Women Asia Cup T20
-
అందుకే ఓడిపోయాం.. ఎప్పటికీ మర్చిపోలేం: భారత కెప్టెన్
మహిళల ఆసియా టీ20 కప్-2024 టోర్నీ ఫైనల్లో తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ విచారం వ్యక్తం చేసింది. అసలైన పోరులో అనవసర తప్పిదాలతో టైటిల్ చేజార్చుకున్నామని పేర్కొంది. ఏదేమైనా శ్రీలంక మహిళా జట్టు గత కొన్నాళ్లుగా అద్భుతంగా ఆడుతోందని.. వాళ్లకు ఈ విషయంలో క్రెడిట్ ఇవ్వాల్సిందేనని ప్రశంసించింది.భారత మహిళల జైత్రయాత్రకు ఫైనల్లో బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ గెలుస్తుందనుకున్న జట్టును ఆతిథ్య శ్రీలంక గట్టి దెబ్బ కొట్టింది. అన్ని మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ను అసలైన ఫైనల్లో శ్రీలంక ఓడించి తొలిసారి ఆసియా కప్‌ను ముద్దాడింది.డంబుల్లా వేదికగా ఆదివారం జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ బృందంపై శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.అందుకే ఓడిపోయాంస్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) రాణించగా, రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి జయభేరి మోగించింది. కెప్టెన్ చమరి అటపట్టు (43 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్షిత (51 బంతుల్లో 69; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో గెలిపించారు.ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంతం మేము బాగా ఆడాం. అయితే, ఫైనల్లో పొరపాట్లకు తావిచ్చాం. నిజానికి మేము మెరుగైన స్కోరే సాధించాం. అయితే, శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. లంక బ్యాటర్లు మా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మేము ఇంకా మెరుగ్గా ఆడాల్సింది. ఈరోజును ఎన్నటికీ మర్చిపోలేం. ఏదేమైనా శ్రీలంక అద్భుతంగా ఆడింది. వాళ్లకు కంగ్రాట్స్’’ అంటూ విష్ చేసింది. -
ధనాధన్ ఇన్నింగ్స్.. కెరీర్ బెస్ట్ స్కోర్! కానీ..
నేపాల్‌తో మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ షెఫాలీ వర్మ సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆది నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పరుగుల వరద పారించింది. ఈ క్రమంలో తన టీ20 కెరీర్లోనే అత్యుత్తమ స్కోరు సాధించింది.కానీ శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024లో భాగంగా భారత్- నేపాల్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంకలోని డంబుల్లా వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో ఓపెనర్ షెఫాలీ వర్మ టీమిండియాకు శుభారంభం అందించింది. కేవలం 48 బంతుల్లోనే 81 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. మరో ఓపెనర్ హేమలత(42 బంతుల్లో 47) కలిసి షెఫాలీ తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.ఇక షెఫాలీ వర్మ అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఇదే అత్యధిక స్కోరు(81) కావడం విశేషం. అంతేకాదు వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో క్రికెటర్‌గా షెఫాలీ నిలిచింది. 2018 నాటి టోర్నీలో 69 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ జాబితాలో షెఫాలీ కంటే ముందు వరుసలో ఉంది.ఓవరాల్‌గా శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు(119 నాటౌట్) స్థానాన్ని మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ ఆక్రమించారు. ఇక భారత్ తరఫున టీ20లలో షెఫాలీ సాధించిన పదో అర్ధ శతకం ఇదే. అంతేకాదు టీమిండియా తరఫున అతిపిన్న వయసులో ఈ ఘనత సాధించిన క్రికెటర్ కూడా షఫాలీ వర్మనే కావడం విశేషం. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 79 అంతర్జాతీయ టీ20లు ఆడి 1906 పరుగులు చేసింది.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఈ క్రమంలో సగం ఆట(10 ఓవర్లు) ముగిసేసరికి నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి కేవలం 48 పరుగులు మాత్రమే చేసింది.ఇదిలా ఉంటే.. ఆసియా టీ20 కప్-2024లో భారత్ ఇప్పటికే సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొందిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. -
టీమిండియా కెప్టెన్‌కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్‌తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
పసికూనను చిత్తు చేసిన పాక్... సెమీస్ రేసులో
వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్‌ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్‌లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు -
విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక
మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది. భారత పేసర్ రేణుకా సింగ్ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: T20 World Cup 2022: ఫేవరెట్ ఎవరు.. ఆసీస్ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది? -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు.. డ్యాన్స్‌తో లంక క్రికెటర్స్ అదుర్స్
మహిళల ఆసియాకప్ టి20 టోర్నీలో శ్రీలంక వుమెన్స్ ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం పాకిస్తాన్ వుమెన్స్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో ఒక్క పరుగు తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మరి ఒక్క పరుగు విజయంతో ఫైనల్‌కు చేరామంటే ఆ సంతోషం మాములుగా ఉండదు కదా. అందుకే మ్యాచ్ గెలిచిన ఆనందంలో శ్రీలంక మహిళా క్రికెటర్లు డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఆటగాళ్లంతా ఒకేసారి కలిసి స్టెప్పులేస్తూ ఆడిపాడారు. ప్రస్తుతం లంక క్రికెటర్స్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక వుమెన్స్.. టీమిండియా మహిళలతో అమితుమీ తేల్చుకోనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గత నెలలో జరిగిన పురుషుల ఆసియా కప్ టి20 టోర్నీ విజేతగా షనక నేతృత్వంలోని శ్రీలంక గెలిచింది. ఈ విజయం ఆ దేశానికి పెద్ద ఊరటను ఇచ్చింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా లంక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయపరమైన కారణాలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఇప్పుడిప్పుడే సంక్షోభం నుంచి బయటపడుతున్న లంకకు క్రికెట్ కొత్త ఊపిరినిస్తుంది. నెల వ్యవధిలోనే అటు పురుషుల టీమ్ ఆసియా కప్‌ను గెలవగా.. ఇటు మహిళల టీమ్ కూడా ఫైనల్‌కు చేరుకుంది. మరి లంక వుమెన్స్ టైటిల్ గెలుస్తుందా లేక టీమిండియా మహిళలకు దాసోహమంటారా చూడాలి. #ApeKello celebrating in style 💃 Sri Lanka qualified for the finals of the Women’s #AsiaCup2022 after winning against Pakistan by 1 run. pic.twitter.com/WXHkGcQJdd — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 13, 2022 చదవండి: ఎఫ్-1 రేసులో అపశృతి.. రేసర్ వెన్నుముక విరిగింది -
పాక్‌ను మట్టికరిపించిన శ్రీలంక.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ
మహిళల ఆసియా కప్-2022లో ఇవాళ (అక్టోబర్ 13) ఉత్కంఠ పోరు జరిగింది. పాకిస్తాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ చివరి నిమిషం దాకా నువ్వా నేనా అన్నట్లు సాగింది. అంతిమంగా శ్రీలంక.. పాక్‌ను పరుగు తేడాతో ఓడించి, అక్టోబర్ 15న జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా.. ఛేదనలో పాక్ లక్ష్యానికి 2 పరుగుల దూరంలో (121/6) నిలిచిపోయింది. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు కీలక వికెట్లు తీసిన ఇనోకా రణవీర (2/17)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. పాక్ విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. శ్రీలంక బౌలర్ కులసూర్య అద్భుతంగా బౌలింగ్ చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ చేతి నుంచి విజయాన్ని లాక్కుంది. ఫలితంగా శ్రీలంక 14 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా, ఇవాళ ఉదయం జరిగిన తొలి సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై టీమిండియా 74 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్
మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21, నట్టాయా బుచాతమ్ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్, పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా వుమెన్స్ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న(శనివారం) జరగనుంది. Women's Asia Cup: India beat Thailand by 74 runs in the first semifinal to enter the final. (Pic Source: BCCI Women) pic.twitter.com/VwWZl0gjkQ — ANI (@ANI) October 13, 2022 4⃣2⃣ Runs 1⃣ Wicket 1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍 Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX — BCCI Women (@BCCIWomen) October 13, 2022 -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
Womens Asia Cup T20 2022: మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా పసికూన థాయ్‌లాండ్‌తో ఇవాళ (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి ధాటికి ప్రత్యర్ధి చిగురుటాకులా వణికిపోయింది. 15.1 ఓవర్లు ఆడిన థాయ్ జట్టు కేవలం 37 పరుగులకే కుప్పకూలింది. ఆతర్వాత భారత్ కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తిప్పేసిన స్పిన్నర్లు.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. స్పిన్నర్లు స్నేహ్ రాణా (3/9), రాజేశ్వరీ గైక్వాడ్ (2/8), దీప్తి శర్మ (2/10) మాయాజాలం చేయడంతో ప్రత్యర్ధి బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. థాయ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన 10 బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. వీరిలో బూచాథమ్ అనే బ్యాటర్ చేసిన ఏడు పరుగులే అత్యధికం కావడం విశేషం. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ సునాయాసంగా విజయం సాధించింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (8) తక్కువ స్కోర్‌కే ఔటైనా.. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (20 నాటౌట్), వన్ డౌన్ బ్యాటర్ పూజా వస్త్రాకర్ (12 నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత్ టేబుల్ టాపర్‌గా (6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు (పాక్ చేతిలో ఓటమి)) దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 13న జరుగనున్నాయి. సెమీస్ రేసులో తొలి మూడు బెర్తులు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక) ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. నాలుగో స్థానం కోసం బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడుతున్నాయి. -
Womens Asia Cup T20: చెలరేగిన జెమీమా
సిల్హెట్: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది. ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది. -
Womens Asia Cup 2022: ఫేవరెట్‌గా భారత్
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టోర్నీని 2004 నుంచి 2018 వరకు ఏడు సార్లు నిర్వహించారు. ఇందులో ఆరు సార్లు భారతే విజేత. ఈ టోర్నీలో మన ఆధిక్యం ఎలా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. వన్డే ఫార్మాట్లో నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన మన అమ్మాయిలు టి20 ఫార్మాట్లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం అనూహ్యంగా ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మన జట్టు రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఇప్పుడు మరోసారి తమ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకునేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సిద్ధమైంది. జట్టు తాజా ఫామ్, ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. నేడు జరిగే తొలి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది. మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుండగా, పురుషుల ఆసియా కప్‌లో రాణించిన అఫ్గానిస్తాన్‌కు మహిళల టీమ్ లేదు. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ప్రతీ జట్టు ఆరుగురు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌లో తలపడుతుంది. టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 15న ఫైనల్ నిర్వహిస్తారు. జోరు మీదున్న టీమ్... ఆసియా కప్ చరిత్రలో వన్డేలు, టి20లు కలిపి భారత్ 32 మ్యాచ్‌లు ఆడగా 30 మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుత టీమ్ అదే తరహాలో పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది. హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండగా ఇప్పుడు జెమీమా రోడ్రిగ్స్ చేరికతో బ్యాటింగ్ మరింత పటిష్టంగా మారింది. హేమలత, కీపర్ రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా ధాటిగా ఆడగలరు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు మెరుపు ఆరంభాలతో ఆకట్టుకున్న షఫాలీ వర్మ ఇటీవలి పేలవ ప్రదర్శనే జట్టును కాస్త ఆందోళనపరుస్తోంది. అయితే ఆమెలో సామర్థ్యానికి కొదవ లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో పరిస్థితి మారుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అండగా నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి సబ్బినేని మేఘనకు ఎన్ని అవకాశాలు లభిస్తాయో చూడాలి. బౌలింగ్‌లో కూడా భారత్ చక్కటి ఫామ్‌లో ఉంది. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలంగా మారింది. మరో పేసర్ పూజ వస్త్రకర్ ఆమెకు అండగా నిలుస్తోంది. బంగ్లా గడ్డపై ప్రభావం చూపించగల స్పిన్ విభాగంలో మన బృందం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. దీప్తి శర్మ, రాధా యాదవ్, ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా సమష్టిగా జట్టును గెలిపించగలరు. గత ఆసియా కప్ ఫైనల్ ప్రదర్శనను పక్కన పెడితే మరోసారి భారత్‌కే టైటిల్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
మిథాలీ ‘రాజ్యం’
సాక్షి క్రీడా విభాగం : ఎప్పుడో 1999లో కెరీర్లో తొలి వన్డేలోనే సెంచరీతో మెరుపులా దూసుకొచ్చింది మిథాలీ రాజ్... ఇప్పుడు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో తనదైన శైలిలో మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ 17 ఏళ్ల కాలంలో మహిళా క్రికెట్లో ఒక తరం మారింది. తరాల మధ్య అంతరం కూడా చాలా ఉంది. ఫార్మాట్లు మారాయి, ప్లేయర్లు మారారు... కానీ మారనిది మిథాలీరాజ్ ఆట ఒక్కటే. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌విమన్‌గా ఖ్యాతిని సొంతం చేసుకుంది. కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆటపై ప్రేమతో అమెచ్యూర్ క్రికెటర్‌గానే తన ప్రతిభను ప్రదర్శించిన మిథాలీ... ఇప్పుడు టీవీ ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా తన ఆటను మరో స్థారుుకి తీసుకుపోయింది. ఈ రెండు తరాలకు వారధిగా నిలిచిన ఆమె అనేక ఘనతలను తన పేరిట లిఖించింది. అంకెలు, గణాంకాలపరంగా చూస్తూ ఆమెను కొందరు ‘మహిళా సచిన్’ అంటూ అభిమానంగా పిలుచుకున్నా... మిథాలీ రాజ్ మూలస్థంభంలా నిలబడి జట్టుకు అందించిన కొన్ని విజయాలు చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. డబుల్ ధమాకా... హైదరాబాద్ నగరంలోనే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ రాజ్ ఆ తర్వాత వేర్వేరు వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించింది. నాడు బీసీసీఐ గుర్తింపునకు నోచుకోకుండా, భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఎవరికీ పట్టని మహిళా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే. కానీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను తనకు ప్రియమైన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు సాగేలా చేశారుు. అదే పట్టుదల ఆమెకు 15 ఏళ్ల వయసులో 1997 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు అందించింది. కానీ ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించిన టీమ్ మేనేజ్మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో కాస్త మనసు విరిగినా... పట్టుదలతో ఆడి చివరకు శతకంతో తన రాకను ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214) మిథాలీ స్థాయిని అమాంతం పెంచేసింది. అప్పట్లో మహిళల టెస్టుల్లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కెప్టెన్‌గా సూపర్... 2003 వచ్చేసరికి మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు ఉండని పరిస్థితి వచ్చేసింది. చివరకు సీనియర్ల నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకున్న అనుభవంతో 2005లో ఆమె తొలిసారిగా కెప్టెన్సీని అంగీకరించింది. అదే ఏడాది ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మిథాలీ... సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 91 నాటౌట్ స్కోరు మహిళల క్రికెట్లోని అత్యుత్తమ ఇన్నింగ్సలలో ఒకటి. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో టీమిండియా ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీ టైటిల్సే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై వారి గడ్డపైనే గెలిచిన వన్డే సిరీస్ ఆమె కెరీర్లో మైలురాళ్లు. బీసీసీఐ మార్పు చేర్పుల్లో భాగంగా మధ్యలో కొంత కాలం మినహా గత దశాబ్ద కాలంలో మిథాలీనే భారత కెప్టెన్. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌పై వామ్స్లేలో కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ అందించిన చారిత్రక టెస్టు విజయం మిథాలీ కీర్తిని మెరో మెట్టు ఎక్కించింది. తిరుగులేని రికార్డు... వేర్వేరు కారణాలతో ఇన్నేళ్ల కెరీర్లో భారత్ చాలా తక్కువ టెస్టులు ఆడింది. దాంతో మిథాలీ కూడా 10 టెస్టులే ఆడినా, అందులోనూ ఆమె సగటు 51 కావడం విశేషం. టి20ల్లో కూడా మన బెస్ట్ బ్యాట్స్‌విమన్‌గా తనదైన ముద్ర చూపించిన మిథాలీ... వన్డేల్లో మాత్రం క్వీన్. 167 మ్యాచ్‌లలో 5,407 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో మిథాలీ ప్రపంచ క్రికెట్లో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అత్యధిక సగటు (49.60) ఆమెదే కావడం విశేషం. 5 సెంచరీలు, 40 అర్ధసెంచరీలతో ఆమె రికార్డు అద్భుతం. శనివారమే 34వ పుట్టిన రోజు జరుపుకున్న మిథాలీ పరుగుల తృష్ణ ఇంకా తగ్గలేదు. ఇదే ఫామ్‌తో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.