగా ఉండదు కదా.
అందుకే మ్యాచ్ గెలిచిన ఆనందంలో శ్రీలంక మహిళా క్రికెటర్లు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఆటగాళ్లంతా ఒకేసారి కలిసి స్టెప్పులేస్తూ ఆడిపాడారు. ప్రస్తుతం లంక క్రికెటర్స్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక వుమెన్స్.. టీమిండియా మహిళలతో అమితుమీ తేల్చుకోనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
గత నెలలో జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నీ విజేతగా షనక నేతృత్వంలోని శ్రీలంక గెలిచింది. ఈ విజయం ఆ దేశానికి పెద్ద ఊరటను ఇచ్చింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా లంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి బయటపడుతున్న లంకకు క్రికెట్ కొత్త ఊపిరినిస్తుంది. నెల వ్యవధిలోనే అటు పురుషుల టీమ్ ఆసియా కప్‌ను గెలవగా.. ఇటు మహిళల టీమ్ కూడా ఫైనల్‌కు చేరుకుంది. మరి లంక వుమెన్స్ టైటిల్ గెలుస్తుందా లేక టీమిండియా మహిళలకు దాసోహమంటారా చూడాలి.
#ApeKello celebrating in style 💃
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022
Sri Lanka qualified for the finals of the Women’s #AsiaCup2022 after winning against Pakistan by 1 run. pic.twitter.com/WXHkGcQJdd
Comments
Please login to add a commentAdd a comment