
కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (Andre Russel)పై ఆ జట్టు బౌలర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ప్రశంసలు కురిపించాడు. ఇప్పట్లో అతడు రిటైర్ కాబోడని.. కనీసం మరో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలానికి ముందు కేకేఆర్ రసెల్‌ను రూ. 12 కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది.
అయితే, తాజా ఎడిషన్ ఆరంభం నుంచి ఈ జమైకన్ స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లో కేవలం డెబ్బై రెండు పరుగులే చేశాడు. అయితే, ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో మాత్రం రసెల్ దుమ్ములేపాడు.

PC: BCCI
25 బంతుల్లోనే 57
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రసెల్ 25 బంతుల్లోనే 57 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇక రసెల్ ఇన్నింగ్స్ కారణంగా 200కు పైగా స్కోరు సాధించిన కేకేఆర్ రాజస్తాన్‌పై జయభేరి మోగించింది.
ఇంకో ఆరేళ్లపాటు ఐపీఎల్ ఆడతాడు
ఇక రసెల్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 129 పరుగులు పూర్తి చేసుకున్నాడు. గత మ్యాచ్‌లలో బ్యాటర్‌గా విఫలమైనప్పటికీ ఆ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. బౌలర్‌గా ఎనిమిది వికెట్లు తీయగలిగాడు. కాగా ఫామ్‌లేమి, వయసు దృష్ట్యా ఐపీఎల్-2025 తర్వాత రసెల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాజస్తాన్‌పై గెలుపు అనంతరం కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ విషయంపై స్పందించాడు. ‘‘ఇంకో రెండు మూడు సైకిళ్ల పాటు అతడు ఐపీఎల్‌లో ఆడాలని భావిస్తున్నాడు. అంటే.. ఇంకో ఐదారేళ్లన్న మాట. అతడు ఫిట్‌గా ఉన్నాడు. బాగున్నాడు.
వయసుతో పనేంటి?
అలాంటపుడు వయసుతో పనేంటి? జట్టు ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేసినంత కాలం ఓ ఆటగాడు ఆడుతూనే ఉంటాడు. ఫ్రాంఛైజీ క్రికెట్ యాజమాన్యాలు ఇలాగే ఆలోచిస్తాయి. ఇలాంటి ఆలోచనా విధానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కాగా రసెల్ స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ చితక్కొట్టగలడని ఈ సందర్భంగా వరుణ్ స్పష్టం చేశాడు. కాగా 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి కోల్‌కతాతోనే కొనసాగుతున్నాడు.
కాగా ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం నాటి మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్తాన్‌పై ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఇప్పటికి ఈ సీజన్‌లో రహానే సేన ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఐదు గెలిచి.. పట్టికలో ఆరోస్థానంలో ఉంది.
ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్
👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)
👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)
👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై కేకేఆర్ గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రసెల్.
చదవండి: ఏం ఆడుతున్నార్రా బాబూ! గుడ్లు ఉరిమి చూసిన రియాన్.. ఒక్క చూపుతోనే..
𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙈𝙖𝙣𝙞𝙖 𝙖𝙩 𝙀𝙙𝙚𝙣 𝙂𝙖𝙧𝙙𝙚𝙣𝙨 💪
Display of brute force from #KKR's very own Andre Russell 💥
Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @Russell12A pic.twitter.com/YfXiU3dF6h— IndianPremierLeague (@IPL) May 4, 2025