
మహిళల ఐపీఎల్‌లో (WPL-2025) ఇవాళ (ఫిబ్రవరి 25) ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీ.. గుజరాత్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. ఢిల్లీ బౌలర్లు శిఖా పాండే (3-0-18-2), మారిజన్ కాప్ (4-1-17-2), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (4-0-20-2), టిటాస్ సాధు (2-0-15-1), జెస్ జొనాస్సెన్ (3-0-24-1) తలో చేయి వేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మలి (29 బంతుల్లో 40 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కరే చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది. భారతి ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటంతో గుజరాత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో భారతితో పాటు డియాండ్రా డొటిన్ (26), తనూజా కన్వర్ (16), బెత్ మూనీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హర్లీన్ డియోల్ 5, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 0, కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్ 3, కశ్వీ గౌతమ్ 0, సిమ్రన్ షేక్ 5, మేఘనా సింగ్ 0 పరుగులకు ఔటయ్యారు. ప్రియా మిశ్రా ఒక్క పరుగుతో అజేయంగా నిలిచింది.
కాగా, ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్ గతం తరహాలోనే పేలవంగా ఆడుతుంది. ఈ సీజన్‌లో జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. గుజరాత్ గత రెండు సీజన్లను ఇదే తరహాలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంతో ముగించింది. ఈ సీజన్‌లో గుజరాత్ యూపీ వారియర్జ్‌పై విజయం సాధించి.. ఆర్సీబీ, ముంబై ఇండయన్స్ చేతుల్లో ఓడింది.
ఈ సీజన్ పాయింట్ల పట్టికలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్‌లో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ముంబై (0.610), యూపీ (0.167), ఢిల్లీ (-0.826) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జట్లు కూడా తలో నాలుగు పాయింట్లు ఖాతాలో కలిగి ఉన్నాయి. అయితే వీటితో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.619) అధికంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment