Gujarat Giants
-
WPL 2025: ముంబై మెరిసె... ఫైనల్లో హర్మన్ బృందం
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్లో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. బ్యాట్‌తో హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేసింది. అనంతరం బంతితోనూ ముంబై బౌలర్లు హడలెత్తించారు. దాంతో లక్ష్య ఛేదనలో గుజరాత్ జెయింట్స్ డీలా పడింది. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన ఏడోసారీ గుజరాత్ జట్టు పరాజయాన్నే మూటగట్టుకుంది. ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి తుదిపోరుకు చేరింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఆడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), నాట్ సివర్ బ్రంట్ (41 బంతుల్లో 77; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకాలతో విజృంభించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో గిబ్సన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ జట్టు 19.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. గిబ్సన్ (24 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), లిచ్‌ఫీల్డ్ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), భారతి (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో హేలీ 3, అమేలియా కెర్ 2 వికెట్లు పడగొట్టింది. హేలీ మాథ్యూస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బాదుడే బాదుడు.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి యస్తిక భాటియా (15; 3 ఫోర్లు) వికెట్ కోల్పోయిన ముంబై 37 పరుగులే చేసింది. గిబ్సన్ వేసిన ఏడో ఓవర్లో సివర్ బ్రంట్ రెండు ఫోర్లతో జోరు పెంచగా... ప్రియా ఓవర్లో హేలీ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడింది. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 100/1తో నిలిచింది. ఈ క్రమంలో హేలీ 36 బంతుల్లో, సివర్ 29 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట మరింత ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిబ్సన్ వేసిన 15వ ఓవర్లో సివర్ రెండు భారీ సిక్సర్లు బాదగా... ప్రియ ఓవర్లో హేలీ వరుసగా 6, 6, 4 కొట్టింది. రెండో వికెట్‌కు 71 బంతుల్లో 133 పరుగులు జోడించిన అనంతరం హేలీ అవుట్ కాగా... హర్మన్ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడింది. తనూజ వేసిన 18వ ఓవర్లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టిన హర్మన్... చివరి ఓవర్లో మరో 2 సిక్స్‌లు బాదింది. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. చివరి 5 ఓవర్లలో ముంబై జట్టు 73 పరుగులు రాబట్టింది.ఛేజింగ్‌లో జెయింట్స్ రనౌట్.. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ ప్రభావం చూపలేకపోయింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ బెత్ మూనీ (6) పెవిలియన్ చేరగా... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (8), హర్లీన్ డియోల్ (8) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో గుజరాత్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిబ్సన్, లిచ్‌ఫీల్డ్ కాస్త పోరాడినా... ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌కు చక్కటి ఫీల్డింగ్ తోడవడంతో ముంబై జట్టు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. భారతి, సిమ్రన్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. పేలవ ఫీల్డింగ్‌తో ముంబై బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్‌లు వదిలేసిన గుజరాత్ జట్టు... వికెట్ల మధ్య చురుకుగా పరిగెత్తలేక రనౌట్ రూపంలో 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) భారతి (బి) గిబ్సన్ 15; హేలీ మాథ్యూస్ (సి) మూనీ (బి) కాశ్వీ గౌతమ్ 77; సివర్ బ్రంట్ (సి) లిచ్‌ఫీల్డ్ (బి) గిబ్సన్ 77; హర్మన్‌ప్రీత్ కౌర్ (రనౌట్) 36; సజన (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–26, 2–159, 3–198, 4–213. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 4–0–30–1; ఆష్లీ గార్డ్నర్ 2–0–15–0; తనూజ కన్వర్ 4–0–49–0; గిబ్సన్ 4–0–40–2; ప్రియా మిశ్రా 3–0–40–0; మేఘనా సింగ్ 3–0–35–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) హేలీ మాథ్యూస్ (బి) షబ్నమ్ 6; గిబ్సన్ (రనౌట్) 34; హర్లీన్ డియోల్ (రనౌట్) 8; ఆష్లీ గార్డ్నర్ (బి) హేలీ మాథ్యూస్ 8; లిచ్‌ఫీల్డ్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 31; భారతి (బి) హేలీ 30; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 4; సిమ్రన్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) కెర్ 17; తనూజ (సి) అమన్‌జ్యోత్ (బి) సివర్ 16; మేఘన (సి) సివర్ (బి) హేలీ 5; ప్రియ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–6, 2–34, 3–43, 4–81, 5–107, 6–112, 7–142, 8– 157, 9–165, 10–166. బౌలింగ్: షబ్నిమ్ 4–0–35–1; సివర్ 4–0–31–1; సైకా 1–0– 8–0; హేలీ 3.2–0–31–3, అమన్‌జ్యోత్ 3–0–32–0; అమేలియా కెర్ 4–0–28–2. -
ఫైనల్ చేరేదెవరో!
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడనుంది. తాజా సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై జట్టునే విజయం వరించగా... ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు భావిస్తోంది. మరోవైపు ఆష్లీ గార్డ్నర్ కెపె్టన్సీలోని గుజరాత్ జెయింట్స్ జట్టు తొలిసారి ఫైనల్ చేరాలని తహతహలాడుతోంది. లీగ్ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్ కూడా 5 మ్యాచ్‌లు నెగ్గినప్పటికీ రన్‌రేట్‌లో ముంబై కంటే మెరుగ్గా ఉన్న ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్ కావడం విశేషం. మరోవైపు 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి గుజరాత్ జెయింట్స్ జట్టు ఎలిమినేటర్‌కు చేరింది. మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడనుండటం హర్మన్‌ప్రీత్ బృందం బలాన్ని మరింత పెంచుతోంది. హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌జ్యోత్ కౌర్, సజన, యస్తిక భాటియా రూపంలో ముంబై జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్‌గా మెరుపు ఆరంభాలు ఇస్తున్న హేలీ మాథ్యూస్... బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బ్యాటింగ్‌లో సివర్ బ్రంట్ ఫుల్ ఫామ్ చాటుకుంటోంది. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన సివర్... 416 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కొనసాగుతోంది. ఇందులో 4 అర్ధశతకాలు ఉన్నాయి. ఇరు జట్ల మద్య చివరగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ విజృంభించింది. మిడిలార్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. బౌలింగ్‌లో షబ్నమ్ ఇస్మాయిల్, హేలీ మాథ్యూస్, సివర్ బ్రంట్, పారుణిక, అమేలియా, సంస్కృతి, అమన్‌జ్యోత్ కీలకం కానున్నారు. మరోవైపు ఈ సీజన్లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన గుజరాత్... వాటికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ, లిచ్‌ఫీల్డ్, డియాండ్రా డాటిన్, హర్లీన్ డియోల్ కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో భారీ షాట్లతో ముంబైని వణికించిన భారతి ఫూల్మాలి నుంచి అదే తరహా మెరుపులు కొనసాగాలని కోరుకుంటోంది. బౌలింగ్‌లో డాటిన్, తనుజ, కాశ్వి, ప్రియ, మేఘన కీలకం కానున్నారు. -
ముంబై ‘ఫైనల్’ రేసులో...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో అగ్రస్థానంతో నేరుగా ఫైనల్ చేరేందుకు ముంబై ఇండియన్స్ జట్టు విజయం దూరంలో నిలిచింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (33 బంతుల్లో 54; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత గుజరాత్ 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారతి (25 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ముంబై బౌలర్లపై విరుచుకుపడింది. జెయింట్స్ ఒకదశలో 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమికి సిద్ధమవగా... భారతి ధనాధన్ ఆటతో ఆశలు రేపింది. 41 బంతుల్లో 88 పరుగుల సమీకరణం ఆఖరి ఓవర్‌కు వచ్చేసరికి 6 బంతుల్లో 13 పరుగులుగా మారింది. కానీ 20వ ఓవర్ వేసిన హేలీ... తనూజ (10)ను రనౌట్ చేసింది. తర్వాతి బంతికి సిమ్రాన్ (18; 1 ఫోర్, 1 సిక్స్), చివరి బంతికి ప్రియా (1) వికెట్లు తీసి ఆలౌట్ చేసింది. నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిస్తే ముంబై 12 పాయింట్లతో పట్టికలో టాప్ లేపి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నా... మెరుగైన రన్‌రేట్ కారణంగా ఢిల్లీ ‘టాప్’లో ఉంది. -
నేరుగా ఫైనల్ చేరడమే లక్ష్యం
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్లే ఆఫ్స్ బెర్త్‌లు శనివారం ఖరారయ్యాయి. ఇక మిగిలిందల్లా అగ్రస్థానం కోసం పోటీ! పాయింట్ల పట్టికలో ‘టాప్’లో నిలిచిన ఏకైక జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్‌ల పోరాటం కూడా దీని కోసమే! 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌కు ఇది ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా... మంచి రన్‌రేట్‌తో గెలిస్తే అగ్రస్థానంతో తుదిపోరుకు చేరే అవకాశముంది. 8 పాయింట్లతో రన్‌రేట్‌లో వెనుకబడినప్పటికీ... ముంబై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉండటం, సొంత ప్రేక్షకుల మధ్య జరగనుండటం అదనపు అనుకూలతగా మారింది. మాజీ చాంపియన్ ముంబై నేడు జెయింట్స్‌పై, రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలిస్తే చాలు ఎలాంటి రన్‌రేట్ సమీకరణాలతో పనిలేకుండా 12 పాయింట్లతో ఫైనల్ బరిలో నిలవొచ్చు. ఇప్పటికైతే ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. అనామకం కాదు కీలకం ముంబై, గుజరాత్ జట్లు ప్లేఆఫ్స్ చేరిన నేపథ్యంలో ఇది అనామక మ్యాచ్ అనుకుంటే పోరపాటే అవుతుంది. ఫైనల్ రేసు కోసం ఇరు జట్ల మధ్య ముమ్మాటికి కీలకపోరే జరుగనుంది! ముంబై జట్టు విదేశీ బ్యాటర్ల బలగంతో పటిష్టంగా ఉంది. నాట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్‌లు ఈ టోర్నీలో నిలకడగా ఫామ్ చాటుకున్నారు. వీళ్లిద్దరితో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, అమెలియా కెర్లు కూడా మెరుగ్గానే ఆడుతుండటంతో బ్యాటింగ్ లైనప్‌కు ఏ ఢోకా లేదు. బౌలింగ్‌లోనూ విదేశీ ఆల్‌రౌండర్లే జట్టు విజయాల్లో భాగమవుతున్నారు. యూపీ వారియర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అమెలియా కెర్ ఐదు వికెట్లతో సత్తా చాటుకుంది. నాట్ సివర్, హేలీ మాథ్యూస్‌లు కూడా అడపాదడపా వికెట్లను పడగొడుతున్నారు. మరోవైపు గుజరాత్ జెయింట్స్ కూడా గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు చెక్ పెట్టింది. 177 పరుగుల భారీ లక్ష్యాన్ని జెయింట్స్ సులువుగా ఛేదించింది. హర్లీన్ డియోల్, బెత్ మూనీ, కెపె్టన్ ఆష్లీ గార్డ్నర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్, కాశ్వీ, తనూజ, మేఘన సింగ్‌లు ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), హేలీ మాథ్యూస్, అమెలియా కెర్, నాట్ సివర్, అమన్‌జ్యోత్ కౌర్, యస్తిక, సజన, కమలిని, సంస్కృతి, షబ్నమ్, పారుణిక సిసోడియా. గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్నర్ (కెప్టెన్), బెత్ మూనీ, హేమలత, హర్లీన్ డియోల్, డియాండ్రా, లిచ్‌ఫీల్డ్, కాశ్వీ గౌతమ్, భారతి, తనూజ, మేఘన సింగ్, ప్రియా మిశ్రా. -
గుజరాత్ జెయింట్స్ జోరు
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ వరుసగా మూడో విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. శుక్రవారం జరిగిన ఈ పోరులో జెయింట్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. గుజరాత్ జెయింట్స్ గెలుపుతో యూపీ వారియర్స్ జట్టు అధికారికంగా ‘ప్లే ఆఫ్’ రేసు నుంచి దూరమైంది. గుజరాత్‌తో పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (57 బంతుల్లో 92; 15 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగగా... మరో ఓపెనర్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 54 బంతుల్లోనే 83 పరుగులు జోడించారు. జెయింట్స్ బౌలర్లలో మేఘనా సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, డియాండ్రా డాటిన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు సాధించి గెలిచింది.హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, బెత్ మూనీ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) రాణించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 బంతుల్లో 85 పరుగులు జత చేశారు. చివర్లో డాటిన్ (10 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆష్లీ గార్డ్నర్ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్ జెయింట్స్ విజయానికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరగలిగే స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశగా తమ చివరిదైన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌ను ముగించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్’ రేసులో నిలవాలంటే బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: లానింగ్ (బి) డాటిన్ 92; షఫాలీ (సి) లిచ్‌ఫీల్డ్ (బి) మేఘన 40; జొనాసెన్ (బి) డాటిన్ 9; జెమీమా (సి) గార్డ్నర్ (బి) మేఘన 4; అనాబెల్ (సి) డాటిన్ (బి) మేఘన 14; కాప్ (నాటౌట్) 7; బ్రైస్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–83, 2–108, 3–119, 4–141, 5–171. బౌలింగ్: డాటిన్ 4–0–37–2, కాశ్వీ 3–0–32–0, తనూజ 4–0–31–0, మేఘన 4–0–35–3, గార్డ్నర్ 2–0–18–0, ప్రియ 2–0–21–0 గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) అనాబెల్ (బి) మిన్ను మణి 44; హేమలత (సి) లానింగ్ (బి) శిఖా 1; హర్లీన్ (నాటౌట్) 70; ఆష్లీ గార్డ్నర్ (సి) మిన్ను మణి (బి) శిఖా 22; డాటిన్ (సి) జెమీమా (బి) జొనాసెన్ 24; లిచ్‌ఫీల్డ్ (సి) షఫాలీ (బి) జొనాసెన్ 0; కాశ్వీ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–4, 2–89, 3–128, 4–162, 5–162. బౌలింగ్: మరిజాన్ కాప్ 4–1–29–0, శిఖా పాండే 4–0–31–2, అనాబెల్ సదర్లాండ్ 4–0–45–0, టిటాస్ సాధు 2–0–17–0, మిన్ను మణి 2–0–15–1, జొనాసెన్ 3.3–0–38–2. -
మూనీ విధ్వంసం.. యూపీని చిత్తు చేసిన గుజరాత్
ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ కీలక విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా సోమవారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో జెయింట్స్ ఘన విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. ఓపెనర్ బెత్ మూనీ (59 బంతుల్లో 96 నాటౌట్; 17 ఫోర్లు) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోగా, హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం వారియర్స్ 17.1 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. షినెల్ హెన్రీ (14 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), గ్రేస్ హారిస్ (30 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో కాశ్వీ, తనూజ చెరో 3 వికెట్లు తీశారు. వాజ్‌పేయి ఇకానా స్టేడియంలో ఇదే తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ కాగా...సొంత మైదానంలో యూపీ చిత్తుగా ఓడింది. తొలి ఓవర్లోనే హేమలత (2) వికెట్ కోల్పోయినా... మూనీ, హర్లీన్ రెండో వికెట్‌కు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముఖ్యంగా మూనీ బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరును అందించింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. యూపీ బౌలర్లంతా సమష్టిగా విఫలం కాగా...ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న హైదరాబాదీ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాకు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు! ఛేదనలో వారియర్స్ మరీ పేలవంగా ఆడింది.ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి డాటిన్ దెబ్బ కొట్టగా...పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 29/4కు చేరింది. ఆ తర్వాత ఏ దశలోనూ యూపీ కోలుకోలేకపోయింది. రెండు రోజుల విశ్రాంతి అనంతరం గురువారం జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ ఆడుతుంది.చదవండి: షమీ సాబ్.. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. అతడి పని పట్టాల్సిందే..: టీమిండియా దిగ్గజం -
RCB Vs GG: మళ్లీ ఓడిన బెంగళూరు
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వడోదర వేదికగా తొలి రెండు మ్యాచ్‌లు ఆడి విజయాలు అందుకున్న ఆర్సీబీ... ఆపై సొంత మైదానానికి వచ్చిన తర్వాత ఒక్క గెలుపూ సాధించలేదు. తాజాగా గురువారం జట్టు ఖాతాలో వరుసగా మూడో పరాజయం చేరింది. మరోవైపు ఈ పోరుకు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒకటే గెలిచి పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్ ఖాతాలో రెండో విజయం చేరింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కనిక అహుజా (28 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...రాఘ్వీ బిస్త్ (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), జార్జియా వేర్హామ్ (21 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ కన్వర్, డాటిన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం గుజరాత్ 16.3 ఓవర్లలో 4 వికెట్లకు 126 పరుగులు సాధించింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో కదం తొక్కగా... ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలోనూ ధాటి కనిపించలేదు. టాప్–3 బ్యాటర్లలో స్మృతి మంధాన (10), డానీ వ్యాట్ (4) విఫలం కాగా... ఎలైస్ పెరీ (4 బంతుల్లో 0) డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి డకౌటైంది. నాలుగో వికెట్‌కు కనిక, రాఘ్వీ 37 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా కాస్త తడబడింది. హేమలత (15 బంతుల్లో 11; 2 ఫోర్లు), బెత్ మూనీ (20 బంతుల్లో 17; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (10 బంతుల్లో 5) తక్కువ వ్యవధిలో వెనుదిరిగారు. అయితే ఆ్రస్టేలియా క్రికెటర్లయిన గార్డ్నర్, లిచ్‌ఫీల్డ్ భాగస్వామ్యంలో జట్టు గెలుపు దిశగా సాగింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 36 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. ప్రేమ రావత్ ఓవర్లో గార్డ్నర్ వరుస బంతుల్లో 4, 4, 4, 6 బాదడం ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. స్కోరు వివరాలురాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (సి) హర్లీన్ (బి) తనూజ 10; డానీ వ్యాట్ (ఎల్బీ) (బి) డాటిన్ 4; పెరీ (సి) తనూజ (బి) గార్డ్నర్ 0; రాఘ్వీ (రనౌట్) 22; కనిక (సి అండ్ బి) తనూజ 33; రిచా (బి) కాశ్వీ 9; వేర్హామ్ (నాటౌట్) 20; గార్త్ (సి) మూనీ (బి) డాటిన్ 14; స్నేహ్ రాణా (నాటౌట్) 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–6, 2–16, 3–25, 4–73, 5–78, 6–99, 7–122. బౌలింగ్: డాటిన్ 4–0–31–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–22–1, కాశ్వీ గౌతమ్ 4–0–17–1, తనూజ 4–0–16–2, హేమలత 1–0–4–0, ప్రియా మిశ్రా 1–0–18–0, మేఘన 2–0–12–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) వేర్హామ్ (బి) రేణుక 17; హేమలత (స్టంప్డ్) రిచా (బి) రేణుక 11; హర్లీన్ (సి) పెరీ (బి) వేర్హామ్ 5; గార్డ్నర్ (సి అండ్ బి) వేర్హామ్ 58; లిచ్‌ఫీల్డ్ (నాటౌట్) 30; డాటిన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.3 ఓవర్లలో 4 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1–25, 2–32, 3–66, 4–117. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–24–2, కిమ్ గార్త్ 2–3.–0–19–0, స్నేహ్ రాణా 4–0–23–0, ప్రేమ రావత్ 1–0–19–0, వేర్హామ్ 3–0–26–2, ఎలైస్ పెరీ 1–0–7–0, కనిక 1–0–7–0. డబ్ల్యూపీఎల్‌లో నేడుఢిల్లీ క్యాపిటల్స్ X ముంబై ఇండియన్స్రాత్రి గం. 7:30 స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే పరిమితం
డబ్ల్యూపీఎల్ 2025 ఎడిషన్‌లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఎల్లిస్ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది. ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ 4, రిచా ఘోష్ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్ (22), జార్జియా వేర్హమ్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్ గార్త్ (14) రెండంకెల స్కోర్ చేసింది. స్నేహ్ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్ (4-0-17-1), తనూజా కన్వర్ (4-0-16-2), కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. -
ఢిల్లీ అలవోకగా...
బెంగళూరు: ఈ సీజన్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన పోరులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా గుజరాత్ నిర్ణీ త 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. భారతి ఫుల్మాలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకుంది.డాటిన్ (24 బంతుల్లో 26; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. మరిజాన్ కాప్, శిఖా పాండే, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 15.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనాసెన్ (32 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), షఫాలీ వర్మ (27 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. ఆరంభంలోనే దెబ్బ... మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టులో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. నాలుగో ఓవర్లో హర్లీన్ (5), లిచ్‌ఫీల్డ్ (0)లను అవుట్ చేసిన మరిజాన్ కాప్ దెబ్బ తీసింది. మరుసటి ఓవర్లో శిఖాపాండే వరుస బంతుల్లో బెథ్ మూని (10), కాశ్వీ గౌతమ్ (0)లను అవుట్ చేయడంతో ఇరవై పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది.కాసేపటికి కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (3), డియాండ్ర డాటిన్‌లు స్వల్ప వ్యవధిలో నిష్క్రమించడంతో 60/6 వద్ద గుజరాత్ కుదేలైంది. ఈ దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ భారతి, తనూజ (16) ఏడో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్కోరు 100 దాటింది. ధనాధన్... సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే కెప్టెన్ మెగ్‌లానింగ్ (3) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్‌ను అవుట్ చేశామన్న ఆనందం గుజరాత్‌కు ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ షఫాలీ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ జెస్ జొనాసెన్ ధాటిగా ఆడటంతో పరుగులు వేగంగా వచ్చాయి. జెస్ బౌండరీలతో అలరించగా, షఫాలీ భారీ సిక్సర్లతో అదరగొట్టింది. వీరిద్దరు 31 బంతుల్లోనే 74 పరుగులు జత చేశారు. షఫాలీ జోరుకు గార్డ్నర్ అడ్డుకట్ట వేయగా, జెమీమా (5), అనాబెల్ (1) స్వల్ప వ్యవధిలో నిష్క్రమించినా... 26 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జొనాసెన్ మిగతా లాంఛనాన్ని చకచకా పూర్తి చేసింది. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై ఇండియన్స్ ఆడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) నికీ (బి) శిఖా పాండే 10; హర్లీన్ డియోల్ (సి) బ్రైస్ (బి) మరిజాన్ కాప్ 5; లిచ్‌ఫీల్డ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మరిజాన్ కాప్ 0; ఆష్లీ గార్డ్నర్ (బి) టిటాస్ సాధు 3; కాశ్వీ (సి) నికీ (బి) శిఖా పాండే 0; డియాండ్రా (బి) అనాబెల్ 26; తనూజ (రనౌట్) 16; భారతి (నాటౌట్) 36; సిమ్రన్ (సి) లానింగ్ (బి) అనాబెల్ 5; మేఘన (బి) జెస్ జొనాసెన్ 0; ప్రియా మిశ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–20, 4–20, 5–41, 6–60, 7–111, 8–121, 9–122. బౌలింగ్: శిఖా పాండే 3–0–18–2, మరిజాన్ కాప్ 4–1–17–2, టిటాస్ సాధు 2–0–15–1, అనాబెల్ 4–0–20–2, మిన్ను మణి 4–0–21–0, జెస్ జొనాసెన్ 3–0–24–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) కాశ్వీ 3; షఫాలీ వర్మ (ఎల్బీడబ్ల్యూ) (బి) గార్డ్నర్ 44; జెస్ జొనాసెన్ (నాటౌట్) 61; జెమీమా (సి) భారతి (బి) తనూజ 5; అనాబెల్ (సి) బెత్ మూనీ (బి) కాశ్వీ 1; మరిజాన్ కాప్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (15.1 ఓవర్లలో 4 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1–14, 2–88, 3–114, 4–115. బౌలింగ్: డియాండ్ర 4–0–30–0, కాశ్వీ 4–0–26–2, ఆష్లీ గార్డ్నర్ 3–0–33–1, మేఘన 1–0–8–0, ప్రియా 1.1–0–18–0, తనూజ 2–0–13–1. -
WPL 2025: రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన గుజరాత్
మహిళల ఐపీఎల్లో (WPL-2025) ఇవాళ (ఫిబ్రవరి 25) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీ.. గుజరాత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఢిల్లీ బౌలర్లు శిఖా పాండే (3-0-18-2), మారిజన్ కాప్ (4-1-17-2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-20-2), టిటాస్ సాధు (2-0-15-1), జెస్ జొనాస్సెన్ (3-0-24-1) తలో చేయి వేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కరే చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. భారతి ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో భారతితో పాటు డియాండ్రా డొటిన్ (26), తనూజా కన్వర్ (16), బెత్ మూనీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హర్లీన్ డియోల్ 5, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 0, కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ 3, కశ్వీ గౌతమ్ 0, సిమ్రన్ షేక్ 5, మేఘనా సింగ్ 0 పరుగులకు ఔటయ్యారు. ప్రియా మిశ్రా ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది.కాగా, ఈ సీజన్లో గుజరాత్ జెయింట్స్ గతం తరహాలోనే పేలవంగా ఆడుతుంది. ఈ సీజన్లో జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ గత రెండు సీజన్లను ఇదే తరహాలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముగించింది. ఈ సీజన్లో గుజరాత్ యూపీ వారియర్జ్‌పై విజయం సాధించి.. ఆర్సీబీ, ముంబై ఇండయన్స్ చేతుల్లో ఓడింది. ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ముంబై (0.610), యూపీ (0.167), ఢిల్లీ (-0.826) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా తలో నాలుగు పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. అయితే వీటితో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.619) అధికంగా ఉంది. -
ముంబై ఇండియన్స్ బోణీ
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) రెండో పోరులో విజయాన్ని అందుకొని పాయింట్ల ఖాతా తెరిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)పై ఘన విజయం సాధించింది. గుజరాత్‌కు ఈ టోర్నిలో ఇది రెండో పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 32; 4 ఫోర్లు), కాశ్వీ గౌతమ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే కొద్దిగా ప్రభావం చూపగలిగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (3/16) రాణించగా...అమెలియా కెర్, నాట్ సివర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 16.1 ఓవర్లలో 5 వికెట్లకు 122 పరుగులు చేసింది. నాట్ సివర్ బ్రంట్ (39 బంతుల్లో 57; 11 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ జట్టు తలపడుతుంది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) సంస్కృతి గుప్తా (బి) నాట్ సివర్ 1; వోల్వార్ట్ (సి) సజన (బి) షబ్నమ్ 4; హేమలత (సి) కెర్ (బి) హేలీ 9; ఆష్లీ గార్డ్నర్ (సి) సంజన (బి) నాట్ సివర్ 10; హర్లీన్ (సి) హేలీ (బి) కౌర్ 32; డాటిన్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 7; కాశ్వీ (సి) భాటియా (బి) హేలీ 20; సిమ్రన్ (సి) కెర్ (బి) హేలీ 3; తనూజ (సి) సంస్కృతి గుప్తా (బి) కెర్ 13; సయాలీ (నాటౌట్) 13; ప్రియ (రనౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1–6, 2–14, 3–16, 4–28, 5–43, 6–67, 7–79, 8–103, 9–103, 10–120. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–1–17–1, నాట్ సివర్ 4–0–26–2, హేలీ మాథ్యూస్ 4–0–16–3, అమేలియా కెర్ 4–0–22–2, పరుణిక 2–0–20–0, అమన్‌జోత్ కౌర్ 2–0–17–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) హర్లీన్ (బి) తనూజ కన్వర్ 17; యస్తిక (సి) వోల్వార్ట్ (బి) ప్రియ 8; నాట్ సివర్ (బి) ప్రియ 57; హర్మన్‌ప్రీత్ (ఎల్బీ) (బి) కాశ్వీ 4; కెర్ (ఎల్బీ) (బి) కాశ్వీ 19; సజన (నాటౌట్) 10; కమలిని (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (16.1 ఓవర్లలో 5 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1–22, 2–46, 3–55, 4–100, 5–114. బౌలింగ్: ఆష్లీ గార్డ్నర్ 3–0–21–0, తనూజ 3–0–25–1, డియాండ్ర డాటిన్ 3.1–0–19–0, ప్రియ మిశ్రా 4–0–40–2, కాశ్వీ గౌతమ్ 3–0–15–2. -
WPL 2025: ముంబై బౌలర్ల విజృంభణ.. గుజరాత్ నామమాత్రపు స్కోరు
ముంబై ఇండియన్స్ వుమెన్(Mumbai Indians Women)తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) బ్యాటర్లు విఫలమయ్యారు. టాపార్డర్ కుప్పకూలడంతో గుజరాత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. మహిళల ప్రీమియర్ లీగ్-2025(WPL) ఎడిషన్‌లో భాగంగా ముంబై- గుజరాత్ మధ్య మ్యాచ్‌కు వడోదర ఆతిథ్యమిస్తోంది.కొటాంబి స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్.. ముంబై జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ(1), లారా వొల్వర్ట్(4) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ దయాళన్ హేమలత(9), నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్(10) కూడా నిరాశపరిచారు.ఆదుకున్న హర్లీన్ డియోల్ ఈ క్రమంలో హర్లీన్ డియోల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. 31 బంతుల్లో 32 పరుగులు చేసిన హర్లీన్ అమన్‌జోత్ కౌర్ బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. మిగతావాళ్లలో హార్డ్ హిట్టర్‌గా పేరొందిన డియాండ్రా డాటిన్ ఏడు పరుగులకే నిష్క్రమించగా.. కశ్వీ గౌతమ్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించింది. హేలీ మాథ్యూస్‌కు మూడు వికెట్లుఇక లోయర్ ఆర్డర్లో సిమ్రన్ షేక్ 3, తనూజా కన్వర్ 13, సయాలీ సత్ఘరే 13(నాటౌట్), ప్రియా మిశ్రా(2) పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత ఇరవై ఓవర్లలో 120 పరుగులు చేసిన గుజరాత్ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్ హేలీ మాథ్యూస్ అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. రైటార్మ్ మీడియం పేసర్ నట్ సీవర్- బ్రంట్, అమేలియా కెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. షబ్నం ఇస్మాయిల్, అమన్‌జోత్ కౌర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.తొలి గెలుపు కోసంకాగా ఫిబ్రవరి 14న డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ మొదలైన విషయం తెలిసిందే. తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వుమెన్ జట్టు ఎదుర్కొన్న గుజరాత్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా.. రెండు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.అనంతరం యూపీ వారియర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గెలుపుబాట పట్టిన గుజరాత్ జెయింట్స్.. తాజా మ్యాచ్‌లో ముంబై బౌలర్ల ధాటికి నామమాత్రపు స్కోరు చేసింది. ఇక సీజన్లో తొలి గెలుపు కోసం ఎదురుచూస్తున్న ముంబై.. విజయమే లక్ష్యంగా మంగళవారం నాటి మ్యాచ్ బరిలో దిగింది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. అరంగేట్ర చాంపియన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ సేన(ముంబై) నిలిచిన విషయం తెలిసిందే. ఇక గతేడాది స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ టైటిల్ గెలిచింది.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ జెయింట్స్ వుమెన్ వర్సెస్ ముంబై వుమెన్ తుదిజట్లుగుజరాత్ జట్టులారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.ముంబై జట్టుయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా. -
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
అండర్-19 టీమిండియా స్టార్ క్రికెటర్ జి.కమలిని(G Kamalini) సరికొత్త రికార్డు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్(WPL) చరిత్రలో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ వుమెన్ తరఫున ఈ తమిళనాడు క్రికెటర్ మంగళవారం(ఫిబ్రవరి 18) డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టింది. ఓటమితో మొదలుపెట్టిన ముంబైకాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 14) డబ్ల్యూపీఎల్-2025 ఎడిషన్ మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్లో తొలుత గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజేతగా నిలవగా.. శనివారం నాటి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ కాప్యిటల్స్ చేతిలో ఓడిపోయింది.అనంతరం ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఆ తర్వాత సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఎదుర్కొన్న బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్- ముంబై తలపడుతున్నాయి.ఇద్దరు ప్లేయర్ల అరంగేట్రంవడోదరలోని కొటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వుమెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. సైకా ఇసాక్ స్థానంలో పరుణిక సిసోడియా(Parunika Sisodia) జట్టులోకి వచ్చినట్లు తెలిపిన హర్మన్.. కమలినికి కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు పేర్కొంది.ఈ క్రమంలో కమలిని అత్యంత చిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. పదహారేళ్ల 213 రోజులు వయసులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మహిళల టీ20 లీగ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల మలేషియా వేదికగా ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో కమలిని సభ్యురాలు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన కమిలిని ఈ మెగా టోర్నమెంట్లో రెండు అర్ధశతకాలతో మెరిసింది. మరోవైపు.. పరుణిక సిసోడియా కూడా వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్. టోర్నీ మొత్తంలో కలిపి పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఒకేసారి అరంగేట్రం చేయడం విశేషం.డబ్ల్యూపీఎల్‌లో చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు👉జి.కమలిని(ముంబై ఇండియన్స్)- 16 ఏళ్ల 213 రోజుల వయసులో- గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం- 2025👉షబ్నం షకీల్(గుజరాత్ జెయింట్స్)- 16 ఏళ్ల 263 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2024👉పార్శవి చోప్రా(యూపీ వారియర్స్)- 16 ఏళ్ల 312 రోజుల వయసులో ముంబై ఇండియన్స్ మీద- 2023👉వీజే జోషిత(ఆర్సీబీ)- 18 ఏళ్ల 205 రోజుల వయసులో గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం-2025👉అలిస్ కాప్సే(ఢిల్లీ క్యాపిటల్స్)- 18 ఏళ్ల 206 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2023.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ముంబై తుదిజట్లుముంబైయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.గుజరాత్లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
WPL 2025: గార్డ్నర్ ఆల్‌రౌండ్ ‘షో’
వడోదర: ఈ సీజన్ డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో 200 పైచిలుకు స్కోరు చేసినా గెలువలేకపోయిన గుజరాత్ జెయింట్స్... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్, డియాండ్ర డాటిన్ల ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ దీప్తి శర్మ (27 బంతుల్లో 39; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. స్పిన్నర్ ప్రియా మిశ్రా 3 వికెట్లు తీయగా... ఆష్లీ గార్డ్నర్, పేసర్ డియాండ్ర 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం గుజరాత్ 18 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 144 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆష్లీ గార్డ్నర్ (32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డియాండ్ర డాటిన్ (18 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. సోఫీ ఎకిల్‌స్టోన్ (4–0– 16–2) చక్కని స్పెల్ వృథా అయ్యింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. దీప్తి ఒక్కరే మెరుగ్గా... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. జట్టు స్కోరు 22 వద్ద ఓపెనర్లు కిరణ్ నవ్‌గిరే (15), వృందా (6) పెవిలియన్ చేరారు. ఈ దశలో ఉమా ఛెత్రి (27 బంతుల్లో 24; 4 ఫోర్లు), దీప్తి శర్మ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్ కుదుట పడుతున్న సమయంలో 73 పరుగుల వద్ద ఉమా, పరుగు వ్యవధిలో ప్రియా స్పిన్ మ్యాజిక్కు తాలియా (0), గ్రేస్ (4) అవుటవ్వడంతో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ధాటిగా ఆడిన దీప్తి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. కానీ తర్వాత 16 పరుగుల వ్యవధిలో మళ్లీ 3 వికెట్లు కూలడంతో యూపీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. దూకుడుగా ఆడి... కష్టమైన లక్ష్యం కాకపోయినా... ఓపెనర్ బెత్ మూనీ (0), వన్‌డౌన్ బ్యాటర్ హేమలత (0) డకౌట్లతో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయిన గుజరాత్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. 4 ఓవర్లలో జట్టు స్కోరు 15/2. పవర్‌ప్లేలో మిగిలినవి రెండే ఓవర్లు. సైమా ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో ఆష్లీ గార్డ్నర్ 2 సిక్స్‌లు, వొల్వార్ట్ మరో సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఇక్కడి నుంచి మ్యాచ్ స్వరూపం మారింది. వోల్వార్ట్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) అవుటైనా... ధనాధన్ షోతో గార్డ్నర్ 28 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. జట్టు స్కోరు 86 వద్ద ఆమె నిష్క్రమించినా... హర్లీన్ డియోల్ (30 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), డియాండ్ర జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి మ్యాచ్‌ను 18 ఓవర్లలోనే ముగించింది. స్కోరు వివరాలు యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: నవ్‌గిరే (ఎల్బీడబ్ల్యూ) (బి) డాటిన్ 15; వృందా (బి) గార్డ్నర్ 6; ఉమా (సి) ప్రియా (బి) డాటిన్ 24; దీప్తి (సి) గార్డ్నర్ (బి) ప్రియా 39; తాలియా (ఎల్బీడబ్ల్యూ) (బి) ప్రియా 0; గ్రేస్ (బి) ప్రియా 4; శ్వేత (బి) గార్డ్నర్ 16; అలానా కింగ్ (నాటౌట్) 19; సోఫీ (బి) కశ్వీ 2; సైమా (రనౌట్) 15; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–22, 2–22, 3–73, 4–74, 5–78, 6–101, 7–111, 8–117, 9–143. బౌలింగ్: సయాలీ 2–0–20–0, డియాండ్రా 4–0– 34–2, ఆష్లీ గార్డ్నర్ 4–0–39–2, కశ్వీ 4–0– 15–1, తనూజ 2–0–10–0, ప్రియా 4–0– 25–3. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: వొల్వార్ట్ (బి) సోఫీ 22; బెత్ మూనీ (సి) తాలియా (బి) గ్రేస్ హారిస్ 0; హేమలత (బి) సోఫీ 0; ఆష్లీ గార్డ్నర్ (సి) నవ్‌గిరే (బి) తాలియా 52; హర్లీన్ (నాటౌట్) 34; డియాండ్ర (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–1, 2–2, 3–57, 4–86. బౌలింగ్: గ్రేస్ హారిస్ 1–0–1–1, సోఫీ 4–0– 16–2, క్రాంతి గౌడ్ 2–0– 15–0, సైమా 1–0– 20–0, దీప్తి శర్మ 4–0–32–0, అలానా కింగ్ 3–0–38–0, తాలియా 3–0–21–1. -
ఉమెన్ ప్రీమియర్ లీగ్ : గుజరాత్ జెయింట్స్ పై బెంగళూరు మెరుపు గెలుపు (ఫోటోలు)
-
RCB Vs GG: ‘రాయల్’ విజయంతో మొదలు
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్‌కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్‌లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది.వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు. సిక్స్‌ల జోరు... ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా... మరో ఎండ్‌లో 6 పరుగుల వ్యవధిలో వోల్వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్‌లు బాదింది. డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్నర్ 3 సిక్స్‌లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్‌కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు. బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్‌దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్‌ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది. ఒకే ఓవర్లో 23 పరుగులు... ఆర్సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో రిచా మ్యాచ్‌ను ముగించడం విశేషం. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్నర్ 4; పెరీ (సి) వోల్వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0. -
WPL 2025: గుజరాత్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.గార్డ్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్నర్ఈ మ్యాచ్‌లో గార్డ్నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్‌కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.ఆతర్వాత 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్‌గిరే (యూపీ), ఇవాళ గార్డ్నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిక్సర్ల సునామీఈ మ్యాచ్‌లో గార్డ్నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్లో సోఫీ డివైన్ కూడా గుజరాత్‌పై 8 సిక్సర్లు కొట్టింది. -
ధనాధన్ సమరం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఆడనుంది.వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్‌కు వేళయింది. తొలి రెండు సీజన్లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది. గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు. » బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు. » పేలవ ఫామ్‌తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నారు. » గత రెండు పర్యాయాలు రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్‌తో క్యాపిటల్స్ బలంగా ఉంది. » తొలి సీజన్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు. » గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. -
గుజరాత్ జెయింట్స్‌కు కొత్త కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) ఫ్రాంచైజీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. పాత కెప్టెన్‌ను మార్చి కొత్త కెప్టెన్‌ను నియమించుకుంది. బెత్ మూనీ (Beth Mooney) (ఆస్ట్రేలియా) స్థానంలో ఆష్లే గార్డ్నర్ను (Ashleigh Gardner) (ఆస్ట్రేలియా) నూతన సారధిగా నియమిస్తున్నట్లు జెయింట్స్ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 5) ప్రకటించింది. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనల నేపథ్యంలో కెప్టెన్‌ను మారుస్తున్నట్లు మేనేజ్మెంట్ పేర్కొంది. జెయింట్స్ గత రెండు సీజన్లలో (2023, 2024) చిట్ట చివరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు గెలిచిన జెయింట్స్.. 2024 సీజన్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసింది.గత రెండు సీజన్లలో జెయింట్స్ ప్రదర్శన బాగా లేనప్పటికీ.. గార్డ్నర్ మాత్రం వ్యక్తిగతంగా రాణించింది. గార్డ్నర్ డబ్ల్యూపీఎల్ మొత్తంలో 324 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టింది. కెప్టెన్‌గా నియమించడం పట్ల గార్డ్నర్ సంతోషం వ్యక్తం చేసింది. జట్టును ముందుండి నడిపించడానికి ఉత్సాహంగా ఉన్నానని ప్రకటించింది. తమ జట్టులో భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. జెయింట్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు దక్కిన గౌరవమని తెలిపింది. తదుపరి సీజన్లో జెయింట్స్‌కు నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించింది. జట్టులో యువ మరియు అనుభవజ్ఞులైన క్రికెటర్లతో పాటు భారతీయ ప్రతిభ పుష్కలంగా ఉందని పేర్కొంది. ఈసారి తమ అభిమానులను గర్వపడేలా చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది.జెయింట్స్ కెప్టెన్‌గా గార్డ్నర్ నియామకంపై ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. గార్డ్నర్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నాడు. గార్డ్నర్ను టఫ్ కాంపిటీటర్తో పోల్చాడు. గార్డ్నర్కు ఆటపై అవగాహన, వ్యూహాత్మక చతురత మరియు ప్లేయర్లను ప్రేరేపించే సామర్థ్యం ఉందని కొనియాడాడు. తదుపరి సీజన్లో గార్డ్నర్ జెయింట్స్‌ను విజయవంతంగా ముందుండి నడుపుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.తాజా మాజీ కెప్టెన్ మూనీ గురించి మాట్లాడుతూ.. ఆమె జట్టులో అంతర్గత నాయకురాలిగా కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్ విభాగంలో మూనీ ప్రధాన పాత్ర పోషించనుందని తెలిపాడు. కెప్టెన్‌గా మూనీ సేవలను కొనియాడాడు. ఇకపై మూనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై పూర్తిగా దృష్టి సారిస్తుందని పేర్కొన్నాడు.కాగా, డిసెంబర్లో జరిగిన వేలంలో జెయింట్స్ భారత ఆల్ రౌండర్ సిమ్రాన్ షేక్‌తో సహా నలుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ సేవలను నిలుపుకుంది. -
PKL 11: సెమీస్‌కు దూసుకెళ్లిన దబంగ్ ఢిల్లీ
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) పదకొండో సీజన్లో మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ జట్టు ఎదురులేని విజయాలతో సెమీఫైనల్స్‌కు దూసుకు వెళ్లింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 41–35తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొంది.. సెమీస్‌కు అర్హత సాధించింది. కాగా వరుసగా గత 15 మ్యాచ్‌లుగా దబంగ్ ఢిల్లీ ఒక్కటీ ఓడిపోలేదు. వీటిలో పదమూడింట గెలుపొందగా, రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యాయి. తద్వారా టాప్–2లో నిలిచి ఢిల్లీ నేరుగా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక గుజరాత్‌తో జరిగిన పోరులో ఢిల్లీ కెప్టెన్, రెయిడర్ అశు మలిక్ 17 సార్లు కూతకెళ్లి 14 పాయింట్లు తెచ్చిపెట్టాడు అతడి సహచరుల్లో ఆల్‌రౌండర్ ఆశిష్ 7, రెయిడర్ నవీన్ 6, డిఫెండర్ ఆశిష్ 4 పాయింట్లు సాధించారు.ఆరు జట్లు నాకౌట్కుమరోవైపు.. గుజరాత్ తరఫున ఆల్‌రౌండర్ జితేందర్ యాదవ్ (7) ఆకట్టుకోగా, కెప్టెన్ గుమన్ సింగ్ (5), హిమాన్షు (5) రాణించారు. ఇదివరకే టాప్‌లో నిలిచిన హరియాణా స్టీలర్స్‌తో పాటు ఇప్పుడు రెండో స్థానంలో నిలిచిన ఢిల్లీ నేరుగా సెమీస్‌కు అర్హత సంపాదించాయి. తర్వాత 3, 4, 5, 6వ స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో ఆడి ఇందులోంచి రెండు జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి.తమిళ్ తలైవాస్‌పై గెలుపుఇదిలా ఉంటే.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 42–32తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. పుణేరి రెయిడర్లు ఆర్యవర్ధన్ నవలే (10), అజిత్ (7) అదరగొట్టారు. డిఫెండర్లలో గౌరవ్ ఖత్రి (5), అమన్ (4) రాణించారు. తలైవాస్ తరఫున ఆల్‌రౌండర్ హిమాన్షు (8), రెయిడర్ సచిన్ (7) పోరాడారు. కెప్టెన్, డిఫెండర్ నితేశ్ కుమార్ 5, అమిర్ హుస్సేన్ 4 పాయింట్లు చేశారు. నేడు జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో యూపీ యోధాస్, బెంగాల్ వారియర్స్‌తో యు ముంబా తలపడతాయి. -
పట్నా, గుజరాత్ మ్యాచ్ ‘టై’
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో భాగంగా శనివారం పట్నా పైరెట్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ 40–40 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. పట్నా పైరెట్స్ తరఫున దేవాంక్ 10 పాయింట్లతో సత్తా చాటగా... సుధాకర్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ 9 పాయింట్లు సాధించగా... గుమన్ సింగ్, జితేందర్ యాదవ్ చెరో 8 పాయింట్లతో మెరిశారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పట్నా 22 రెయిడ్ పాయింట్లు సాధించగా... గుజరాత్ 18 రెయిడ్ పాయింట్లకు పరిమితమైంది. ట్యాక్లింగ్‌లో వెనుకబడిన పట్నా 11 పాయింట్లతో సరిపెట్టుకోగా... గుజరాత్ 20 ట్యాకింగ్స్‌తో సత్తాచాటింది. ఇరు జట్ల మధ్య ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరు చివరకు సమంగా ముగిసింది. పట్నా జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరడంతో పాటు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా... గుజరాత్ 21 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 13 పరాజయాలు, 3 ‘టై’లతో 38 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 11వ స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 33–31 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. ఢిల్లీ తరఫున అశు మాలిక్ 12 పాయింట్లతో రాణించగా... జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున అర్జున్ దేశ్వాల్ 10 పాయింట్లతో పోరాడాడు. ఢిల్లీ, జైపూర్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. లీగ్‌లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), హరియాణా స్టీలర్స్‌తో యూ ముంబా (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
యూపీ యోధాస్ జోరు
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో యూపీ యోధాస్ జోరుకు గుజరాత్ జెయింట్స్ చేతులెత్తేసింది. దీంతో యూపీ యోధాస్ 59–23 స్కోరుతో ఏకపక్ష విజయం సాధించింది. రెయిడర్లు గగన్ గౌడ (19 పాయింట్లు), భవాని రాజ్‌పుత్ (11 పాయింట్లు) అదరగొట్టగా, డిఫెండర్లు సుమిత్ (5), అశు సింగ్ (4), మహేందర్ సింగ్ (4) రాణించారు. 18 సార్లు కూతకెళ్లిన గగన్ గౌడ 13 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. మ్యాచ్‌లో నాలుగుసార్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం విశేషం. తొలి అర్ధభాగం మొదలైన ఎనిమిది నిమిషాలకే యోధాస్ ఆటగాళ్లు గుజరాత్‌ను ఆలౌట్ చేశారు. 12–7తో అక్కడ మొదలైన ఆధిపత్యం ఆఖరిదాకా కొనసాగింది. ఈ అర్ధభాగం ముగిసేలోపే మళ్లీ 18వ నిమిషంలో జెయంట్స్ ఆలౌటైంది. గుజరాత్ ఆటగాళ్లలో రెయిడర్ గుమన్ సింగ్ (7), ఆల్‌రౌండర్ జితేందర్ యాదవ్ (6), రెయిడర్ రాకేశ్ (5) రాణించారు. ఇదివరకే ప్లేఆఫ్స్‌కు అర్హత సంపాదించిన యూపీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 43–37తో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ (15) పదేపదే పాయింట్లు తెచ్చిపెట్టగా, డిఫెండర్లు సునీల్ కుమార్ (5), పర్వేశ్ (4), మన్జీత్ (4), ఆల్‌రౌండర్ రోహిత్ రాఘవ్ (4) సమష్టిగా రాణించారు. పైరేట్స్ తరఫున రెయిడర్ దేవాంక్ (12), అయాన్ (7), డిఫెండర్లు దీపక్ (4), శుభమ్ (4) మెరుగ్గా ఆడారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో బెంగాల్ వారియర్స్... తెలుగు టైటాన్స్‌తో పుణేరి పల్టన్ తలపడనున్నాయి. -
మినీ వేలం.. విండీస్ అల్రౌండర్కు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్‌రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్‌గా పిలువబడే డియాండ్రా డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్‌ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్‌లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది. ఆ సీజన్లో జెయింట్స్ డొట్టిన్‌ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్‌ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్‌లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్‌తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్‌ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్‌కు విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గానూ పేరుంది. అందుకే డొట్టిన్‌కు వేలంలో భారీ మొత్తం దక్కింది.ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. -
తెలుగు టైటాన్స్ గెలుపు
పుణే: రెండు వరుస పరాజయాల తర్వాత తెలుగు టైటాన్స్ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–11)లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 36–32తో గుజరాత్ జెయంట్స్‌పై విజయం సాధించింది. స్టార్ రెయిడర్, కెప్టెన్ పవన్ సెహ్రావత్ (12 పాయింట్లు) కూతకెళ్లిన ప్రతీ సారి ప్రత్యర్థుల్ని హడలెత్తించాడు. 18 సార్లు రెయిడింగ్‌కు వెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచర రెయిడర్ ఆశిష్ నర్వాల్ (6) కూడా రాణించాడు. ఆల్‌రౌండర్ విజయ్ మాలిక్ (18) అదరగొట్టాడు. ప్రథమార్ధం ముగిసే ఆఖరి నిమిషంలో గుజరాత్ ఒకసారి తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేస్తే... ద్వితీయార్ధంలో పవన్, ఆశిష్, విజయ్‌లు చెలరేగడంతో ప్రత్యర్థి జట్టును స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచింది. గుజరాత్ జట్టులో కెప్టెన్ గుమన్ సింగ్ (9), రాకేశ్ (10) రెయిడింగ్‌లో ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సంపాదించిన హరియాణ స్టీలర్స్‌కు దబంగ్ ఢిల్లీ షాకిచ్చిoది. ఢిల్లీ జట్టు 44–37తో స్టీలర్స్‌పై గెలుపొందింది. రెయిడర్, ఢిల్లీ కెపె్టన్ అషు మాలిక్ (15) అద్భుతంగా రాణించాడు. అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టాడు. సహచరుల్లో రెయిడర్ నవీన్ (7), డిఫెండర్లు యోగేశ్ (4), ఆశిష్ (5) రాణించారు. హరియాణా జట్టులో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (9), రెయిడర్ శివమ్ పతారే (6) ఆదుకున్నారు.సంజయ్, నవీన్, వినయ్ తలా 3 పాయింట్లు చేశారు. జైదీప్, రాహుల్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు (ఆదవారం) జరిగే పోటీల్లో తమిళ్ తలైవాస్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్... యు ముంబాతో యూపీ యోధాస్ తలపడుతుంది. -
గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా ప్రవీణ్ తాంబే
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ తమ నూతన బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేను నియమించుకుంది. మాజీ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ప్రవీణ్ నియామకం జరిగింది. గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ నియామకం కూడా చేపట్టింది. గుజరాత్ బ్యాటింగ్ కోచ్ స్థానానికి ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ మార్ష్ ఎంపికయ్యాడు. గుజరాత్ జెయింట్స్ తమ హెడ్ కోచ్‌గా మైఖేల్ క్లింగర్కు కొనసాగించనుంది. క్లింగర్ గత సీజన్లోనే జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.కాగా, ప్రవీణ్ తాంబే 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2013 సీజన్లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. తాంబేకు ఐపీఎల్లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున కోచింగ్ బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది.డేనియల్ మార్ష్ విషయానికొస్తే.. ఇతను 2013-17 మధ్యలో టాస్మానియా పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. మార్ష్.. 2022లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు.షాకిచ్చిన మిథాలీడబ్ల్యూపీఎల్ 2025 వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే తప్పుకుంది. మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.అట్టడుగు స్థానంలో..గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది.డిసెంబర్ 15న వేలండబ్ల్యూపీఎల్ 2025 వేలం రానున్న ఆదివారం (డిసెంబర్ 15) బెంగళూరు వేదికగా జరుగనుంది. వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్ ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ లాంటి సీనియర్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది.గుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, భారతీ ఫుల్మాలీ, సయాలీ సత్గరేగుజరాత్ జెయింట్స్ వదులుకున్న ప్లేయర్లు: స్నేహ్ రాణా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నమ్ పఠాన్, లీ తహుహు. -
గుజరాత్ జెయింట్స్ నుంచి వైదొలిగిన టీమిండియా మాజీ కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి (డిసెంబర్ 15) ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ (భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్) బాధ్యతల నుంచి తప్పుకొంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకుంది. మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మిథాలీతో పాటు గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకుంది. అల్ ఖదీర్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితోనే ముగిసింది. అయితే అల్ ఖదీర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించమని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరలేదు. అల్ ఖదీర్ ప్రస్తుతం భారత అండర్-19 మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుంది. మెంటార్ మరియు బౌలింగ్ కోచ్ ప్రత్యామ్నాయాలను గుజరాత్ జెయింట్స్ రేపటి లోగా ప్రకటించవచ్చు. హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ యధావిధిగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని జెయింట్స్ యాజమాన్యం ప్రకటించింది. కాగా, గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. -
అర్జున్ అదరహో
పుణే: స్టార్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో సత్తా చాటాడు. దాంతో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్‌పాంథర్స్ తొమ్మిదో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ పోరులో పింక్‌పాంథర్స్ 42–29 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి సూపర్ రెయిడ్లతో అర్జున్ అదరగొట్టగా... నీరజ్ నర్వాల్ (8 పాయింట్లు) అతడికి సహకరించాడు. గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున గుమాన్ సింగ్, రాకేశ్ చెరో 9 పాయింట్లు సాధించారు. తాజా సీజన్లో 18 మ్యాచ్‌లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ 9 విజయాలు, 7 పరాజయాలు, 2 ‘టై’లతో 54 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గుజరాత్ కేవలం ఐదు విజయాలతో పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 44–29 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. వారియర్స్ తరఫున విశ్వాస్ 14 పాయింట్లు, ప్రణయ్ 9 పాయింట్లతో రాణించగా... బెంగళూరు తరఫున స్టార్ రెయిడర్, ‘డుబ్కీ కింగ్’ ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో తమిళ్ తలైవాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
తమిళ్ తలైవాస్ తడాఖా
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో తమిళ్ తలైవాస్ జట్టు ఆరో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన తలైవాస్ 40–27 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మోయిన్ షఫాఘి 13 పాయింట్లతో సత్తా చాటగా... సౌరభ్, హిమాన్షు చెరో 7 పాయింట్లు సాధించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున హిమాన్షు 11 పాయింట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. తాజా సీజన్లో 16 మ్యాచ్‌లాడిన తమిళ్ తలైవాస్ 6 విజయాలు, 9 పరాజయాలు, ఒక ‘టై’తో 38 పాయింట్లు సంపాదించింది. ప్రస్తుతం తలైవాస్ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ 16 మ్యాచ్‌ల్లో పదో పరాజయం మూటగట్టుకుంది. శుక్రవారమే జరిగిన రెండో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 42–36 తేడాతో పట్నా పైరేట్స్‌ను చిత్తు చేసింది. హరియాణా జట్టు తరఫున శివమ్ 11 పాయింట్లు, మొహమ్మద్ రెజా 9 పాయింట్లు సాధించగా.. సంజయ్ ధుల్, వినయ్ చెరో 5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. పట్నా తరఫున దేవాంక్ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఇరు జట్లు రెయిడింగ్‌లో చెరో 19 పాయింట్లు సాధించగా... డిఫెన్స్‌లో సత్తా చాటిన స్టీలర్స్ విజాయన్ని ఖరారు చేసుకుంది. ఈ సీజన్లో 17 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 13 విజయాలు, 4 పరాజయాలతో 67 పాయింట్లు సాధించింది. తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. పట్నా పైరేట్స్ 53 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో పుణేరి పల్టన్ (రాత్రి 8 గంటలకు), తెలుగు టైటాన్స్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
పోరాడి ఓడిన తెలుగు టైటాన్స్
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో జోరు మీదున్న తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా మూడు విజయాల తర్వాత పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో తెలుగు టైటాన్స్ 28–31 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున విజయ్ 15 పాయింట్లతో సత్తాచాటగా.. ఆశీష్ నర్వాల్ 7 పాయింట్లు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రతీక్ దహియా 11 పాయింట్లతో రాణించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 16 రెయిడ్ పాయింట్లు సాధించగా... తెలుగు టైటాన్స్ 21 పాయింట్లు సాధించింది. అయితే ట్యాక్లింగ్‌లో జెయింట్స్ 12 పాయింట్లతో సత్తాచాటగా... టైటాన్స్ 6 పాయింట్లకే పరిమితమై పరాజయం పాలైంది. తాజా సీజన్లో 13 మ్యాచ్‌లాడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలు, 5 పరాజయాలతో 43 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా... 20 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో 11వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 43–30 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున వినయ్, శివమ్ చెరో 11 పాయింట్లతో కదంతొక్కగా... జైపూర్ తరఫున అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. హరియాణా స్టీలర్స్ 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలు 3 పరాజయాలతో 51 పాయింట్లతో పట్టిక ‘టాప్’లో నిలిచింది. లీగ్‌లో భాగంగా ఆదివారం పుణేరి పల్టన్‌తో బెంగాల్ వారియర్స్ (రాత్రి 8 గంటలకు), పట్నా పైరెట్స్‌తో యూపీ యోధాస్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. -
పట్నా పైరేట్స్ ప్రతాపం
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జోరు కొనసాగుతోంది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 40–27 పాయింట్లతో ఏకపక్ష విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ 10 పాయింట్లతో టాపర్‌గా నిలవగా... దేవాంక్ (6 పాయింట్లు), సందీప్ (5 పాయింట్లు) సహకరించారు. గుజరాత్ ఆటగాళ్లలో అంతా సమష్టి ప్రదర్శన చేసినా అది ఓటమి నుంచి తప్పించుకునేందుకు సరిపోలేదు. గుమన్ సింగ్, పార్తీక్ దహియా చెరో 5 పాయింట్లు స్కోరు చేశారు. తొలి అర్ధభాగంలో 21–16తో ముందంజలో నిలిచిన పట్నా చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో నెగ్గిన గుజరాత్ టీమ్‌కు ఇది వరుసగా ఏడో పరాజయం కావడం విశేషం. పట్టికలో ప్రస్తుతం పట్నా పైరేట్స్ నాలుగో స్థానంలో (27 పాయింట్లు), గుజరాత్ జెయింట్స్ చివరి స్థానంలో (7 పాయింట్లు) కొనసాగుతున్నాయి. నేడు జరిగే పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్... పుణేరీ పల్టన్‌తో దంబగ్ ఢిల్లీ తలపడతాయి. హరియాణా స్టీలర్స్ హ్యాట్రిక్ మరోవైపు హరియాణా స్టీలర్స్ జట్టు తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ట పర్చుకుంది. లీగ్‌లో వరుసగా మూడో విజయంతో స్టీలర్స్ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా 48–39 పాయింట్ల తేడాతో మాజీ చాంపియన్ యు ముంబాను ఓడించింది. విశాల్, శివమ్, మొహమ్మద్ రెజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెయిడర్లు విశాల్, శివమ్ చెరో 11 పాయింట్లతో సత్తా చాటగా... ఆల్‌రౌండర్ రెజా 10 పాయింట్లు సాధించాడు. ముంబా తరఫున అజిత్ చౌహాన్ ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. రెయిడర్ అజిత్ ఒక్కడే ఏకంగా 18 పాయింట్లు సాధించగా... మిగతా వారంతా విఫలమయ్యారు. తొలి అర్ధ భాగం ముగిసేసరికి ముంబా 23–23 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నా... రెండో అర్ధభాగంలో అనూహ్యంగా వెనుకబడిపోయింది. ముంబా 16 పాయింట్లు మాత్రమే సాధించగా... హరియాణా ఖాతాలో 25 పాయింట్లు చేరాయి. 8 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించిన హరియాణా మొత్తం 31 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 29 పాయింట్లతో ముంబా మూడో స్థానంలో కొనసాగుతోంది. -
PKL 11: యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం.. పాయింట్ల పట్టికలో పైపైకి
నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్లో మాజీ చాంపియన్ యు ముంబా ‘హ్యాట్రిక్’ విజయం ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా జరుగుతున్న రెండో అంచె పోటీల్లో ఆదివారం యు ముంబా జట్టు ఉత్కంఠ పోరులో 35–33తో యూపీ యోధాస్‌పై గెలిచింది.యు ముంబా తరఫున అజిత్ చవాన్, రోహిత్ రాఘవ్ చెరో 8 పాయింట్లతో రాణించగా... యూపీ యోధాస్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. ఆరంభంలో ఆకట్టుకున్న యూపీ జట్టు ప్రత్యర్థిపై పైచేయి కనబర్చినా దాన్ని చివరి వరకు కొనసాగించలేక పోయింది.ఇక తాజా సీజన్లో యు ముంబా 8 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘టై’తో 29 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు.. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదో పరాజయం మూటగట్టుకున్న యూపీ యోధాస్ 20 పాయింట్లతో పదో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఓటమిమరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 39–23 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. హరియాణా స్టీలర్స్ తరఫున రాహుల్ 8 పాయింట్లు... వినయ్, రెజా చెరో 7 పాయింట్లతో సత్తాచాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున రాకేశ్ (7 పాయింట్లు) మినహా మిగతా వారు ఆకట్టుకోలేకపోయారు. హరియాణా 26 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు... గుజరాత్ జెయింట్స్ 7 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 8 గంటలకు), యు ముంబాతో హరియాణా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి. ఇక ఇప్పటి వరకు పుణెరి పల్టన్ అస్థానంలో కొనసాగుతోంది. -
హర్యానాదే ఆల్‌రౌండ్ షో
హైదరాబాద్, నవంబర్ 7: ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్)లో మ్యాచ్‌లను రసవత్తరంగా సాగుతున్నాయి. పాయింట్ పాయింట్‌కు ప్లేయర్లు కసికొద్ది తలపడుతున్నారు. గురువారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 35-22తో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన హర్యానా తరఫున వినయ్(9), మహమ్మద్ రెజా(6),సంజయ్(4) అదరగొట్టారు. వినయ్ రైడింగ్‌లో విజృంభిస్తే..రెజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మరోవైపు గుమన్‌సింగ్(11) ఒంటరిపోరాటం గుజరాత్‌ను గెలిపించలేకపోయింది. ఈ విజయంతో హర్యానా 21 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకోగా, గుజరాత్ జెయింట్స్(7) ఆఖరి స్థానానికి పరిమితమైంది.స్టీలర్స్ జోరు.. ప్రొ కబడ్డీ లీగ్‌లో ఓటములతో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హర్యానా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. లీగ్‌లో ముందంజ వేయాలంటే కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితుల మధ్య బరిలోకి దిగిన రెండు జట్లు అద్భుతంగా పోరాడుతున్నాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన గుజరాత్‌పై హర్యానా ఒకింత ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ 19వ నిమిషంలో రోహిత్, నీరజ్, బాలాజీని ఔట్ చేయడం ద్వారా హర్యానాకు వినయ్ ఒకే రైడ్‌లో మూడు పాయింట్లు తీసుకొచ్చాడు.ఓవైపు హర్యానాకు వినయ్ వరుస రైడ్లలో పాయింట్లు తీసుకొస్తే..మరోవైపు గుజరాత్ తరఫున గుమన్‌సింగ్ పాయింట్లు అందించాడు. అయితే 16వ నిమిషంలో రైడ్‌కు వెళ్లిన వినయ్‌ను గుమన్‌సింగ్ సూపర్ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు. ఈ క్రమంలో మరింత పట్టు బిగించిన స్టీలర్స్ వరుస రైడ్లతో గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. డూ ఆర్ డై రైడ్‌కు వచ్చిన నీరజ్‌కుమార్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి నిమిషంలో రైడ్‌కు వచ్చిన నవీన్..జితేందర్‌యాదవ్‌ను ఔట్ చేయడంతో 10వ నిమిషంలో గుజరాత్ ఆలౌటైంది. స్టీలర్స్ పక్కా వ్యూహాంతో గుజరాత్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18-13తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.అదే దూకుడు: తొలి అర్ధభాగంలో హర్యానాకు వినయ్, జయ పాయింట్ల వేటలో కీలకంగా వ్యవహరించగా, గుమన్‌సింగ్..గుజరాత్‌కు ఆయువుపట్టుగా నిలిచాడు. తొలిరైడ్‌కు వెళ్లిన గుమన్‌సింగ్..నవీన్‌ను ఔట్ చేసి జట్టులో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఓవైపు వినయ్ తనదైన దూకుడు కొనసాగిస్తే..అతనికి మహమ్మద్ రెజా జతకలిశాడు. వరుస రైడ్లలో పాయింట్లకు తోడు డిఫెన్స్‌లోనూ చెలరేగిన రెజా స్టీలర్స్‌కు కీలక పాయింట్లు అందించాడు. గుమన్‌సింగ్ ఒంటరి పోరాటం గుజరాత్‌ను ఒడ్డున పడేయలేకపోయింది. దీంతో మరో ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. -
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11: ఎదురులేని పుణెరి పల్టన్
హైదరాబాద్, 4 నవంబర్ 2024 : డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్ టాప్ లేపింది. ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఐదో విజయం ఖాతాలో వేసుకున్న పుణెరి పల్టన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. సోమవారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన పీకెఎల్ 11 లీగ్ దశ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 49-30తో పుణెరి పల్టన్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ సమిష్టిగా మెరిసిన పుణెరి పల్టన్ 19 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేయటం విశేషం. పుణెరి పల్టన్ ఆటగాళ్లలో ఆకాశ్ షిండె (11 పాయింట్లు) సూపర్ టెన్తో మెరువగా.. పంకజ్ మోహితె (8 పాయింట్లు), మోహిత్ గోయత్ ( 5 పాయింట్లు), ఆమన్ ( 5 పాయింట్లు), గౌరవ్ ఖత్రి ( 5 పాయింట్లు) అదరగొట్టారు. గుజరాత్ జెయింట్స్ తరఫున గుమన్ సింగ్ ( 13 పాయింట్లు) సూపర్ టెన్ ప్రదర్శనతో ఒంటరి పోరాటం చేశాడు. పుణెరి పల్టన్ ఏడు మ్యాచుల్లో ఐదో విజయం సాధించగా, గుజరాత్ జెయింట్స్ ఐదు మ్యాచుల్లో నాల్గో పరాజయం చవిచూసింది.పల్టన్ వన్‌సైడ్ షో : వరుస విజయాల జోరుమీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టన్.. గుజరాత్ జెయింట్స్‌పై పంజా విసిరింది. ప్రథమార్థంలోనే ఆ జట్టుపై ఏకంగా 21 పాయింట్ల భారీ ఆధిక్యం సాధించింది. ప్రథమార్థం తొలి ఐదు నిమిషాల్లో, చివరి ఐదు నిమిషాల ఆటలో గుజరాత్ జెయింట్స్‌ను ఆలౌట్ చేసిన పుణెరి పల్టన్ 30-9తో వన్‌సైడ్ షో చేసింది. కెప్టెన్ అస్లాం ఇనందార్ బరిలో లేకపోయినా.. ఆకాశ్ షిండే, పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కూతలో కేక పెట్టించారు. పంకజ్ మోహితె, మోహిత్ గోయత్‌లు కండ్లుచెదిరే సూపర్ రెయిడ్లతో ఆకట్టుకున్నారు. డిఫెన్స్‌లో గౌరవ్ ఖత్రి, ఆమన్ ట్యాకిల్స్ జెయింట్స్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. తొలి పది నిమిషాల్లో 14-5తో ముందంజ వేసిన పుణెరి పల్టన్.. తర్వాతి పది నిమిషాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాయింట్లు సాధించింది. గుజరాత్ జెయింట్స్ పూర్తిగా తేలిపోయింది. గుమన్ సింగ్ కూతలో మెరిసినా.. ఇతర ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారు.గుజరాత్ పుంజుకున్నా.. పుణెరి అదే జోరు : విరామం అనంతరం సైతం పుణెరి పల్టన్ జోరు తగ్గలేదు. గుజరాత్ జెయింట్స్ ఆట కాస్త మెరుగైనా.. పుణెరి పల్టన్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో రాణించలేదు. ద్వితీయార్థం తొలి పది నిమిషాల తర్వాత పుణెరి పల్టన్ 41-16తో 25 పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించిన గుజరాత్ జెయింట్స్ ఆఖరు ఐదు నిమిషాల ఆట మిగిలి ఉండగా పుణెరి పల్టన్‌ను ఆలౌట్ చేసింది. పాయింట్ల అంతరం తగ్గించేందుకు చివరి ఐదు నిమిషాల్లో మంచి ప్రయత్నమే చేసింది. అయినా, పుణెరి పల్టన్ అలవోకగా సీజన్లో ఐదో విజయం సాధించింది. ద్వితీయార్థంలో పుణెరి పల్టన్ 19 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ 21 పాయింట్లు దక్కించుకుంది. -
PKL 11: తమిళ్ తలైవాస్ దూకుడు.. గుజరాత్ చిత్తు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ జెయింట్స్‌పై తమిళ్ తలైవాస్ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని ఏకంగా 44-25తో చిత్తు చేసింది. తద్వారా ఏకంగా 19 పాయింట్ల భారీ తేడాతో గుజరాత్‌పై తమిళ్ తలైవాస్ గెలుపొందింది. సీజన్లో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి ఎగబాకింది. మరోవైపు..ఈ సీజన్లోనాలుగు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జెయింట్స్‌కు ఇది మూడో పరాజయం.కాగా గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్.. గుజరాత్‌తో తలపడింది అదరగొట్టింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్ 20 సార్లు కూతకెళ్లి 15 పాయింట్లు సాధించగా.. సచిన్ (5 పాయింట్లు), డిఫెండర్ నితేశ్ కుమార్ (4 పాయింట్లు), ఆమీర్ ( 4 పాయింట్లు) రాణించారు. గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లలో గుమన్ సింగ్ ఏడు పాయింట్లు సాధించగా, రాకేశ్ మూడు పాయింట్లతో మెరిశాడు.ఆకట్టుకున్న తలైవాస్..మ్యాచ్ప్రథమార్థం తొలి పది నిమిషాల్లో ఆధిపత్యం కోసం ఇరు జట్లు గట్టిగా పోటీపడ్డాయి. అయితే, 11-9తో తమిళ్ తలైవాస్ పైచేయి సాధించింది. కానీ గుజరాత్ జెయింట్స్ రెట్టించిన ఉత్సాహంతో పోరాడింది. డిఫెన్స్‌లో తలైవాస్‌తో సమవుజ్జీగా నిలిచినా.. రెయిడింగ్‌లో జెయింట్స్ వెనుకంజ వేసింది. తలైవాస్ స్టార్ రెయిడర్ నరేందర్, సచిన్ మెరువగా.. గుజరాత్ జెయింట్స్ రెయిడర్లలో గుమన్ సింగ్ మాత్రమే మెప్పించాడు. దీంతో ప్రథమార్థం ఆట ముగిసేసరికి తమిళ్ తలైవాస్ 18-14తో నాలుగు పాయింట్ల ఆధిక్యం దక్కించుకుంది.తలైవాస్ దూకుడు..విరామం అనంతరం తమిళ్ తలైవాస్ దూకుడు పెంచింది. తొలి 20 నిమిషాల్లో సాధించిన ఆధిక్యాన్ని.. ద్వితీయార్థంలో తొలి పది నిమిషాల్లోనే సొంతం చేసుకుంది. ప్రథమార్థంలో ఆలౌట్ కాకుండా జాగ్రత్త పడిన గుజరాత్ జెయింట్స్ సెకండ్ హాఫ్‌లో చేతులెత్తేసింది.జెయింట్స్ కోర్టు ఖాళీ చేసిన తలైవాస్ విలువైన ఆలౌట్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఆఖరు నిమిషంలో గుజరాత్ జెయింట్స్‌ను మరోసారి ఆలౌట్ చేసిన తమిళ్ తలైవాస్ ఏకపక్ష ప్రదర్శన చేసింది. చివరి 20 నిమిషాల ఆటలో తమిళ్ తలైవాస్ 26 పాయింట్లు సాధించగా, గుజరాత్ జెయింట్స్ కేవలం 11 పాయింట్లే సొంతం చేసుకుంది. -
గుజరాత్ జెయింట్స్ బోణీ
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు శుభారంభం చేసింది. గచ్చిచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. గుజరాత్ జెయింట్స్‌లో ప్రతీక్ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ 39–34తో బెంగాల్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది. జైపూర్ జట్టు తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లతో సత్తా చాటాడు. 12 రెయిడింగ్ పాయింట్లతో సూపర్–10 ఖాతాలో వేసుకున్న అర్జున్ జట్టుకు కీలక సమయాల్లో ఆధిక్యం అందించాడు. అభిజిత్ మలిక్ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ జట్టు తరఫున అత్యధికంగా నితిన్ కుమార్ 13 పాయింట్లు సాధించాడు. మణీందర్ సింగ్ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో దబంగ్ ఢిల్లీ (రాత్రి 8:00 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటల నుంచి) తలపడతాయి. -
PKL: షెడ్యూల్ పూర్తి వివరాలు.. తొలి మ్యాచ్‌లో తలపడే జట్లు ఇవే
Pro Kabaddi League Season 11: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆరంభ దశ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే నెల 18 నుంచి పీకేఎల్ ప్రారంభం కానుండగా... గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరగనున్న తొలి పోరులో బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది.అదే రోజు జరగనున్న రెండో మ్యాచ్‌లో యు ముంబాతో దబంగ్ ఢిల్లీ పోటీపడుతుంది. మూడు వేదికల్లో పీకేఎల్ మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించగా... అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లో పీకేఎల్ తొలి దశ సాగనుంది.ఆ తర్వాత నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడాలోని ఇండోర్ స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3 నుంచి 24 వరకు పుణేలో లీగ్ సాగనుంది. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనున్నారు. గత నెలలో జరిగిన పీకేఎల్ వేలంలో మొత్తం 12 జట్లు తమ అస్త్రశ్రస్తాలకు పదును పెంచుకోగా... లీగ్ చరిత్రలోనే అత్యధికంగా ఎనిమిది మంది ప్లేయర్లు కోటి రూపాయలకు పైగా ధర పలికారు. హైదరాబాద్ (గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం)అక్టోబర్ 18, శుక్రవారం-తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)-దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 19, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 20, ఆదివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు) అక్టోబర్ 21, సోమవారం- యూపీ యోధాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 22, మంగళవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 23, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 24, గురువారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 25, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 26, శనివారం- యు ముంబా వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 27, ఆదివారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 28, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 29, మంగళవారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగళూరు బుల్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 30, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)అక్టోబర్ 31, గురువారం- పట్నా పైరేట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 2, శనివారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 3, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 4, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 5, మంగళవారం- యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 6, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 7, గురువారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 8, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 9, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ పుణెరి పల్టన్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)నోయిడా (నోయిడా ఇండోర్ స్టేడియం)నవంబర్ 10, ఆదివారం- యూపీ యోధాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 11, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 12, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 13, బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 14, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 15, శుక్రవారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 16, శనివారం- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 17, ఆదివారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 18, సోమవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 19, మంగళవారం- పుణెరి పల్టాన్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)బెంగళూరు బుల్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 20, బుధవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 21, గురువారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 22, శుక్రవారంజైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ యూపీ యోధస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 23, శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 24, ఆదివారం- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 25, సోమవారం- యు ముంబా వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 26, మంగళవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 27, బుధవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 28, గురువారం- యూపీ యోధాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 29, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 8:00 గంటలు)- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)నవంబర్ 30, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 1, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)పుణె (బాలేవాడి బ్యాడ్మింటన్ స్టేడియం)డిసెంబర్ 3, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 4, బుధవారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 5, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 6, శుక్రవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- తమిళ్ తలైవాస్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 7, శనివారం- యూపీ యోధాస్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 8:00 గంటలు)- తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 8, ఆదివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 9, సోమవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 10, మంగళవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 11, బుధవారంహర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 12, గురువారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 8:00 గంటలు)- యూపీ యోధాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 13, శుక్రవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 14, శనివారం- తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ హర్యానా స్టీలర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 15, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 16, సోమవారం- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ పుణెరి పల్టాన్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 17, మంగళవారం- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 18, బుధవారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 19, గురువారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- యు ముంబా వర్సెస్ పట్నా పైరేట్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 20, శుక్రవారం- జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తెలుగు టైటాన్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 21, శనివారం- పట్నా పైరేట్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ (రాత్రి 8:00 గంటలు)- దబాంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ జైపూర్ పింక్ పాంథర్స్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 22, ఆదివారం- తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ (రాత్రి 8:00 గంటలు)- హర్యానా స్టీలర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 23, సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ కేసీ (రాత్రి 8:00 గంటలు)- పుణెరి పల్టాన్ వర్సెస్ తమిళ్ తలైవాస్ (రాత్రి 9:00 గంటలు)డిసెంబర్ 24, మంగళవారం- బెంగళూరు బుల్స్ వర్సెస్ యూపీ యోధాస్ (రాత్రి 8:00 గంటలు)- బెంగాల్ వారియర్స్ వర్సెస్ యు ముంబా (రాత్రి 9:00 గంటలు) -
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్
న్యూఢిల్లీ: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఏడాది తుది పోరుకు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్‌లలో 6 గెలిచిన ఢిల్లీ 12 పాయింట్లతో టాపర్‌గా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. ఈ ఓటమితో పట్టికలో చివరి స్థానంతో గుజరాత్ ఈ సీజన్‌ను ముగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులే చేసింది. భారతి ఫుల్మలి (36 బంతుల్లో 42; 7 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...కాథరీన్ బ్రైస్ (22 బంతుల్లో 28 నాటౌట్; 4 ఫోర్లు), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (21 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఒకదశలో జట్టు స్కోరు 48/5 కాగా... భారతి, బ్రైస్ ఆరో వికెట్‌కు 50 బంతుల్లో 68 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఢిల్లీ బౌలర్లలో మిన్ను మణి, మరిజాన్ కాప్, శిఖా పాండే తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 13.1 ఓవర్లలో 3 వికెట్లకు 129 పరుగులు సాధించి గెలిచింది. ఓపెనర్ షఫాలీ వర్మ (37 బంతుల్లో 71; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపు వేగంలో అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి జోరు ప్రదర్శించింది. షఫాలీ, జెమీమా మూడో వికెట్‌కు 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేశారు. విజయానికి 2 పరుగుల దూరంలో షఫాలీ వెనుదిరిగినా... జెమీమా ఫోర్ కొట్టడంతో మరో 41 బంతులు మిగిలి ఉండగానే క్యాపిటల్స్ జట్టుకు గెలుపు దక్కింది. ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థిని నిర్ణయించే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ రేపు జరుగుతుంది. గత ఏడాది చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘ఎలిమినేటర్’ పోరులో తలపడనున్నాయి. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా... చెరో మ్యాచ్‌లో విజయం సాధించి సమఉజ్జీలుగా నిలిచాయి. ఆదివారం జరిగే ఫైనల్‌తో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ముగుస్తుంది. -
WPL 2024: గుజరాత్‌ను గెలిపించిన వైజాగ్ అమ్మాయి
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న గుజరాత్ జెయింట్స్‌కు విశాఖ బౌలర్ షబ్నమ్ షకీల్ బ్రేక్ ఇచ్చింది. యూపీ వారియర్జ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో షబ్నమ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (4-0-11-3) ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్ 8 పరుగుల తేడాతో వారియర్జ్‌ను ఓడించి సీజన్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. షబ్నమ్ తన మీడియం పేస్ బౌలింగ్‌తో వారియర్జ్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. షబ్నమ్ దెబ్బకు వారియర్జ్ 4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఆదిలోనే ఓటమిని ఖరారు చేసుకుంది. దీప్తి శర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ మెరుపు అర్ధ సెంచరీతో (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగినా వారియర్జ్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా వారియర్జ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లారా వాల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. లక్ష ఛేదనలో షబ్నమ్ దెబ్బకు ఆదిలోనే తడబడిన వారియర్జ్ దీప్తి శర్మ రాణించినా ఓటమిపాలైంది. వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులకే పరిమితమైంది. దీప్తితో పాటు పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా వారియర్జ్‌కు గెలిపించలేకపోయారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా దీప్తి 2 సిక్సర్లు సహా 17 పరుగులు సాధించినప్పటికీ వారియర్జ్ లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అవుతుంది. ఢిల్లీ, ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. ఆర్సీబీ మరో బెర్త్ రేసులో ముందుంజలో ఉంది. సత్తా చాటిన విశాఖ అమ్మాయి.. యూపీ వారియర్జ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్‌లో సత్తా చాటిన షబ్నమ్ స్వస్థలం విశాఖపట్నం. 16 ఏళ్ల షబ్నమ్ డబ్ల్యూపీఎల్ బరిలోకి దిగిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. వేలంలో ఆమెను గుజరాత్ టీమ్ రూ. 10 లక్షలకు తీసుకుంది. తన తొలి మ్యాచ్‌లో వికెట్ దక్కకపోయినా చక్కటి బంతులతో ఆమె ఆకట్టుకుంది. ముంబైతో జరిగిన గత మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ నాట్ సివర్ బ్రంట్‌ను తొలి వికెట్‌గా అవుట్ చేసిన షబ్నమ్... ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చింది. గత ఏడాదే అండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో షబ్నమ్ సభ్యురాలిగా ఉంది. -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్.. చివరి 12 బంతుల్లో 7 బౌండరీలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 11) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు లారా వాల్వార్డ్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, సిక్స్), బెత్ మూనీ (42 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, సిక్స్) రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దయాలన్ హేమలత 0, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 4, ఆష్లే గార్డ్నర్ 15, భారతి ఫుల్మలి 1, కేథరీన్ బ్రైస్ 11, తనుజా కన్వర్ 1, షబ్నమ్ 0 పరుగులకు ఔటయ్యారు. వారియర్జ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2, రాజేశ్వరీ గైక్వాడ్, చమారీ ఆటపట్టు తలో వికెట్ పడగొట్టారు. పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడిన మూనీ.. గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మూనీ తొలుత ఆచితూచి ఆడినప్పటికీ.. ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. చివరి 12 బంతుల్ని ఎదుర్కొన్న మూనీ.. ఏకంగా 7 ఫోర్లతో విరుచుకుపడింది. 19వ ఓవర్లో రెండు ఫోర్ల సాయంతో 11 పరుగులు రాబట్టిన మూనీ.. చివరి ఓవర్లో ఏకంగా ఐదు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకుంది. మూనీ ఆఖరి రెండు ఓవర్లలో జూలు విదల్చడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఢిల్లీ, ముంబై జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. గుజరాత్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీ, యూపీ వారియర్జ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. -
హర్మన్ ధనాధన్.. ఫ్లే ఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్
న్యూఢిల్లీ: భారీ స్కోర్ల మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం ముంబై ఇండియన్స్‌ను గెలిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. ముందుగా గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దయాళన్ హేమలత (40 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ బెత్ మూనీ (35 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 10.2 ఓవర్లలోనే 121 పరుగులు జోడించారు. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఒక దశలో ఓవర్‌కు పది పరుగుల పైచిలుకు దూసుకెళ్లిన రన్‌రేట్... తర్వాత ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున కోల్పోవడంతో నెమ్మదించింది. సైకా ఇషాక్ 2 వికెట్లు తీసింది. అనంతరం ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (36 బంతుల్లో 49; 8 ఫోర్లు, 1 సిక్స్), హేలీ మాథ్యూస్ (18; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులతో శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరితో పాటు నట్ సీవర్ బ్రంట్ (2) వికెట్‌నూ వంద పరుగుల్లోపే కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది. 15.4 ఓవర్లలో ముంబై స్కోరు 121/3. విజయానికి 26 బంతుల్లో 70 పరుగులు కావాలి. ఈ దశలో హర్మన్‌ప్రీత్ (వ్యక్తిగత స్కోరు 29 బంతుల్లో 40) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బౌండరీ వద్ద లిచ్‌ఫీల్డ్ జారవిడిచింది. దీనిని సద్వినియోగం చేసుకున్న హర్మన్ ఆ తర్వాత విధ్వంసకరంగా ఆడింది. చేయాల్సిన 70 పరుగుల్లో ఆమె ఒక్కతే 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు (19 బంతుల్లో) సాధించడంతో ముంబై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. -
గుజరాత్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ
మహిళల ఐపీఎల్ 2024 సీజన్లో వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ జెయింట్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు బ్యాటర్ హర్లీన్ డియోల్ మిగితా డబ్యూపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైంది. హర్లీన్ స్థానాన్ని మరో టీమిండియా బ్యాటర్ భారతి ఫుల్మలితో భర్తీ చేస్తున్నట్లు గుజరాత్ మేనేజ్మెంట్ ప్రకటించింది. గాయంతో బాధపడుతూనే ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్‌లు ఆడిన హర్లీన్.. వరుసగా 8, 22, 18 స్కోర్లు చేసింది. టీమిండియా తరఫున 10 వన్డేలు, 24 టీ20లు ఆడిన ఈ చంఢీఘడ్ అమ్మాయి.. రెండు ఫార్మాట్లలో కలిపి 3 అర్దసెంచరీల సాయంతో 458 పరుగులు చేసింది. హర్లీన్ స్థానంలో ఎంపికైన భారతి టీమిండియా తరఫున 2 టీ20లు ఆడి 23 పరుగులు చేసింది. దేశవాలీ టోర్నీల్లో విదర్భకు ఆడే భారతి.. మహిళల టీ20 లీగ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత డబ్యూపీఎల్ సీజన్లో గుజరాత్ జెయింట్స్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా గల్లంతు చేసుకుంది. ముంబై, ఆర్సీబీ, యూపీ, ఢిల్లీ జట్ల చేతిలో ఓడిన ఈ జట్టు మార్చి 6న మరోసారి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. గుజరాత్ రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
గుజరాత్ బోణీ
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నిలో ఎట్టకేలకు గుజరాత్ జెయింట్స్ జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన గుజరాత్ ఐదో మ్యాచ్‌లో గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 19 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు సాధించింది. ఓపెనర్లు లౌరా వొల్వార్ట్ (45 బంతుల్లో 76; 13 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 86 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 13 ఓవర్లలో 140 పరుగులు జోడించారు. లౌరా అవుటయ్యాక వచ్చిన ఫోబీ లిచ్‌ఫీల్డ్ (18; 1 ఫోర్), యాష్లీ గార్డ్నర్ (0), హేమలత (1), వేద కృష్ణమూర్తి (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎలీస్ పెరీ (24; 3 ఫోర్లు), సోఫీ డివైన్ (23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), రిచా ఘోష్ (30; 5 ఫోర్లు, 1 సిక్స్), జార్జియా వేర్హమ్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా ఫలితం లేకపోయింది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ఆర్సీబీతో మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన గుజరాత్ ఓపెనర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 6) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓపెనింగ్ బ్యాటర్లు లారా వొల్వార్డ్ట్, బెత్ మూనీ శివాలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లారా, మూనీ రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. లారా 45 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేయగా.. మూనీ 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లారా, మూనీ మినహా గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 18, ఆష్లే గార్డ్నర్ 0, దయాలన్ హేమలత 1, వేద కృష్ణమూర్తి ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్ సోఫీ మోలినెక్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. మోలినెక్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసింది. ఒకరు రనౌటయ్యారు. 18వ ఓవర్ వరకు (187/1) అతి భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించిన గుజరాత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్హమ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు బ్యాటర్లు రనౌట్లయ్యారు. -
ఢిల్లీ ‘హ్యాట్రిక్’...
బెంగళూరు: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిన తర్వాత క్యాపిటల్స్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అయితే గుజరాత్ పరిస్థితి మాత్రం మరింత దిగజారింది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఒక్క గెలుపు కూడా లేకుండా వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 చేయగా.... జెయింట్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించింది. షఫాలీ వర్మ (13), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలం కావడంతో లానింగ్ ముందుండి నడిపించింది. అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 27; 5 ఫోర్లు)తో రెండో వికెట్‌కు లానింగ్ 26 బంతుల్లో 38 పరుగులు జోడించగా... చివర్లో అనాబెల్ సదర్లాండ్ (12 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని కీలక పరుగులు జత చేసింది. గుజరాత్ పేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు వదిలేయడం కలిసొచ్చినా ఢిల్లీ వాటిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ఒకదశలో 105/2తో మెరుగైన స్థితిలో నిలిచిన జట్టు ఆ తర్వాత వేగంగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో ఢిల్లీ 33 పరుగులు చేసింది. జెయింట్స్ పేసర్ మేఘనా సింగ్ (4/37) కీలక వికెట్లు తీయగా... గార్డ్నర్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ తడపడింది. సున్నా స్కోరు వద్దే వాల్వార్ట్ (0) వెనుదిరగ్గా... బెత్ మూనీ (12), లిచ్‌ఫీల్డ్ (15), వేద కృష్ణమూర్తి (12) ప్రభావం చూపలేకపోయారు. అయితే యాష్లీ గార్డ్నర్ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే పోరాడగలిగింది. అయితే 35 బంతుల్లో 59 పరుగులు చేయాల్సిన స్థితిలో జెస్ జొనాసెన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గార్డ్నర్ స్టంపౌట్ కావడంతో గుజరాత్ ఆశలు కోల్పోయింది. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ లాంఛనమే అయింది. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జొనాసెన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా... అరుంధతి రెడ్డి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో యూపీ వారియర్స్ తలపడుతుంది. లీగ్ దశలో తొలి అర్ధ భాగం మ్యాచ్‌లు (11) నేటితో బెంగళూరులో ముగియనున్నాయి. మంగళవారం నుంచి తర్వాతి 11 మ్యాచ్‌లకు ఢిల్లీ వేదిక కానుంది. తొలి కన్కషన్ సబ్‌స్టిట్యూట్ ఆదివారం మ్యాచ్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన తొలి ప్లేయర్‌గా గుజరాత్ జెయింట్స్‌కు చెందిన సయాలీ సద్గరే గుర్తింపు తెచ్చుకుంది. జెయింట్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ బ్యాటర్ జొనాసెన్ షాట్ కొట్టగా డీప్ మిడ్ వికెట్ వద్ద క్యాచ్‌ను అందుకునే క్రమంలో హేమలత పట్టు తప్పింది. క్యాచ్ చేజారగా... బంతి ఆమె నుదుటికి బలంగా తాకింది. దాంతో కన్‌కషన్‌తో హేమలత మైదానం వీడింది. గుజరాత్ తరఫున పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సయాలీ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. -
మళ్లీ ఓడిన గుజరాత్
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు ‘హ్యాట్రిక్’ ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచి తమ ఖాతాలో రెండో విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు సాధించింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), యాష్లే గార్డ్నర్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో గుజరాత్ స్కోరు 100 దాటింది. అంతకుముందు లారా వొల్వార్ట్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్ బెత్ మూనీ (16 బంతుల్లో 16; 2 ఫోర్లు), హర్లీన్ డియోల్ (24 బంతుల్లో 18; 1 ఫోర్) వేగంగా ఆడటంలో విఫలమయ్యారు. యూపీ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం యూపీ వారియర్స్ 15.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయతీరాలకు చేరింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (33 బంతుల్లో 60 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించి యూపీ విజయంలో కీలకపాత్ర పోషించింది. నేడు జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్‌కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్‌ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్‌డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
రెచ్చిపోయిన ఆర్సీబీ బౌలర్లు.. తేలిపోయిన గుజరాత్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. ఆర్సీబీ బౌలర్లు వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో రేణుకా సింగ్ (4-0-14-2), సోఫీ మోలినెక్స్ (4-0-25-3), జార్జియా వేర్హమ్ (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీశారు. వికెట్లు తీయలేకపోయినా సోఫీ డివైన్ (4-0-12-0), ఆశా శోభన (3-0-13-0) పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), స్నేహ్ రాణా (10 బంతుల్లో 12; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. బెత్ మూనీ (8), లిచ్‌ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7), కేథరీన్ బ్రైస్ (3) తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లుకు ఇది రెండో మ్యాచ్. తమ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. యూపీ వారియర్జ్‌ను ఓడించి బోణీ కొట్టగా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన గుజరాత్ బోణీ విజయం కోసం ఎదురు చూస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఢిల్లీ, ఆర్సీబీ, గుజరాత్, యూపీ వరస స్థానాల్లో ఉన్నాయి. -
ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్–2)లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట గుజరాత్ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. తనూజ (21 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు), క్యాథ్రిన్ బ్రిస్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. ముంబై బౌలర్లు అమెలియా కెర్ (4/17), షబ్నమ్ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు యస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్ (7) నిరాశపరచగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయంగా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. హర్మన్, అమెలియా కెర్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. గుజరాత్ బౌలర్లలో తనూజ 2, బ్రిస్, లి తహుహు చెరో వికెట్ తీశారు. నేడు జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
ముంబై బౌలర్ల విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైన గుజరాత్
మహిళల ఐపీఎల్ (WPL) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 25) ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముంబై ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ముంబై బౌలర్లు అమేలియా కెర్ (4-0-17-4), షబ్నిమ్ ఇస్మాయిల్ (4-0-18-3) అద్భుత ప్రదర్శనలతో గుజరాత్ పతనాన్ని శాశించారు. నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. అమేలియా కెర్ ఆఖర్ ఓవర్లో 2 వికెట్లు తీసి గుజరాత్‌ను నామమాత్రపు స్కోర్‌కే కట్టడి చేసింది. తనుజా కన్వర్ (28) ఆఖర్లో బ్యాట్ ఝులిపించకపోయుంటే గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో కేథరీన్ బ్రైస్ (25 నాటౌట్), కెప్టెన్ బెత్ మూనీ ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. వేద కృష్ణమూర్తి (0), హర్లీన్ డియోల్ (8), లిచ్‌ఫీల్డ్ (7), దయాలన్ హేమలత (3), ఆష్లే గార్డ్నర్ (15), స్నేహ్ రాణా (0), లియా తహుహు (0) విఫలమయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో గుజరాత్‌కు ఇది తొలి మ్యాచ్ కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీపై విజయం సాధించి, ఖాతా తెరిచింది. -
PKL 10: ‘టాప్’ పుణెరి పల్టన్.. ప్లే ఆఫ్స్ సమరానికి సై
Pro Kabaddi League- పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. పుణేరి పల్టన్ 40–38తో యూపీ యోధాస్‌పై గెలిచి ఓవరాల్‌గా 96 పాయింట్లుతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. A comeback of the 𝚑̶𝚒̶𝚐̶𝚑̶𝚎̶𝚜̶𝚝̶ 𝐏𝐚𝐥𝐭𝐚𝐧 order 💪 Aslam & Co. turned things around in style against Yoddhas to confirm their No. 1️⃣ spot 🫡#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL10 #PKL #HarSaansMeinKabaddi #PUNvUP #PuneriPaltan #UPYoddhas pic.twitter.com/wOG3cEARlu — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 హైదరాబాద్‌లో మిగిలిన మ్యాచ్‌లు మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 53–39తో హరియాణా స్టీలర్స్‌ను ఓడించింది. పుణేరి పల్టన్, జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, పట్నా పైరేట్స్ టాప్–6లో నిలిచి ప్లే ఆఫ్స్ దశకు అర్హత సాధించాయి. ఈనెల 26 నుంచి మార్చి 1 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్లే ఆఫ్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మరోవైపు.. తెలుగు టైటాన్స్ తాజా సీజన్లోనూ గత వైఫల్యాలు కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. League stage ✅ Playoffs ⏳ Here’s what the points table looks like after the last league-stage game of #PKLSeason10 🤩#ProKabaddi #HarSaansMeinKabaddi #ProKabaddiLeague #PKL #PKL10 #PUNvUP #HSvBLR pic.twitter.com/KVfiBs14cS — ProKabaddi (@ProKabaddi) February 21, 2024 -
మరో మూడు రోజుల్లో టోర్నీ షురూ.. ఆర్సీబీకి ఊహించని షాక్
మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌కు మరో మూడు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 23న బెంగళూరు వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ లీగ్ ఆరంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు గుజరాత్ జెయింట్స్ జట్లకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఆర్సీబీ ఆల్ రౌండర్ కనిక అహుజా, గుజరాత్ జెయింట్స్ పేసర్ కాశ్వీ గౌతమ్‌లు డబ్ల్యూపీఎల్-2024 సీజన్ నుంచి తప్పుకున్నారు. గాయాల కారణంగా వీరిద్దరూ ఈ ఏడాది సీజన్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలో కనిక స్ధానాన్ని లెఫ్టార్మ్ పేసర్ శ్రద్ధా పోఖర్కర్‌తో ఆర్సీబీ భర్తీ చేసింది. శ్రద్ధాకు దేశీవాళీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. ఆమె రూ. 10 లక్షల కనీస ధరతో ఆర్సీబీలో చేరనుంది. మరోవైపు కాశ్వీ గౌతమ్ స్ధానాన్ని సయాలీ సతగరెతో గుజరాత్ జెయింట్స్ భర్తీ చేసింది. సయాలీతో రూ.10 లక్షల కనీస ధరకు గుజరాత్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా డబ్ల్యూపీఎల్-2024 వేలంలో కాశ్వీని రూ.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ సొంతం చేసుకుంది. -
గుజరాత్ జెయింట్స్ జట్టు హెడ్ కోచ్‌గా క్లింగర్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తలపడే గుజరాత్ జెయింట్స్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ క్లింగర్‌ను నియమించారు. తొలి సీజన్లో ఆస్ట్రేలియాకే చెందిన రాచెల్ హేన్స్ కోచింగ్‌లో బరిలోకి దిగిన జెయింట్స్ అట్టడుగున నిలిచింది. 2017లో ఆ్రస్టేలియా తరఫున మూడు అంతర్జాతీయ టి20 లు ఆడిన క్లింగర్ తదనంతరం మహిళల బిగ్‌బా‹Ùలో సిడ్నీ థండర్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశారు. డబ్ల్యూపీఎల్–2 ఈ నెల 25న మొదలవుతుంది. -
గుజరాత్ జెయింట్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు (రెండవది) ముందు గుజరాత్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లింగర్ గుజరాత్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్ స్థానాన్ని క్లింగర్ భర్తీ చేస్తాడు. క్లింగర్ ఎంపిక విషయాన్ని గుజరాత్ జెయింట్స్ మేనేజ్మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది. తొలి సీజన్ నుంచి జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న క్లింగర్ .. మెంటార్ మిథాలీ రాజ్, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌తో ఇదివరకే జాయిన్ అయినట్లు జెయింట్స్ మేనేజ్మెంట్ తెలిపింది. క్లింగర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ అసిస్టెంట్ కోచ్‌గా, అదే సిడ్నీ థండర్స్ రిక్రూటర్‌గా, 2019-2021 వరకు మెల్బోర్న్ రెనెగేడ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. 43 ఏళ్ల క్లింగర్ 2019లో బిగ్‌బాష్ లీగ్‌కు రిటైర్మెంట్ (ఆటగాడిగా) పలికాడు. నాటికి క్లింగర్ బీబీఎల్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. Coach saheb padharya! 🤩 We are delighted to welcome former Australian cricketer @maxyklinger as our head coach for the upcoming WPL season. 🙌🧡#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/iJjqnSUo9K — Gujarat Giants (@Giant_Cricket) February 6, 2024 ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో (2023) గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి, తొలి WPL టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2024 సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో మ్యాచ్‌లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్ట్‌ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. జెయింట్స్‌లో త్రిష పూజిత, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్, మన్నత్ కశ్యప్, స్నేహ్ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు. -
Pro Kabaddi 2024: పట్నా పైరేట్స్‌కు ఎనిమిదో గెలుపు
పట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో సొంతగడ్డపై పట్నా పైరేట్స్ జట్టు అదరగొట్టింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ జట్టు 32–20 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఈ టోర్నీలో పైరేట్స్కిది ఎనిమిదో విజయం కావడం విశేషం. పట్నా తరఫున సందీప్ (7 పాయింట్లు), అంకిత్ (6 పాయింట్లు) రాణించారు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–36తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. హరియాణా తరఫున శివమ్ 12 పాయింట్లు, సిద్ధార్థ్ 11 పాయింట్లు, వినయ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. -
PKL 2023: గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసిన దబంగ్ ఢిల్లీ
Pro Kabaddi League 2023- నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో దబంగ్ ఢిల్లీ జట్టు ఐదో విజయం నమోదు చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 35–28తో గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ 11 పాయింట్లు, మంజీత్ 9 పాయింట్లు స్కోరు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్; పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్ తలపడతాయి. రిత్విక్ జోడీ శుభారంభం థాయ్‌లాండ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ–నిక్కీ పునాచా (భారత్) ద్వయం 6–3, 6–1తో సెచినాటో–ఫోనియో (ఇటలీ) జోడీని ఓడించింది. ఇదే టోర్నీలో ఆడుతున్న సాకేత్ మైనేని–రామ్‌కుమార్ జంట తొలి రౌండ్లో 5–7, 6–3, 8–10తో రే హో (చైనీస్ తైపీ)–యున్ సేంగ్ చుంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! -
PKL 2023: తలైవాస్‌పై పాంథర్స్ గెలుపు
Pro Kabaddi League 2023- చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఢిపెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్‌పాంథర్స్ 25–24తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. అర్జున్ దేశ్వాల్ (7 పాయింట్లు), రెజా మిర్బగెరి (5), సునీల్ కుమార్ (4), అజిత్ (3) రాణించారు. The Pink Panthers' 𝗿𝗲𝘇-son to 𝔹𝔼𝕃𝕀𝔼𝕍𝔼 🩷#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #CHEvJPP #TamilThalaivas #JaipurPinkPanthers pic.twitter.com/jCmyGWIsui — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 తలైవాస్ తరఫున హిమాన్షు నర్వాల్ 8 పాయింట్లు సాధించాడు. తద్వారా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది డేగా నిలిచాడు. ఇక తలైవాస్‌పై తాజా విజయంతో జైపూర్ పింక్‌పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు.. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 38–30తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. గుజరాత్ విజయంలో రెయిడర్ రాకేశ్ (14) కీలకపాత్ర పోషించాడు. Powerful Parteek with a Giant tackle 🤜🤛#ProKabaddiLeague #ProKabaddi #PKLSeason10 #PKL #HarSaansMeinKabaddi #GGvUP #GujaratGiants #UPYoddhas pic.twitter.com/My5I0MfTXS — ProKabaddi (@ProKabaddi) December 23, 2023 బంగ్లా చేతిలో కివీస్ చిత్తు నేపియర్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న బంగ్లాదేశ్‌కు ఊరట విజయం దక్కింది. శనివారం జరిగిన చివరి వన్డేలో బంగ్లా 9 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 31.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాపై ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. యంగ్ (26) టాప్ స్కోరర్ కాగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తన్జీమ్ హసన్ (3/14), సౌమ్య సర్కార్, షరీఫుల్ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం బంగ్లా 15.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. నజ్ముల్ హుస్సేన్ (51 నాటౌట్), అనాముల్ హక్ (37) రాణించారు. కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి గెలుపు కావడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన న్యూజిలాండ్ 2–1తో సిరీస్ సొంతం చేసుకుంది. -
PKL 2023: డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ గెలుపు బోణీ
Pro Kabaddi League 2023- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 35–32తో గెలిచింది. విరామ సమయానికి 12–20తో వెనుకబడి ఉన్న జైపూర్ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుంది. రెయిడర్ అర్జున్ దేశ్వాల్ అత్యధికంగా 15 పాయింట్లు స్కోరు చేసి జైపూర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా ఈ సీజన్లో జైపూర్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఆ జట్టుకు ఇదే తొలి గెలుపు. మరోవైపు.. గుజరాత్ జెయింట్స్ ఐదింట మూడు గెలిచి 17 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. 2️⃣4️⃣-carat magical raid ft. Sonu 😍#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #JPPvGG #JaipurPinkPanthers #GujaratGiants pic.twitter.com/vDrssOgxDi — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 బెంగళూరు బుల్స్ చేతిలో యూపీ యోధాస్ ఓటమి ఇదిలా ఉంటే.. సోమవారం నాటి మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 38–36తో యూపీ యోధాస్‌ను ఓడించి ఈ సీజన్లో ఐదో మ్యాచ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. బెంగళూరు తరఫున వికాశ్, భరత్ 11 పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మంగళవారం జరిగే మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్ వారియర్స్ తలపడుతుంది. Announcing the yuddh in his style ⚔️ Pardeep Narwal for you 💪#ProKabaddi #PKL #PKLSeason10 #HarSaansMeinKabaddi #BLRvUP #BengaluruBulls #UPYoddhas pic.twitter.com/HrUJXMKK3W — ProKabaddi (@ProKabaddi) December 11, 2023 -
గుజరాత్‌పై పట్నా పైచేయి
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న గుజరాత్ జెయింట్స్ జట్టుకు పట్నా పైరేట్స్ బ్రేక్ వేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ 33–30 పాయింట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో పట్నాకిది వరుసగా రెండో విజయంకాగా... గుజరాత్ జట్టుకిది తొలి పరాజయం. గుజరాత్‌తో మ్యాచ్‌లో పట్నా సమష్టి ఆటతో రాణించింది. పట్నా పైరేట్స్ తరఫున సుధాకర్ (6 పాయింట్లు), సచిన్ (4), నీరజ్ కుమార్ (4), అంకిత్ (4), సందీప్ కుమార్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. గుజరాత్ తరఫున రాకేశ్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఫలితం లేకపోయింది. అంతకుముందు బెంగాల్ వారియర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. బెంగాల్ తరఫున శ్రీకాంత్ జాదవ్ (7), నితిన్ కుమార్ (5), మణీందర్ సింగ్ (4)... జైపూర్ తరఫున భవాని రాజ్‌పుత్ (10) అర్జున్ దేశ్వాల్ (6) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్‌తో దబంగ్ ఢిల్లీ; పుణేరి పల్టన్‌తో యు ముంబా తలపడతాయి. -
మాజీ ఛాంపియన్‌కు షాక్.. గుజరాత్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గుజరాత్ జెయింట్స్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 39–37తో మాజీ చాంపియన్ యు ముంబా జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో గుజరాత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. రెయిడర్ సోనూ జగ్లాన్ 11 పాయింట్లు స్కోరు చేసి గుజరాత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. రాకేశ్ (9 పాయింట్లు), రోహిత్ గులియా (7 పాయింట్లు) కూడా రాణించారు. యు ముంబా తరఫున గుమన్ సింగ్, అమీర్ మొహమ్మద్ పది పాయింట్ల చొప్పున స్కోరు చేసినా కీలకదశలో గుజరాత్ జెయింట్స్ ఆటగాళ్లు పైచేయి సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్; యూపీ యోధాస్‌తో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
నోర్ట్జే దెబ్బకు గిల్ విలవిల.. కొత్త లుక్ అదిరిందయ్యా!
సౌతాఫ్రికా పేసర్ అన్రిచ్ నోర్ట్జే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ 16వ సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన నోర్ట్జే గుజరాత్‌తో మ్యాచ్‌లో వస్తూనే తన పవర్ ఏంటో చూపించాడు. తన తొలి ఓవర్లోనే సాహాను బౌల్డ్ చేసిన నోర్ట్జే.. తర్వాతి ఓవర్లో శుబ్‌మన్ గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. 148 కిమీ వేగంతో నోర్ట్జే వేసిన బంతికి గిల్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఎలా ఆడాలో తెలియక గిల్ తికమక పడగా బంతి వేగానికి లెగ్‌స్టంప్ ఎగిరిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నోర్ట్జే సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు. కోరమీసంతో నోర్ట్జే కాస్త కొత్తగా కనిపించాడు. దీంతో నోర్ట్జేపై ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్ చేశారు.'' నీ కొత్త లుక్ అదిరింది పో.. కోర మీసంతో హీరోలా కనిపిస్తున్నావు'' అంటూ పేర్కొన్నారు. Nortje - Pace is Pace 🔥pic.twitter.com/iutrKpDtng — Johns. (@CricCrazyJohns) April 4, 2023 -
నక్క తోక తొక్కిన వార్నర్..
ఐపీఎల్ 16వ సీజన్లో మంగళవారం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి షమీ తొలి ఓవర్లో వార్నర్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్ నక్క తోక తొక్కినట్లున్నాడు. ఓవర్ తొలి బంతిని వైడ్ వేసిన షమీ ఆ తర్వాత బంతిని మాత్రం అద్బుతంగా వేశాడు. మిడిల్ స్టంప్ అయిన బంతి ఆఫ్‌స్టంప్‌ను తాకుతూ కీపర్ సాహా చేతుల్లోకి వెళ్లింది. కానీ బెయిల్స్ ఇంచు కూడా కదల్లేదు. దీంతో వార్నర్ బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత వార్నర్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. pic.twitter.com/ujy9abVzAX — Guess Karo (@KuchNahiUkhada) April 4, 2023 -
మెక్‌గ్రాత్, హ్యారిస్ విధ్వంసం.. ఉత్కంఠ సమరంలో యూపీ వారియర్జ్ విజయం
డబ్ల్యూపీఎల్-2023లో మరో ఉత్కంఠ సమరం జరిగింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (మార్చి 20) మధ్యాహ్నం మొదలైన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ సూపర్ విక్టరీ సాధించి, ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. తద్వారా లీగ్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించాల్సి వచ్చింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, తాజా విజయంతో వారియర్జ్ ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేయగా.. తహీల మెక్‌గ్రాత్ (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), గ్రేస్ హ్యారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మెరిసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చారు. ఆఖర్లో సోఫీ ఎక్లెస్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి మరో బంతి మిగిలుండగానే వారియర్జ్‌ను విజయతీరాలకు చేర్చింది. 19వ ఓవర్లో ఐదో బంతిని ఎక్లెస్టోన్ బౌండరీకి తరలించడంతో వారియర్జ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వారియర్జ్‌ను తహీల మెక్‌గ్రాత్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో, గ్రేస్ హ్యారిస్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో గెలిపించారు. ఈ సీజన్లో జెయింట్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో (26 బంతుల్లో 59) మెరిసి వారియర్జ్‌ను ఇన్నే వికెట్ల తేడాతో గెలిపించిన హ్యారిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
హేమలత, గార్డ్నర్ మెరుపు అర్ధశతకాలు.. గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్
డబ్ల్యూపీఎల్-2023లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 20) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జెయింట్స్.. దయాలన్ హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగుల భారీ స్కోర్ చేసింది. గార్డ్నర్, హేమలత జోరు చూసి ఓ దశలో జెయింట్స్ స్కోర్ సునాయాసంగా 200 పరుగులు దాటుతుందని భావించినప్పటికీ.. రెండు ఓవర్ల వ్యవధిలో ఇద్దరు ఔట్ కావడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ నమోదైంది. సూపర్ ఫామ్‌లో ఉన్న గార్డ్నర్ ఎడాపెడా షాట్లు బాది భారీ స్కోర్‌కు దోహదపడింది. సోఫీ డంక్లే (23), లారా వోల్వార్డ్ (17) తొలి వికెట్‌కు 41 పరుగులు (4.1 ఓవరల్లో) జోడించి శుభారంభాన్ని అందించగా.. హర్లీన్ డియోల్ (4), అశ్వనీ కుమారి (5) విఫలమయ్యారు. వారియర్జ్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్షవి చోప్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అంజలీ సర్వాని, సోఫీ ఎక్లెస్టోన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 ఓవర్లు బౌల్ చేసిన దీప్తి శర్మ భారీగా పరుగులు (49) సమర్పించుకుంది. కాగా, ప్రస్తుత లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. వారియర్జ్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో ఉంది. తొలి రెండు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇదివరకే క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించాయి. -
36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆర్సీబీ వుమెన్ తొలిసారి తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఆర్సీబీ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండడంతో పాటు రన్‌రేట్ కూడా చాలా దారుణంగా ఉంది. రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలన్నా.. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్న కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఆర్సీబీది. అందుకే కీలకమ్యాచ్‌లో తొలిసారి జూలు విదిల్చింది. ముఖ్యంగా సోఫీ డివైన్ ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఆమె విధ్వంసానికి ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగుల వర్షంతో తడిసిపోయింది. బంతి పడిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న డివైన్ 36 బంతుల్లోనే 9ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు చేసింది. అయితే సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో ఔటైన డివైన్ ఆ ఒక్క పరుగు పూర్తి చేసి ఉంటే చరిత్రకెక్కేది. ఎందుకంటే మహిళల క్రికెట్లో అత్యంత ఫాస్టెస్ట్ సెంచరీ డీజెఎస్ డొట్టిన పేరిట ఉంది. ఆమె 38 బంతుల్లోనే శతకం మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత అలీసా హేలీ 46 బంతుల్లో సెంచరీ సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో బ్యూమౌంట్ 47 బంతుల్లో, నాలుగో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకుంది. కానీ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయిన సోఫీ డివైన్ అరుదైన ఫీట్‌ను మిస్ చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం.సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. Devine power at play ⚡ #GGvRCB #CheerTheW | @RCBTweets pic.twitter.com/YOi84P4tLB — JioCinema (@JioCinema) March 18, 2023 .@RCBTweets register their second win in a row 😍#CheerTheW #TATAWPL #GGvRCB pic.twitter.com/SHz3eh9sRA — JioCinema (@JioCinema) March 18, 2023 చదవండి: ఉత్కంఠ.. ఆఖరి బంతికి రనౌట్; టైటిల్ నిలబెట్టుకున్న లాహోర్ సూపర్ సోఫీ... ఆర్సీబీ వరుసగా రెండో విజయం -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
దంచికొట్టిన గుజరాత్ జెయింట్స్.. ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా డబుల్ హెడర్‌లో భాగంగా శనివారం రాత్రి ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 188 పరుగులు చేసింది. లారా వోల్వార్డట్ (42 బంతుల్లో 68 పరుగులు) వరుసగా రెండో అర్థసెంచరీతో రాణించగా.. అష్లే గార్డనర్ 41 పరుగులు, సబ్బినేని మేఘన 31 పరుగులు చేశారు. చివర్లో హర్లీన్ డియోల్ (12), దయలాన్ హేమలత (16)రెచ్చిపోయి ఆడారు. మేఘన్ షట్ వేసిన ఆఖరి ఓవర్లో హర్లీన్, హేమలత తలా ఒక ఫోర్, సిక్స్ బాదారు. దాంతో, గుజరాత్ భారీ స్కోరు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీసింది. సోఫీ డెవినే, ప్రీతీ బోస్ తలా ఒక వికెట్ తీశారు. టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ తీసుకుంది. అయితే.. 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫియా డంక్లీ (16)ని సోఫీ డెవినే బౌల్డ్ చేసింది. అయితే.. మరో ఓపెనర్ లారా వొల్వార్డ్ మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. 35 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో హాఫ్ సెంచరీ సాధించింది. సబ్బినేని మేఘన (31)తో కలిసి రెండో వికెట్‌కు 63 రన్స్, అష్ గార్డ్నర్తో కలిసి మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించింది. -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను నిలుపుకుంది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ 136 పరుగులకు ఆలౌట్ అయింది. మారిజన్నే కాప్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అరుంధతీ రెడ్డి 25 పరుగులు, ఎలిస్ క్యాప్సీ 22 పరుగులు చేసింది. వీరిద్దరు మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో తనూజా కన్వర్ రెండు వికెట్లు తీయగా.. అష్లే గార్డనర్, కిమ్ గార్త్, హర్లిన్ డియోల్, స్నేహ్రాణా తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. -
సాధారణ స్కోరుకే పరిమితం.. ఢిల్లీ టార్గెట్ 148
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డాట్ (45 బంతుల్లో 57, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), అష్లే గార్డనర్(33 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు), హర్లిన్ డియోల్ 31 పరుగులు రాణించడంతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లారా, అష్లే గార్డనర్లు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించి గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాసెన్ రెండు వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి, మారిజెన్నె కాప్ చెరొక వికెట్ తీశారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఔట్ అయింది. మరిజానే కాప్ వేసిన ఆఖరి బంతికి లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. కుదురుకున్న హర్లీన్ డియోల్ (31) ను జొనాసెన్ రెండో వికెట్‌గా వెనక్కి పంపింది. దాంతో, గుజరాత్ జట్టు 53 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత.. ఓపెనర్ లారా వోల్వార్డట్, అష్లే గార్డ్నర్ గుజరాత్‌ను ఆదుకున్నారు. తొలి మ్యాచ్‌లో విఫలమైన ఆమె కీలక మ్యాచ్‌లో రాణించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో గుజరాత్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు విజయాలతో రెండో స్థానంలో ఉన్న పటిష్టమైన ఢిల్లీని గుజరాత్ నిలువరిస్తుందా? అనేది ఆసక్తికరం. గుజరాత్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపైన. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ పోటీలో నిలవాలని స్నేహ్ రానా సేన భావిస్తోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, అలైస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, జెస్ జొనాసెన్, కాప్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా కాప్,శిఖా పాండే, రాధా యాదవ్‌లతో బాగానే ఉంది. మరోవైపు గుజరాత్ జెయింట్స్ తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది.హర్లిన్ డియోల్, అష్లీ గార్డనర్, సోఫియా డంక్లీలు రాణించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మాత్రం కిమ్ గార్త్, తనూజా కన్వర్లతో పటిష్టంగా ఉంది. కెప్టెన్‌గా స్నేహ్రాణా రాణిస్తున్నప్పటికి ఆటలో మాత్రం నిలకడ చూపలేకపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు : మేగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిసే క్యాప్సే, జెస్ జొనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, పూనమ్ యాదవ్. రాధా యాదవ్ గుజరాత్ జెయింట్స్ జట్టు : లారా వోల్వార్డ్త్, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అశ్విని కుమారి, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి 🚨 Toss Update 🚨@DelhiCapitals have elected to bowl against @GujaratGiants. Follow the match 👉 https://t.co/fWIECCa2QJ #TATAWPL | #DCvGG pic.twitter.com/NyMHidy8Aa — Women's Premier League (WPL) (@wplt20) March 16, 2023 -
హర్మన్ ధనాధన్ హాఫ్ సెంచరీ.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీ బాదింది. ఓపెనర్ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నెర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు. నట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (రనౌట్) 44; హేలీ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; నట్ సీవర్ (ఎల్బీ) (బి) గార్త్ 36; హర్మన్‌ప్రీత్ (సి) హర్లీన్ (బి) గార్డ్నెర్ 51; అమెలియా (సి) గార్త్ (బి) కన్వార్ 19; ఇసి వాంగ్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 0; హుమైరా (రనౌట్) 2; ధార (నాటౌట్) 1; అమన్‌జోత్ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; కలిత (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్: గార్డ్నెర్ 4–0–34–3, కిమ్ గార్త్ 4–0–31–1, స్నేహ్ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్ 4–0–42–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (ఎల్బీ) (బి) నట్ సీవర్ 0; మేఘన (సి) నట్ సీవర్ (బి) హేలీ 16; హర్లీన్ (ఎల్బీ) (బి) వాంగ్ 22; అనాబెల్ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్నెర్ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్ (ఎల్బీ) (బి) నట్ సీవర్ 20; హేమలత (సి) వాంగ్ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్) 18; గార్త్ (సి) హర్మన్ (బి) నట్ సీవర్ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్: నట్ సీవర్ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్ 3–0–19–1, హేలీ మాథ్యూస్ 4–0–23–3, అమెలియా కెర్ 4–0–18–2, అమన్‌జోత్ 1–0–6–0. -
ఎదురులేని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో విజయం
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ వుమెన్ దూసుకుపోతుంది. లీగ్‌లో వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ముంబై బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్నేహ్రాణా 20 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో నట్ సివర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ 2 వికెట్లు పడగొట్టింది.అంతకముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్రాణా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
హర్మన్‌ప్రీత్ ఫిఫ్టీ.. గుజరాత్ జెయింట్స్ టార్గెట్ 163
వుమెన్స్ ప్రీమియర్ లీగ్ భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ పోరాడే స్కోరు సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (51) అర్ధ శతకంతో రాణించింది. ఈ లీగ్‌లో ఆమెకు ఇది మూడో ఫిఫ్టీ. నాలుగో వికెట్‌కు హర్మన్‌ప్రీత్, అమేలియా 29 బంతుల్లో 51 రన్స్ చేశారు. అయితే.. ధాటిగా ఆడుతున్న అమేలియా కేర్ (19)ను ఔట్ చేసిన తనూజ కన్వార్ గుజరాత్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆమె ఔటయ్యాక వెంటనే ఇసీ వాంగ్ వెనుదిరిగింది. దాంతో 136 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ పడింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గేర్ మార్చింది. సిక్స్, ఫోర్‌తో స్కోర్‌బోర్డు 150 దాటించింది. 19వ ఓవర్లో అష్లీ గార్డ్నర్ హ్యాట్రిక్‌పై నిలిచింది. వరుస బంతుల్లో హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్ కౌర్‌లను ఔట్ చేసింది. కానీ, ఆఖరి బంతికి జింతిమని కతియా రెండు రన్స్ తీసింది. గుజరాత్ బౌలర్లలో అష్లీ గార్డ్నర్ మూడు వికెట్లు తీయగా.. కిమ్ గార్త్, స్నేహ్ రానా, తనూజా కన్వార్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
ఓటమెరుగని ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ నిలువరిస్తుందా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ ఫీల్డింగ్ ఏంచుకుంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన ముంబై ఇండియన్స్ టాప్‌లో ఉండగా.. గుజరాత్ జెయింట్స్ నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్లో ఓటమన్నదే ఎరుగని ముంబైని గుజరాత్ నిలువరిస్తుందా? లేదా? అనేది చూడాలి. ముంబై బ్యాటర్లు హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నాట్ సీవర్ బ్రంట్, అమేలియా కేర్ ఫామ్‌లో ఉన్నారు. ఇసీ వాంగ్, సైకా ఇషాక్ బౌలింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఇక గుజరాత్ విషయానికొస్తే… ఓపెనర్లు మేఘన, సోఫీ భారీ స్కోర్ చేయడం లేదు. హర్లీన్ ఒక్కామే రాణిస్తోంది. ఈ లీగ్‌లో ఒక్క విజయం మాత్రమే సాధించిన గుజరాత్, టాప్ గేర్‌లో ఉన్న ముంబైతో ఎలా ఆడనుంది? అనేది ఆసక్తికరం. గుజరాత్ జెయింట్స్: సబ్బినేని మేఘన, సోఫీ డంక్లే, స్నేహ్ రానా (కెప్టెన్), హర్లీన్ డియోల్, అష్ గార్డ్నర్, దయలాన్ హేమలత, అన్నబెల్ సథర్లాండ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), కిమ్ గార్త్, తనుజా కన్వర్, మన్సీ జోషి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కేర్, ఇసీ వాంగ్, అమన్‌జోత్ కౌర్, హుమారియా కాజీ, జింతిమణి కలిత, సాయిక్ ఇషాక్ -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
గుజరాత్ కెప్టెన్ స్థానంలో సౌతాఫ్రికా ఓపెనర్
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ జెయింట్స్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ స్టార్ ప్లేయర్/వికెట్‌కీపర్ బెత్ మూనీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడి, ఆతర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లకు (యూపీ వారియర్జ్, ఆర్సీబీ)దూరంగా ఉంది. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో మూనీ సీజన్ మొత్తానికే దూరమైంది. దీంతో ఆమె స్థానాన్ని సౌతాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్ట్తో భర్తీ చేసింది యాజమాన్యం. జెయింట్స్ మూనీని బేస్ ధర 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న వొల్వార్ట్.. మార్చి 11 ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి మూనీ గైర్హాజరీలో కెప్టెన్‌గా స్నేహ్ రాణా, వికెట్‌కీపర్‌గా సుష్మా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూనీని వేలంలో గుజరాత్ జెయింట్స్ 2 కోట్లు వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు గాయపడిన ఆల్‌రౌండర్ లక్ష్మీ యాదవ్ స్థానంలో శివాలి షిండేను భర్తీ చేసుకుంది యూపీ వారియర్జ్ యాజమాన్యం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన 26 ఏళ్ల శివాలి.. మహారాష్ట్ర, ఇండియా ఏ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. మార్చి 9 నాటికి డబ్ల్యూపీఎల్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది.. -
డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్ క్రికెటర్..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్ జెయింట్స్ బ్యాటర్.. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది. ముఖ్యంగా రేణుకా ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టుల్లో 152 పరుగులు చేసింది. -
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి
గుజరాత్‌కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి ఆర్సీబీ ఆటతీరు మారడం లేదు. వరుసగా మూడో ఓటమితో లీగ్‌లో హ్యాట్రిక్ నమోదు చేసింది. 202 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 66 పరుగులు, హెథర్‌నైట్ 11 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ రాణించినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడం.. మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి ఎదురైంది. గుజరత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. అన్నాబెల్ సదర్లాండ్ రెండు, మాన్సీ జోషీ ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. 14 ఓవర్లలో ఆర్సీబీ 118/2 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 51 పరుగులతో, రిచా ఘోష్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 24, సోఫీ డివైన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ఆర్సీబీ 74/1 9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 16, సోఫీ డివైన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ స్మృతి మంధాన(18) రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అష్లే గార్డనర్ బౌలింగ్‌లో మాన్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. టార్గెట్ 202.. ధీటుగా బదులిస్తున్న ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్సీబీ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసిది. సోఫీ డివైన్ 18 బంతుల్లో 31, మంధాన 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచికొట్టిన గుజరాత్.. ఆర్సీబీ టార్గెట్ 202 ఆర్సీబీతో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శ్రేయాంక్ పాటిల్ బౌలింగ్ బాగా వేయడంతో గుజరాత్ స్కోరు కాస్త తగ్గింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్‌నైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. దంచికొడుతున్న గుజరాత్.. 14 ఓవర్లలో 136/3 ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 42, దయాలన్ హేమలత ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. 18 బంతుల్లోనే అర్థశతకం.. గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకుంది. ప్రీతీ బోస్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో డంక్లీ వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకున్న డంక్లీ 18 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. డంక్లీ 54, హర్లీన్ డియోల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆర్సీబీ వుమెన్‌తో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సబ్బినేని మేఘన స్కౌట్ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం గుజరాత్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీ వుమెన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యి పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భోణీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లలో గుజరాత్ జెయింట్స్ కాస్త ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లో కూడా స్నేహ్ రాణానే కెప్టెన్‌గా గుజరాత్‌ను నడిపించనుంది. ఆర్సీబీ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగాన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ గుజరాత్ జెయింట్స్(ప్లేయింగ్ XI): స్నేహ్ రాణా(కెప్టెన్) సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), అష్లీగ్ గార్డనర్, దయాళన్ హేమలత, కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్ -
WPL 2023 GG Vs RCB: స్పెషల్ డే.. ‘స్పెషల్ మ్యాచ్’.. అందరికి ఎంట్రీ ఫ్రీ
WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ టీమ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. అందరికీ ఉచిత ప్రవేశం మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ముంబై టాప్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గుజరాత్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడగా.. లానింగ్ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పెషల్ డే.. స్పెషల్ మ్యాచ్ మూడో మ్యాచ్‌లో గుజరాత్- యూపీ వారియర్స్ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!! చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..? PSL 2023: మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో.. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
స్పాన్సర్స్ ఎవరూ లేక, ధోని పేరును బ్యాట్‌పై రాసుకుని ఇరగదీసింది
మహిళల ఐపీఎల్ (WPL) 2023 సీజన్ మొదటి రెండు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగడంతో కాస్త బోర్‌గా ఫీలైన అభిమానులకు నిన్న (మార్చి 5) రాత్రి గుజరాత్ జెయింట్స్-యూపీ వారియర్జ్ మధ్య జరిగిన మ్యాచ్ అసలుసిసలైన టీ20 మజాను అందించింది. చివరి నిమిషం వరకు రసవత్తరంగా సాగి ఈ మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు), ఆష్లే గార్డెనర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరే (43 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రేస్ హ్యారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), సోఫీ ఎక్లెస్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, సిక్స్) విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటంతో యూపీ వారియర్జ్ మరో బంతి మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓ పక్క వికెట్లు పడుతున్నా కిరణ్ ఒక్కరే జట్టు భారాన్ని అంతా మోయగా.. గెలుపుపై ఆశలు సన్నగిల్లిన తరుణంలో గ్రేస్, సోఫీ జోడీ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి తమ జట్టుకు అపురూపమైన విజయాన్నందించారు. వీరిలో ముఖ్యంగా గ్రేస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 18వ ఓవర్లో 20 పరుగులు, 19వ ఓవర్లో 14 పరుగులు, చివరి ఓవర్లో 25 పరుగులు పిండుకుని వారియర్జ్‌కు బోణీ విజయాన్నందించింది. కాగా, ఈ మ్యాచ్‌లో వారియర్జ్ బ్యాటింగ్ సందర్భంగా కనిపించిన ఓ ఆసక్తికర సీన్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించింది. వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్‌గిరే.. టీమిండియా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరును తన బ్యాట్‌పై రాసుకుని బరిలోకి దిగింది. ధోని అంటే పడిచచ్చిపోయే కిరణ్.. స్పాన్సర్ ఎవరూ లేకపోవడంతో ఇలా చేసి ఎంఎస్డీపై అభిమానాన్ని చాటుకుంది. ఎంఎస్డీ7 అని రాసివున్న బ్యాట్‌తో బరిలోకి దిగిన కిరణ్.. ధోని తరహాలోనే విధ్వంసం సృష్టించి, తన జట్టు గెలుపుకు బలమైన పునాది వేసింది. కిరణ్ బ్యాట్‌పై ఎంఎస్డీ7 అని రాసి ఉండటాన్ని లైవ్‌లో కామెంటర్లు ప్రస్తావించడంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. కిరణ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఎవరికీ తెలియని కిరణ్.. రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. ధోని పేరు పుణ్యమా అని ప్రస్తుతం ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నోళ్లలో నానుతుంది. ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ కిరణ్ నవ్గరేను ప్రతేక్యంగా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన 28 ఏళ్ల కిరణ్ ప్రభు నవ్గరే.. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించింది. దేశవాలీ టోర్నీల్లో గతంలో మహారాష్ట్ర, ప్రస్తుతం నాగాలాండ్‌కు ఆడుతున్న నవ్గరే.. వుమెన్స్ టీ20 చాలెంజ్‌లో వెలాసిటి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. టీ20ల్లో 150కి పైగా వ్యక్తిగత స్కోర్ సాధించిన ఏకైక భారత బ్యాటర్ కిరణ్ రికార్డుల్లోకెక్కింది. మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ-2022లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ అజేయమైన 162 పరుగులు సాధించి, మహిళల క్రికెట్లో డాషింగ్ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. -
‘గ్రేట్’ హారిస్...
ముంబై: పురుషుల లీగ్‌కు ఏమాత్రం తీసిపోని మ్యాచ్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు వన్నెలద్దింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ ‘హిట్టర్’ గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖరి ఓవర్ మెరుపులతో మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. 170 లక్ష్యం ఛేదించే క్రమంలో యూపీ ఒకదశలో 105/7 స్కోరుతో ఓటమికి దగ్గరైంది. ఈ దశలో సోఫీ ఎకిల్‌స్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో హారిస్ ధనాధన్ ‘గ్రేట్’ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. అబేధ్యమైన 8వ వికెట్‌కు ఈ ఇద్దరు 4.1 ఓవర్లలో 70 పరుగులు జోడించి యూపీని గెలిపించారు. ఆఖరి ఓవర్లో యూపీకి 19 పరుగుల కావాల్సి ఉండగా.. అనాబెల్ వేసిన ఈ ఓవర్లో గ్రేస్ వరుసగా 6, వైడ్, 2, 4, వైడ్, 4, 6లతో ఏకంగా 24 పరుగులు పిండుకుంది. దీంతో యూపీ 3 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించగా, సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. కిమ్ గార్త్ (5/36) యూపీని బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది. స్కోరు వివరాలు గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (సి) శ్వేత (బి) సోఫీ 24; సోఫియా (బి) దీప్తి 13; హర్లిన్ (సి) తాలియా (బి) అంజలి శర్వాణి 46; అనాబెల్ సదర్లాండ్ (సి) అంజలి (బి) సోఫీ 8; సుష్మ (సి) శ్వేత (బి) తాలియా 9; గార్డ్నర్ (స్టంప్డ్) హీలీ (బి) దీప్తి 25; హేమలత (నాటౌట్) 21; స్నేహ్ రాణా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–34, 2–38, 3–50, 4–76, 5–120, 6–142. బౌలింగ్: రాజేశ్వరి 4–0–30–0, అంజలి శర్వాణి 4–0–43–1, దీప్తి 4–0–27–2, సోఫీ 4–0–25–2, తాలియా 2–0–18–1, దేవిక 2–0–24–0. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి అండ్ బి) గార్త్ 7; శ్వేత (సి) మాన్సి (బి) గార్త్ 5, కిరణ్ నవ్‌గిరే (సి) సుష్మ (బి) గార్త్ 53; తాలియా (సి) హేమలత (బి) గార్త్ 0; దీప్తి (బి) మాన్సి 11; గ్రేస్ హారిస్ (నాటౌట్) 59; సిమ్రన్ (బి) గార్త్ 0; దేవిక (సి) హేమలత (బి) అనాబెల్ 4; సోఫీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–13, 2–19, 3–20, 4–86, 5–88, 6–88, 7–105. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–36–5, తనూజ 4–0–29–0, గార్డ్నెర్ 4–0–34–0, అనాబెల్ 3.5–0–41–1, స్నేహ్ రాణా 2–0–16–0, మాన్సి 2–0–15–1. ♦ డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ఇండియన్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం
హారిస్ సంచలన ఇన్నింగ్స్.. గుజరాత్‌పై యూపీ వారియర్జ్ విజయం మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్జ్ శుభారంబం చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 3 వికెట్ల తేడాతో యూపీ విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో యూపీ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆ జట్టు బ్యాటర్ గ్రేస్ హారిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి ఓవర్ వేసిన సదర్లాండ్ బౌలింగ్‌లో 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో మ్యాచ్‌ను హారిస్ ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్‌లో కేవలం 26 బంతులు ఎదుర్కొన్న హారిస్ 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 59 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు కిరణ్ నవ్‌గిరే(53)పరుగులతో యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ ఐదు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం లేకపోయింది. గార్త్ తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. ►18 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(36), ఎకిలిస్టోన్(9) పరుగులతో ఉన్నారు. యూపీ విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాలి. ►17 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 7 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. క్రీజులో హ్యారీస్(23), ఎకిలిస్టోన్(3) పరుగులతో ఉన్నారు. ఐదు వికెట్లతో చెలరేగిన కిమ్ గార్త్ వరుస క్రమంలో యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయింది. 13 ఓవర్లు ముగిసే సరికి యూపీ 6 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. యూపీ విజయానికి 42 బంతుల్లో 82 పరుగులు కావాలి. క్రీజులో హ్యారిస్, వైద్యా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ ఐదు వికెట్లు పడగొట్టింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. 9 ఓవర్లకు యూపీ స్కోర్: 60/3 9 ఓవర్లు ముగిసే సరికి యూపీ వారియర్జ్ 3 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో కిరణ్ నవ్‌గిరే(40), దీప్తి శర్మ(8) పరుగులతో ఉన్నారు. 26 పరుగులకే 3 వికెట్లు.. కష్టాల్లో యూపీ 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హీలీతో పాటు శ్వేతా సెహ్రావత్, మెక్‌గ్రాత్ వికెట్లను యూపీ కోల్పోయింది. కాగా తొలి మూడు వికెట్లను కూడా గుజరాత్ పేసర్ కిమ్ గార్త్ పడగొట్టింది. రాణించిన గుజరాత్ బ్యాటర్లు.. యూపీ టార్గెట్ 170 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో హర్లీన్ డియోల్(46),గార్డనర్(25) పరుగులతో రాణించారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, ఎక్లెస్టోన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెక్‌గ్రాత్,శర్వాణి తలా వికెట్ సాధించారు. ► 16 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 5 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), హేమలత (1)పరుగులతో ఉన్నారు. ► 14 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్ డియోల్(23), గార్డనర్(18) పరుగులతో ఉన్నారు. 9 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 58/3 ►9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ మూడు వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో హర్లీన్, సుష్మా వర్మ పరుగులతో ఉన్నారు. ►38 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 24 పరుగులు చేసిన మేఘన.. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో పెవియలన్కు చేరింది. ►34 పరుగుల వద్ద గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డాంక్లీ.. దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యంది. క్రీజులో హర్లీన్ వచ్చింది. 3 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 30/0 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో సబ్బినేని మేఘన(20), డాంక్లీ(10) పరుగులతో ఉన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. యూపీ వారియర్జ్ తమ తొలి మ్యాచ్‌లో డివై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ రెగ్యూలర్ కెప్టెన్ బెత్ మూనీ గాయం కారణంగా దూరమైంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టుకు స్నేహ్ రానా సారథ్యం వహించనుంది. తుది జట్లు: యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, సిమ్రాన్ షేక్, కిరణ్ నవ్‌గిరే, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ గుజరాత్ జెయింట్స్ : సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సుష్మా వర్మ(వికెట్‌కీపర్), దయాళన్ హేమలత, స్నేహ్ రాణా(కెప్టెన్), తనుజా కన్వర్, మాన్సీ జోషి -
చరిత్రలో తొలిసారి.. కొత్త రూల్‌ను పరిచయం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు), ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) చెలరేగడంతో చేతులెత్తేసిన గుజరాత్ టీమ్ 15.1 ఓవర్లలో 64 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. pic.twitter.com/EpIaVdOCoX — WPL MAHARASTRA (@WMaharastra) March 4, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. గుజరాత్ ఇన్నింగ్స్ సందర్భంగా సైకా ఇషాఖీ బౌల్ చేసిన 13వ ఓవర్ ఆఖరి బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్ బాల్‌గా ప్రకటించింది. అయితే అంపైర్ కాల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ముంబై కెప్టెన్ హర్మన్ రివ్యూ కోరింది. రీప్లేలో బంతి బ్యాటర్ మోనిక గ్లోవ్స్‌ను తాకినట్లు స్పష్టంగా తెలియడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. క్రికెట్ చరిత్రలో ఇలా వైడ్ బాల్ విషయంలో రివ్యూకి వెళ్లడం ఇదే తొలిసారి. WPLలో వైడ్ బాల్స్‌తో పాటు నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు ఉంది. ఈ ఛాన్స్‌ను హర్మన్ విజయవంతంగా వాడుకుని సక్సెస్ అయ్యింది. గతంలో ఔట్ విషయంలో మాత్రమే అంపైర్ కాల్‌ను ఛాలెంజ్ చేసే అవకాశం ఉండేది. WPL 2023 నుంచి బీసీసీఐ వైడ్, నో బాల్స్ విషయంలోనూ రివ్యూకి వెళ్లే వెసలుబాటు కల్పించింది. హోరాహోరీ మ్యాచ్‌ల్లో రాంగ్ కాల్ (వైడ్, నో బాల్) వల్ల నష్టం జరగకూడదనే బీసీసీఐ ఈ కొత్త రూల్‌ను అమల్లోకి తెచ్చింది. వైడ్‌బాల్ రివ్యూ వల్ల ముంబై ఇండియన్స్‌ను ఒరిగింది ఏమీ లేనప్పటికీ.. ఇలాంటి రూల్ ఒకటి ఉందని సగటు క్రికెట్ అభిమానికి ఈ మ్యాచ్ ద్వారానే తెలిసింది. -
గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబైను గెలిపించిన ఈ అమ్మాయి ఎవరు..?
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023) తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిన్న (మార్చి 4) జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. గుజరాత్ జెయింట్స్‌ను 143 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) మెరుపు అర్ధశతకంతో, ఓపెనర్ హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), నాట్ సీవర్-బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), పూజా వస్త్రాకర్ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2.. వేర్హమ్, గార్డ్నర్, తనుజా కన్వర్ తలో వికెట్ దక్కించుకున్నారు. 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. సైకా ఇషాఖీ (3.1-1-11-4), నాట్ సీవర్-బ్రంట్ (2-0-5-2), అమేలియా కెర్ర్ (2-1-12-2), ఇస్సీ వాంగ్ (3-0-7-1) ధాటికి 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి పేకమేడలా కూలింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో దయాలన్ హేమలత (23 బంతుల్లో 29 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), 11వ నంబర్ ప్లేయర్ మోనికా పటేల్ (9 బంతుల్లో 10; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. గుజరాత్ స్కోర్ కార్డు సున్నాలు, సింగిల్ డిజిట్ స్కోర్లతో నిండుకుని ఫుట్‌బాల్ స్కోర్ కార్డును తలపించింది. సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0 రిటైర్డ్ హర్ట్), హర్లీన్ డియోల్ (0), ఆష్లే గార్డ్నర్ (0), అన్నాబెల్ సుదర్లాండ్ (6), జార్జియా వేర్హమ్ (8), స్నేహ్ రాణా (1), తనుజా కన్వర్ (0), మాన్సీ జోషీ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సైకా ఇషాఖీ ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇషాఖీ ఎవరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు. సైకా ఇషాఖీ గురించి నెట్లో సెర్చ్ చేయగా.. ఆమె ఓ దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన 27 ఏళ్ల ఇషాఖీ.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయనప్పటికీ ఇండియా డి వుమెన్, ట్రయల్‌బ్లేజర్స్, బెంగాల్, ఇండియా ఏ వుమెన్ జట్లకు ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యమున్న ఇషాఖీ.. 2021లో ఇండియా-సితో జరిగిన ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో అమేలియా కెర్ర్, హేలీ మాథ్యూస్ లాంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లు ఉన్నా, ఇషాఖీ వారిని ఫేడ్ అవుట్ చేసి మరీ సత్తా చాటింది. ఈ ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శనతో ఇషాఖీ రాత్రికిరాత్రి స్టార్‌గా మారిపోయింది. -
హై స్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారాలా?
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)G తొలి ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం(మార్చి 4న) గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ 14 ఫోర్లతో 35 బంతుల్లోనే 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. హేలీ మాథ్యూస్ నాలుగు సిక్సర్లతో 31 బంతుల్లోనే 47 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పూర్తి ఓవర్లు ఆడకుండానే 64 పరుగులకే కుప్పకూలింది. అయితే సాధారణంగా అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో బౌండరీ లైన్‌ను కాస్త ముందుకు జరపడం చూస్తుంటాం. ఐపీఎల్‌లోనూ ఇదే తంతు కొనసాగుతుంది. కేవలం పెద్ద స్కోర్లు రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు. అయితే డబ్ల్యూపీఎల్ విషయంలో బీసీసీఐ మరింత ముందుకెళ్లింది. హై స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదవ్వాలనే ఉద్దేశంతో బౌండరీ లైన్‌ను బాగా తగ్గించేసింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీ లైన్‌ను ఉంచింది. అందుకే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్లు అవలీలగా బౌండరీలు కొట్టేశారు. ఒక్క హర్మన్‌ప్రీత్ ఏకంగా 14 బౌండరీలు బాదగా.. మాథ్యూస్ అయితే నాలుగు సిక్సర్లు కొట్టిపారేసింది. అయితే చేధనలో చతికిలపడ్డ గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో బౌండరీలు ఎక్కువగా రానప్పటికి వాళ్లు కూడా బంతులను అవలీలగా బౌండరీ దాటించేశారు. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కేవలం 60 మీటర్ల దూరంలోనే బౌండరీని ఏర్పాటు చేసింది. ఇటీవలే ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో బౌండరీ లైన్‌ను 65 మీటర్ల దూరంలో ఉంచారు. బౌండరీలైన్‌ను తగ్గించడం ద్వారా హై స్కోరింగ్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని.. మ్యాచ్ చూస్తే అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని బీసీసీఐ పేర్కొంది. అయితే బీసీసీఐ చేసిన పనిని కొంతమంది తప్పుబట్టారు. హైస్కోరింగ్ మ్యాచ్‌ల కోసం ఇంత దిగజారుతారా అంటూ కామెంట్స్ చేశారు. 𝑾𝒉𝒐 𝒆𝒍𝒔𝒆? @ImHarmanpreet brings up the first 5️⃣0️⃣ of #TATAWPL 👏🏼 More of her in action in #GGvMI 👉🏼 LIVE on #JioCinema & #Sports18 📺📲#CheerTheW #TATAWPLonJioCinema #TATAWPLonSports18 pic.twitter.com/16SxnLpZup — JioCinema (@JioCinema) March 4, 2023 చదవండి: సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!? WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం -
ముంబై మెరుపులు
అప్పుడెలాగో... ఇప్పుడు అలాగే.... పురుషుల ఆటలోని మెరుపులు అమ్మాయిల లీగ్‌లోనూ కనిపించాయి. 2008లో పురుషుల లీగ్ ధనాధన్‌గా ప్రారంభమైన రీతిలో మహిళల లీగ్ డబ్ల్యూపీఎల్‌కు కూడా తెర లేచింది. కోల్‌కతాలాగే ముంబై చెలరేగగా... భారీ లక్ష్య ఛేదనలో నాడు బెంగళూరు కుదేలైనట్లే... తాజాగా గుజరాత్ కూడా విలవిల్లాడింది. మొత్తానికి ఈ రెండు లీగ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు (కోల్‌కతా, ముంబై) 200 పైచిలుకు స్కోరుతో తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాయి. అంతకు ముందు తారాలోకంతో కూడిన ‘గానాబజానా’ వేడుకలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్ర ముంబై ఇండియన్స్ బోణీతో మొదలైంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 143 పరుగుల తేడాతో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. హేలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అమెలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరిపించారు. అనంతరం గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. హేమలత (29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇశ్వక్ 4 వికెట్లు తీసింది. చెలరేగిన హేలీ, హర్మన్ హేలీ మాథ్యూస్‌తో ముంబై ఇన్నింగ్స్ ఆరంభించిన యస్తిక భాటియా (1) నిరాశ పరిచింది. అయితే నట్ సీవర్ బ్రంట్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), హేలీ ధాటిగా ఆడటంతో వేగం పెరిగింది. హేలీ అయితే భారీ సిక్సర్లతో అలరించింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరగా... కాసేపటికి వరుస ఓవర్లలో బ్రంట్, హేలీ నిష్క్రమించారు. 10 ఓవర్లలో ముంబై స్కోరు 77/3. తర్వాత సగం ఓవర్ల ఆట రూటు మారింది. అమెలియా కెర్ అండతో కెపె్టన్ హర్మన్ ఒక్కసారిగా బౌండరీలతో విరుచుకుపడింది. కాసేపు ఇద్దరి ఆట పురుషుల లీగ్‌ను గుర్తుకుతెచ్చింది. మోనిక పటేల్ 15వ ఓవర్లో తొలి రెండు బంతులాడిన అమెలియా ఒక ఫోర్ కొడితే... తర్వాతి నాలుగు బంతుల్ని హర్మన్ బౌండరీలకు తరలించింది. ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లోనూ ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టిన హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో (11 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్–కెర్ జోడీ నాలుగో వికెట్‌కు కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు. హర్మన్ నిష్క్రమించాక... అమెలియా, పూజ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ధాటిని కొనసాగించడంతో జట్టు స్కోరు 200 దాటింది. గుజరాత్ ఆట పేలవంగా మొదలై... చివరకు చిత్తుగా ఓడింది. టాపార్డర్‌లో మూనీ (0 రిటైర్డ్‌హర్ట్) గాయంతో వెనుదిరగ్గా... హర్లీన్ (0), సహా గార్డ్నర్ (0), తనూజ (0) ఖాతానే తెరువలేదు. ఏకంగా 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హేమలతతో పాటు మోనిక (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (సి) జార్జియా (బి) తనూజ 1; హేలీ (బి) గార్డ్నెర్ 47; సీవర్ (సి) స్నేహ్ రాణా (బి) జార్జియా 23; హర్మన్‌ప్రీత్ (సి) హేమలత (బి) స్నేహ్ రాణా 65; అమెలియా నాటౌట్ 45; పూజ (సి) మోనిక (బి) స్నేహ్ రాణా 15; ఇసి వాంగ్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–15, 2–69, 3–77, 4–166, 5–201. బౌలింగ్: ఆష్లే గార్డ్నెర్ 4–0–38–1, మాన్సి 2–0–17–0, తనూజ 2–0–12–1, మోనిక 2–0–34–0, జార్జియా 3–0–30–1, అనాబెల్ 3–0–32–0, స్నేహ్ రాణా 4–0–43–2, గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (బి) సీవర్ 2; బెత్ మూనీ రిటైర్డ్ హర్ట్ 0; హర్లిన్ (సి) వాంగ్ (బి) నట్ సీవర్ 0; ఆష్లే గార్డ్నెర్ (సి) హేలీ (బి) వాంగ్ 0; అనాబెల్ (బి) ఇష్వాక్ 6; హేమలత నాటౌట్ 29; జార్జియా (బి) ఇషా్వక్ 8; స్నేహ్ రాణా (ఎల్బీ) (బి) అమెలియా 1; తనూజ (సి) నట్ సీవర్ (బి) అమెలియా 0; మాన్సి జోషి (ఎల్బీ) (బి) ఇష్వాక్ 6; మోనిక (బి) ఇష్వాక్ 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 64. వికెట్ల పతనం: 1–1, 2–3, 3–5, 4–12, 5–22, 6–23, 7–23, 8–49, 9–64. బౌలింగ్: నట్ సీవర్ 2–0–5–2, ఇసి వాంగ్ 3–0–7–1, సయిక ఇషా్వక్ 3.1–1–11–4, అమెలియా కెర్ 2–1–12–2, పూజ 2–0–9–0, కలిత 2–0–12–0, హేలీ 1–0–8–0. డాటిన్ వివాదం డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌కు ముందే ఒక అనూహ్య పరిణామం వివాదాన్ని రేపింది. గుజరాత్ జెయింట్స్ జట్టు తమ ప్రధాన ప్లేయర్ డియాండ్రా డాటిన్ (వెస్టిండీస్) గాయపడిందని ప్రకటించింది. ఆమె స్థానంలో ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌ను తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే డాటిన్నుంచి భిన్నమైన స్పందన వచి్చంది. తాను అసలు గాయంతోనే లేదని ఆమె ప్రకటించడం విశేషం. ‘నేను కోలుకుంటున్నానని చెబుతున్నాను. అసలు ఏదైనా అయితే కదా నేను కోలుకునేది. దేనినుంచి కోలుకుంటున్నానో నాకే తెలీదు. నిజాలు చెబితే బాగుంటుంది’ అని ట్వీట్ చేసింది. దీనిపై గుజరాత్ యాజమాన్యం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వేలంలో డాటిన్‌ను గుజరాత్ రూ. 60 లక్షలకు తీసుకుంది. మహిళల టి20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు ఉన్న డాటిన్ విండీస్ తరఫున 127 టి20లు ఆడింది. మహిళల టి20ల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. డబ్ల్యూపీఎల్‌లో నేడు బెంగళూరు VS ఢిల్లీ మ.గం. 3.30 నుంచి యూపీ VS గుజరాత్ రా.గం. 7.30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు కేకేఆర్, ఇప్పుడు ముంబై ఇండియన్స్
మహిళల క్రికెట్లో తొలిసారి నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభం అదిరింది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు నమోదైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఇప్పటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అర్థసెంచరీతో మెరవగా.. అమెలియా కెర్, హేలీ మాథ్యూస్‌లు రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ దారుణ ఆటతీరును కనబరిచింది. ఇది చూసిన తర్వాత ఒక విషయం గుర్తుకురాక మానదు. అదే 2008 తొలి ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్. అప్పుడు కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మెక్కల్లమ్ 73 బంతుల్లోనే 158 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 82 పరగులకే కుప్పకూలి 140 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. అజిత్ అగార్కర్ మూడు వికెట్లు తీశాడు. సేమ్ టూ సీన్ రిపీట్ అయిందంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. -
ఫోర్లతో హర్మన్ హల్చల్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఫిఫ్టీ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో తొలి అర్థశతకం నమోదైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీగ్‌లో తొలి ఫిఫ్టీ సాధించింది. గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ 22 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకుంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి వేగంగా ఆడిన హర్మన్ వరుస బౌండరీలతో విరుచుకుపడింది. బౌండరీల రూపంలోనే 44 పరుగులు వచ్చాయంటే ఆమె ఎంత దూకుడుగా ఆడిందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక హర్మన్ ఇన్నింగ్స్ ఒక్క సిక్సర్ లేకుండా కేవలం బౌండరీలు మాత్రమే ఉండడం విశేషం. మ్మ్యాచ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. -
64 పరుగులకే కుప్పకూలిన గుజరాత్.. ముంబై ఘన విజయం
గుజరాత్ జెయింట్స్‌కు దారుణ పరాభవం ►డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ 64 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దయాలన్ హేమలత 29 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. సైకా ఇషికీ నాలుగు వికెట్లతో చెలరేగింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ► గుజరాత్ జెయింట్స్ ఫేలవ ఆటతీరు కనబరుస్తుంది. మాన్సి జోషి(6) రూపంలో ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్ ► గుజరాత్ జెయింట్స్ కష్టాల్లో పడింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. వర్హెమ్ 4, దయాలన్ హేమలత ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన గుజరాత్ ► 208 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత కెప్టెన్ బెత్ మూనీ కాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన హర్లిన్ డియోల్ వాంగ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగింది. మరుసటి బంతికే స్టార్ బ్యాటర్ అష్లీ గార్డనర్ గోల్డెన్ డకౌట్ అయింది. సబ్బినేని మేఘన రెండు పరుగులు చేసి పెవిలియన్ చేరింది. హర్మన్, అమెలీ కైర్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు ► డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్‌లో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. హర్మన్‌కు తోడు హేలీ మాథ్యూస్(31 బంతుల్లో 47 పరుగులు), అమెలియా కెర్(24 బంతుల్లో 45 నాటౌట్) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. తనుజా కన్వర్, అష్లే గార్డనర్, జార్జియా వెర్హమ్లు తలా ఒక వికెట్ తీశారు. ముగిసిన హర్మన్ జోరు.. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై ► కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ జోరుకు బ్రేక్ పడింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన హర్మన్(30 బంతుల్లో 65) స్నేహ్రాణా బౌలింగ్‌లో హేమలతాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ మెరుపులు.. భారీ స్కోరు దిశగా ముంబై ► ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌండరీల వర్షం కురిపిస్తోంది. తద్వారా ముంబై భారీ స్కోరు దిశగా కదులుతుంది. 15 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులతో హర్మన్ దూకుడు ఆటతీరును కనబరుస్తోంది. ప్రస్తుతం ముంబై 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ముంబై ► దూకుడుగా ఆడిన హేలీ మాథ్యూస్ 47 పరుగుల వద్ద గార్డనర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ముంబై 10 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. సిక్సర్ల వర్షం కురిపిస్తున్న విండీస్ క్రికెటర్ ► విండీస్ క్రికెటర్ హెలీ మాథ్యూస్ సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ముంబై 8.5 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. మాథ్యూస్ 41 పరుగులతో క్రీజులో ఉంది. సివర్ బ్రంట్ 23 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ► ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్ నష్టానికి 44 పరుగులుగా ఉంది. సివర్ బ్రంట్ 189, మాథ్యూ హెలిస్సా 23 పరుగులతో ఆడుతున్నారు. ► 4 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు ఎంతంటే? 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వుమెన్స్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. హెలీ మాథ్యూస్ 15, నట్ సివర్ బ్రంట్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు యస్తికా బాటియా(1) తనూజ కన్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. ► టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న గుజరాత్ జెయింట్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి.ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం మ్యాచ్‌కు వేదిక కానుంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ ఏంచుకుంది.గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, హుమైరా కాజీ, ఇస్సీ వాంగ్, జింటిమణి కలిత, సైకా ఇషాక్ గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ(కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, దయాళన్ హేమలత, జార్జియా వేర్హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సీ జోషి ► అంతకముందు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2023) ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సింగర్ డిల్లాన్లు తమ ప్రదర్శనతో స్టేడియాన్ని హోరెత్తించారు. -
WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023) ఆరంభ సీజన్ తొలిరోజునే వివాదం నెలకొంది. గుజరాత్ జెయింట్స్ జట్టు ఫిట్నెస్ లేదన్న కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్పై వేటు వేసింది. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఫిట్నెస్ లేదని చెప్పి తనను అకారణంగా డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించారంటూ విండీస్ మహిళా క్రికెటర్ డియాండ్రా డాటిన్ ఆరోపణలు చేసింది. తన ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కింబెర్లీ గార్త్‌ను తీసుకోవడం సరికాదని ఆమె తెలిపింది. ''తొందరగా కోలుకోవాలని నాకు మెసేజ్‌లు పంపిస్తున్నవాళ్లను అభినందిస్తున్నా. అయితే.. నిజం ఏంటంటే..? నేను ఎలాంటి గాయం నుంచి కోలుకోవడం లేదు. ధన్యవాదాలు'' అని సోషల్‌మీడియాలో పోస్ట్‌లో రాసుకొచ్చింది. చికిత్స తీసుకున్న డాటిన్ ఇంకా కోలుకోలేదని చెప్పి గుజరాత్ జెయింట్స్ డాటిన్‌ను తప్పించింది. డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్న డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మధ్యే ముగిసిన వేలంలో కింబెర్లీ గార్త్‌ను ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దక్షిణాఫ్రికాలో ముగిసిన టి20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో గార్త్ సభ్యురాలు. అయితే.. ఈమె కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇవాళ(మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. I think we have the 1st #WPL controversy @GujaratGiants need to come up with some clarity No way to treat a legend#WPL2023 pic.twitter.com/qGyrN8l2gH — Mohit Shah (@mohit_shah17) March 4, 2023 చదవండి: WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా.. మహిళల ఐపీఎల్ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..? -
WPL 2023: మ్యాచ్ 30 నిమిషాలు ఆలస్యంగా..
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్ 2023) తొలి ఎడిషన్ శనివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానున్నట్లు నిర్వహాకులు తెలిపారు. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ 8గంటలకు మొదలుకానుంది. టాస్ కూడా రాత్రి 7:30 గంటలకు వేయనున్నారు. తొలిసారి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుండడంతో బీసీసీఐ ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చూస్తోంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 6:25 గంటలకు గ్రాండ్‌గా డబ్ల్యూపీఎల్ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. బాలీవుడ్ స్టార్స్ కియరా అద్వానీ, కృతి సనన్ సహా టాప్ స్టార్స్ అంతా సందడి చేయనున్నారు. ఆ తర్వాత టాప్ సింగర్ ఎపీ డిల్లాన్తో మ్యూజికల్చాట్బస్టర్స్ ఏర్పాటు చేశారు. వీటికి కాస్త సమయం ఎక్కువ ఉండడంతో మ్యాచ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. తొలిరోజు కావడంతో ప్రారంభోత్సవ వేడుకల దృశ్యా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా.. రేపటి నుంచి షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ఒక మ్యాచ్ ఉంటే రాత్రి గం 7:30 నుంచి... రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి మ్యాచ్ 3:30 గంటల నుంచి... రెండో మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి మొదలవుతుంది. A star ⭐ studded line-up D.Y.Patil Stadium will be set for an evening of glitz and glamour 👌🏻 𝐃𝐨 𝐍𝐨𝐭 𝐌𝐢𝐬𝐬 the opening ceremony of #TATAWPL Grab your tickets 🎫 now on https://t.co/c85eyk7GTA pic.twitter.com/2dj4L8USnP — Women's Premier League (WPL) (@wplt20) March 1, 2023 చదవండి: రిఫరీపై ఆటగాళ్ల మూకుమ్మడి దాడి -
మహిళల ఐపీఎల్ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..?
తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ (మార్చి 4) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా 2023 WPL ఇనాగురల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్.. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ సారధ్యం వహిస్తుండగా.. ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తే.. గుజరాత్‌తో పోలిస్తే, ముంబైకే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. గుజరాత్ టీమ్‌లో కెప్టెన్ మూనీ, యాష్లే గార్డెనర్, అనాబెల్ సదర్లాండ్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, సబ్బినేని మేఘన గుర్తింపుగల స్టార్ ప్లేయర్లు కాగా.. ముంబై జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్ వాంగ్, హేలీ మాథ్యూస్ ఆకాశమే హద్దుగా చెలరేగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా ముంబై టీమ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్ర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా సంచలన ప్రదర్శనలు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇటీవలికాలంలో వీరి ఫామ్‌ను బట్టి చూస్తే.. ఈ ఐదుగురిని ఆపడం కష్టమని సుస్పష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తే.. గుజరాత్‌పై పైచేయి సాధించడం హర్మన్ సేనకు పెద్ద కష్టమైన విషయం కాకపోవచ్చు. ఈ మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ తప్పుకోవడం గుజరాత్‌కు మైనస్‌గా చెప్పవచ్చు. గుజరాత్ విజయావకాశలు కెప్టెన్ బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణాలపైనే అధారపడి ఉన్నాయి. కాగా, WPL టీవీ లైవ్ స్ట్రీమింగ్ హక్కులను స్పోర్ట్స్ 19 నెట్వర్క్ దక్కించుకోగా.. డిజిటల్ రైట్స్‌ను జియో సినిమా యాప్, వెబ్సైట్ సొంతం చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్.. హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. గుజరాత్ జెయింట్స్.. బెత్ మూనీ (కెప్టెన్), యాష్లే గార్డ్నర్,జార్జియా వేర్హమ్,స్నేహ్ రాణా, అనాబెల్ సదర్లాండ్, కిమ్ గార్త్, సోఫియా డన్క్లే, సుష్మా వర్మ, తనూజ కన్వర్, హర్లీన్ డియోల్, అశ్వని కుమారి, హేమలత, మాన్సి జోషి, మోనిక పటేల్, సబ్బినేని మేఘన, హర్లీ గాల, పరుణిక సిసోడియా, షబ్నమ్ షకీల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం!
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్దమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. ముంబై వేదికగా జరిగిన వేలంలో డాటిన్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగొలు చేసింది. ఇక గుజరాత్ తమ జట్టులో డాటిన్ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా గుజరాత్ ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కిమ్ గార్త్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్ దూరం కావడంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్ గార్త్‌కు దక్కింది. రూ.60 లక్షల కనీస ధరకు గార్త్‌తో గుజరాత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్‌లో గుజరాత్ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బెత్ మూనీ వ్యవహరించనుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్‌కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL: ‘శక్తి’మంతంగా డబ్ల్యూపీఎల్ ఆంథెమ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం!
Women's Premier League 2023 Anthem: భారత క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ బీసీసీఐ నిర్వహించనున్న మహిళా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు సమయం ఆసన్నమైంది. ఐదు ఫ్రాంఛైజీలకు సంబంధించిన జట్లతో కూడిన టీ20 లీగ్ మార్చి 4న ఆరంభం కానుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్‌తో ప్రారంభ సీజన్‌కు తెరలేవనుంది. మహిళా శక్తికి అద్దం పట్టేలా ఈ నేపథ్యంలో బీసీసీఐ డబ్ల్యూపీఎల్ ఆంథెమ్‌ను విడుదల చేసింది. ‘‘యేతో బస్ షురువాద్ హై (ఇది కేవలం ఆరంభం మాత్రమే)’’ అంటూ మొదలైన ఈ గీతం అమ్మాయిల సంకల్ప బలానికి, మహిళా శక్తికి అద్దం పట్టేలా సాగింది. కఠిన సవాళ్లను ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగుతున్న మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా స్ఫూర్తిదాయక పదాల కూర్పుతో అద్భుతంగా ఉంది. గూస్బంప్స్ రావడం ఖాయం మహిళా క్రికెటర్లు ఎవ్వరికీ తీసిపోరని, అంకితభావంతో వాళ్లు ఇక్కడిదాకా చేరిన తీరుకు నిదర్శనంగా నిలిచింది. అందుకు తగ్గట్లే సంగీతం కూడా అదిరిపోయింది. మొత్తానికి ఈ పాట వింటే గూస్బంప్స్ రావడం ఖాయం. మహిళా శక్తిని వివరిస్తూ ‘‘జాగీ హుయీ శక్తి అబ్ మేరే పాస్ హై, దేఖో అభి, యేతో బస్ షురువాద్ హై!’’ అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఈ పాటను మీరు కూడా వినేయండి! మహిళా దినోత్సవానికి ముందే మరో కానుక ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై నమస్తస్యయై.. నమో నమః ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ్ ధమ్ ధ మ మ ధమ్ ధమ మైదాన్ మే గూంజే మేరీ శక్తి అబ్ ఆస్మాన్ మే’’ అంటూ నేటితరం ఆడబిడ్డలకు సవాళ్లు స్వీకరించడం ఓ అలవాటులా మారిపోయిందని.. విజయగర్జన చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ.. ఆకాశమే హద్దుగా ఆటలో తమను తాము నిరూపించుకుంటామంటూ సాగిన పాట జోష్ నింపుతోంది. నెటిజన్లు ఈ గీతానికి ఫిదా అవకుండా ఉండలేకపోతున్నారు. మహిళా దినోత్సవానికి ముందే మహిళా క్రికెటర్లకు అద్భుతమైన పాట రూపంలో కానుక ఇచ్చారంటూ బీసీసీఐని కొనియాడుతున్నారు. చదవండి: Jasprit Bumrah: న్యూజిలాండ్‌కు వెళ్లనున్న బుమ్రా Ind Vs Aus: ఇప్పటి వరకు అత్యంత చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే! అప్పుడు కూడా ఇదే మాట అంటారా? View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్ మూనీ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో పాల్గొనే గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కెపె్టన్‌గా... భారత ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా వైస్ కెపె్టన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి డబ్ల్యూపీఎల్ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది. -
WPL 2023: డబ్ల్యూపీఎల్ షెడ్యూల్, వేదికలు.. ఫైనల్ అప్పుడే!
Women's Premier League- 2023- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య వచ్చే నెల 4 నుంచి అమ్మాయిల మెరుపులు మొదలవుతాయి. దీనికి సంబంధించిన మొత్తం 22 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను మంగళ వారం విడుదల చేశారు. డీవై పాటిల్ స్టేడియంలో మార్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. ఫైనల్ 26న జరుగుతుంది. ఈ సీజన్లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 11 చొప్పున బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో నిర్వహిస్తారు. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2. ఢిల్లీ క్యాపిటల్స్ 3. యూపీ వారియర్స్ 4. గుజరాత్ జెయింట్స్ 5. ముంబై ఇండియన్స్ చదవండి: వివాదంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్.. ఆటగాళ్లు ఇంజక్షన్లు తీసుకుంటారు.. వాళ్లు సూపర్స్టార్లు.. ఫిట్నెస్ లేకున్నా అంటూ.. WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా -
గుజ్రాత్ జెయింట్స్ జట్టు ఇదే.. అత్యధిక ధర ఎవరికంటే?
తొట్టి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ వేలం ముంబై వేదికగా ఆట్టహాసంగా జరిగింది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ యాష్లే గార్డ్నర్ చరిత్ర సృష్టించింది. గార్డ్నర్ రూ.3.20 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న విదేశీ క్రికెటర్‌గా గార్డ్నర్ నిలిచింది. ఇక ఓవరాల్‌గా మంధాన తర్వాత అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో క్రికెటర్‌గా గార్డ్నర్ నిలిచింది. ఇక ఈ వేలంలో భాగంగా గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్న క్రికెటర్ల వీరే యాష్లే గార్డ్నర్- (రూ3.20 కోట్లు) బెత్ మూనీ- రూ.2 కోట్లు జార్జియా వేర్హమ్ -రూ.75 లక్షలు స్నేహ్ రాణా- రూ.75 లక్షలు అనాబెల్ సదర్లాండ్- రూ.70 లక్షలు డియాండ్ర డాటిన్- రూ.60 లక్షలు సోఫియా డన్క్లే- రూ.60 లక్షలు సుష్మా వర్మ- రూ.60 లక్షలు తనూజ కన్వర్- రూ.50 లక్షలు హర్లీన్ డియోల్- రూ.40 లక్షలు అశ్వని కుమారి- రూ.35 లక్షలు హేమలత- రూ.30 లక్షలు మాన్సి జోషి- రూ.30 లక్షలు మోనిక పటేల్- రూ.30 లక్షలు సబ్బినేని మేఘన- రూ.30 లక్షలు హర్లీ గాల- రూ.10 లక్షలు పరుణిక సిసోడియా- రూ.10 లక్షలు షబ్నమ్ షకీల్- రూ.10 లక్షలు మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండు టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్! -
Gujarat Giants: గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం
WPL 2023: మహిళల ఐపీఎల్లో అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ ఆదివారం (ఫిబ్రవరి 12) నాడు తమ జట్టు లోగోను ట్విటర్ వేదికగా ఆవిష్కరించింది. వేలానికి ఓ రోజు ముందే గుజరాత్ జెయింట్స్ లోగోను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రికెట్ అభిమానులను, ముఖ్యంగా గుజరాత్ ప్రాంత వాసులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ లోగోలో గర్జిస్తున్న ఆసియా సింహం (సివంగి) చిహ్నాన్ని పొందుపర్చింది ఫ్రాంచైజీ యాజమాన్యం. Presenting the Gujarat Giants @wplt20 team logo: the Asiatic Lioness roaring and looking forward to any challenge! The Asiatic Lion, found only in Gujarat's Gir National Park, is an enduring symbol of the state. [1/2] pic.twitter.com/SAntd2Lrev — Gujarat Giants (@GujaratGiants) February 12, 2023 ఈ లోగోకు గర్జిస్తున్న ఆసియా సింహం.. ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధం అన్న కామెంట్స్‌ను జోడించారు. ఈ రకం ఆసియా సింహం (సివంగి) గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌లో మాత్రమే కనిపిస్తుంది. గర్జించే సింహం యొక్క చిహ్నం గుజరాత్ రాష్ట్ర గౌరవానికి ప్రతీక అంటూ ట్వీట్లో పేర్కొంది గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం. గుజరాత్ జెయింట్స్ లోగో ప్రస్తుతం సోషల్‌మీడియాలో, క్రికెట్ సర్కిల్స్‌లో వైరలవుతోంది. కాగా, అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అహ్మదాబాద్ ఆధారిత సంస్థ గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీను 1289 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చింది సొంతం చేసుకుంది. WPLలో ఇదే అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ. దీని తర్వాత ముంబై ఇండియన్స్ (ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 912.99 కోట్లు), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 901 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్, 810 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ (క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, 757 కోట్లు) ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగబోయే WPL తొలి వేలంలో కూడా గుజరాత్ జెయింట్స్ తమ హవా చూపనుందని సమాచారం. కొందరు దేశీయ ఆటగాళ్ల కోసం ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరిస్తుంది. -
‘జెయింట్స్’ హెడ్ కోచ్‌గా రేచల్ హేన్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో అత్యధిక మొత్తంతో టీమ్‌ను సొంతం చేసుకున్న అహ్మదాబాద్ యాజమాన్యం అందరికంటే వేగంగా, చురుగ్గా టీమ్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ టీమ్ ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఇటీవలే మెంటార్‌గా ఎంపిక చేయగా, ఇప్పుడు టీమ్ హెడ్ కోచ్‌ను ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ రేచల్ హేన్స్ ‘జెయింట్స్’కు హెడ్ కోచ్‌గా వ్యవహరించనుంది. గత ఏడాదే ఆటకు గుడ్‌బై చెప్పిన హేన్స్ ఆసీస్ తరఫున ఆరు ప్రపంచకప్ విజయాల్లో భాగంగా ఉండటం విశేషం.ఆస్ట్రేలియా తరఫున ఆమె 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టి20ల్లో ప్రాతినిధ్యం వహించింది. దీంతో పాటు మరో రెండు నియామకాలను కూడా అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇటీవలే వరల్డ్‌కప్ నెగ్గిన భారత మహిళల అండర్–19 టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించిన నూషీన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా... తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీ నెగ్గిన ‘సూపర్ నోవాస్’కు కోచ్‌గా పని చేసిన అనుభవం నూషీన్కు ఉండగా, బరోడా మాజీ క్రికెటర్ తుషార్ భారత సీనియర్ మహిళల టీమ్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. -
గుజరాత్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్
ఆరంభ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ తమ జట్టు ప్రధానకోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్ రచెల్ హేన్స్‌ను నియమించింది. అదే విధంగా తుషార్ అరోథేను బ్యాటింగ్ కోచ్‌గా, భారత మాజీ స్పిన్నర్ నూషిన్ అల్ ఖదీర్‌ను బౌలింగ్ కోచ్‌గా గుజరాత్ ఎంపికచేసింది. కాగా తొట్టతొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా నూషిన్ అల్ ఖదీర్ పని చేశాడు. అతడి నేతృత్వంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ఇక ఈ ముగ్గురు గుజరాత్ జెయింట్స్ మెంటార్ మిథాలీ రాజ్‌తో కలిసి పనిచేయనున్నారు. రచెల్ హేన్స్.. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టులో చాలా కాలం పాటు కీలక సభ్యురాలిగా కొనసాగింది. అదే విధంగా ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టులో హేన్స్ భాగంగా ఉంది. ఆమె ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు 6 టెస్టులు, 77 వన్డేలు, 84 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించింది. ఆమె వన్డేల్లో అద్భుతంగా రాణించింది. హేన్స్ 77 వన్డేల్లో 2585 పరుగులు చేసింది. అందులో 19 అర్ధ సెంచరీలతో పాటు రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. డబ్ల్యూపీఎల్ వేలం ఎప్పుడంటే? మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన తొట్టతొలి వేలం ఫిబ్రవరి 13న ముంబై వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా వేలంలో దాదాపు 1000 మంది WPLకు సంబంధించిన వివరాలు.. లీగ్‌లో మొత్తం జట్లు: 5 మ్యాచ్‌ల సంఖ్య (అంచనా): 22 వేదికలు (అంచనా): బ్రబౌర్న్ స్టేడియం (ముంబై), డీవై పాటిల్ స్టేడియం (ముంబై) జట్లు తదితర వివరాలు.. 1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) చదవండి: BGT 2023: గెలుపెవరిది.. రికార్డులు ఏం చెబుతున్నాయి..? -
గుజరాత్ జెయింట్స్ మెంటార్‌గా మిథాలీ రాజ్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అహ్మదాబాద్ జట్టు ‘గుజరాత్ జెయింట్స్’కు భారత మాజీ కెపె్టన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా వ్యవహరించనుంది. మిథాలీ లాంటి స్టార్‌ను తమ బృందంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందని డైరెక్టర్ ప్రణవ్ అదానీ చెప్పారు. డబ్ల్యూపీఎల్ కోసం ఆమె రిటైర్మెంట్ను పక్కన పెట్టి తొలి టోర్నీలో ఆడవచ్చని వినిపించింది. అయితే తాజా ప్రకటనతో మిథాలీ ప్లేయర్‌గా ఆడే అవకాశాలు లేవని తేలిపోయింది. గుజరాత్లో విమెన్స్ క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్‌గా మిథాలీ సపోర్ట్ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్ రూ. 1298 కోట్లతో గుజరాత్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్ క్రికెట్ డెవలప్కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్‌స్టర్స్ క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది. -
కొద్దిగా ఆగి ఉంటే వేరుగా ఉండేది.. ఊహించని ట్విస్ట్
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) సీజన్-9లో తమిళ్ తలైవాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం కంఠీరవ ఇండోర్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడింది. అయితే మ్యాచ్ సందర్భంగా తలైవాస్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇదంతా మ్యాచ్ మొదటి హాఫ్ తొలి 10 నిమిషాల్లోనే జరిగింది. గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్లు 7-7తో సమంగా ఉన్న సమయంలో గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ చంద్రన్ రంజిత్ రైడ్‌కు వచ్చాడు. ఆ సమయంలో మ్యాట్‌పై తమిళ్ తలైవాస్ నుంచి ఇద్దరే ఉన్నారు. కెప్టెన్ పవన్ సెహ్రావత్ సహా సాహిలా గులియాలు ఉన్నారు. సూపర్ టాకిల్ చేస్తే పాయింట్లు వచ్చే అవకాశం ఉండడంతో సాహిల్.. చంద్రన్ రంజిత్ అప్పర్ బాడీని పట్టుకునే ప్రయత్నం చేయగా.. పవన్ చంద్రన్ కాలును గట్టిగా హోల్డ్ చేశాడు. కొద్దిగా ఆగితే పాయింట్లు వచ్చేవే. కానీ ఇక్కడే ఊహించని పరిణామం జరిగింది. పవన్ పట్టు సాధించే క్రమంలో అతని మోకాలు బెణికింది. దీంతో మ్యాట్‌పై పడిపోయిన పవన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. అంతసేపు గట్టిగా అరుస్తున్న అభిమానులు కూడా సైలెంట్ అయిపోయారు. వెంటనే మెడికల్ స్టాప్ వచ్చి పవన్ సెహ్రావత్‌ను స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. నొప్పి చూస్తుంటే గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అయితే తమిళ్ తలైవాస్ కోచ్ జె. ఉదయ్ కుమార్ మాత్రం పవన్ సెహ్రావత్ 2-3 రోజుల్లో కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక పవన్ సెహ్రావత్‌ను తమిళ్ తలైవాస్ రూ. 2.26 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఇక కెప్టెన్ పవన్ సెహ్రావత్ స్థానంలో నరేందర్ రైడర్‌గా అరంగేట్రం చేశాడు. ఇక గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ 31–31తో డ్రాగా ముగిసింది. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. చదవండి: Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్ -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో శనివారం మూడు మ్యాచ్‌లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నాతో మ్యాచ్‌లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్‌తో మ్యాచ్‌లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్‌తో మ్యాచ్‌లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్‌తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
గెలిపించిన షేన్ వాట్సన్.. ఫైనల్‌కు బిల్వారా కింగ్స్
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బిల్వారా కింగ్స్ ఫైనల్లో ప్రవేశించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో బిల్వారా కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.ఓపెనర్లు విలియం పోర్టర్‌ఫీల్డ్ (43 బంతుల్లో 60 పరుగులు), మోర్నీ వాన్విక్ 31 పరుగులు మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్(24 బంతుల్లో 48 నాటౌట్) చివరిదాకా నిలిచి జట్టును గెలిపించాడు. ఆఖర్లో పఠాన్ బ్రదర్స్ యూసఫ్ పఠాన్(21), ఇర్ఫాన్ పఠాన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రియాన్ 45, యశ్పాల్ సింగ్ 43, తిలకరత్నే దిల్షాన్ 36 పరుగులు చేశారు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్ 2, పనేసర్, ఎడ్వర్ట్స్, బ్రెస్నన్, త్యాగిలు తలా ఒక వికెట్ తీశారు. ఇక అక్టోబర్ 8న(శనివారం) ఇండియా క్యాపిటల్స్‌తో జరగనున్న ఫైనల్లో బిల్వారా కింగ్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆదివారం(అక్టోబర్ 2న) జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. చదవండి: యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్‌ల గొడవ.. అంపైర్ తలదూర్చినా! Glimpses of @Bhilwarakings from tonight! #BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/JadTaqN5gK — Legends League Cricket (@llct20) October 3, 2022 -
LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు! ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది. చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై