మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది.
ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్‌నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment