Renuka Singh
-
ఫైనల్లో టీమిండియా
మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్‌కు దూసుకువెళ్లింది.వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.చెలరేగిన భారత బౌలర్లుపేసర్ రేణుకా సింగ్ టాపార్డర్‌ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించింది. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్‌ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఓపెనర్లే పూర్తి చేశారుస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్‌గా మారిన హార్దిక్ పాండ్యా -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 80 పరుగులకే బంగ్లా ఖేల్ ఖతం
వుమెన్స్ ఆసియా కప్ టీ20- 2024 టోర్నీ సెమీ ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా కేవలం ఎనభై పరుగులకే బంగ్లా కథ ముగిసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా టీ20 కప్‌లో గ్రూప్-ఏలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ క్రమంలో గ్రూప్-ఏ టాపర్‌గా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. మరోవైపు.. బంగ్లాదేశ్ గ్రూప్-బి సెకండ్ టాపర్‌గా నిలిచింది.ఫలితంగా తొలి సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాతో పోటీకి అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో డంబుల్లా వేదికగా ఇరు జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత పేసర్ రేణుకా సింగ్ ఆది నుంచే నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను తిప్పలు పెట్టింది.తన బౌలింగ్ నైపుణ్యాలతో టాపార్డర్‌ను కుదేలు చేసింది. రేణుక దెబ్బకు ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్‌డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8) పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు.నిగర్ కెప్టెన్ ఇన్నింగ్స్జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా పట్టుదలగా నిలబడింది. 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ బౌలింగ్‌లో నిగర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఆ తర్వాత టపా టపా వికెట్లు పడ్డాయి. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ మిగిలిన పని పూర్తి చేశారు. బంగ్లాదేశ్ లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ కేవలం 80 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ అత్యధికంగా మూడేసి వికెట్లు దక్కించుకోగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ టోర్నీలో భారత బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విధించిన 81 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళా జట్టు తేలికగానే ఛేదించే అవకాశం ఉంది. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన మెరుపులు మెరిపించింది. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనకు ఎల్లిస్ పెర్రీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సబ్బినేని మేఘన (28), రిచా ఘోష్ (21 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించారు. వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, అంజలి శర్వాణి, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ పడగొట్టారు. Mandhana's magic in Chinnaswamy!#WPL2024 pic.twitter.com/rMncZXmSzx — OneCricket (@OneCricketApp) March 4, 2024 అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్.. రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఆతర్వాత రెండు ఓవర్లలో మాత్రం వారియర్జ్ ఓపెనర్లు అలైసా హీలీ (13), కిరణ్ నవ్‌గిరే (17) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో వారియర్జ్ 3 ఓవర్లలో 40 పరుగులు చేసింది. తొలి ఓవర్ మొయిడిన్‌గా మలిచిన రేణుకా సింగ్, ఆతర్వాతి ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకుంది. కారు అద్దాలు పగలగొట్టిన పెర్రీ.. ELLYSE PERRY HAS BROKE THE GLASS OF THE CAR...!!! 🤯 - The reaction of Perry was priceless!! pic.twitter.com/zaxiQLLN1r — Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024 -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్‌కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్‌డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
Womens T20 World Cup 2023: రేణుక, స్మృతి మెరుపులు వృథా
కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్‌ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్‌ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్‌స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147. బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్‌ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్‌స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119. బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్‌స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0. -
రేణుకా సింగ్ కొత్త చరిత్ర .. టీమిండియా తొలి పేసర్‌గా
మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ రేణుకా ఠాకూర్ సింగ్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం గ్రూప్-బిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రేణుకా సింగ్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. టి20 వరల్డ్‌కప్‌లో తరపున ఐదు వికెట్ల హాల్ అందుకున్న తొలి భారత మహిళా పేసర్‌గా రికార్డులకెక్కింది. అంతేకాదు వరల్డ్‌కప్‌లో రేణుకా కెరీర్ బెస్ట్ ప్రదర్శన అందుకుంది. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది. తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకున్న రేణుకా చివరి ఓవర్లో మరో రెండు వికెట్లను పడగొట్టింది. డంక్లీ, వ్యాట్, అలిస్ క్యాప్సీ, అమీ జోన్స్, బ్రంట్‌ల రూపంలో రేణుకా ఐదు వికెట్ల మార్క్‌ను అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్ రేణుకా సింగ్ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రంట్ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. Renuka Singh Thakur today: - First Indian pacer to take five-wicket in T20 WC. - Best bowling figure by an Indian in T20 WC. pic.twitter.com/YH8CAtaCNh — Johns. (@CricCrazyJohns) February 18, 2023 చదవండి: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
వేలంలో ఊహించని ధర.. సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా! వీడియో వైరల్
ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా భారత క్రికెటర్ల పంటపండింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రూ.3.4 కోట్ల భారీ ధర దక్కించుకోగా.. దీప్తిశర్మ(రూ.2.6 కోట్లు) షఫాలీ వర్మ(రూ. 2 కోట్లు), దీప్తి శర్మ(రూ.2.6 కోట్లు), జెమ్మిమా రోడ్రిగ్స్(రూ. 2.2కోట్లు), పూజా వస్త్రాకర్(రూ.1.9 కోట్లు) సొంతం చేసుకున్నారు. సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో బీజీ బీజీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఈ వేలాన్ని భారత క్రికెటర్లంతా వారు బస చేస్తున్న హాటల్లో వీక్షించారు. అయితే ఈ వేలంలో భారత పేసర్ రేణుక సింగ్‌కు ఊహించని ధర దక్కడంతో ప్లేయర్స్ సెలబ్రేషన్స్‌లో మునిగి తెలిపోయారు. రేణుక సింగ్‌ను రూ.1.5 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆక్షనర్ మల్లికా సాగర్ రేణుక సింగ్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించిగానే సహాచర క్రికెటర్లు ఆమె చుట్టూ చేరి ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అరుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: WPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్ ప్లేయర్లు ఇప్పుడేమంటారో? Yet another lovely video - the celebration is simply incredible. Renuka Singh Thakur joins Smriti Mandhana in RCB. pic.twitter.com/63OteaQwKC — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2023 -
టీమిండియా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
ICC Womens Emerging Cricketer Of The Year 2022: భారత స్టార్ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న ఈ సిమ్లా (హిమాచల్ ప్రదేశ్) అమ్మాయి.. ఐసీసీ వుమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఇవాళ (జనవరి 25) ప్రకటించింది. 𝗣𝗿𝗲𝘀𝗲𝗻𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗜𝗖𝗖 𝗪𝗼𝗺𝗲𝗻’𝘀 𝗘𝗺𝗲𝗿𝗴𝗶𝗻𝗴 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗬𝗲𝗮𝗿 2️⃣0️⃣2️⃣2️⃣ Congratulations Renuka Singh 👏🏻👏🏻#TeamIndia pic.twitter.com/ZKfk7ENDm3 — BCCI (@BCCI) January 25, 2023 26 ఏళ్ల రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ అయిన రేణుకా.. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ ప్లేయర్ అలైస్ క్యాప్సీ, సహచర క్రికెటర్ యష్తిక భాటియా పోటీపడినప్పటికీ.. రేణుకానే ఈ అవార్డు వరించింది. Impressing everybody with her magnificent displays of seam and swing bowling, the ICC Emerging Women's Cricketer of the Year had a great 2022 👌#ICCAwards2022 — ICC (@ICC) January 25, 2023 రేణుకా టీమిండియా తరఫున ఇప్పటివరకు 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 41 వికెట్లు (వన్డేల్లో 18, టీ20ల్లో 23) పడగొట్టింది. ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె లేని లోటును భర్తీ చేస్తున్న రేణుకా.. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన తర్వాత రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చిన రేణుకా 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ వెన్ను విరిచింది. రేణుకా స్పెల్‌లో ఏకంగా 16 డాట్ బాల్స్ ఉండటం విశేషం. -
ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో టీమిండియా ప్లేయర్ల హవా
ICC Womens T20I Team Of The Year 2022: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 అత్యుత్తమ పురుషుల టీ20 జట్టుతో పాటు మహిళల అత్యుత్తమ టీ20 జట్టును కూడా ఇవాళే (జనవరి 23) ప్రకటించింది. ఈ జట్టులో అత్యధికంగా నలుగురు భారతీయ క్రికెటర్లను ఎంపిక చేసిన ఐసీసీ.. కెప్టెన్‌గా సోఫీ డివైన్ (న్యూజిలాండ్)ను ఎంచుకుంది. గతేడాది పొట్టి ఫార్మాట్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. టీమిండియా ప్లేయర్స్ స్మృతి మంధన, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఐసీసీ బెస్ట్ టీ20 టీమ్‌కు ఎంపికయ్యారు. ఓపెనర్లుగా స్మృతి మంధన (భారత్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా)లను ఎంచుకున్న ఐసీసీ.. వన్‌డౌన్‌లో సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆతర్వాతి స్థానాలకు ఆష్ గార్డ్నర్ (ఆస్ట్రేలియా), తహిల మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దార్ (పాకిస్తాన్), దీప్తి శర్మ (భారత్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్, భారత్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇంద్‌కా రణవీరా (శ్రీలంక), రేణుక సింగ్ (భారత్)లను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఛాంపియన్ జట్టు ఆస్ట్రేలియా (ముగ్గురు) కంటే భారత్‌కే అధిక ప్రాతినిధ్యం లభించడం విశేషం. -
ఆకాశమే హద్దుగా ప్రతిభ చాటండి
సాక్షి, అమరావతి: కృష్ణానది ఒడ్డున, దుర్గా మాత ఒడిలో గిరిజన బాలల జాతీయ క్రీడోత్సవాలు జరగడం పెద్ద సంబరమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుట చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీలు ప్రకృతిలో భాగమని, ఆకాశమే హద్దుగా ఆటలాడి ప్రతిభ చాటాలని, ప్రఖ్యాత క్రీడాకారులుగా రాణించాలని చెప్పారు. ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యార్థుల మూడో జాతీయ క్రీడలు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రేణుకా సింగ్, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర క్రీడా జ్యోతిని వెలిగించి జాతీయ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. నేటి కాలంలో ఏకలవ్యుడి వంటి శిష్యులు ఎంతో మంది ఉన్నారని, మరెందరో ద్రోణాచార్యులు కూడా ఉన్నారని అన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి ఉపకార వేతనాలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి రేణుకా సింగ్ విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మన రాష్ట్రంలో జరగడం గర్వకారణం గిరిజన విద్యార్థుల జాతీయ క్రీడలు మన రాష్ట్రంలో జరగడం గర్వించే విషయమని పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజనులంటే సీఎం వైఎస్ జగన్‌కు ఎంతో ప్రేమ అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల ఏర్పాటే ఇందుకు నిదర్శనమన్నారు. గిరిజన బాలలను విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడానికి ఐదు జిల్లాల్లో స్పోర్ట్స్ స్కూల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆరు పథకాల ద్వారా గిరిజన విద్యార్థులను విద్యాపరంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 1.26 లక్షల గిరిజన కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద 2,48,887 ఎకరాలు ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే వి.కళావతి, తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు జరిగే ఈ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 4344 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఏపీ గిరిజన బాలలతో ‘ధింసా’ నృత్యం కాగా ఏపీకి చెందిన గిరిజన బాలలు ప్రదర్శించిన ధింసా, లంబాడీ నృత్యాలు, తెలంగాణ బాలల గుస్సాడీ నృత్యం అందరినీ అలరించాయి. క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు దేశంలోని 22 రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజన క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం పంపిన సందేశాన్ని డిప్యూటీ సీఎం రాజన్న దొర చదివి వినిపించారు. ‘స్వచ్ఛమైన మనసుతో నిర్మలంగా జీవించే గిరిజనులంతా నా కుటుంబ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉన్నతికి, అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తోంది. నవరత్నాల ద్వారా వారి అభివృద్ధి కాంక్షిస్తోంది. క్రీడాకారులకు, కోచ్‌లకు, అధికారులకు, ఈఎంఆర్ఐ స్కూల్స్ సిబ్బందికి నా శుభాభినందనలు’ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
అట్టహసంగా ప్రారంభమైన ఏకలవ్య ఆదర్శ పాఠశాలల నేషనల్ స్పోర్ట్స్ మీట్
సాక్షి, విజయవాడ: ఏకలవ్య ఆదర్శ పాఠశాలల మూడవ జాతీయ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం శనివారం అట్టహసంగా ప్రారంభమైంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికగా నిలిచింది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్ధినులు నృత్యాలు చేశారు. కాగా ఈనెల 17 వ తేదీ నుంచి 22 వ తేది వరకు నాగార్జున యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో క్రీడలు జరగనున్నాయి. -
విజృంభించిన భారత బౌలర్లు.. 65 పరుగులకే పరిమితమైన శ్రీలంక
మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఆది నుంచే వికెట్లు కోల్పోయిన శ్రీలంక.. ఏ దశలోను భారత్‌కు పోటీ ఇవ్వ లేకపోయింది. భారత పేసర్ రేణుకా సింగ్ ఈ కీలక పోరులో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: T20 World Cup 2022: ఫేవరెట్ ఎవరు.. ఆసీస్ గడ్డపై అత్యధిక విజయశాతం ఎవరిది? -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
CWG 2022: రెప్పపాటులో తలకిందులు.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్!
కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్లో భారత జట్టును ఆదిలోనే ఓటమి పలకరించింది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన పరాజయం పాలైంది. మూడు వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి మూటగట్టుకుంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి హర్మన్‌ప్రీత్ బృందం ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తొలి మ్యాచ్‌లోనే గెలిచి అరుదైన ఘనత సాధించాలనుకున్న భారత్‌కు నిరాశే ఎదురైంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ అద్బుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన ఆమె కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చింది. రేణుక ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాచ్ రెండో బంతికే ఓపెనర్ అలిసా హేలీను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్ మూనీతో పాటు.. కెప్టెన్ మెగ్ లానింగ్, తాహిలా మెగ్రాత్ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్ మొదటి బంతికి మెగ్రాత్‌ను రేణుక అవుట్ చేసిన తీరు హైలెట్‌గా నిలిచింది. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో మెగ్రాత్‌ను రేణుక బౌల్డ్ చేసింది. రేణుక సంధించిన బంతిని షాట్ ఆడేందుకు మెగ్రాత్ సమాయత్తమైంది. కానీ.. నమ్మశక్యం కాని రీతిలో బంతి మెగ్రాత్ ప్యాడ్, బ్యాట్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్‌ను ఎగురగొట్టింది. దీంతో బిత్తరపోయిన మెగ్రాత్ 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా క్రీజును వీడింది. అయితే, గార్డ్నర్కు తోడు గ్రేస్ హ్యారిస్ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్ సొంతమైంది. 𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥 Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj — Olympic Khel (@OlympicKhel) July 29, 2022 కామన్వెల్త్ క్రీడలు 2022- మహిళా క్రికెట్(టీ20 ఫార్మాట్) ►భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ►వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ ►టాస్: భారత్- బ్యాటింగ్ ►భారత్ స్కోరు: 154/8 (20) ►ఆస్ట్రేలియా స్కోరు: 157/7 (19) ►విజేత: ఆస్ట్రేలియా... 3 వికెట్ల తేడాతో గెలుపు చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో 14 ఏళ్ల భారత క్రీడాకారిణి సంచలనం -
Sri Lanka vs India: మెరిసిన దీప్తి, రేణుక
పల్లెకెలె: శ్రీలంక జట్టుతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక జట్టును ఓడించింది. రేణుక సింగ్ (3/29) పదునైన బౌలింగ్... దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/25; 22 నాటౌట్) భారత విజయంలో కీలకపాత్ర పోషించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 48.2 ఓవర్లలో171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి డిసిల్వా (43; 4 ఫోర్లు), హాసిని పెరీరా (37; 5 ఫోర్లు) రాణించారు. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 38 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (35; 1 ఫోర్, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (44; 3 ఫోర్లు), హర్లీన్ (34; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. పూజా వస్త్రకర్ (21 నాటౌట్; 2 సిక్స్‌లు)తో కలిసి దీప్తి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. శ్రీలంక బౌలర్లలో ఇనోకా రణవీర (4/39), ఒషాది రణసింఘే (2/34) టీమిండియాను ఇబ్బంది పెట్టినా ఇతర బౌలర్లు విఫలమయ్యారు. రెండో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది. -
ఏపీకి 28 ఏకలవ్య మోడల్ స్కూళ్లు మంజూరు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరైనట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 28 ఏకలవ్య స్కూళ్లలో 11 విశాఖపట్నం జిల్లాలోను 6 తూర్పు గోదావరి జిల్లాలోను ఉన్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఏకలవ్య సూళ్లలో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుని సహకరించడానికి వీలుగా 2019లో గిరిజన విద్యార్థుల జాతీయ విద్యా సంఘాన్ని (ఎన్ఈఎస్టీఎస్)ను నెలకొల్పినట్లు మంత్రి తెలిపారు. ఈ సంస్థను నెలకొల్పిన తొలి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య స్కూళ్లలో 92 శాతం మంది టెన్త్ విద్యార్థులు, 88 శాతం మంది ఇంటర్ విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 13 మంది ఇంజనీరింగ్ కోర్సుల్లోను, 11 మంది మెడికల్ కోర్సుల్లోను 21 మంది ఇతర ప్రొఫెనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో విద్యార్ధులు జేఈఈ, నీట్లో కూడా రాణించేందుకు వీలుగా దక్షణ ఫౌండేషన్ ద్వారా ఎంపిక చేసిన ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. -
బెల్టు తీసి కొడతా: రేణుకా సింగ్
రాయ్‌పూర్: కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి క్వారంటైన్ కేంద్రంలో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. దిలీప్ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్ కేంద్రంలో వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కేంద్రమంత్రి రేణుకా సింగ్ ఆదివారం బల్రాంపూర్లో ఉన్న కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడి వసతుల గురించి ఆరా తీసిన రేణుకా సింగ్ .. ప్రభుత్వ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాగిరి తన దగ్గర చెల్లదని ఆమె హెచ్చరించారు. (ఇంట్లోనే ఉంటున్నా) ‘మా ప్రభుత్వం అధికారంలో లేదని ఎవరు భావించవద్దు. మేం 15 సంవత్సరాలు పాలించాం. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద చాలినంత డబ్బు ఉంది. కాబట్టి ప్రజలకు కావాల్సిన వాటిని సమకూర్చండి. కాషాయ కండువా ధరించిన బీజేపీ కార్యకర్తలు బలహీనులని భావించకండి. మాట వినని జనాలను గదిలో బంధించి బెల్టు తీసుకుని ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు జాగ్రత్త’ అంటూ ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు రేణుకా సింగ్. ఈ తతంగాన్ని దిలీప్ గుప్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రేణుకా సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారానన్ని రేపుతున్నాయి. (‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’) ఈ క్రమంలో దిలీప్ గుప్తా మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్లి వచ్చాను. కరోనా నేపథ్యంలో బల్రాంపూర్ క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్నాను. ఇక్కడ వసతులు సరిగా లేవు, మంచి ఆహారం పెట్టడం లేదు. దాంతో ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. దీని గురించి అధికారులు నా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జుట్టు పట్టుకు లాగారు.. వీడియోను డిలీట్ చేశారు. కానీ ఈ లోపే రేణుకా సింగ్ ఈ వీడియోను చూడటంతో ఆమె క్వారంటైన్ కేంద్రానికి వచ్చి మాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు’ అన్నాడు దిలీప్ గుప్తా. -
భారత మహిళల హాకీ జట్టుకు నాలుగో విజయం
భోపాల్: భారత మహిళల హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. బెలారస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రాణి రాంపాల్ సేన వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 2–1 గోల్స్ తేడాతో బెలారస్‌ను ఓడించింది. ఆట ఆరంభమైన ఆరో నిమిషంలోనే రేణుకా యాదవ్ ఫీల్డ్ గోల్ చేయగా... మరో ఆరు నిమిషాలకు గుర్జీత్ కౌర్ (12వ ని.) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. రెండో క్వార్టర్లో బెలారస్ తరఫున నస్టాసియా సైరయెజ్కా ఫీల్డ్ గోల్ సాధించింది.