Women Asia Cup 2022 Final: Ind Vs SL Final Match Today, Sri Lanka Won Toss - Sakshi
Sakshi News home page

Women Asia Cup Final: చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు

Published Sat, Oct 15 2022 1:36 PM | Last Updated on Sat, Oct 15 2022 3:49 PM

Women Asia Cup Final: India Vs Sri Lanka Final Match - Sakshi

Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. టాస్‌ గెలిచిన లంక వుమెన్స్‌ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది.

ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్‌ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం.

ఏడోసారి..
ఆసియా కప్‌ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్‌ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్‌ గెలుచుకున్న భారత్‌ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు.  తొలి లీగ్‌ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్‌ ఓడించినా... ఆ జట్టు సెమీస్‌ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం.

అప్‌డేట్‌: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చదవండి: T20 WC 2022: రోహిత్‌ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే!
Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్‌' కోహ్లి ఒక్కడే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement