Varun Chakravarthy
-
పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్
బంగ్లాదేశ్‌పై గెలుపొంది చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ భారత జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.ఆ నలుగురు మళ్లీ బెంచ్ మీదేఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌తో ఆడిన తుదిజట్టునే పాక్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్‌కు మరోసారి మొండిచేయి చూపింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది..‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్ ఎలెవన్‌తోనే వారు గత మ్యాచ్ గెలిచారు. అయితే, ఒక్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్ చక్రవర్తిని పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీని ఎలా పక్కనపెట్టగలరు?అంతేగాక.. మరో పేసర్ హర్షిత్ రాణా కూడా గత మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్తో పోరులోనూ అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్ గావస్కర్ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సమయంలో ఫఖర్ జమాన్ గాయపడగా.. భారత్‌తో మ్యాచ్‌లో సౌద్ షకీల్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.2017లో చివరిసారిగాకాగా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్- పాకిస్తాన్ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ భారత జట్టును ఓడించిన టైటిల్ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్ చాంపియన్‌గా పాక్ బరిలోకి దిగింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌పై భారత్, అఫ్గనిస్తాన్‌పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్-ఎ నుంచి న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి సౌతాఫ్రికా టాప్‌లో ఉన్నాయి.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టురోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్సౌద్ షకీల్, బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహిన్ అఫ్రిది, నసీం షా, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే.. -
Champions Trophy 2025: పాకిస్తాన్ మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టండి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భారత్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రాణాను (Harshit Rana) పక్కన పెట్టాలని సలహా ఇచ్చాడు. రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) అవకాశం ఇవ్వాలని కోరాడు. బంగ్లాతో మ్యాచ్‌లో పేసర్లే అధికంగా వికెట్లు తీసినప్పటికీ.. స్పిన్నర్లు టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పేసర్ల కంటే స్పిన్నర్లే పొదుపుగా బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకే భారత్ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. షమీకి జతగా హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లతో పాటు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఆదిలో కష్టాల్లో ఎదుర్కొంది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను తౌహిద్ హృదయ్ (100) వీరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి జాకిర్ అలీ (68) సహకరించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ (228) చేయగలిగింది. ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లోనూ జూలు విదిల్చి ఐదు వికెట్లు తీశాడు. మరో పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. రోహిత్ తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా ఇబ్బంది పడింది. రోహిత్ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమై సెంచరీతో చివరి వరకు క్రీజ్‌లో ఉండి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి కేఎల్ రాహుల్ సహకరించాడు. ఇన్నింగ్స్ మధ్యలో భారత్ స్వల్ప వ్యవధిలో విరాట్ కోహ్లి(22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే గిల్, రాహుల్ జాగ్రత్తగా ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదించేందుకు భారత్ కాస్త ఇబ్బందిపడింది. బంగ్లా బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. మెహిది హసన్ మిరాజ్ భారత బ్యాటర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యం కాస్త పెద్దదై ఉంటే టీమిండియా ఇబ్బంది పడాల్సి వచ్చేది. -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
తుదిజట్టులో ఆ ఇద్దరు పక్కా.. మరీ అంతమంది ఎందుకు?: అశ్విన్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) విమర్శించాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)కి ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాడు. తుదిజట్టు కూర్పు విషయంలో ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డాడు.యశస్వి జైస్వాల్‌ను తప్పించికాగా ఈ ఐసీసీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మంగళవారం తమ పూర్తిస్థాయి జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాథమిక జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి.. అతడి స్థానంలో కొత్తగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని చేర్చింది. అదే విధంగా.. జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కాగా.. హర్షిత్ రాణాకు పిలుపునిచ్చింది.ఇదిలా ఉంటే.. ఇప్పటికే జట్టులో కుల్దీప్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల రూపంలో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. వరుణ్ రాకతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నాకు అర్థం కావడం లేదు‘‘దుబాయ్‌కు ఇంతమంది స్పిన్నర్లను తీసుకువెళ్లడంలో మర్మమేమిటో నాకు అర్థం కావడం లేదు. యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి స్పిన్నర్ల సంఖ్య ఐదుకు పెంచారు. ఈ పర్యటనలో ముగ్గురు లేదంటే నలుగురు స్పిన్నర్లు ఉంటారని ముందుగానే ఊహించాం.కానీ దుబాయ్‌కు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో వెళ్తున్నామా? ఒకరు.. లేదంటే ఇద్దరు అదనంగా ఉన్నారని అనిపించడం లేదా?.. అందులో ఇద్దరు లెఫ్టార్మ్ స్పిన్నర్లు(రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్). ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లే.పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు జడేజా, అక్షర్ తుదిజట్టులో ఉంటారు. కుల్దీప్ కూడా ఆడతాడు. ఇలాంటపుడు ఒకవేళ మీరు వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకోవాలనుకుంటే.. ఓ పేసర్‌ను పక్కనపెట్టాల్సి ఉంటుంది.అప్పుడు హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా ఉపయోగించుకోవాలి. లేదంటే.. స్పిన్నర్‌ను తప్పించి మూడో సీమర్‌ను తుదిజట్టులోకి తెచ్చుకోవాలి. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. మరి అప్పుడు వరుణ్‌కు ఎలా చోటిస్తారు?ఒకవేళ కుల్దీప్తో పాటు వరుణ్ కూడా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ దుబాయ్‌లో బంతి అంతగా టర్న్ అవుతుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఈ జట్టు ఎంపిక తీరు పట్ల సంతృప్తిగా లేను’’ అని అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు.3-0తో క్లీన్స్వీప్కాగా చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సొంతగడ్డపై బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత తుదిజట్టులో జడేజాతో పాటు అక్షర్ పటేల్ ఉండటం ఖాయం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వీలుగా వీరికి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ఇద్దరు స్పెషలిస్టు పేసర్లను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ లేదంటే వరుణ్ చక్రవర్తిలలో ఒక్కరికే స్థానం దక్కుతుంది. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడుతుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి. చదవండి: CT 2025: ఏ జట్టునైనా ఓడిస్తాం.. చాంపియన్స్ ట్రోఫీ మాదే: బంగ్లాదేశ్ కెప్టెన్ -
భారత అత్యుత్తమ తుదిజట్టుకు ఆఖరి కసరత్తు.. వారిద్దరికి ఛాన్స్!
ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి భారత్ తన తుది జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడుతోంది. జట్టులోని ఆటగాళ్ల ఫామ్ గురించి అంచనా వేయడానికి అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్(India vs England)తో బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్ టీమిండియాకు చివరి అవకాశం. భారత్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నందున.. ఈ మూడో వన్డేలో కొంతమంది ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయత్నించేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్(Pakistan)- దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే -2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించడానికి భారత్ కి ఇదే చివరి అవకాశం.పంత్‌కు అవకాశంకర్ణాటక వికెట్ కీపర్-బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ వికెట్ కీపర్‌గా రాణించాడు. కానీ ఈ మూడో వన్డే లో రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం కల్పించడం తప్పనిసరి గా కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ భారత జట్టులో ప్రధాన వికెట్ కీపర్ అని కెప్టెన్ రోహిత్ శర్మ ఇంతకూ ముందే ప్రకటించినప్పటికీ పంత్ దూకుడుగా ఆడే స్వభావం వల్ల మిడిల్ ఆర్డర్లో అతనికి అవకాశం కల్పించే అవకాశం లేకపోలేదు.పైగా జట్టులో రెండో వికెట్ కీపర్ గా అతని ఎంపిక తప్పనిసరిగా కనిపిస్తోంది. పంత్కి వన్డేల్లో మెరుగైన రికార్డు (27 ఇన్నింగ్స్‌లలో 871 పరుగులు) ఉంది. అంతేగాక తన అసాధారణ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని క్షణాల్లో మార్చగల సత్తా పంత్‌కు ఉంది. మరోవైపు, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వన్డేల్లో రాహుల్ వికెట్ కీపర్ గా రాణించినా తన బ్యాటింగ్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాగ్‌పూర్ లో కేవలం రెండు పరుగులు చేయగా కటక్ లో పది పరుగులు చేశాడు. అయితే, ఎడమ చేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ఇప్పటికే జట్టులో ఉండటంతో పంత్కి అది ప్రతికూలంగా మారవచ్చు.రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్భారత్ ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ గురించి ఇంకా స్పష్టత లేక పోవడంతో.. అర్ష్‌దీప్ సింగ్ కి అవకాశం కల్పించే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంకా తన పూర్తి స్థాయి ఫామ్ కనిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు వందేళ్లలో షమీ ప్రదర్శన అతని స్థాయికి తగ్గట్టుగా లేదు.ఫలితంగా తన పూర్తి ఓవర్ల కోటా బౌలింగ్ చేయలేక పోయాడు. ఈ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేకు పేస్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. హర్షిత్ ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు వన్డేల నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుధవారం ఇంగ్లండ్‌తో జరిగే మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ఆడే అవకాశం ఉంది.రేసులో వరుణ్ చక్రవర్తి ఇక కుల్దీప్ అవకాశం కల్పించిన ప్రతీ సారి తన వైవిధ్యమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. ఈ కారణంగా అతనికి ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. అయితే కుల్దీప్‌నకు వరుణ్ చక్రవర్తి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో వరుణ్ చక్రవర్తి తన అద్భుతమైన ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ భారత్ విజయానికి బాటలు వేస్తున్నాడు. ఈ కారణంగా భారత్ కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో పాటు ఆల్ రౌండర్లయిన అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లను కూడా జట్టులో తీసుకోనే అవకాశం ఉంది. చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
వరుణ్ చక్రవర్తికి భంగపాటు
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)కి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు తొలిసారిగా నామినేట్ అయిన అతడికి భంగపాటు తప్పలేదు. వరుణ్ మాదిరే ఇటీవల అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్(Jomel Warrican) అవార్డును ఎగురేసుకుపోయాడు.ఇదొక చిన్న మైలురాయివరుణ్ చక్రవర్తి, పాకిస్తాన్ స్పిన్నర్ నొమన్ అలీ(Noman Ali)లను వెనక్కినెట్టి జనవరి నెలకు గానూ వారికన్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ఏడాది టెస్టుల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే, ఇంత గొప్పగా దానిని సాధిస్తానని అనుకోలేదు.నా క్రికెట్ ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌తో సిరీస్‌లో తప్పక రాణిస్తానని మా కెప్టెన్‌కు మాటిచ్చాను. మా నాన్న కళ్లెదుటే నా నుంచి ఇలాంటి గొప్ప ప్రదర్శన రావడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని వారికన్ హర్షం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్లోకాగా ఇటీల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ గడ్డపై రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా పందొమ్మిది వికెట్లు తీశాడు. ముల్తాన్ వేదికగా తొలి టెస్టు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చాడు.అయితే, ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా పాకిస్తాన్ చేతిలో 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ముల్తాన్‌లోనే జరిగిన రెండో టెస్టులో వారికన్ వరుసగా నాలుగు, ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ పాకిస్తాన్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో 2ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డునూ వారికన్ సొంతం చేసుకున్నాడు.వరుణ్ మాయాజాలంమరోవైపు.. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 14 వికెట్లు కూల్చిన అతడి ఖాతాలో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వరుణ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వారికన్తో పోటీలో వెనుకబడి విజేతగా నిలవలేకపోయాడు. విజేతగా బెత్ మూనీఇక మహిళా క్రికెటర్ల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ జనవరి నెలకు గానూ ‘’ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా తన టెస్టు కెరీర్లో తొలి శతకం బాదిన ఆమె.. అంతకు ముందు టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మూనీ ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.వెస్టిండీస్ స్పిన్నర్ కరిష్మా రామ్హరాక్, అండర్-19 ప్రపంచకప్-2025లో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ తెలుగమ్మాయి గొంగడి త్రిషలను వెనక్కి నెట్టి మూనీ అవార్డును సొంతం చేసుకుంది. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు ఇచ్చే క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా నామినేట్ అయిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించి.. అవార్డును ప్రదానం చేస్తారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
టీమిండియాకు భరోసానిచ్చిన బౌలర్లు.. అతడికీ త్వరలోనే అవకాశం!
ఇంగ్లండ్‌తో నాగపూర్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ తరుఫున మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని రంగంలోకి దించుతారని అందరూ భావించారు. అయితే, గురువారం నాటి ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో ఆడినప్పటికీ వరుణ్‌కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు. ఇందుకు బదులుగా ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా(Ravindra Jadeja), మరో ఎడం చేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav)లతో భారత్ బరిలోకి దిగింది. ఈ ఫార్ములా టీమిండియాకు బాగానే పనిచేసింది.తడబడినా రాణించిన రానాఇక పేస్ బౌలర్లలో గాయం నుంచి కోలుకున్న మహమ్మద్ షమీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాలతో పాటు 23 ఏళ్ళ హర్షిత్ రాణాకి స్థానం ఇచ్చారు. అతడికి ఇదే తొలి వన్డే. ఢిల్లీకి చెందిన హర్షిత్ రాణా గత సీజన్ లో ఐపీఎల్ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడిన రానా 13 మ్యాచ్ లలో 20.15 సగటుతో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితా లో నాలుగో బౌలర్ గా నిలిచాడు.ఇక డెత్ ఓవర్లలో 9.85 పరుగుల సగటు తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రాణా.. అరంగేట్రంలోనే మూడు వికెట్లు పడగొట్టి వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే నాగపూర్ లో తన తొలి స్పెల్ లోని మూడో ఓవర్లో రాణా ఏకంగా 26 పరుగులు ఇచ్చి ఓ చెత్త రికార్డుని తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ మూడు సిక్సలు, రెండు బౌండరీలతో ఏకంగా 26 పరుగులు సాధించాడు.అయితే అతడి స్థానంలో తర్వాత బౌలింగ్ కి వచ్చిన హార్దిక్ పాండ్యా నిలకడగా బౌలింగ్ చేయడమే కాక , అదే ఓవర్లో సాల్ట్ రనౌట్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కి బ్రేకులు పడ్డాయి. మళ్ళీ రెండో స్పెల్ కి వచ్చిన రాణా ఎంతో మెరుగ్గా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ మరో ఓపెనర్ బెన్ డకేట్ వికెట్ తీయడమే కాక మొత్తం మీద ఏడు ఓవర్లలో 53 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.షమీ రాకతో కొంత ఊరట ఇక గాయం నుంచి కొలుకొని మళ్ళీ జట్టులోకి వచ్చిన ౩౩ ఏళ్ళ షమీ పొదుపుగా బౌలింగ్ చేసి 38 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి నుంచి కోలుకోవడం పై స్పష్టమైన సమాచారం లేక పోవడం తో షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యల బౌలింగ్ భారత్ జట్టు మేనేజిమెంట్ కి కొద్దిగా ఊరట కలిగించవచ్చు. అయితే బుమ్రా లేని లోటు పూరించడం కష్టమే అయినా ఈ ముగ్గురు రాణించడం పేస్ బౌలింగ్ భారం కొద్దిగా తగ్గినట్టు భావించవచ్చు.వరుణ్‌కు త్వరలో అవకాశం అయితే ఈ మ్యాచ్ కి ముందు అందరూ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తప్పక ఆడతాడని భావించారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్ లో వరుణ్ రాణించడమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ జట్టులో వరుణ్ కి స్థానం కల్పించడానికి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ లో ఆడించడం చాల ముఖ్యం. ఈ నేపథ్యంలో నాగపూర్ లో 33 ఏళ్ల వరుణ్ ఆడటం ఖాయమని భావించారు. అయితే మ్యాచ్ కి ముందు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే ఈ టోర్నమెంట్ లో ఏదో ఒక దశ లో వరుణ్ ఆడే అవకాశం ఉందని వివరించాడు.అయితే అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడడం పై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన పై అది ఆధారపడి ఉంటుందని రోహిత్ వివరించాడు. "వరుణ్ బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ఇది రుజువైంది. అయితే అతని ఆడింది టి20 ఫార్మాట్ అయినందున వన్డేల్లో అతని ప్రదర్శనపై ఇంకా అంచనా వేయాల్సి ఉందని రోహిత్ వ్యాఖ్యానించాడు."ఈ సిరీస్‌లో వరుణ్ తో ఏదో ఒక దశలో ఆడించడానికి ప్రయత్నిస్తాం. అతని సామర్థ్యం ఏమిటో చూడటానికి ఇది మాకు అవకాశాన్ని కలిపిస్తుంది. ప్రస్తుతం మేము అతన్ని తీసుకోవాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడం లేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపికలో వరుణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే, అతని ప్రదర్శన కూడా మేము ఆశించిన స్థాయిలో ఉంటే వరుణ్ కి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో అవకాశం కల్పించే అవకాశం పై తప్పక పరిశీలిస్తాం’’ అని రోహిత్ వివరించాడు. -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో వరుణ్ చక్రవర్తి
జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఫిబ్రవరి 6) ప్రకటించింది. పురుషుల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నోమన్ అలీ, విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్, టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ, విండీస్ స్పిన్నర్ కరిష్మ రామ్హరాక్, భారత యువ సంచలనం గొంగడి త్రిష జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.నోమాన్ అలీ: ఈ పాకిస్తానీ వెటరన్ స్పిన్నర్ జనవరి నెలలో టెస్ట్‌ల్లో అత్యుత్తమంగా రాణించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నోమాన్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 10 వికెట్ల ఘనతతో పాటు హ్యాట్రిక్ ప్రదర్శన ఉంది. నోమాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండోసారి. నోమాన్.. గతేడాది అక్టోబర్‌లో ఈ అవార్డు గెలుచుకున్నాడు.వరుణ్ చక్రవర్తి: ఈ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాక చెలరేగిపోతున్నాడు. జనవరి నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెలలో జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనల తర్వాత వరుణ్ టీ20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబకాడు.జోమెల్ వార్రికన్: 32 ఏళ్ల ఈ కరీబియన్ స్పిన్నర్ జనవరి నెలలో పాక్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో అతను 19 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా నిలిచాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వార్రికన్ బ్యాటింగ్‌లోనూ పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో విండీస్ పాక్ గడ్డపై 34 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.బెత్ మూనీ: ఈ ఆసీస్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇంగ్లండ్‌తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్ సిరీస్‌లో సత్తా చాటింది. ఈ సిరీస్‌లోని టీ20 మ్యాచ్‌ల్లో మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టీ20 సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లో మూనీ 75, 44, 94 నాటౌట్ స్కోర్ల సాయంతో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆసీస్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రదర్శనల అనంతరం మూనీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్తానానికి ఎగబాకింది.కరిష్మ రామ్హరాక్: ఈ విండీస్ స్పిన్ బౌలర్ బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సత్తా చాటడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కరిష్మ రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది. కరిష్మ సత్తా చాటడంతో ఈ సిరీస్‌లో విండీస్ బంగ్లాదేశ్‌పై 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో కరిష్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంది.గొంగడి త్రిష: ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్ 19 టీ20 వరల్డ్‌కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ టోర్నీలో త్రిష (జనవరిలో) 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. -
CT 2025: వరుణ్ చక్రవర్తి రేసులో ఉన్నాడు: రోహిత్ శర్మ
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇప్పట్లో మైదానంలో దిగే పరిస్థితి కనిపించడం లేదు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నాటికి కూడా అతడు అందుబాటులోకి వస్తాడా? లేదా అన్న విషయంపై కూడా సందిగ్దం నెలకొంది. కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంతా తానై పేస్ దళ బాధ్యతలు మోసిన బుమ్రా.. ఆఖరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా వెన్నునొప్పి(Back Spasm)తో బాధపడ్డాడు. మ్యాచ్ మధ్యలోనే ఆస్పత్రికి వెళ్లిన బుమ్రా.. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ జట్టుతో చేరాడు. కానీ.. బౌలింగ్ మాత్రం చేయలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు అతడు దూరమయ్యాడు. అయితే, చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి ఫిట్నెస్ ఆధారంగా చోటు కల్పించింది.స్పందించిన రోహిత్ శర్మకానీ ఇప్పటికీ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకోలేదని వార్తలు వస్తుండగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయంపై స్పందించాడు. ఇంగ్లండ్‌తో గురువారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బుమ్రా స్కానింగ్ రిపోర్టుల కోసం మేము ఎదురుచూస్తున్నాం.మరికొన్ని రోజుల్లో వైద్య బృందం వద్దకు నివేదిక వస్తుంది. ఆ తర్వాతే బుమ్రా ఫిట్‌గా ఉన్నాడా? లేదా అన్న అంశంపై స్పష్టత వస్తుంది. ఒకవేళ అతడు ఫిట్నెస్ సాధిస్తే ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు అందుబాటులోకి వస్తాడు’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.వరుణ్ పోటీలో ఉంటాడుఅదే విధంగా.. తొలిసారిగా వన్డే జట్టుకు ఎంపికైన వరుణ్ చక్రవర్తి గురించి కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.‘‘టీ20 సిరీస్‌లో అతడు తన బౌలింగ్‌లో వైవిధ్యాన్ని చూపించాడు. పొట్టి ఫార్మాట్‌కు వన్డేలకు తేడా ఉంటుందని తెలుసు. అయితే, తాను ఏం చేయగలనో వరుణ్ నిరూపించాడు. అందుకే అతడిని కూడా మా ఆప్షన్లలో చేర్చుకున్నాం.ఈ సిరీస్ ద్వారా అతడి బౌలింగ్ సామర్థ్యాలు, నైపుణ్యాలను క్షుణ్ణంగా గమనించే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాం. అతడిని తుదిజట్టులోకి తీసుకుంటామా? లేదా అన్నది ఇప్పుడే చెప్పలేను. అయితే, కచ్చితంగా అతడు మాత్రం పోటీలో ఉంటాడు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌లలో కలిపి పద్నాలుగు వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో వన్డే జట్టులోనూ అతడిని చేర్చారు. ఇదిలా ఉంటే.. 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 18 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తంగా 33 వికెట్లు తీశాడు. ఇక.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు సమయం ఉంది. కాబట్టి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత వరుణ్ ఈ మెగా టోర్నీకి ఎంపికవుతాడా? లేదా అన్న విషయం తేలుతుంది. ప్రస్తుతానికి అతడు ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్ల లిస్టులో ఉన్నాడు. చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ -
వరుణ్ చక్రవర్తికి వన్ డేల్లో ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ
-
వన్డే జట్టులోకి వచ్చేశాడు.. కానీ ఆ విషయంలో కష్టమే!
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. అరంగేట్రం ఖాయమేఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను. పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది. -
వరుణ్ చక్రవర్తికి బంపరాఫర్..?
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) బంపరాఫర్ తగిలినట్లు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) కోసం ఎంపిక చేసిన భారత జట్టులో (Team India) వరుణ్‌కు చోటు కల్పించనున్నారని సమాచారం. మెగా టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన జట్టులో వరుణ్‌కు చోటు దక్కలేదు. అయితే ఇటీవల ఇంగ్లండ్ ముగిసిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో వరుణ్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ బెర్త్ ఖరారైందని తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ముగిసినా వరుణ్ భారత వన్డే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.వరుణ్ ప్రస్తుతం భారత వన్డే జట్టుతో కలిసి నాగ్‌పూర్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డే సిరీస్ కోసం ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.Varun Chakaravarthy training with Indian ODI Team in Nagpur 🚨- He's not officially part of the squad yet.📸: Sandipan Banerjee#INDvENG #ChampionsTrophy #Nagpur pic.twitter.com/vqfyQJtdLe— OneCricket (@OneCricketApp) February 4, 2025కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్లలో మార్పులు చేర్పుల కోసం ఇంకా అవకాశం ఉంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో చెలరేగిన నేపథ్యంలో వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల రిటైరైన భారత లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలని సిఫార్సు చేశాడు. ఒకవేళ వరుణ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌కు యాడ్ చేస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే, ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్‌లో వరుణ్ 14 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో వరుణ్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో వరుణ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు తెగ ఇబ్బంది పడిపోయారు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికా పర్యటనలోనూ (టీ20 సిరీస్‌లో) ఇరగదీశాడు. ఆ సిరీస్‌లో వరుణ్ 4 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా బ్యాటర్లపై వరుణ్ పూర్తి ఆధిపత్యం చలాయించిన నేపథ్యంలో అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేయాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా భాగమన్న విషయం తెలిసిందే.వన్డేల్లో ఇదే జోరు కొనసాగించగలడా..?ప్రస్తుత పరిస్థితుల్లో వరుణ్ విషయంలో ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతుంది. టీ20 ఫార్మాట్లో చెలరేగిపోతున్న వరుణ్ వన్డేల్లో రాణించగలడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. 33 ఏళ్ల వరుణ్ ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేయలేదు. వరుణ్ కేవలం టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వరుణ్ వైవిధ్యమైన స్పిన్ బౌలింగ్ వన్డేలకు సూట్ అవుతుందో లేదో వేచి చూడాలి. వరుణ్ భారత్ తరఫున 18 టీ20ల్లో 2 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 33 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ ఒక్క సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌ల్లోనే 9 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు తీశాడు. వరుణ్‌కు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. వరుణ్ గతేడాది కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. -
CT 2025: అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్
టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England) ఆసాంతం అదరగొట్టాడు ఈ కర్ణాటక బౌలర్. ఐదు టీ20లలో కలిపి పద్నాలుగు వికెట్లతో మెరిసిన ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్.. భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.అంతేకాదు.. ఒక ద్వైపాక్షకి సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్‌గానూ వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న వరుణ్ చక్రవర్తికి వరుస అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అతడిని జట్టులోకి తీసుకోండిఈ క్రమంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) టీమిండియా నాయకత్వ బృందానికి కీలక సూచనలు చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో వరుణ్ చక్రవర్తిని చేరిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. అయితే, అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అతడిని ఆడించాలని సూచించాడు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫ్రీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పదిహేను మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అతడు చాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తారనే భావిస్తున్నా.సమయం మించిపోలేదుఎందుకంటే.. ఈ టోర్నీలో ఆడుతున్న అన్ని దేశాలు తమ ప్రాథమిక జట్లను మాత్రమే ప్రకటించాయి. కాబట్టి వరుణ్‌కు ఈసారి ఛాన్స్ ఇస్తారేమో అనిపిస్తోంది. అయితే, నేరుగా ఐసీసీ టోర్నీ జట్టుకు ఎంపిక చేయడం అంత సులువేమీ కాదు.అదీగాక అతడు ఇంకా వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు. అందుకే తొలుత ఇంగ్లండ్‌తో వన్డేల్లో వరుణ్ని ఆడించి.. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపిక చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అతడికి తప్పక అవకాశం ఇస్తారని అశ్విన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జట్టులో నలుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది. ఇక వరుణ్ చక్రవర్తిని కూడా జట్టులోకి తీసుకుంటే ఐదో స్పెషలిస్టు స్పిన్నర్ అవుతాడు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి -
వాళ్లిద్దరు అద్భుతం.. రిస్క్ అని తెలిసినా ఒక్కోసారి తప్పదు: సూర్య
ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం(India Beat England)పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) స్పందించాడు. సమిష్టి కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైనందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారని.. అందుకు తగ్గ ఫలితాలను మైదానంలో చూస్తున్నామంటూ సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు.4-1తో కైవసంఇక ఎక్కువసార్లు తాము రిస్క్ తీసుకునేందుకే మొగ్గుచూపుతామన్న సూర్య.. అంతిమంగా జట్టు ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా అదరగొట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో విజయంతో సిరీస్‌ను ఆరంభించిన సూర్యసేన.. చెన్నైలోనూ అదే ఫలితం పునరావృతం చేసింది.అనంతరం రాజ్‌కోట్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి పాఠాలు నేర్చుకున్న భారత జట్టు.. పుణెలో విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరిదైన నామమాత్రపు ఐదో టీ20లోనూ అద్భుత ఆట తీరు కనబరిచింది. వాంఖడే వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది.అభిషేక్ శర్మ ఊచకోతఓపెనర్ సంజూ శాంసన్(16) మరోసారి వైఫల్యాన్ని కొనసాగించగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) మాత్రం పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లతో పాటు ఏకంగా ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఇక మిగతా వాళ్లలో తిలక వర్మ(24), శివం దూబే(13 బంతుల్లో 30) మాత్రమే రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన బట్లర్ బృందానికి టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆదిలోనే షాకిచ్చాడు. బెన్ డకెట్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు తమ మాయాజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు.97 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఓపెనర్ ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 55) ఒక్కడు కాసేపు పోరాడగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఏమాత్రం సహకారం అందలేదు. ఫలితంగా 10.3 ఓవర్లలో కేవలం 97 పరుగులే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో 150 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే రెండు, స్పిన్నర్లు వరుణ్ చక్రర్తి రెండు, అభిషేక్ శర్మ రెండు, రవి బిష్ణోయి ఒక వికెట్ తీశారు. అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రిస్క్ అని తెలిసినాఈ నేపథ్యంలో విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ‘‘జట్టులోని ఏ సభ్యుడైతే ఈరోజు రాణించగలడని భావిస్తానో.. అతడిపై ఎక్కువగా నమ్మకం ఉంచుతాను. నెట్స్‌లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడుతున్నారు. నాకు ఎప్పుడైతే వారి అవసరం ఉంటుందో అప్పుడు కచ్చితంగా రాణిస్తున్నారు.మ్యాచ్‌కు ముందు రచించిన ప్రణాళికలకు అనుగుణంగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒక్కోసారి రిస్క్ అని తెలిసినా వెనకడుగు వేయడం లేదు. అంతిమంగా మా అందరికీ జట్టు ప్రయోజనాలే ముఖ్యం.వాళ్లిద్దరు అద్భుతంఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఈరోజు అద్భుతంగా సాగింది. టాపార్డర్‌లో ఓ బ్యాటర్ ఇలా చెలరేగిపోతుంటే చూడటం ముచ్చటగా అనిపించింది. ఈ ఇన్నింగ్స్ చూసి అతడి కుటుంబం కూడా మాలాగే సంతోషంలో మునిగితేలుతూ ఉంటుంది.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రాక్టీస్ సెషన్లను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అందుకు ఫలితమే ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన. అతడి వల్ల జట్టుకు అదనపు శక్తి లభిస్తోంది. అతడొక అద్భుతం’’ అని సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా ఈ సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి పద్నాలుగు వికెట్లు తీశాడు.చదవండి: ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ చూడలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు: గంభీర్An impressive way to wrap up the series 🤩#TeamIndia win the 5th and final T20I by 150 runs and win the series by 4-1 👌Scoreboard ▶️ https://t.co/B13UlBNLvn#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/aHyOY0REbX— BCCI (@BCCI) February 2, 2025 -
అభిషేక్ శర్మ విధ్వంసకర శతకం.. ఐదో టీ20లో టీమిండియా ఘన విజయం
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్లు చెలరేగడంతో 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాట్‌తో విజృంభించిన అభిషేక్.. ఆతర్వాత బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టినందుకు గానూ అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి 14 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టిన అభిషేక్ఈ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ సాధించిన అభిషేక్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ (17), రెండో వేగవంతమైన సెంచరీని (37) నమోదు చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతుల్లో) పేరిట ఉండగా.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. 17 మ్యాచ్‌ల టీ20 కెరీర్లో అభిషేక్‌కు ఇది రెండో సెంచరీ.ఈ మ్యాచ్‌లో అభిషేక్ సాధించిన మరిన్ని రికార్డులు..- టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక స్కోర్ (135).- టీ20లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు (13).- అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేల్లో అత్యధిక స్కోర్ (95/1) నమోదు చేసింది.టీ20ల్లో నాలుగో అత్యధిక స్కోర్ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన స్కోర్ (247/9) టీ20ల్లో నాలుగో అత్యధికం. ఈ మ్యాచ్‌లో భారత్ మరింత భారీ స్కోర్ సాధించాల్సింది. అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక భారత్ స్కోర్ బాగా నెమ్మదించింది. వరుస క్రమంలో వికెట్లు పడిపోయాయి. ఆరంభంలో సంజూ శాంసన్ (7 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు).. మధ్యలో తిలక్ వర్మ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (3 బంతుల్లో 2), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 9; సిక్స్), రింకూ సింగ్ 6 బంతుల్లో 9; ఫోర్), అక్షర్ పటేల్ (11 బంతుల్లో 15; 2 ఫోర్లు), బిష్ణోయ్ (0) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 3, మార్క్ వుడ్ 2, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆది నుంచే తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు ఫిల్ సాల్ట్ (23 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరిని కుదురుకోనివ్వలేదు. షమీ (2.3-0-25-3), వరుణ్ చక్రవరి (2-0-25-2), శివమ్ దూబే (2-0-11-2), అభిషేక్ శర్మ (1-0-3-2), రవి బిష్ణోయ్ (1-0-9-1) తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కేవలం సాల్ట్, జేకబ్ బేతెల్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. టీ20ల్లో పరుగుల పరంగా (150) ఇంగ్లండ్‌కు ఇది భారీ పరాజయం.చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తిఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. -
IND VS ENG 5th T20: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా (Team India) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన వరుణ్.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో (Bilateral Series) అత్యధిక వికెట్లు (14) తీసిన స్పిన్ బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు విండీస్ పేసర్ జేసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోల్డర్ 15 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ కూడా సాధించాడు.ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ బౌలర్ రికార్డు వరుణ్‌కు ముందు ఐష్ సోధి (న్యూజిలాండ్) పేరిట ఉండింది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో సోధి 13 వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ఘనత ఉంది.ఐదో టీ20 విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో (54 బంతుల్లో 135; 7 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. భారత బౌలర్లు తలో చేయి వేసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. బ్యాటింగ్‌లో చెలరేగిన అభిషేక్ బౌలింగ్లోన సత్తా చాటి 2 వికెట్లు తీశాడు. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.ప్రస్తుత సిరీస్‌లో వరుణ్ ప్రదర్శనలు..తొలి టీ20-3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)రెండో టీ20-2/38మూడో టీ20-5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)నాలుగో టీ20-2/28ఐదో టీ20-2/25 -
ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాకింగ్స్ లో టాప్-5కి వరుణ్ చక్రవర్తి
-
దుమ్మురేపిన వరుణ్ చక్రవర్తి.. రెండో స్థానానికి ఎగబాకిన తిలక్ వర్మ
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా (Team India) ఆటగాళ్లు సత్తా చాటారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఏకంగా 25 స్థానాలు మెరుగుపర్చుకుని తొలిసారి టాప్-5లోకి చేరాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసిన వరుణ్ 679 రేటింగ్ పాయింట్లు తన ఖాతాలో వేసుకుని ఐదో స్థానంలో నిలిచాడు.అగ్రస్థానంలో ఆదిల్ రషీద్భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. రషీద్ విండీస్ స్పిన్నర్ అకీల్ హొసేన్‌ను రెండో స్థానానికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఆదిల్ రషీద్ ఖాతాలో 718 రేటింగ్ పాయింట్లు ఉండగా.. అకీల్ హొసేన్ ఖాతాలో 707 పాయింట్లు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న వరుణ్ చక్రవర్తికి టాప్ ప్లేస్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌కు మధ్య కేవలం 39 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.టాప్-10లోకి ఆర్చర్భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా గణనీయంగా తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. ఆర్చర్ 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరాడు. మరోవైపు భారత బౌలర్ అక్షర్ పటేల్ కూడా 5 స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరాడు. భారత్ నుంచి టాప్-10లో వరుణ్ చక్రవర్తి (5), అర్షదీప్ సింగ్ (9), రవి భిష్ణోయ్ (10) ఉన్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆశించినంతగా రాణించలేకపోయిన భిష్ణోయ్ 5 స్ణానాలు కోల్పోయి ఐదో స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయాడు.రెండో స్థానానికి ఎగబాకిన తిలక్ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ (Tilak Varma).. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. తిలక్.. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్‌ను కిందకు దించి రెండో స్థానానికి చేరాడు. ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి తిలక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ (4), యశస్వి జైస్వాల్ (9) టాప్-10లో ఉన్నారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో చెలరేగిన అభిషేక్ శర్మ.. ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ 59 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ స్థానానికి చేరాడు. మరో భారత ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా మూడు వైఫల్యాల కారణంగా 12 స్థానాలు కోల్పోయి 29వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. -
ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా.. వరుణ్ చక్రవర్తి ‘చెత్త రికార్డు’
గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా కలిసిరావాలంటారు. టీమిండియా ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) ప్రస్తుత పరిస్థితికి ఈ నానుడి చక్కగా సరిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చాడు 33 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలర్. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో ఐదు వికెట్లు తీసిన వరుణ్.. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలోనూ రాణించాడు.కెరీర్లోనే అత్యుత్తమంగాస్వభావసిద్ధంగా ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించే సౌతాఫ్రికా పిచ్‌లపై కూడా వరుణ్ చక్రవర్తి తన మార్కు చూపించగలిగాడు. ప్రొటిస్ జట్టుతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 12 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్(ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం) కూడా ఉండటం విశేషం.ఇక తాజాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్(India vs England T20 Series)లోనూ వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు వికెట్లు తీయగలిగాడు.అయితే, రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన మూడో టీ20లో మాత్రం వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగాడు. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులే ఇచ్చి మెరుగైన ఎకానమీ(6.00) నమోదు చేశాడు. ఇంగ్లండ్ కీలక బ్యాటర్, కెప్టెన్ జోస్ బట్లర్(24)తో పాటు జేమీ స్మిత్(6), జేమీ ఓవర్టన్(0), బ్రైడన్ కార్సే(3), జోఫ్రా ఆర్చర్(0)ల వికెట్లు తీశాడు.కానీ.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఇంగ్లండ్ చేతిలో 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.దురదృష్టం వెంటాడిందిసౌతాఫ్రికాతో 2024 నాటి రెండో టీ20 సందర్భంగా వరుణ్ చక్రవర్తి తొలిసారి అంతర్జాతీయ టీ20లలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. తాజాగా ఇంగ్లండ్‌తో మూడో టీ20లో రెండో అత్యుత్తమ గణాంకాలు(5/24) సాధించాడు.కానీ దురదృష్టవశాత్తూ ఈ రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో ఇలా ఓ బౌలర్ ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేసిన రెండు సందర్భాల్లోనూ అతడి జట్టు ఓడిపోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే తొలిసారి.చెత్త ‘వరల్డ్’ రికార్డుతద్వారా.. వరుణ్ చక్రవర్తి పేరిట ఇలా ఓ చెత్త వరల్డ్ రికార్డు నమోదైంది. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అద్భుత ప్రదర్శనకు గానూ వరుణ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మెరుగ్గా ఆడేందుకుఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. ప్రస్తుతం తన ప్రదర్శన పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు తెలిపాడు. అయితే, మున్ముందు ఇంతకంటే మెరుగ్గా ఆడేందుకు కష్టపడుతున్నట్లు తెలిపాడు.బ్యాటర్ల కారణంగానేకాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. చెన్నైలో రెండు వికెట్ల తేడాతో గట్టెక్కగలిగింది. అయితే, మూడో టీ20లో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. రాజ్‌కోట్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన టీమిండియా.. ఇంగ్లండ్‌ను 171 పరుగులకు కట్టడి చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో 145 పరుగులకే పరిమితమై ఓటమిని ఆహ్వానించింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం పుణెలో నాలుగో టీ20 జరుగుతుంది.చదవండి: భారత్ బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. అతడిని లోయర్ ఆర్డర్లో ఆడిస్తారా??: కెవిన్ పీటర్సన్ -
అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. మా ఓటమికి కారణం అదే: సూర్య
ఇంగ్లండ్‌పై హ్యాట్రిక్ విజయంతో సిరీస్ గెలవాలని భావించిన టీమిండియాకు చుక్కెదురైంది. రాజ్‌కోట్ టీ20లో సూర్యకుమార్ సేన ప్రత్యర్థి చేతిలో 26 పరుగుల తేడా(England Beat India)తో ఓటమిపాలైంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కు తగ్గింది.బెన్ డకెట్ మెరుపు హాఫ్ సెంచరీనిరంజన్ షా స్టేడియంలో మంగళవారం రాత్రి ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. ఆదిలోనే హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(5) వికెట్ తీసి శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ బెన్ డకెట్(Ben Ducket) ఆ ఆనందాన్ని ఎక్కువ సేపు నిలవనీయలేదు.మెరుపు అర్ధ శతకం బాది మెరుగైన స్కోరుకు బాటలు వేశాడు. డకెట్.. 28 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 51 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్ జోస్ బట్లర్(24) కూడా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నించగా వరుణ్ చక్రవర్తి అతడిని బోల్తా కొట్టించాడు.లివింగ్‌స్టోన్ ధనాధన్మిగతా వాళ్లలో లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone- 24 బంతుల్లో 43 రన్స్) దంచికొట్టగా.. ఆదిల్ రషీద్(10), మార్క్ వుడ్(10) డబుల్ డిజిట్ స్కోర్లతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో చెలరేగగా.. హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయి, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.టీమిండియా తడ‘బ్యాటు’ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే టీమిండియా తడ‘బ్యాటు’కు గురైంది. ఓపెనర్లలో సంజూ శాంసన్(3) మరోసారి నిరాశపరచగా.. అభిషేక్ శర్మ(14 బంతుల్లో 24) కాసేపు మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14) మరోసారి విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్(6), ధ్రువ్ జురెల్(2) చేతులెత్తేశారు.ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40) మరో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(15)తో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఇక టెయిలెండర్లలో మహ్మద్ షమీ 7 పరుగులు చేయగా.. రవి బిష్ణోయి 4, వరుణ్ చక్రవర్తి ఒక్క పరుగుతో అజేయంగా ఉన్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో 26 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓటమి ఎదురైందని విచారం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్ సాగేకొద్దీ మంచు ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుందని భావించాను. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మా చేతుల్లో ఉందనుకున్నా.అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్కానీ ఆదిల్ రషీద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అందుకే అతడిని వరల్డ్‌క్లాస్ బౌలర్ అంటారు. మాకు స్ట్రైక్ రొటేట్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. స్పిన్నర్లు అవసరం ఎంతగా ఉంటుందో మాకు తెలుసు. అందుకే మా జట్టులో వారే ఎక్కువగా ఉన్నారు.ప్రతి టీ20 మ్యాచ్ నుంచి మేము సరికొత్త పాఠాలు నేర్చుకుంటాం. ముఖ్యంగా ఈసారి బ్యాటింగ్ పరంగా మా పొరపాట్లు ఏమిటో గుర్తించగలిగాం. ఇక షమీ విషయానికొస్తే.. అతడు కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు సాధిస్తున్న ఫలితాలే.. అతడి క్రమశిక్షణ, కఠిన శ్రమకు నిదర్శనం. మైదానం లోపలా.. వెలుపలా ఆట పట్ల అతడి అంకితభావం ఒకేలా ఉంటుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెటరన్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కీలకమైన ఇన్ఫామ్ బ్యాటర్ తిలక్ వర్మ(18) వికెట్ తీసి.. టీమిండియా ఓటమిని శాసించాడు. మిగతా వాళ్లలో జేమీ ఓవర్టన్ మూడు, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మార్క్‌వుడ్ ఒక వికెట్ తీశాడు. ఇక తన అద్భుత ప్రదర్శన(5/24)కు గానూ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా -
#INDvsENG : మూడో టి20లో టీమిండియా ఓటమి (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో వరుణ్ ఐదు వికెట్లతో మెరిశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లకు వరుణ్ బంతితో చుక్కలు చూపించాడు. అతడిని ఎదుర్కొవడం ఇంగ్లండ్ బ్యాటర్ల తరం కాలేదు.అద్బుతమైన గూగ్లీలతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అతడి దెబ్బకు వరుస క్రమంలో ఇంగ్లండ్ వికెట్లు కోల్పోయింది. ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్‌కు ఇది తన టీ20 కెరీర్లో రెండో ఫైవ్ వికెట్ హాల్ కావడం గమనార్హం. తద్వారా వరుణ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వరుణ్ సాధించిన రికార్డులు ఇవే..👉వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ ఈ సిరీస్ కంటే ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లోనూ ఐదు వికెట్లతో మెరిశాడు. ఇప్పుడు రాజ్‌కోట్ టీ20లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్లు సాధించాడు. దీంతో ఈ అరుదైన ఫీట్‌ను చక్రవర్తి తన ఖాతాలో వేసుకున్నాడు.👉అదే విధంగా వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో 12 వికెట్లు పడగొట్టిన వరుణ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లో తొలి మూడు టీ20లలోనే 10 వికెట్లు పడగొట్టాడు.👉అంతర్జాతీయ టీ20ల్లో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన మూడో భారత బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ రెండు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. తన 4 ఓవర్ల కోటాలో 24 పరుగులిచ్చి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితోపాటు హార్దిక్ పాండ్యా రెండు, రవి బిష్ణోయ్ వికెట్ సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివింగ్ స్టోన్(43), జోస్ బట్లర్(24) పరుగులతో రాణించారు. Double-wicket over 👌Completion of fifer for Varun Chakaravarthy 👌Updates ▶️ https://t.co/amaTrbtzzJ#TeamIndia | #INDvENG | @chakaravarthy29 | @IDFCFIRSTBank pic.twitter.com/ne0Ze0lppj— BCCI (@BCCI) January 28, 2025 -
వరుణ్ 'అందమైన మిస్టరీ స్పిన్నర్'.. వన్డేల్లో కూడా ఆడించాలి!
ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో భారత్ అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులందరూ అతని వారసుడు ఎవరు అని సందిగ్ధంలో పడ్డారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో ప్రత్యర్థి జట్టులోని అగ్రశ్రేణి బ్యాటర్లని బోల్తా కొట్టించిన తీరు చూస్తే అశ్విన్ కి తగ్గ వారసుడు దొరికాడని అతనిని అభినందించకుండా ఉండలేరు.చెపాక్‌లో జరిగిన రెండో టీ20లో వరుణ్ సత్తాచాటాడు. వరుణ్ చక్రవర్తి దేశవాళీ పోటీలలో తమిళ నాడు కి ప్రాతినిధ్యం వహిస్తాడు. వరుణ్ కి అశ్విన్ అభిమాన స్పిన్ బౌలర్ కావడమే కాక అతని నుంచే స్పిన్ బౌలింగ్ మెళకువలు నేర్చుకోవడం విశేషం.కర్ణాటక నుంచి చెన్నై కి..వరుణ్ పుట్టింది కర్ణాటకలోని బీదర్‌లో అయినప్పటికీ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. చెన్నై లోని సెయింట్ పాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచలర్ డిగ్రీ పొందాడు.25 సంవత్సరాల వయసులో క్రికెట్‌ను కెరీర్ గా ఎంచుకొని ఆర్కిటెక్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసాడు. కొద్దిగా ఆలస్యంగా క్రికెట్ లోకి వచ్చినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో సాధన చేసి అనతికాలంలోనే దేశంలోనే అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లోని పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించి తన బౌలింగ్ కి మెళకువలు దిద్దుకొని దేశంలోనే ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా పేరు గడించాడు.వరుణ్ ని అడ్డుకోవడానికి ఇంగ్లండ్ వ్యూహం? ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై గట్టి దెబ్బతీసాడు. రెండో టీ20లో 38 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఆరడుగుల ఎత్తు కూడా వరుణ్ కి బాగా కలిసి వచ్చింది. వరుణ్ బౌలింగ్ తీరు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ను సైతం ఆకట్టుకుంది. వరుణ్ ని వాన్ "అందమైన మిస్టరీ స్పిన్నర్" గా అభివర్ణించడం విశేషం. వరుణ్ ఇతర స్పిన్నర్ల లాగా బంతి ని ఎక్కువగా స్పిన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని లైన్ అండ్ లెంగ్త్ ఎప్పుడూ నిలకడ ఉంటుంది. స్టంప్స్ ని గురిపెట్టి చాలా స్థిరంగా, తెలివిగా బౌలింగ్ చేస్తాడు. వరుణ్ చక్రవర్తిపై ఒత్తిడి తీసుకురావడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు సరైన వ్యూహాన్ని రూపొందించాలి.. లేకపోతే అతను ఇంగ్లండ్ కి చాల ప్రమాదకరంగా పరిణమించే అవకాశముందని, హెచ్చరిక కూడా చేసాడు.భారత్ కి కొత్త ఆశలు వరుణ్ భారత్ తరుఫున 2021లో టి20 మ్యాచ్ ల్లో రంగ ప్రవేశం చేసాడు. ఇప్పటివరకు వరుణ్ చక్రవర్తి 15 టి20 లలో భారత్ కి ప్రాతినిధ్యం వహించి 24 వికెట్లు తీసుకున్నాడు. కోల్‌కతాలోని తొలి టి20 మ్యాచ్ లో వరుణ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పటికీ, అర్ష్‌దీప్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించారు, ఒక్కొక్కరు రెండేసి వికెట్లు తీసుకున్నారు.మొత్తానికి ఆస్ట్రేలియాలో చతికిలపడి నిస్తేజంగా ఉన్న భరత్ జట్టుకి వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో కొత్త ఊపిరి పోసాడు. అయితే వరుణ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకో లేకపోవడం బాధాకరం. మంచి ఫామ్ లో ఉన్న వరుణ్ ని భారత్ సెలెక్టర్లు సరైన రీతిలో ప్రోత్సహిస్తే జట్టుకి అశ్విన్ వంటి ఎంతో అనుభవం ఉన్న స్పిన్నర్ లేని కొరత కొంతవరకైనా తీరుతుంది.చదవండి: తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం -
వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్‌లు ఔట్
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను అద్బుతమైన బంతితో వరుణ్ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.బంతి పిచ్ అయిన వెంటనే షార్ప్‌గా టర్న్ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్‌లో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్‌ను వరుణ్ ఔట్ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్ Through the gates! 🎯The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo— BCCI (@BCCI) January 25, 2025 -
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అతడికి ఇవ్వాల్సింది.. మూడు ఓవర్లలోనే..
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో టీమిండియా(India Beat England) శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను కట్టడి చేయగా.. లక్ష్య ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగి అభిషేక్ శర్మ విజయాన్ని నల్లేరు మీద నడకలా మార్చాడు.ఈ మ్యాచ్‌లో సత్తా చాటి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh), వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలను టీమిండియా అభిమానులు హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఈ ముగ్గురి చక్కటి ఆట తీరు వినోదాన్ని పంచిందంటూ కితాబులిస్తున్నారు. ఇక వీరిలో వరుణ్ చక్రవర్తిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించిన విషయం తెలిసిందే.అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దృష్టిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’కు అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే అర్హుడని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు?.. అభిషేక్ శర్మ లేదంటే వరుణ్?.. కానేకాదు..నా వరకైతే అర్ష్‌దీప్ మాత్రమే ఈ అవార్డుకు అర్హుడు. ఎందుకంటే.. ఇంగ్లండ్ టాపార్డర్‌ను అతడు కుప్పకూల్చాడు. ఒకరకంగా.. కేవలం మూడంటే మూడు ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశాడు’’ అని బసిత్ అలీ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్రశంసించాడు.అత్యుత్తమంగా రాణించాడుఅదే విధంగా.. ‘‘వరుణ్ చక్రవర్తి కూడా బాగా బౌలింగ్ చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. అయినా సరే.. అద్భుతంగా బౌలింగ్ చేసింది మాత్రం అర్ష్‌దీప్ అనే చెబుతాను. అతడు ఈరోజు అత్యుత్తమంగా రాణించాడు. రవి బిష్ణోయి కూడా ఫరవాలేదు. వికెట్ తీయలేకపోయినా కాస్త పొదుపుగానే బౌల్ చేశాడు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.బౌలర్ల విజృంభణకాగా టీమిండియాతో తొలి టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 132 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(0), బెన్ డకెట్(4)లను వచ్చీ రాగానే అర్ష్‌దీప్ అవుట్ చేశాడు. ఆరంభంలోనే మూడు ఓవర్లు వేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే మాత్రమే ఇచ్చాడు.మరోవైపు.. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లు పూర్తి చేసి 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వాళ్లలో హార్దిక్ పాండ్యా(2/42), అక్షర్ పటేల్(2/22) రెండేసి వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక వికెట్ కీపర్ సంజూ శాంసన్ ఆదిల్ రషీద్ రనౌట్‌లో భాగమయ్యాడు.బ్యాటర్ల సత్తాఇక లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ శుభారంభం అందించారు. సంజూ వేగంగా(20 బంతుల్లో 26) ఆడి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ కాగా.. అభిషేక్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. కేవలం 34 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లసాయంతో 79 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ కాగా.. తిలక్ వర్మ(9*) , హార్దిక్ పాండ్యా(3*) అజేయంగా నిలిచి పనిపూర్తి చేశారు.చదవండి: అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్ -
అతడే ఎక్స్ ఫ్యాక్టర్.. జట్టులో కొనసాగించండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై భారత మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా(Piyush Chawla) ప్రశంసలు కురిపించాడు. అతడు గనుక బ్యాట్ ఝులిపిస్తే అది కచ్చితంగా మ్యాచ్ విన్నింగ్సే అవుతుందని కొనియాడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను సుదీర్ఘకాలం టీ20 జట్టులో కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్లి చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన అభిషేక్ శర్మ.. గతేడాది జూలైలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన ఈ పంజాబీ బ్యాటర్ డకౌట్ అయి విమర్శల పాలయ్యాడు. అయితే, అదే వేదికపై శతకంతో చెలరేగి తానేంటో నిరూపించుకున్నాడు.సంజూకు కెప్టెన్ మద్దతుఅయితే, ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇక టీ20 జట్టులో ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్(Sanju Samson)తో పాటు అభిషేక్‌ను మేనేజ్మెంట్ ఆడిస్తున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్‌గా సంజూనే కొనసాగిస్తామని ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో అతడికి ఢోకా లేనట్లే.జైస్వాల్ రూపంలో ముప్పుఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో గనుక విఫలమైతే అభిషేక్ శర్మకు కష్టాలు తప్పవని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మరో లెఫ్టాండర్ బ్యాటర్ అయిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) రూపంలో అతడికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాట్ ఝులిపిస్తేనే మరికొంతకాలం జట్టుతో కొనసాగగలడని అంచనా వేశాడు.ఇరవై బంతుల్లోనే అందుకు తగ్గట్లుగానే అభిషేక్ శర్మ తొలి టీ20లోనే దుమ్ములేపాడు. కేవలం ఇరవై బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్న అతడు.. మొత్తంగా 34 బంతులు ఎదుర్కొని 79 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో జియో సినిమా షోలో భారత మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా అభిషేక్ శర్మ ఆట తీరును ప్రశంసించాడు. ‘‘అభిషేక్ హై- రిస్క్ బ్యాటర్. ఒకవేళ అతడు పరుగుల వరద పారించాడంటే.. ఆ మ్యాచ్‌లో జట్టు గెలవాల్సిందే.ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్అభిషేక్ శర్మ ఎక్స్- ఫ్యాక్టర్ ప్లేయర్. 20-22 బంతుల్లోనే 60 పరుగులు చేయగలడు. ఇలాంటి వాళ్లను జట్టులో సుదీర్ఘకాలం కొనసాగించాలి. ఈరోజు అతడు కాస్త నెమ్మదిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉండవచ్చు. కానీ కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.అతడి ఆట తీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక చక్కటి నిదర్శనం. అతడి ఆడిన షాట్లు కూడా చూడముచ్చటగా ఉన్నాయి’’ అని పీయూష్ చావ్లా కితాబులిచ్చాడు. కాగా ఇంగ్లండ్‌తో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ప్రత్యర్థిని 132 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం.. లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 12.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ(79) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా వేగంగా టార్గెట్‌ను ఛేదించింది. ఇక ఇంగ్లండ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన మూడు వికెట్ల వీరుడు, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఇప్పటికైనా అతడికి జట్టులో ఛాన్స్ ఇస్తారా? లేదా?: దినేశ్ కార్తీక్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) తన రీఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తన స్పిన్ మాయాజాలంతో బెంబేలెత్తించిన వరుణ్.. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌లోనూ అదే తీరును కనబరుస్తున్నాడు. కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. హ్యారీ బ్రూక్, లివింగ్ స్టోన్, బట్లర్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(Dinesh Karthik) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్ చక్రవర్తిని ఎందుకు ఎంపిక చేయలేదని భారత సెలక్టర్లను కార్తీక్ ప్రశ్నించాడు.వరుణ్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడని. అతడికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇచ్చిండాల్సందని దినేష్ అభిప్రాయపడ్డాడు. కాగా చక్రవర్తికి 15 మంది సభ్యల ప్రధాన జట్టులో చోటు దక్కలేదు. అతడిని ట్రావిలింగ్ రిజర్వ్‌గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా సరిగ్గా రెండు నెలల క్రితం వరుణ్ చక్రవర్తిని ఉద్దేశించి కార్తీక్ ఓ ట్వీట్ చేశాడు. "ఛాంపియన్స్ ట్రోఫీకి వరుణ్‌ను ఎంపిక చేయకపోతే అది భారత సెలక్టర్లు చేసిన ఘోర తప్పిదం అవుతుందని "ఎక్స్‌లో డీకే రాసుకొచ్చాడు. ఇప్పడు అదే విషయాన్ని మరోసారి హైలెట్ చేస్తూ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి ఇప్పుడైనా తీసుకుంటారా? అని ట్వీట్ చేశాడు.నలుగురు స్పిన్నర్లతో..ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్న కుల్దీప్ యాదవ్ తిరిగి వచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి అనుభవజ్ఞులైన మణికట్టు స్పిన్నర్లకు చోటు దక్కింది.ఈ క్రమంలోనే సెలక్టర్లు చక్రవర్తికి ప్రధాన జట్టులో చోటు ఇవ్వలేదు. కానీ చక్రవర్తి అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో చక్రవర్తి అదరగొట్టాడు. 2024-25 సీజన్లో వరుణ్ తమిళనాడు తరపున కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే నే 18 వికెట్లు పడగొట్టాడు.తొలి టీ20లో భారత్ ఘన విజయంఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు తీశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలోనే చేధించింది. భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. కేవలం 34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్‌లతో 79 పరుగులు చేసి శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 జనవరి 25న చెన్నై వేదికగా జరగనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ -
ఆరంభం అదిరింది.. తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
టి20 వరల్డ్ చాంపియన్ భారత్ మరోసారి తమ స్థాయికి తగ్గ ఆటతో అదరగొట్టింది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య ఏకపక్షంగా సాగిన పోరులో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. కట్టుదిట్టమైన పేస్, స్పిన్‌తో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా... ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో మరో 43 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారీ బ్యాటింగ్ బలగం ఉన్న ఇంగ్లండ్ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అర్ష్ దీప్ , వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌తో పాటు అభిషేక్ శర్మ మెరుపు ప్రదర్శన భారత జట్టును ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిపాయి. రెండో టి20 మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. కోల్‌కతా: ఇంగ్లండ్‌తో మొదలైన టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ముందంజ వేసింది. బుధవారం జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కగా...అర్ష్ దీప్ , అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 12.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు సాధించి గెలిచింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. భారత బౌలర్ల జోరు... లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ పదునైన బంతులతో ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. తొలి ఓవర్లో ఫిల్ సాల్ట్ (0)ను అవుట్ చేసిన అతను, తన రెండో ఓవర్లో డకెట్ (4)ను వెనక్కి పంపించాడు. బట్లర్, బ్రూక్ (17) కలిసి కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పాండ్యా ఓవర్లో నాలుగు ఫోర్లతో బట్లర్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి స్పిన్‌కు ఇంగ్లండ్ కుదేలైంది. ఒకే ఓవర్లో అతను బ్రూక్, లివింగ్‌స్టోన్ (0)లను డగౌట్‌కు పంపించాడు. అనంతరం ఒక ఎండ్‌లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోగా... బట్లర్ ఒక్కడే పోరాడగలిగాడు. 34 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆపై పాండ్యా, అక్షర్ మెరుగైన బౌలింగ్‌కు తోడు చక్కటి ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ 26 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు చేజార్చుకుంది. మెరుపు బ్యాటింగ్... అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్లో సంజు సామ్సన్ (20 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో వరుసగా 4, 4, 0, 6, 4, 4 బాదిన అతను 22 పరుగులు రాబట్టాడు. అయితే ఒకే ఓవర్లో సామ్సన్, సూర్యకుమార్ (0)లను అవుట్ చేసి ఆర్చర్ దెబ్బ తీశాడు. వుడ్ ఓవర్లో అభి షేక్ 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లేలో భారత్ 63 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 పరుగుల వద్ద ఆదిల్ రషీద్ రిటర్న్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అభిషేక్ తర్వాతి మూడు బంతుల్లో వరుసగా 4, 6, 6 బాదాడు. ఆపై మరో సిక్స్‌తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాతా దూకుడుగా ఆడిన అభిషేక్ భారత విజయానికి 8 పరుగుల దూరంలో అవుటయ్యాడు. షమీకు నో చాన్స్!ఫిట్నెస్ నిరూపించుకొని దాదాపు 14 నెలల విరామం తర్వాత భారత జట్టులోకి వచి్చన సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి ఇంకా మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇంగ్లండ్‌తో తొలి టి20 కోసం ప్రకటించిన టీమ్‌లో అనూహ్యంగా అతనికి చోటు దక్కలేదు. దీనికి మేనేజ్మెంట్ ఎలాంటి కారణం చెప్పలేదు. జట్టు కూర్పులో భాగంగా అతడిని పక్కన పెట్టారా లేక పూర్తిగా కోలుకోలేదా అనే విషయంపై స్పష్టత లేదు.97 అంతర్జాతీయ టి20ల్లో అర్ష్ దీప్ సింగ్ వికెట్ల సంఖ్య. భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా అతను నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యుజువేంద్ర చహల్ (96)ను అర్ష్ దీప్ అధిగమించాడు. స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; డకెట్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 4; బట్లర్ (సి) నితీశ్ రెడ్డి (బి) వరుణ్ 68; బ్రూక్ (బి) వరుణ్ 17; లివింగ్‌స్టోన్ (బి) వరుణ్ 0; బెతెల్ (సి) అభిషేక్ (బి) పాండ్యా 7; ఒవర్టన్ (సి) నితీశ్ రెడ్డి (బి) అక్షర్ 2; అట్కిన్సన్ (స్టంప్డ్) సామన్ (బి) అక్షర్ 2; ఆర్చర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 12; రషీద్ (నాటౌట్) 8; వుడ్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 132. వికెట్ల పతనం: 1–0, 2–17, 3–65, 4–65, 5–83, 6–95, 7–103, 8–109, 9–130, 10–132. బౌలింగ్: అర్ష్ దీప్ సింగ్ 4–0–17–2, హార్దిక్ పాండ్యా 4–0–42–2, వరుణ్ చక్రవర్తి 4–0–23–3, అక్షర్ పటేల్ 4–1–22–2, రవి బిష్ణోయ్ 4–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26; అభిషేక్ శర్మ (సి) బ్రూక్ (బి) రషీద్ 79; సూర్యకుమార్ (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0; తిలక్‌వర్మ (నాటౌట్) 19; పాండ్యా (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.5 ఓవర్లలో 3 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–41, 2–41, 3–125. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–21–2, అట్కిన్సన్ 2–0–38–0, మార్క్ వుడ్ 2.5–0–25–0, రషీద్ 2–0–27–1, ఒవర్టన్ 1–0–10–0, లివింగ్‌స్టోన్ 1–0–7–0. -
వరుణ్ చక్రవర్తి మాయాజాలం.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయం
మిస్టరీ స్పిన్నర్, తమిళనాడు ఆటగాడు వరుణ్ చక్రవర్తి విజయ్ హజారే ట్రోఫీ రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ మాయాజాలం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తన ఐదు వికెట్ల ప్రదర్శనలో ఏకంగా ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్ ఓ క్యాచ్ కూడా పట్టాడు. వరుణ్‌తో పాటు సందీప్ వారియర్ (8.3-1-38-2), సాయి కిషోర్ (10-0-49-2), త్రిలోక్ నాగ్ (6-1-31-1) కూడా వికెట్లు తీయడంతో రాజస్థాన్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో, కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ద సెంచరీతో కదం తొక్కడంతో రాజస్థాన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో వీరిద్దరితో పాటు కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అభిజీత్ తోమార్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో బాధ్యతాయుతమైన సెంచరీ చేయగా.. లోమ్రార్ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద శతకం బాదాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో సచిన్ యాదవ్ 4, దీపక్ హూడా 7, అజయ్ సింగ్ 2, మానవ్ సుతార్ 1, అనికేత్ చౌదరీ 2, ఖలీల్ అహ్మద్ 1, అమన్ షెకావత్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.Varun Chakravarthy with a peach of a delivery. 🤯🔥 pic.twitter.com/kL0BfOHH5m— Mufaddal Vohra (@mufaddal_vohra) January 9, 2025అనంతరం 268 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 14.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తుషార్ రహేజా (11), భూపతి కుమార్ (0) ఔట్ కాగా.. నారాయణ్ జగదీశన్ (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (13) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అనికేత్ చౌదరీకి తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 183 పరుగులు చేయాలి.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఖాయంఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటించడానికి ముందు వరుణ్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అనంతరం వరుణ్ టీమిండియాకు ఎంపిక కావడం ఖాయమని తెలుస్తుంది. భారత జట్టులో చోటు విషయంలో వరుణ్‌కు రవి భిష్ణోయ్ నుంచి పోటీ ఉండింది. అయితే తాజా ప్రదర్శన నేపథ్యంలో సెలెక్టర్లు ఏకపక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వరుణ్ ఇటీవల టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొట్టాడు. గతేడాది నవంబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో వరుణ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే, ఇవాళే జరుగుతున్న మరో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్లో (మొదటిది) హర్యానా, బెంగాల్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. హర్యానా ఇన్నింగ్స్‌లో పార్థ్ వట్స్ (62), నిషాంత్ సంధు (64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో సుమిత్ కుమార్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగాల్ బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. ముకేశ్ కుమార్ రెండు, సుయాన్ ఘోష్, ప్రదిప్త ప్రమాణిక్, కౌశిక్ మైటీ, కరణ్ లాల్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND Vs SA: చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్క్రమ్లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.అశ్విన్ రికార్డు బద్దలు...ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తద్వారా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది.చదవండి: IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది -
అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన మిస్టరీ స్పిన్నర్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టిస్తాడు.2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఏ భారత స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్‌కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 5.25 సగటున 8 వికెట్లు తీశాడు.డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే.రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ డేంజరెస్ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు పడగొట్టాడు. -
గత మూడేళ్లు కష్టకాలం..! రీ ఎంట్రీలో అదుర్స్
పోర్ట్ ఎలిజబెత్: మూడేళ్ల క్రితం వరుణ్ చక్రవర్తి ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు తెచ్చుకొని భారత జట్టులోకి ఎంపికయ్యాడు. శ్రీలంకతో టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో పొదుపైన బౌలింగ్ ప్రదర్శన కనబర్చడంతో కొద్ది రోజులకే యూఏఈలో జరిగిన టి20 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం కూడా దక్కింది. అయితే 3 మ్యాచ్‌లలో కలిపి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు! దాంతో అతను తీవ్ర విమర్శలపాలై సెలక్టర్ల నమ్మకం కోల్పోయాడు. జట్టులో స్థానం చేజార్చుకున్న అతను ఐపీఎల్లో మాత్రం ఆకట్టుకున్నాడు. 2024 ఐపీఎల్లో మళ్లీ సత్తా చాటి కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించడంతో ఎట్టకేలకు మళ్లీ టీమిండియా చాన్స్ లభించింది.పునరాగమంలో ఆడిన 5 టి20ల్లో కలిపి 13 వికెట్లతో వరుణ్ సత్తా చాటాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండో టి20 మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన అతను తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘వైఫల్యాలు వచ్చిన తర్వాత నేను మళ్లీ నా ఆటలో మూలాలకు వెళ్లిపోయాను. నా వీడియోలు చూసి లోపాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశా. నా సైడ్ స్పిన్ బౌలింగ్ అంతర్జాతీయ స్థాయిలో పనికి రాదని అర్థమైంది. అందుకే నా బౌలింగ్‌లో సమూల మార్పులు చేసుకున్నాను. దానికి రెండేళ్లు పట్టింది. ఐపీఎల్‌తో పాటు స్థానిక లీగ్‌లలో అది మంచి ఫలితాలు ఇవ్వడంతో దానినే ఇక్కడా కొనసాగించాను. ఆదివారం మ్యాచ్‌లో నా శైలికి పిచ్ కూడా సహకరించింది. ఇకపై కూడా ఇలాగే రాణించాలని కోరుకుంటున్నా’ అని వరుణ్ స్పందించాడు. మూడేళ్ల క్రితం భారత జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత తన పరిస్థితి బాగా ఇబ్బందికరంగా మారిందని అతను గుర్తు చేసుకున్నాడు. దానిని కష్టకాలంగా అతను పేర్కొన్నాడు. ‘గత మూడేళ్లు చాలా కఠినంగా సాగాయి. ఆపై మరింత ఎక్కువ క్రికెట్ ఆడటమే నేను చేయగలిగిందని అర్థమైంది.అందుకే టీఎన్‌పీఎల్ వంటి దేశవాళీ లీగ్‌లలో పాల్గొన్నా. అది నా ఆటను మరింత అర్థం చేసుకునేందుకు, ఆపై మెరుగు పర్చుకునేందుకు ఉపకరించింది’ అని వరుణ్ చెప్పాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలపై స్పష్టత ఇవ్వడం మేలు చేసిందని అతను అన్నాడు. ‘నువ్వు 30–40 పరుగులు ఇచ్చినా సరే ఆందోళన చెందవద్దు. వికెట్ల తీయడమే నీ పని అంటూ నా బాధ్యత ఏమిటో గంభీర్ స్పష్టంగా చెప్పారు. అది మంచి చేసింది’ అని ఈ స్పిన్నర్ వ్యాఖ్యానించాడు. చదవండి: ICC CT 2025: టీమిండియా లేకుంటే చాంపియన్స్ ట్రోఫీ లేనట్లే! -
సూర్య చేసిన తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు?
సౌతాఫ్రికా పర్యటనను ఘనంగా ఆరంభించిన టీమిండియా జోరుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తొలి టీ20లో ఎదురైన పరాభవానికి ఆతిథ్య ప్రొటిస్ జట్టు బదులు తీర్చుకుంది. రెండో మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచి.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కాగా నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు సూర్య సేన సౌతాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో డర్బన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే, గెబెహాలో ఆదివారం జరిగిన రెండో టీ20లో మాత్రం ఓటమిపాలైంది. కీలక బ్యాటర్లంతా విఫలమైనా.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడటం కోసం బౌలర్లు ఆఖరి వరకు పోరాడారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.ఒకే ఒక్క ఓవర్ ఇస్తారా?ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా విమర్శలు చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సూర్య విఫలమయ్యాడని పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వడం భారత కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పని విమర్శించాడు.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘అక్షర్ పటేల్ సేవలను పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అసలు అతడిని ఎందుకు ఆడిస్తున్నారు? డర్బన్‌లో అక్షర్‌కు కేవలం ఒకే ఒక్క ఓవర్ ఇచ్చారు. గెబెహాలోనూ అదే పరిస్థితి.సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇదిస్పిన్నర్లు మాత్రమే ఆరు నుంచి ఏడు వికెట్లు తీస్తున్న పిచ్‌పై అక్షర్‌తో ఇలా ఒకే ఒక్క ఓవర్ వేయించడం ఏమిటి? అక్షర్ సేవలను వినియోగించుకోవడంలో మేనేజ్మెంట్ విఫలమవుతోంది. తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తున్నారు. కానీ వారిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నారు.భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం గురించి నేను ప్రస్తుతానికి మాట్లాడదలచుకోలేదు. కానీ బౌలర్‌గా అక్షర్ పటేల్‌ను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో సూర్య చేసిన అతిపెద్ద తప్పు ఇది అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కేవలం 124 పరుగులుఇక ఈ మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడం నిజంగా అతడి దురదృష్టమని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. తిలక్ వర్మ(20), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(27), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో ఈ మాత్రం స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికాను భారత బౌలర్లు ఆది నుంచే ఇబ్బంది పెట్టారు. వరుణ్ ఐదు వికెట్లు తీసినా..ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు. మరో స్పిన్నర్ రవి బిష్ణోయి సైతం ఒక వికెట్ తీయగా.. పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.అయితే, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై అక్షర్ పటేల్‌కు మాత్రం ఒకే ఒక్క ఓవర్ ఇవ్వగా.. అతడు కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలర్లు అటాక్ చేస్తున్నా సౌతాఫ్రికా హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 47 పరగులుతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య బుధవారం సెంచూరియన్ వేదికగా మూడో టీ20 జరుగనుంది.చదవండి: హార్దిక్ సెల్ఫిష్ ఇన్నింగ్స్..! ఇదంతా ఐపీఎల్ కోసమేనా: పాక్ మాజీ క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. తొలి భారత బౌలర్‌గా
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైనప్పటకి ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బంతితో మాయ చేశాడు. 125 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ప్రోటీస్ బ్యాటర్లను చక్రవర్తి ముప్పుతిప్పలు పెట్టాడు. మార్క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడొట్టి ఆతిథ్య జట్టును ఓటమి కోరల్లో చిక్కుకునేలా చేశాడు. కానీ ప్రోటీస్ బ్యాటర్ స్టబ్స్ అద్బుత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి తప్పించాడు. ఈ మ్యచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఈ తమిళనాడు స్పిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి భారత బౌలర్‌గా..👉అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డులకెక్కాడు. చక్రవర్తి 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ ఆల్‌టైమ్ రికార్డును వరుణ్ బ్రేక్ చేశాడు.👉అదేవిధంగా ఓ టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా చక్రవర్తి నిలిచాడు. ఈ జాబితాలో స్టార్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.👉ఓవరాల్‌గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు.చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య pic.twitter.com/T5ZdA4gCWt— viratgoback (@viratgoback) November 10, 2024 -
చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఆతిథ్య ప్రోటీస్ చేధించింది. ఓ దశలో ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) మాయాజాలంతో భారత్ గెలిచేలా కన్పించినప్పటకి.. సఫారీ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్) విరోచిత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సౌతాఫ్రికా సమం చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) ఫైటింగ్ నాక్ ఆడాడు. అతడితో పాటు అక్షర్ పటేల్(27), తిలక్ వర్మ(20) పరుగులతో పర్వాలేదన్పించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, కోయిట్జీ, పీటర్, సీమీలేన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటకి వరుణ్ చక్రవర్తి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడని సూర్య కోనియాడు.చాలా గర్వంగా ఉంది: సూర్యకుమార్"ఎప్పుడైనా సరే ఎంత లక్ష్యం నమోదు చేసినా కానీ డిఫెండ్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభానికి ముందు మా కుర్రాళ్లకు ఇదే విషయం చెప్పాను. ఫలితాలు కోసం ఆలోచించకండి, ఆఖరి వరకు పోరాడాదం అని చెప్పాను. వాస్తవానికి టీ20 గేమ్‌లో 125 లేదా 140 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడం అంత సులభం కాదు. కానీ మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. వారి పోరాట పటిమ చూసి గర్వపడుతున్నా. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేశాడు. 125 పరుగుల లోస్కోరింగ్ మ్యాచ్‌లో టార్గెట్‌ను డిఫెండ్ క్రమంలో ఒక్క బౌలర్ 5 వికెట్లు సాధించడం చాలా గొప్ప విషయం. అతడు ఈ రోజు కోసమే ఎప్పటినుంచో ఎదురుచేస్తున్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఈ రోజు అతడి కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న మూడో టీ20లో ఈ ఓటమికి బదులు తీర్చుకుంటామని" పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs SA: విజయాన్ని వదిలేశారు -
విజయాన్ని వదిలేశారు
పోర్ట్ ఎలిజబెత్: భారత్ చేసింది 124/6. తక్కువ స్కోరే! దక్షిణాఫ్రికా ముందున్న లక్ష్యం 125. సులువైందే! కానీ భారత ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) బిగించిన ఉచ్చు సఫారీని ఓటమి కోరల్లో పడేసింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటం ఆతిథ్య జట్టును గెలిపించింది.ఆదివారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దాంతో నాలుగు టి20ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 13న సెంచూరియన్‌లో మూడో టి20 జరుగనుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడంతే! అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి గెలిచింది. కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన కీలక పరుగులు, స్టబ్స్ పోరాటంతో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కష్టాలతో మొదలై... ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే జాన్సెన్ మూడో బంతికి సంజూ సామ్సన్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాతి కొయెట్జీ ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ (4) కీపర్ క్యాచ్ నుంచి రివ్యూకెళ్లి బతికిపోయినా... మరో రెండు బంతులకే భారీ షాట్‌కు ప్రయతి్నంచి జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 5 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ కష్టాలు చాలవన్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ (4) సిమ్‌లేన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 పరుగులకే టాపార్డర్ కూలిపోగా... పవర్‌ప్లేలో భారత్ 34/3 స్కోరు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ జోడీ ఠాకూర్ తిలక్ వర్మ (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) నిలదొక్కుకోకుండా మార్క్రమ్ చేశాడు. అతని బౌలింగ్‌లో తిలక్ షాట్ ఆడగా బుల్లెట్లా దూసుకొచ్చిన బంతిని మిల్లర్ గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. పీటర్ వేసిన 12వ ఓవర్లో హార్దిక్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా... అది నేరుగా వెళ్లి నాన్–స్ట్రయిక్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. ఈ లోపే బంతిని అడ్డుకోబోయిన పీటర్ చేతికి టచ్ అయ్యింది. అక్షర్ రీప్లే వచ్చేవరకు వేచిచూడకుండా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో 70 పరుగులకే టీమిండియా సగం వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన రింకూ (9)ను పీటరే అవుట్ చేశాడు. రింకూ ఆడిన షాట్‌ను షార్ట్‌ఫైన్ లెగ్‌లో కొయెట్జీ అందుకున్నాడు. ఎట్టకేలకు 17వ ఓవర్లో పాండ్యా బౌండరీతో జట్టు స్కోరు వందకు చేరింది. జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. చివరి రెండు డెత్ ఓవర్లను కొయెట్జీ, జాన్సెన్ చక్కగా నియంత్రించారు. పాండ్యా ఆఖరిదాకా క్రీజులో ఉన్నప్పటికీ కొయెట్జీ 19వ ఓవర్లో 3 పరుగులే ఇవ్వగా, జాన్సన్ ఆఖరి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. వరుణ్ తిప్పేసినా... సొంతగడ్డపై ప్రత్యర్థి స్వల్ప లక్ష్యమే నిర్దేశించినా... దక్షిణాఫ్రికా ఆపసోపాలు పడి గెలిచింది. హెండ్రిక్స్, కెపె్టన్ మార్క్రమ్ (3), జాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఆశలు రేపాడు. ఒక దశలో 64/3 వద్ద పటిష్టంగా కనిపించిన సఫారీ అంతలోనే వరుణ్ స్పిన్ ఉచ్చులో పడి 66 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఓటమి ప్రమాదాన్ని తెచ్చుకుంది. కాసేపటికే సిమ్‌లేన్ (7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరం ఆనందంలో మునిగితేలింది. 24 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉండగా, అర్ష్ దీప్ 17వ ఓవర్లో కొయెట్జీ 6, స్టబ్స్ 4 బాదారు. దీంతోనే సఫారీ జట్టు స్కోరు 100కు చేరింది. ఇక 18 బంతుల్లో 24 పరుగుల సమీకరణం వద్ద అవేశ్ బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపమే మారింది. చెత్త బంతులేసిన అవేశ్ ఖాన్ రెండు ఫోర్లు సహా 12 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్ అర్ష్ దీప్ వేయగా స్టబ్స్ 4, 4, 0, 0, 4, 4లతో ఇంకో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 4; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిమ్‌లేన్ 4; తిలక్ (సి) మిల్లర్ (బి) మార్క్రమ్ 20; అక్షర్ (రనౌట్) 27; పాండ్యా (నాటౌట్) 39; రింకూ (సి) కొయెట్జీ (బి) పీటర్ 9; అర్ష్ దీప్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–15, 4–45, 5–70, 6–87. బౌలింగ్: జాన్సెన్ 4–1–25–1, కొయెట్జీ 4–0–25–1, సిమ్‌లేన్ 3–0–20–1, కేశవ్ 4–0– 24–0, మార్క్రమ్ 1–0–4–1, పీటర్ 4–0–20–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెండ్రిక్స్ (బి) వరుణ్ 24; మార్క్రమ్ (బి) వరుణ్ 3; స్టబ్స్ (నాటౌట్) 47; జాన్సెన్ (బి) వరుణ్ 7; క్లాసెన్ (సి) రింకూ (బి) వరుణ్ 2; మిల్లర్ (బి) వరుణ్ 0; సిమ్‌లేన్ (బి) బిష్ణోయ్ 7; కొయెట్జీ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–22, 2–33, 3–44, 4–64, 5–66, 6–66, 7–86. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1, అవేశ్ 3–0–23–0, హార్దిక్ 3–0–22–0, వరుణ్ 4–0–17–5, రవి బిష్ణోయ్ 4–0–21–1, అక్షర్ 1–0–2–0. -
ఐదేసి మాయ చేసిన వరుణ్ చక్రవర్తి.. అయినా ఓటమిపాలైన టీమిండియా
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సఫారీ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ, అండైల్ సైమ్‌లేన్, ఎయిడెన్ మార్క్రమ్, ఎన్ పీటర్ పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలువగా.. తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సంజూ శాంసన్ 0, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తలో 4, రింకూ సింగ్ 9 పరుగులు చేసి ఔటయ్యారు. అర్షదీప్ సింగ్ 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత్ ఆదిలో విజయవంతమైంది. వరుణ్ చక్రవర్తి (4-0-17-5) దెబ్బకు సౌతాఫ్రికా ఓ దశలో మరో ఓటమి మూటగట్టుకునేలా కనిపించింది. అయితే ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్ (47 నాటౌట్), గెరాల్డ్ కొయెట్జీ (19 నాటౌట్) పట్టుదలగా ఆడి సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు. 19 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టబ్స్, కొయెట్జీతో పాటు ర్యాన్ రికెల్టన్ (13), రీజా హెండ్రిక్స్ (24) రెండంకెల స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవరి ఐదు, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. -
పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.86 మ్యాచ్‌లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్‌మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది.గంభీర్ ఎఫెక్ట్.. కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.పాపం బిష్ణోయ్బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్‌గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్‌ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్‌ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. -
IND Vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్.. మూడేళ్ల తర్వాత భారత స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
బంగ్లాదేశ్‌తో టీ20తో సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం రాత్రి ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని అనూహ్య ఎంపికలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో స్ధానం లభించగా.. స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్‌కు తొలి సారి జాతీయ జట్టులో చోటు దక్కింది. బంగ్లాతో టీ20 సిరీస్‌కు స్టార్ క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్‌లు దూరమయ్యారు. వర్క్ లోడ్ కారణంగా వీరిముగ్గురికి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ ఛాన్స్ కొట్టేశాడు.మిస్టరీ స్పిన్నర్ రీఎంట్రీఇక ఈ సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు పిలుపు నిచ్చారు. అతడికి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటుదక్కింది. చక్రవర్తి చివరగా టీమిండియా తరపున 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆడాడు. అయితే ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో సెలక్టర్లు అతడికి మళ్లీ పిలునివ్వాలని నిర్ణయించుకున్నారు.అయితే అతడి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేయడంలో హెడ్‌కోచ్ గంభీర్‌ది కీలక పాత్ర అని చెప్పవచ్చు. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా పనిచేసిన గంభీర్‌ను.. చక్రవర్తి తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లకు గౌతీ అతడిని ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. చక్రవర్తి టీమిండియా తరపున ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనప్పటకి.. దేశీవాళీ క్రికెట్లో మాత్రం వరుణ్‌కు మంచి రికార్డు ఉంది. 87 టీ20లు ఆడి 98 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.బంగ్లాతో టీ20లకు భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, మయాంక్ యాదవ్ -
మిస్టరీ స్పిన్నర్ మాయాజాలం.. 69 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి
విజయ్ హజారే ట్రోఫీ 2023లో తమిళనాడు బౌలర్, ఐపీఎల్ మిస్టరీ స్పిన్నర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) వరుణ్ చక్రవర్తి చెలరేగిపోయాడు. నాగాలాండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. వరుణ్ స్పిన్ మాయాజాలం ధాటికి నాగాలాండ్ 19.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసిన వరుణ్.. 3 మెయిడిన్లు వేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. Varun Chakravarthy took 5 wickets for 9 runs against Nagaland...!!!! - he has taken 14 wickets from just 6 games in Vijay Hazare 2023. pic.twitter.com/Ex5PI2XRpB — Johns. (@CricCrazyJohns) December 5, 2023 ప్రస్తుత సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న వరుణ్.. ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్‌టేకర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. వరుణ్‌తో పాటు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ (5.4-0-21-3), సందీప్ వారియర్ (6-1-21-1), టి నటరాజన్ (3-0-15-1) కూడా రాణించడంతో నాగాలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సుమిత్ కుమార్ 20, జాషువ ఒజుకుమ్ 13 పరుగులు చేశారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన పరుగులు (15) నాగాలండ్ ఇన్నింగ్స్‌లో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం. గ్రూప్-ఈలో ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు ఎదుర్కొన్న నాగాలాండ్ మరో ఓటమి దిశగా సాగుతుంది. -
భారత సెలక్టర్లు చాలా పెద్ద తప్పుచేశారు.. అతడు జట్టులో ఉండాల్సింది
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు 31 నుంచి ఆసియాకప్ జరగనుండడంతో భారత ద్వితీయ శ్రీణి జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐపీఎల్లో అదరగొట్టిన యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. రింకూ సింగ్ తిలక్ వర్మ, యశస్వీ జైశ్వాల్, ప్రభుసిమ్రాన్‌కు వంటి ఐపీఎల్ హీరోలకు చోటు దక్కింది. వీరితోపాటు ఆల్‌రౌండర్ శివమ్ దుబే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ జట్టుకు యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టుపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. ఈ జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిను ఎంపిక చేయకపోవడం సెలక్టర్లు చేసిన అతిపెద్ద తప్పిదమని చోప్రా అభిప్రాయపడ్డాడు. "ఆసియాక్రీడలకు భారత సెలక్టర్లు పటిష్టమైన జట్టును ఎంపికచేశారు. రింకూ, జైశ్వాల్, ప్రభుసిమ్రాన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ జట్టులో వరుణ్ చక్రవర్తికి చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో మాత్రం సెలెక్టర్లు మాత్రం పెద్ద తప్పు చేశారు. అతడు ప్రపంచంలోనే అత్యుతమ స్పిన్నర్లలో ఒకడు. అతడికి టీ20 ప్రపంచకప్-2021 జట్టులో అవకాశం ఇచ్చారు. అక్కడ విఫలమకావడంతో పూర్తిగా అతడిని పక్కన పెట్టేశారు. వరుణ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో కూడా రాణించాడు. కాబట్టి అతడు చైనాకు వెళ్లే భారత జట్టులో ఉండాల్సింది" అని తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా పేర్కొన్నాడు. చదవండి: Duleep Trophy: ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్ -
నీట్ యూజీ రాష్ట్ర అర్హుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2023లో అర్హత సాధించిన రాష్ట్ర విద్యార్థుల జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది. నీట్లో మొత్తం 720 మార్కులకు 720 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ పొందిన బోరా వరుణ్ చక్రవర్తి స్టేట్ టాపర్‌గా నిలిచాడు. 711 మార్కులతో ఆల్ ఇండియా 25వ ర్యాంకర్ వైఎల్ ప్రవర్ధన్ రెడ్డి రెండో స్థానంలో, 38 ర్యాంకర్ వి.హర్షిల్ సాయి మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో మొదటి పది ర్యాంకులు పొందినవారిలో ఏడుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. రాష్ట్రం నుంచి నీట్ యూజీకి 69,690 మంది దరఖాస్తు చేసుకోగా, 68,578 మంది పరీక్ష రాశారు. వీరిలో 42,836 మంది అర్హత సాధించారు. వారిలో అత్యధికంగా 28,471 మంది అమ్మాయిలు, 14,364 మంది అబ్బాయిలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. https:// drysr.uhsap.in వెబ్సైట్లో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ఉంచారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్విసెస్(డీజీహెచ్ఎస్) అందించిన నీట్ అర్హుల వివరాల ఆధారంగా రాష్ట్ర జాబితాను ప్రదర్శించినట్లు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాగానే నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. -
నీట్లో మనోళ్లు టాప్ లేపారు..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ‘నీట్’ పరీక్షలో తెలుగు విద్యార్థులు టాప్ లేపారు. జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకుతోపాటు టాప్–50లో ఏడు ర్యాంకులను ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. ఏపీకి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి 720 మార్కులకు 720 సాధించి ఆలిండియా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. తమిళనాడుకు చెందిన ప్రభంజన్ కూడా 720 మార్కులతో మొదటి ర్యాంకును పంచుకున్నాడు. ఇక తెలంగాణ నుంచి కంచాని జయంత్ రఘురామరెడ్డికి 15వ ర్యాంకు, ఏపీకి చెందిన వైఎల్ ప్రవర్థన్‌రెడ్డి 25వ ర్యాంకు (ఈడబ్ల్యూఎస్ విభాగంలో దేశంలోనే తొలి స్థానం), వి.హర్షిల్‌సాయి 35వ ర్యాంకు, కె.యశశ్రీ 40వ (ఎస్సీ విభాగంలో రెండో స్థానం), కల్వకుంట్ల ప్రణతిరెడ్డి 45వ ర్యాంకు, తెలంగాణకు చెందిన బోడెద్దుల జాగృతి 49వ ర్యాంకు (మహిళల కేటగిరీలో పదో స్థానం) సాధించారు. ఇక ఆలిండియా 119వ ర్యాంకు సాధించిన ఏపీ విద్యార్థి ఎం.జ్యోతిలాల్ చావన్ ఎస్టీ విభాగంలో దేశంలో టాప్ ర్యాంకు కొల్లగొట్టాడు. తెలంగాణకు చెందిన లక్ష్మి రషి్మత గండికోట 52వ ర్యాంకు (మహిళల కేటగిరీలో 12వ ర్యాంకు) సాధించింది. జాతీయ స్థాయిలో 56.21 శాతం అర్హత నీట్ యూజీ–2023 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం రాత్రి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 20,38,596 మంది పరీక్ష రాయగా.. 11,45,976 మంది (56.21 శాతం) అర్హత సాధించారు. ఇందులో ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి 42,654 మంది ఉన్నారు. నీట్ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన కౌస్తవ్ బౌరి 3వ, పంజాబ్‌కు చెందిన ప్రాంజల్ అగర్వాల్ 4వ, కర్ణాటకకు చెందిన ధ్రువ్ అద్వానీ 5వ ర్యాంకు సాధించారు. ఈసారి పేపర్ కఠినంగా ఉన్నా కటాఫ్ మార్కులు పెరిగాయని నిపుణులు చెప్తున్నారు. గతేడాది అన్ రిజర్వ్డ్, ఈడబ్లు్యఎస్ కటాఫ్ మార్కులు 117 కాగా.. ఈసారి 137కు పెరిగాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పీహెచ్, ఎస్సీ పీహెచ్‌ల కటాఫ్ మార్కులు గతేడాది 93 కాగా.. ఈసారి 107కు పెరిగాయి. వారంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు ఆలిండియా కోటాలోని 15 శాతం సీట్లతోపాటు కేంద్ర, డీమ్డ్ యూనివర్సిటీలు, ఈఎస్ఐసీ, ఏఎఫ్ఎంసీ, బీహెచ్‌యూ, ఏఎంయూ మెడికల్ కాలేజీల్లో సీట్లకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీసీఏ) కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. డీజీసీఏ సూచనల మేరకు అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 85శాతం సీట్లకు రాష్ట్రాల స్థాయిలో భర్తీ చేపడతారు. వారం రోజుల్లో నీట్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటిస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కలిపి మొత్తంగా 8,340 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపాయి. మార్కులు అవే అయినా.. ర్యాంకులు తగ్గి.. తెలుగు విద్యార్థులకు టాప్ ర్యాంకర్లతో సమానంగా మార్కులు వచ్చినా, పలు అంశాలతో తక్కువ ర్యాంకులను కేటాయించారు. జాతీయస్థాయిలో నాలుగో ర్యాంకర్ మార్కులు 715కాగా.. 15వ ర్యాంకు సాధించిన రఘురామరెడ్డి మార్కులు కూడా 715 కావడం గమనార్హం. అలాగే జాతీయస్థాయి 27వ ర్యాంకర్ నుంచి 49వ ర్యాంకర్ జాగృతి వరకు అందరికీ 710 మార్కులే. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేస్తా.. మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తోటాడా గ్రామం. నాన్న, అమ్మ ఇద్దరూ టీచర్లే. జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతా. – బోర వరుణ్ చక్రవర్తి, 1వ ర్యాంకర్ అమ్మానాన్నల ప్రోత్సాహంతో.. ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటున్నాను. మాది అనంతపురం జిల్లా తాడిపత్రి. అమ్మానాన్న ఇద్దరూ వైద్యులే. ఇప్పుడు నేనూ వైద్యుడిని కాబోతుండటం సంతోషంగా ఉంది. – రఘురామరెడ్డి, 15వ ర్యాంకర్ డాక్టర్ కావాలన్నది కోరిక నేను డాక్టర్ కావాలని పదో తరగతిలో ఉన్నప్పుడే అనుకున్నాను. అదే లక్ష్యంతో కష్టపడ్డాను. మా నాన్న అమెరికాలో ఇంజనీర్. తల్లిదండ్రులు ఇచి్చన స్వేచ్ఛ, ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. – జాగృతి, 49వ ర్యాంకర్ -
అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్కే కోచ్
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మరో సారి తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు సునీల్ నరైన్ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్‌గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు. సీసీఎస్‌కే, కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్‌ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్. నెట్స్‌లో అతడి బౌలింగ్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం. గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్ వంటి స్పిన్ పిచ్‌లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్‌లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు. చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు -
అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
ఐపీఎల్-2023లో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లతో వరుణ్ చక్రవర్తి చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 26 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన వరుణ్.. 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వరుణ్ చక్రవర్తిపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని భజ్జీ కొనియాడాడు. "నేను వరుణ్‌తో కలిసి కేకేఆర్ తరపున ఆడినప్పుడు అతడు తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఆసమయంలో అతడు ఇంజెక్షన్లు తీసుకుంటూ, ఐస్ ప్యాక్‌లు వేసుకుంటూ టోర్నీ మొత్తం కొనసాగాడు. అయినప్పటికీ అతడు ఆ సీజన్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వరుణ్ టీమిండియాకు ఎంపికైనప్పుడు కూడా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఓ సందర్భంలో అతడితో నేను మాట్లాడినప్పుడు బరువు తగ్గించుకోమని సలహా ఇచ్చాను. ఎందుకంటే బరువు కారణంగా అతని మోకాలిపై చాలా ఒత్తిడి పడుతుంది. అతడు బరువు తగ్గాడు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి వరుణ్ కచ్చితంగా టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడు" అని స్టా్ర్ స్పోర్ట్స్ షోలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఆర్సీబీతో ముంబై కీలకపోరు.. తిలక్ వర్మ బ్యాక్! అతడు కూడా -
నరాలు తెగే ఉత్కంఠ! అప్పుడు నా హార్ట్‌బీట్ 200కు చేరువైంది.. అయితే..
IPL 2023 SRH Vs KKR: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్బుత ఆట తీరు కనబరిచాడు. కీలక సమయంలో ప్రత్యర్థిని కట్టడి చేసి జట్టుకు విజయం అందించాడు. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో కేకేఆర్‌ను గెలుపు తీరాలకు చేర్చి.. రైజర్స్పై ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు. ఐపీఎల్-2023లో రైజర్స్‌తో మొదటి ముఖాముఖి పోరులో సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు ఈ క్రమంలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు స్కోరు చేసింది. సొంతమైదానంలో రైజర్స్ రెచ్చిపోతుందనుకుంటే.. ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ(9)ను శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్ (18)ను హర్షిత్ రాణా తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపారు. టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన వన్‌డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (9 బంతుల్లో 20 పరుగులు) ఆట ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో వైభవ్ అరోరాకు క్యాచ్ ఇవ్వడంతో ముగిసింది. క్లాసెన్ ఆకట్టుకున్నా ఈ క్రమంలో రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్ (41 బంతుల్లో 40 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (20 బంతుల్లో 36 పరుగులు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకోగా.. మార్కరమ్‌ను వైభవ్, క్లాసెన్‌ను శార్దూల్ అవుట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయ సమీకరణం 9 పరుగులుగా మారింది. బంతి బంతికీ ఉత్కంఠ క్రీజులో అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్ ఉన్నారు. అప్పుడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా బంతిని వరుణ్ చక్రవర్తికి అందించాడు. చివరి ఓవర్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. చక్రవర్తి బౌలింగ్‌లో మొదటి బంతికి అబ్దుల్ సమద్ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి లెగ్‌బై రూపంలో పరుగు వచ్చింది. ఇక మూడో బంతికి వరుణ్ మ్యాజిక్ చేసి సమద్‌ను అవుట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మయాంక్ మార్కండే.. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయాడు. ఐదో బంతికి ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి భువీ చేతులెత్తేయడంతో కేకేఆర్ విజయం ఖరారైంది. కీలక ఓవర్లో 3 పరుగులే ఇచ్చి జట్టును గెలిపించిన వరుణ్ చక్రవర్తిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం వరుణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్ట్‌బీట్ 200కు చేరింది.. అతడు 2 ఫోర్లు బాదాడు! ‘‘ఆఖరి ఓవర్లో నా హార్ట్‌బీట్ 200కు చేరువైంది. అయితే.. ఏదేమైనా వాళ్లను కట్టడి చేయాలని ఫిక్సైపోయాను. ఓ వైపు బాలేమో స్లిప్ అవుతోంది. ఎలాగైనా బ్యాటర్లను ట్రాప్ చేసి లాంగ్ షాట్లు ఆడేలా చేయాలని భావించా. నా మొదటి ఓవర్లో 12 పరుగులు ఇచ్చాను. మార్కరమ్ నా బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదాడు. నిజానికి.. గతేడాది నేను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాను. లోపాలు సరిచేసుకున్నాను. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకుంటున్నా’’ అని వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో వరుణ్ 301 పరుగులు ఇచ్చి 14 వికెట్లు పడగొట్టాడు. రైజర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక సమయంలో వికెట్ తీశాడు. చదవండి: లక్షలు పోసి కొంటే రెట్టింపు తిరిగి ఇస్తున్నాడు! 4 కోట్లు తీసుకున్న నువ్విలా.. వేస్ట్ ఎక్కడివాళ్లు అక్కడ ఉండాలి.. మధ్యలో దూరడం ఎందుకు: గౌతీపై ఇంగ్లండ్ దిగ్గజం విమర్శలు చిన్నప్పటి నుంచే అశ్విన్‌కు నాపై క్రష్! స్కూల్ మొత్తం తెలుసు! ఓరోజు.. #KKR clinch a nail-biter here in Hyderabad as Varun Chakaravarthy defends 9 runs in the final over.@KKRiders win by 5 runs. Scorecard - https://t.co/dTunuF3aow #TATAIPL #SRHvKKR #IPL2023 pic.twitter.com/g9KGaBbADy — IndianPremierLeague (@IPL) May 4, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'అతడొక అద్భుతం.. కచ్చితంగా టీమిండియాకు ఆడుతాడు'
ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ అదరగొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్ రెండు కీలక వికెట్లు పడగొట్టి.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం19 ఏళ్ల సుయాష్ శర్మపై మరో కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. సుయాష్ భవిష్యత్తులో కచ్చితంగా భారత జట్టుకు ఆడుతాడని చక్రవర్తి కొనియాడాడు. కాగా ఈ మ్యాచ్‌లో చక్రవర్తి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి 27 పరుగులిచ్చాడు. "సుయాష్ శర్మ అద్భుతమైన లెగ్ స్పిన్నర్. అతడు జట్టులోకి రావడంతో మా బౌలింగ్ విభాగం మరింత బలపడింది. అదే విధంగా అతడు భవిష్యత్తులో కచ్చితంగా భారత్ తరపున ఆడుతాడు. అతడు దేశీవాళీ క్రికెట్లో ఆడి తన టాలెంట్‌ను మరింత మెరుగుపరుచుకోవాలని" మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ -
కోల్‌కతా గెలుపు బాట...
బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మరోసారి కలిసొచ్చిం ది. నాలుగు వరుస పరాజయాలతో డీలా పడిన జట్టుకు కొత్త ఉత్సాహాన్నిచ్చిం ది. సమష్టి ప్రదర్శనతో చెలరేగిన కోల్‌కతా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఈ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన గత 11 మ్యాచ్‌ల్లో ఏడుసార్లు నెగ్గిన కోల్‌కతా ఈసారీ తమ ఆధిపత్యాన్ని చాటుకొని 21 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు సాధించింది. జేసన్ రాయ్ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ నితీశ్ రాణా (21 బంతుల్లో 48; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టారు. చివర్లో రింకూ సింగ్ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ వీస్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరిశారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. డుప్లెసిస్ (17; 1 ఫోర్, 2 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్ (5; 1 ఫోర్) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కోహ్లి (37 బంతుల్లో 54; 6 ఫోర్లు), మహిపాల్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి (3/27), సుయశ్ శర్మ (2/30), రసెల్ (2/29) బెంగళూరును దెబ్బ కొట్టారు. ధనాధన్ ఆరంభం... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు జేసన్ రాయ్, జగదీశన్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన రాయ్.. షహబాజ్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా నాలుగు సిక్స్‌లతో అలరించాడు. తొమ్మిది ఓవర్లకు 82/0తో దూసుకుపోతున్న కోల్‌కతాకు వైశాక్ బ్రేక్ వేశాడు. పదో ఓవర్లో జగదీశన్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు), జేసన్ రాయ్‌లను వైశాక్ అవుట్ చేశాడు. రెండు క్యాచ్‌లు వదిలేసి... ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయినా కోల్‌కతా అదే దూకుడు కొనసాగించింది. కోల్‌కతాకు బెంగళూరు ఫీల్డర్ల నిర్లక్ష్యం కూడా కలిసొచ్చిం ది. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 5 వద్ద సిరాజ్.. నితీశ్ రాణా వ్యక్తిగత స్కోరు 19 వద్ద హర్షల్ పటేల్ క్యాచ్‌లు జారవిడిచారు. ఈ రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకున్న రాణా కదంతొక్కాడు. హర్షల్ పటేల్ వేసిన 16వ ఓవర్లోని చివరి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచిన రాణా... వైశాక్ వేసిన 17వ ఓవర్లోని చివరి మూడు బంతుల్లో 4,4,6తో మెరిశాడు. 17 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా 167/2తో నిలిచింది. అయితే 18వ ఓవర్లో హసరంగ స్పిన్‌కు నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 31; 3 ఫోర్లు) పెవిలియన్ చేరారు. ఈ ఓవర్లో హసరంగ 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అయితే సిరాజ్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో రింకూ సింగ్ 6,4,4 కొట్టగా... ఐదో బంతికి రసెల్‌ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో వీస్ రెండు సిక్స్‌లు కొట్టడంతో కోల్‌కతా స్కోరు 200కు చేరింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (బి) వైశాక్ 56; జగదీశన్ (సి) విల్లీ (బి) వైశాక్ 27; వెంకటేశ్ అయ్యర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హసరంగ 31; నితీశ్ రాణా (సి) వైశాక్ (బి) హసరంగ 48; రసెల్ (బి) సిరాజ్ 1; రింకూ సింగ్ (నాటౌట్) 18; డేవిడ్ వీస్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1–83, 2–88, 3–168, 4–169, 5–185. బౌలింగ్: సిరాజ్ 4–0–33–1, విల్లీ 3–0–31–0, హసరంగ 4–0–24–2, షహబాజ్ అహ్మద్ 1–0–25–0, వైశాక్ 4–0–41–2, హర్షల్ పటేల్ 4–0–44–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) వెంకటేశ్ అయ్యర్ (బి) రసెల్ 54; డుప్లెసిస్ (సి) రింకూ సింగ్ (బి) సుయశ్ శర్మ 17; షహబాజ్ అహ్మద్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుయశ్ శర్మ 2; మ్యాక్స్‌వెల్ (సి) నితీశ్ రాణా (బి) వరుణ్ 5; మహిపాల్ (సి) రసెల్ (బి) వరుణ్ 34; దినేశ్ కార్తీక్ (సి) రింకూ సింగ్ (బి) వరుణ్ 22; ప్రభుదేశాయ్ (రనౌట్) 10; హసరంగ (సి) అనుకూల్ రాయ్ (సబ్) (బి) రసెల్ 5; విల్లీ (నాటౌట్) 11; వైశాక్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–31, 2–51, 3–58, 4–113, 5–115, 6–137, 7–152, 8–154. బౌలింగ్: వైభవ్ అరోరా 2–0–22–0, ఉమేశ్ యాదవ్ 1–0–19–0, సుయశ్ శర్మ 4–0–30–2, వరుణ్ చక్రవర్తి 4–0–27–3, రసెల్ 4–0–29–2, సునీల్ నరైన్ 4–0–41–0, నితీశ్ రాణా 1–0–8–0. ఐపీఎల్లో నేడు రాజస్తాన్ VS చెన్నై (రాత్రి గం. 7:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
Viral Video: ఆహా.. ఏమా మాయాజాలం, కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్సీ క్లీన్ బౌల్డ్
IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు. Varun Chakravarthy was absolutely unplayable in that spell! 3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS — Prasenjit Dey (@CricPrasen) April 6, 2023 ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌కు భారీ ధర.. వాషింగ్టన్ సుందర్‌కు నామమాత్రపు రేట్
TNPL 2023 Auction: ప్రాంతీయ క్రికెట్ టోర్నీ అయిన తమిళనాడు ప్రీమియర్ లీగ్ సక్సెస్‌ఫుల్‌గా ఆరు ఎడిషన్లు పూర్తి చేసుకుని ఏడవ ఎడిషన్‌ను సిద్ధమవుతుంది. సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహకులు తొలిసారి ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 23), రేపు జరుగబోయే ఈ వేలంలో మొత్తం 942 మంది ఆటగాళ్లు (తమిళనాడుకు చెందిన వారు) తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, విజయ్ శంకర్ తదతరులు పాల్గొంటుండగా.. పెద్ద పేర్లలో రిటెన్షన్ చేసుకున్న ఏకైక ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. దిండిగుల్ డ్రాగన్స్ ఫ్రాంచైజీ యాశ్ను 60 లక్షలకు రిటైన్ చేసుకుంది. వేలం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్.. టీమిండియా ఆల్‌రౌండర్, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 10.25 లక్షల రికార్డు ధరకు సొంతం చేసుకోగా.. ప్రస్తుత భారత పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడు వాషింగ్టన్ సుందర్‌ను మధురై పాంథర్స్ 6.75 లక్షలకు , మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని దిండిగుల్ డ్రాగన్స్ 6.75 లక్షలకు సొంతం చేసుకుంది. వేలంలో పై పేర్కొన్న ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. సాయ్ కిషోర్, సాయ్ సుదర్శన్, బాబా అపరాజిత్, బాబా ఇంద్రజిత్, మురుగన్ అశ్విన్.. ఇలా దేశవాలీ స్టార్లు చాలా మంది వేలంలో పాల్గొంటున్నారు. కాగా, ఈ వేలంలో ప్రతి జట్టు కనిష్టంగా 16 మందిని, గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. లీగ్‌లో పాల్గొనే 8 జట్లు ఇద్దరు ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫ్రాంచైజీల గరిష్ఠ పర్సు విలువ 70 లక్షలుగా నిర్ధారించారు. వేలంలో పాల్గొనే ఆటగాళ్లను నాలుగు కేటగిరీలు విభజించిన నిర్వహకులు.. ఏ కేటగిరి (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 10 లక్షలు, బి కేటగిరి (సీనియర్ బీసీసీఐ దేశవాలీ మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 6 లక్షలు, సి కేటగిరి (పై రెండు కేటగిరిల్లో లేకుండా, కనీసం 30 TNPL మ్యాచ్‌లు ఆడిన వారు) ఆటగాళ్లకు 3 లక్షలు, డి కేటగిరి (ఇతర ఆటగాళ్లు) ఆటగాళ్లకు 1.5 లక్షల చొప్పున బేస్ ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలు.. చేపక్ సూపర్ గిల్లీస్ (ఎన్ జగదీశన్) నెల్లై రాయల్ కింగ్స్ (అజితేశ్, కార్తీక్ మణకందన్) ఐ డ్రీమ్ తిరుపూర్ తమిజాన్స్ (తుషార్ రహేజా) లైకా రోవై కింగ్స్ (షారుక్ ఖాన్, సురేశ్ కుమార్) దిండిగుల్ డ్రాగన్స్ (రవిచంద్రన్ అశ్విన్) రూబీ త్రిచీ వారియర్స్ (ఆంటోనీ దాస్) సేలం స్పార్టన్స్ (గణేశ్ మూర్తి) మధురై పాంథర్స్ (గౌతమ్) -
'ఐపీఎల్లో అదరగొడతా.. మళ్లీ తిరిగి టీమిండియాలోకి వస్తా'
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గత కొన్నాళ్లుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు చివరి సారిగా టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తరపున ఆడాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో అతడిని సెలక్టర్లు గతేడాది ప్రపంచకప్‌కు ఎంపిక చేశారు. అయితే ఈ మెగా ఈవెంట్లో వరుణ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మార్క్యూ ఈవెంట్లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో అప్పటి నుంచి అతడిని సెలక్టర్లు పక్కనబెట్టారు. ఇక ఇది ఇలా ఉండగా.. భారత జట్టులోకి పునరాగమనం చేసి తన సత్తాను నిరూపించుకోవాలని వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం భావిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడు స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. త్వరలో జరగనున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ఐపీఎల్-2023లో రాణించి తిరిగి భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ.. "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకు చాలా ముఖ్యమైనది. అక్కడ మెరుగైన ప్రదర్శన చేసి తిరిగి భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అదే విధంగా వచ్చే ఏడాది ఐపీఎల్లో అద్భుతంగా రాణించడానికి ప్రయత్నిస్తాను. ఈ రెండు ఈవెంట్లలో నేను బాగా రాణిస్తే.. ఖచ్చితంగా తిరిగి భారత జట్టులోకి చోటు దక్కుతుంది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?! -
ఉమేశ్ యాదవ్-వరుణ్ చక్రవర్తి సరికొత్త రికార్డు
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్‌లో కేకేఆర్ టెయిలెండర్లు ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు సరికొత రికార్డు నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైన వేళ ఈ ఇద్దరు కలిసి ఆఖరి వికెట్‌కు 27 పరుగులు జత చేశారు. విశేషమేమిటంటే.. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఉమేశ్ యాదవ్(18), వరుణ్ చక్రవర్తి(10 నాటౌట్) పరుగులు చేశారు. వీరిద్దరు ఆడడంతో కేకేఆర్ 128 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించింది. కాగా ఐపీఎల్లో ఒక జట్టు తరపున 10,11 బ్యాట్స్‌మెన్ అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇక కేకేఆర్ బ్యాటర్స్‌లో రసెల్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే ఉమేశ్ యాదవ్- వరుణ్ చక్రవర్తిలను చూసి ప్రధాన బ్యాటర్స్ బ్యాటింగ్ ఆడడం నేర్చుకోవాలని అభిమానులు కామెంట్స్ చేశారు. చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది -
T20 WC: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి?
Reason Behind India Bad Show In Tourney Explained: తొలి రెండు మ్యాచ్‌లలో రెండు పెద్ద జట్ల చేతిలో పరాజయం! ఇంకా కోలుకునేందుకు అవకాశం ఎక్కడిది? ఆ తర్వాత చిన్న టీమ్‌లపై మూడు భారీ విజయాలు సాధించినా అవి సెమీస్ లెక్కకు సరిపోలేదు. ఆట ముగిసిన తర్వాత ‘అలసట’ అని చెప్పినా, ‘టాస్’ ప్రభావం గురించి మాట్లాడినా అవన్నీ ఉత్త మాటలుగానే అనిపిస్తాయి. స్టార్లకు, రికార్డులకు కొదవ లేని జట్టు. సుదీర్ఘ కాలంగా వరుస విజయాలు సాధించి ఊపు మీద కూడా ఉంది. అయినా సరే విరాట్ బృందం మెగా టోర్నీలో చేతులెత్తేసింది. నిజానికి ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు యూఏఈలో ఆడుతున్న అనుభవం ఎంత ప్రయోజనకరమో, పిచ్‌లు మన స్పిన్‌కు ఎంతగా అనుకూలిస్తాయో ఊదరగొట్టినవారు ఇప్పుడు ఓటమి తర్వాత అదే ఐపీఎల్‌కు వరల్డ్ కప్‌కు మధ్య కాస్త వ్యవధి ఉంటే బాగుండేదని చెబుతున్నారు! అప్పుడు ఇలాగే.. ►నిజానికి 2016 టి20 ప్రపంచకప్‌లో కూడా భారత్ ఒకదశలో దాదాపు ఇలాంటి పరిస్థితిలో నిలిచింది. అయితే అప్పుడు కోలుకునే అవకాశం లభించింది. న్యూజిలాండ్ చేతిలో 47 పరుగుల తేడాతో చిత్తుగా ఓడటంతో భారత్ టోర్నీ మొదలైంది. దాంతో ఆపై జరిగే ప్రతీ మ్యాచ్ ‘నాకౌట్’లాగానే సాగింది. ఓడితే నిష్క్రమించే పరిస్థితిలో జట్టు బరిలోకి దిగుతూ వచ్చింది. పాక్‌పై ఏకపక్షంగా, బంగ్లాపై అనూహ్యంగా గెలిచిన జట్టు ఆసీస్‌ను అద్భుత రీతిలో ఓడించి సెమీస్ చేరింది. ఈసారి కాస్త మారిన ఫార్మాట్‌తో (12 జట్లు) మూడు విజయాలు ముందంజ వేసేందుకు సరిపోలేదు. 2012 టి20 ప్రపంచ కప్ తర్వాత ప్రతీ ఐసీసీ టోర్నీ (2013, 14, 15, 16, 17, 19)లో కనీసం సెమీస్ చేరిన టీమిండియా ఇప్పుడు మళ్లీ గ్రూప్ దశకే పరిమితమైంది. .@ImRo45 & @klrahul11 score fifties as #TeamIndia seal a clinical 9⃣-wicket win over Namibia. 👏 👏#T20WorldCup #INDvNAM Scorecard ▶️ https://t.co/kTHtj7LdAF pic.twitter.com/4HgbvFAyWJ — BCCI (@BCCI) November 8, 2021 సమష్టి వైఫల్యమా? ►భారత్ పేలవ ప్రదర్శనకు బ్యాటింగ్ వైఫల్యం కారణమా, బౌలర్లా లేక సమష్టి వైఫల్యమా! చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఆటకు ముందే మనోళ్లు గెలుపు ఖాయం అన్నట్లుగా కనిపించారు. పాత రికార్డులను ముందేసుకొని సరిపెట్టుకుంటూ కొత్తగా మారిన పాక్‌పై ఎలా ఆడాలనే సన్నద్ధత కనిపించలేదు. లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్ ‘డకౌట్’ అందుకు చిన్న ఉదాహరణ మాత్రమే. 151 పరుగులు చేసినా... చివరకు ఒక్కరినీ అవుట్ చేయలేక 10 వికెట్ల తేడాతో ఘోర పరాభవం. ►న్యూజిలాండ్‌తో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు ఉంటాయని తెలిసిన తర్వాత కూడా జట్టు అంతకంటే పేలవ ప్రదర్శన కనబర్చింది. మరీ 110 పరుగులకే పరిమితమైన తర్వాత ఇంకా గెలుపుపై ఆశలు మిగిలి ఉంటాయా! ఈసారి రోహిత్, కోహ్లి, రాహుల్ కలిసికట్టుగా విఫలం కావడంతో అసలు స్కోరు బోర్డు ముందుకే సాగలేదు. ఆపై అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలపై ఎంత ప్రతాపం చూపించినా అంతా విఫలప్రయత్నమే! ►టాప్ ఆటగాళ్ల వైఫల్యాలతో పాటు సగం ఫిట్నెస్తో ఉన్న భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలను భారత్ బలవంతంగా కొనసాగించింది. ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ ఎంపికనే ఒక పెద్ద మిస్టరీలాగా అనిపించింది. ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన చహల్‌ను పరిగణలోకి తీసుకోకుండా రాహుల్ చహర్‌పైనే నమ్మకముంచిన మేనేజ్మెంట్ నాలుగు మ్యాచ్‌లలో అవకాశమే ఇవ్వలేదు. తాను అలసిపోయినట్లు బుమ్రానే స్వయంగా చెప్పగా, ఈ ఫార్మాట్‌కు తాను పనికిరానని షమీ నిరూపించేశాడు. అయితే టాస్‌ను, మంచును నిందించి లాభం లేదు. వీటి ప్రభావం తొలుత బ్యాటింగ్ చేయడంపై ఎలాగూ ఉండదు. కనీస స్కోరు కూడా చేయనప్పుడు దిగ్గజ బౌలర్లు కూడా మ్యాచ్‌లను రక్షించలేరు. ►ఓవరాల్‌గా చూస్తే మన బ్యాటింగ్‌లో పదును లేకపోవడంతో ఈ ని్రష్కమణకు కారణమైంది. సగటు అభిమానులు తాజా ఫలితంపై బాధపడిపోతుండవచ్చు కానీ ఆటగాళ్ల కోణంలో చూస్తే ఇది మరో టోర్నీ మాత్రమే. కనీసం వారు కూడా తప్పుప్పొలను బేరీజు వేసుకునే సమయం కూడా లేకుండా వచ్చే బుధవారం సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌కు సిద్ధం కావాల్సిందే. ప్రదర్శన ఎలా ఉన్నా భారత క్రికెట్ నిరంతర ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. ►చివరగా... మెంటార్ హోదాలో భారీ ఎంట్రీ ఇచ్చిన ధోని ఈ టోర్నీలో సరిగ్గా ఎలాంటి పాత్ర పోషించాడో ఎవరైనా చెప్పగలరా! చదవండి: Virat Kohli: అందరికీ థాంక్స్.. ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం -
ధోని వద్దన్నా.. కోహ్లి వినలేదా?
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో మెంటార్ రోల్‌ను పోషిస్తున్నాడు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ధోనిని మెంటార్‌గా తీసుకుంది బీసీసీఐ. ఇటు భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, అటు ఐపీఎల్లో సీఎస్కేకు నాలుగు టైటిల్స్ అందించిన సారథిగా ఉన్న ధోనిని మెంటార్‌గా నియమించుకోవడం సబబే. ప్రధానంగా ధోనిని తీసుకోవడం వెనుక కోహ్లి కూడా ఉన్నాడనేది కాదనలేని వాస్తవం. ఐపీఎల్లో సీఎస్కే ఫైనల్‌కు చేరిన తర్వాత కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కోహ్లి వ్యాఖ్యానించడం ఆపై టీమిండియా మెంటార్‌గా ధోని నియామకం జరిగిపోయాయి. కోహ్లి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం? గతవారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయిన తర్వాత ధోని-కోహ్లిల గురించి తీవ్ర చర్చ నడిచింది. నెటిజన్లు ఒక్కోక్కరూ తలో విధంగా స్పందిస్తూ ఈ ఇద్దరే గురించే ఎక్కువ కామెంట్ చేశారు. పాక్‌తో మ్యాచ్‌లో భాగంగా ఇషాన్ కిషన్ ద్వారా పంపిన సలహాలు, సూచనలు విరాట్ కోహ్లి పాటించలేదనే దానిపై చర్చ నడిచింది.. కోహ్లితో పాటు రిషభ్ పంత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్ ఏదో చెప్పగా, దానికి కోహ్లి మరొకటి చెప్పాడు. తాను ఔటైతే హార్దిక్ పాండ్యాను తర్వాత పంపమని, ఒకవేళ రిషభ్ అయితే రవీంద్ర జడేజాను పంపమనే సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే వీరిద్దరిలో ఎవరు ఔటైనా హార్దిక్‌నే తర్వాత పంపుదామనే ధోని సలహాను ఇషాన్ తీసుకురాగా, దానికి కోహ్లి కాస్త భిన్నంగా స్పందించాడాని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కోహ్లి ప్రత్యేకంగా ఇషాన్‌ను పిలిచి మరీ చెప్పడం ధోని సలహాను వ్యతిరేకించాడనే దానికి మరింత బలం చేకూర్చేదిగా ఉందని అభిమానుల అభిప్రాయంగా ఉంది. వరుణ్‌ను ధోని వద్దన్నాడా? ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఆడపా దడపా భారత జట్టులోకి వస్తున్న లెగ్ బ్రేక్ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. అంతర్జాతీయంగా ఇంకా నిరూపించుకోలేకపోయాడు. ఇంకా పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్న వరుణ్‌ను.. వరల్డ్ టీ20కి ఎంపిక చేశారు. కానీ పాకిస్తాన్‌తో పోటీకి వరుణ్‌ను వద్దనే ధోని అన్నాడనే టాపిక్ వచ్చింది. పెద్దగా అనుభవం లేని వరుణ్ కంటే, రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేస్తే మంచిదని ధోని ఒక మెంటార్‌గా చెప్పాడనేది వీరి భావన. కానీ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో వరుణ్ మెరుగైన ప్రదర్శనే చేశాడు. దాంతో వరుణ్ వైపే మొగ్గుచూపాడు కోహ్లి. కానీ అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని వరుణ్ ఎంపిక సరైనది కాదనేది మ్యాచ్ తర్వాత తేటతెల్లమైంది. వరుసగా గాయాల బారిన పడుతున్న వరుణ్ ఎంపికపై ఆదినుంచి డైలమా ఉంది. అతన్ని తీసుకోవాలా వద్దా.. అనే సందిగ్థంలోనే పాక్ వంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్ ఆడేశాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఫలితంగా కోహ్లి తప్పుచేశాడనే వాదన తెరపైకి వచ్చింది. దీనిపై అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. పాక్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన వరుణ్..వికెట్లేమీ తీయకుండా 33 పరుగులిచ్చాడు. కోహ్లికి జట్టును ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అందులో ధోని తలదూర్చే అవకాశం దాదాపు ఉండదనేది ఒక వాదన. మరి ధోని-కోహ్లిల మధ్య అంతర్గతంగా ఏమి జరిగిందనే వారికే తెలియాలి. మార్పులు తప్పవా? ఈ టీ20 వరల్డ్‌కప్‌లో మిగిలిఉన్న మ్యాచ్‌లు టీమిండియాకు కీలకం. దాంతో కివీస్‌తో ఆదివారం(ఆక్టోబర్ 31) మ్యాచ్‌కు భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా వరుణ్ చక్రవర్తి, భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో ఆడేది అనుమానంగానే ఉంది. వీరిద్దరూ రాణించడం విషయాన్ని పక్కన పెడితే, పాక్ జట్టును పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు.మరొకవైపు షమీ కూడా రాణించలేదు. కానీ టీమిండియా పేస్ విభాగంలో భువీని తప్పించి అతని స్థానంలో శార్దూల్ తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేస్తున్నప్పుడు తానొక బ్రేక్-త్రూ బౌలర్ అనే విషయాన్ని శార్దూల్ చాలాసార్లు నిరూపించుకున్నాడు. దాంతో శార్దూల్, అశ్విన్‌లు తుదిజట్టులో ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌కు వరుణ్ వద్దే వద్దు! న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు వరుణ్ వేసుకోవద్దని ఇప్పటికే మాజీలు సలహాలు ఇవ్వడం షురూ చేశారు. ఐపీఎల్లో విజయవంతమైన బౌలరే కానీ వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో, అందులోనూ కివీస్‌తో కీలకమైన మ్యాచ్‌కు వరుణ్ తీసుకుని మళ్లీ తప్పుచేయవద్దని టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తేల్చిచెప్పాడు. అతనికి విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమం అని పేర్కొన్నాడు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసినా అంతర్జాతీయ క్రికెట్ అనేది భిన్నమైనదని పేర్కొన్నాడు. ‘కీలకమైన మ్యాచ్‌లు టీమిండియా ముందున్న తరుణంలో వరుణ్‌ను పక్కన పెట్టండి. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్లు పెద్దగా రాణించలేరు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ విషయం నిరూపితమైంది. స్పిన్నర్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు’ అని దిలీప్ దోషి పేర్కొన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లు తమ గత ఫామ్‌ను అందుపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. -
అలాంటి మిస్టరీ బంతులను పాక్‌లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారు..!
Salman Butt Takes A Dig At Varun Chakaravarthy: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తేలిపోవడంపై పాక్ మాజీ సారధి సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్ సంధించిన మిస్టరీ బంతులను పాక్‌లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారని.. వేళ్లతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టే ప్రయత్నం చేయడం పాక్‌లో సర్వసాధారణమని.. అందుకే వరుణ్‌ను పాక్ ఓపెనర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారని తెలిపాడు. పాక్‌పై మిస్టరీ బౌలింగ్ ప్రభావం నామమాత్రమేనని, గతంలో శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ సైతం పాక్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడని అన్నాడు. 2003-04 పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు సభ్యుడు ఇర్ఫాన్ పఠాన్‌పై కూడా అప్పటి పాక్ కోచ్ జావిద్ మియాందాద్ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇర్ఫాన్ లాంటి బౌలర్లు పాక్‌లో వీధికొకరు ఉంటారని అవమానించాడు. కాగా, నిన్న పాక్‌తో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు బౌల్ చేసి 33 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్‌కు భారత్‌పై తొలి విజయం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో పాక్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్ 17.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసి చారిత్రక విజయం నమోదు చేసింది. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు -
టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్..!
Varun Chakravarthy Dodgy Knees Became Biggest Head Ache For Team India: త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఓ షాకింగ్ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న వరుణ్..మోకాళ్ల నొప్పులతో సతమతమవుతున్నాడు. పెయిన్ కిల్లర్ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దీంతో పొట్టి ప్రపంచకప్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో వరుణ్ స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్.. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు. చదవండి: T20 World Cup 2021: ఈ ఐదు తొలిసారిగా.. సరికొత్తగా.. ఆసక్తికర విశేషాలు -
T20 World Cup: టీమిండియాకు అతడే కీలకం: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan Comments On Varun Chakravarthy: రానున్న టీ20 వరల్డ్‌కప్‌లో యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి టీమిండియాకు కీలకంగా మారనున్నాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఐపీఎల్లో ఆడిన అనుభవం అతడికి ప్రయోజనకరంగా మారనుందని పేర్కొన్నాడు. అయితే, తొలి ప్రపంచకప్ ఆడే సమయంలో ఒత్తిడికి గురవడం సహజమని, దానిని అధిగమిస్తే సత్ఫలితాలు పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్కప్నకై ప్రకటించిన జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు దక్కిన విషయం విదితమే. ఇక ఐపీఎల్-2021లో భాగంగా యూఏఈ వేదికగా సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ వరుణ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మాక్స్వెల్, సచిన్ బేబి, వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన వరుణ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... ‘‘వరల్డ్‌కప్‌లో తను కీలకంగా మారే అవకాశం ఉంది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్‌కు... లీగ్ మ్యాచులకు తేడా ఉంటుంది. ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఐపీఎల్ ఆడటం వల్ల కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. వరుణ్ కూడా అంతే. నిజానికి వన్డే వరల్డ్ కప్ 2011 సమయంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్ వేయడం మొదలుపెట్టాడు. అదొక ఆశ్చర్యకరమైన డెలివరీ. ఇలాంటి సర్ప్రైజ్ ఫ్యాక్టర్ కచ్చితంగా బౌలర్‌కు మేలు చేస్తుంది. కొత్త విషయాలు కనుగొనడం బౌలర్లకు ఉపయుక్తంగా ఉంటాయి. బహుశా వరుణ్ చక్రవర్తి నుంచి కూడా ఇదే తరహాలో ఏవైనా కొత్త డెలివరీలు ఊహించవచ్చేమో’’ అని పేర్కొన్నాడు. కాగా ఫాస్ట్ బౌలర్లు తమ వేగాన్ని(బంతి) ఒక్కసారిగా తగ్గించి బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టేందుకు విసిరే బంతిని నకుల్బాల్గా పేర్కొంటారన్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. కాగా ఇటీవలి శ్రీలంక పర్యటనతో వరుణ్ చక్రవర్తి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే -
KKR vs RCB: కోల్‌కతా ధనాధన్ షో.. రసెల్ పడేశాడు, వరుణ్ తిప్పేశాడు
భారత్‌లో చక్కగా సాగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌లాంటి సూపర్ హిట్టర్లున్న జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్‌ను ముగించింది. మొదట స్పిన్–పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆటకట్టించిన నైట్‌రైడర్స్ లక్ష్యాన్ని మెరుపువేగంతో ఛేదించింది. అబుదాబి: ఐపీఎల్–14 సీజన్ రెండో అంచెలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లి సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్‌లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్ బృందం బ్యాటింగ్‌లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్‌మని ఊదేసింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. రసెల్ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్‌తో... వరుణ్ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్‌తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. వరుణ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోహ్లి 5, డివిలియర్స్ 0 బెంగళూరు దళానికి బ్యాటింగే బలం. అందులోనూ కోహ్లి, డివిలియర్స్‌ల బ్యాట్ల నుంచి జాలువారే పరుగులు, సిక్సర్లు అభిమానులకు కనువిందు. కానీ... సోమవారం కోల్‌కతా కసి ముందు ఎవరి ఆటలు సాగలేదు. మ్యాక్స్‌వెల్ రూపంలో జట్టుకు మరో మెరుపు వీరుడు జతయినప్పటికీ నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు మొత్తం బెంగళూరు ఇన్నింగ్సే చెల్లాచెదురైంది. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్‌ప్లేలో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో బాగానే కనిపించింది. 9వ ఓవర్ వేసేందుకు రసెల్ వచ్చాక, స్పిన్నర్ వరుణ్ మ్యాజిక్ మొదలయ్యాక బెంగళూరు ఒక్కసారిగా కుదేలైంది. రసెల్ తన తొలి ఓవర్లోనే భరత్ (16), డివిలియర్స్ (0)ను ఔట్ చేశాడు. వరుణ్ కూడా తన సహచరుడినే ఫాలో అయ్యాడు. మ్యాక్స్‌వెల్ (10), హసరంగ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఇలా 8 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లే చితగ్గొట్టారు... అవతలివైపు ఆపసోపాలు పడి చేసిన పరుగుల్ని ఇవతలివైపు ఇద్దరంటే ఇద్దరే బాదేశారు. కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో బెంగళూరు బౌలర్లు అలసిపోకుండా సగం కోటా (ఐదుగురు తలా 2 ఓవర్లు వేశారు)లోనే లక్ష్యం పూర్తయ్యింది. పదో ఓవర్లో గిల్ ఔటైనా... కావాల్సిన 11 పరుగుల్ని మూడు బౌండరీలతో వెంకటేశ్ అదే ఓవర్లో పూర్తి చేయడంతో రసెల్‌కు బంతిని ఎదుర్కొనే అవకాశమే చిక్కలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్ కృష్ణ 5; పడిక్కల్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; శ్రీకర్ భరత్ (సి) గిల్ (బి) రసెల్ 16; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్ 0; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ పటేల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చహల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్ 4–0–24–2, నరైన్ 4–0–20–0, రసెల్ 3–0– 9–3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) సిరాజ్ (బి) చహల్ 48; వెంకటేశ్ (నాటౌట్) 41; రసెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94. వికెట్ పతనం: 1–82. బౌలింగ్: సిరాజ్ 2–0–12–0, జేమీసన్ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్ 2–0–23–1, హర్షల్ పటేల్ 2–0–13–0. -
టీ20 వరల్డ్ కప్: నా ఓటు అతడికే: ముత్తయ్య మురళీధరన్
కొలంబో: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికే కుల్దీప్ తన ప్రతిభను నిరూపించుకున్నాడని, అయినా దురుదృష్టవశాత్తూ కొన్నిసార్లు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో వరుణ్ చక్రవర్తితో పోలిస్తే, కుల్దీప్నకే టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అతడికే తన ఓటు అని ముత్తయ్య మురళీధరన్ స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్-2021లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కుల్దీప్‌నకు యాజమాన్యం అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. స్పిన్ విభాగంలో సునిల్ నరైన్, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తిని మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంది. ఈ విషయంపై స్పందించిన కుల్దీప్.. ‘‘నేను మరీ అంతపనికిరాని వాడినా? చెత్తగా ఆడతానా?’’ అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక భారత జట్టు శ్రీలంక టూర్లో భాగంగా జట్టులో చోటుదక్కించుకున్న అతడు... వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్.. చివరి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. అదే విధంగా.. మొదటి టీ20లో ఆడే అవకాశం రాకపోగా.. రెండో టీ20లో 2 వికెట్లతో రాణించాడు. మూడో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో భాగంగా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి.. తొలి రెండు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీశాడు. మూడో మ్యాచ్‌లో ఖాతా తెరవలేకపోయాడు. ఈ నేపథ్యంలో రానున్న టీ20 వరల్డ్ కప్ అంచనాల గురించి ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ... ‘‘యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడక తప్పదు. ఎవరు ఫాంలో ఉంటారు.. ఎవరు ఫాం కొనసాగిస్తారన్న అంశాలు తేలతాయి. అయితే, స్పిన్నర్ల విషయంలో నేను మాత్రం కుల్దీప్ యాదవ్ వైపే మొగ్గు చూపుతాను. ఎందుకంటే వికెట్లు తీయగల బౌలర్‌గా తనను తాను నిరూపించుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే... తను మంచి బౌలర్. టీమిండియా, ఐపీఎల్ జట్లకు తను బెటర్ ఆప్షన్. అయితే, అజంతా మెండిస్, సునీల్ నరైన్ అంతటి స్థాయి వరుణ్‌కు లేదనే అనుకుంటాను. తను బ్యాట్స్‌మెన్‌ను మెస్మరైజ్ చేయలేడు. ఇంకా మెరుగ్గా రాణించాల్సి ఉంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో భాగంగా ముత్తయ్య మురళీధరన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. -
వికెట్ కీపర్‌గా మొదలెట్టాడు.. మిస్టరీ స్పిన్నర్లా రాణిస్తున్నాడు
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల వరుణ్ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, అతని బౌలింగ్‌లో ఉన్న మిస్టరీ.. అతని జీవన ప్రయాణంలోనూ కొనసాగుతుంది. వికెట్ కీపర్‌గా క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వరుణ్.. ప్రస్తుతం వైవిధ్యమైన బౌలర్‌గా రాణిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించిన అతను 17 ఏళ్ల వరకు అలానే కొనసాగాడు. అయితే వికెట్ కీపర్‌గా పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్‌ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. కానీ ఆ పని కిక్ ఇవ్వకపోవడంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్‌ను వదిలేసి స్పిన్నర్‌గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్లో స్పిన్నర్స్‌ను బాగా కొడతారని భావించిన ఈ తమిళనాడు కుర్రాడు.. తన స్పిన్‌కు పేస్‌ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్‌లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడు రకాల వేరియేషన్స్ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్‌తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో బ్యాట్స్‌మెన్ తెగ ఇబ్బంది పడేవారు. అనంతరం 2017లో సీఎస్కే నెట్ బౌలర్‌గా అవకాశం దక్కించుకున్న వరుణ్.. మాజీ కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ దృష్టిని ఆకర్శించాడు. డీకే పట్టుపట్టి మరీ వరుణ్‌ను కేకేఆర్ నెట్ బౌలర్‌గా ఎంపిక చేయించాడు. అక్కడ సునీల్ నరైన్ సాయంతో మెళకువలు నేర్చుకున్న వరుణ్.. మిస్టరీ స్పిన్నర్లా మారాడు. దీంతో 2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ జట్టు వరుణ్‌ను రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం 2020 సీజన్లో కేకేఆర్ మేనేజ్మెంట్ వరుణ్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడిన అతను 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్లోనూ అద్భుతంగా రాణించిన వరుణ్.. 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్.. గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో అతనికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. -
వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ సందర్బంగా కరోనా బారిన పడి, ఇటీవలే కోలుకున్న కేకేఆర్ ఆటగాడు సందీప్ వారియర్.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మే 2న అతని భార్యతో వీడియో కాల్ మాట్లాడుతుండగా.. ఆమె అతనికి కరోనా సోకిందని చెప్పినట్లు తెలిపాడు. భార్య ఆర్తి కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్ కావడంతో.. ఆమె ఈ విషయాన్ని చూపులతో పసికట్టిందని, అంతే కాకుండా ఆమె కూడా గతేడాది కరోనా బారిన పడిందని సందీప్ చెప్పుకొచ్చాడు. కరోనా బారిన పడినప్పుడు ఆమెకున్న లక్షణాలే తనకున్నాయని చెప్పడంతో, టెస్టు రిపోర్ట్ రాకముందే తనకు కరోనాగా నిర్దారించిందని గుర్తు చేసుకున్నాడు. కాగా, సందీప్ వారియర్.. అంతకు ముందే ఓ సారి కరోనా టెస్ట్ చేయించాడు. దీంట్లో అతనికి నెగిటివ్ వచ్చింది. అయితే ఆతర్వాత అతని భార్య సలహా మేరకు రెండో సారి టెస్ట్ చేయించగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. నాటి నుంచి దాదాపు నాలుగు వారాలు మహమ్మారితో పోరాడిన సందీప్.. ఇటీవలే కోలుకొని, పాత విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, సందీప్‌తో పాటు మరో కోల్‌కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి కూడా కరోనా బారిన పడి కొద్ది రోజుల క్రితమే కోలుకున్నాడు. కాగా, ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ అర్దాంతరంగా ముగిసింది. ఈ సీజన్లో కోల్ కతా 7 మ్యాచ్‌లు ఆడగా 2 విజయాలు, 5 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ -
షారుక్ భాయ్ మమ్మల్ని వదల్లేదు.. రోజు ఎంక్వైరీ చేసేవాడు
చెన్నై: కరోనా మహమ్మారి సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు ఇద్దరికి కరోనా పాటిటివ్‌గా తేలడంతో ముందు జాగ్రత్త చర్యగా ఇద్దరు ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించారు. ఆ తర్వాత సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీల్లో కూడా కరోనా కలకలం రేపడంతో సీజన్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. తాజాగా సందీప్ వారియర్ కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సందీప్ వారియర్ కరోనా సమయంలో కేకేఆర్ తనతో పాటు వరుణ్ చక్రవర్తిని ఎలా చూసుకుందనే దానిపై చెప్పుకొచ్చాడు. ''మాకు కరోనా పాజిటివ్ అని తేలగానే చాలా భయపడిపోయాం.అయితే కేకేఆర్ యాజమాన్యం మాకు దైర్యం చెప్పింది. మా జట్టు డాక్టర్ శ్రీకాంత్, వేన్ బెంట్లీ(మేనేజర్) ,రాజు (లాజిస్టిక్స్) మాతో పాటే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మా ఇద్దరికి నెగెటివ్ వచ్చిన తర్వాతే వారు ఇంటికి వెళ్లారు. అంతేగాక కేకేఆర్ సహ యజమాని షారుక్ ఖాన్ మమ్మల్ని వదల్లేదు. మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతీరోజు మా ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేసేవాడు. షారుక్ తన జట్టులో ఎవరైనా ఆటగాడు ఏ విషయంలో బాధపడ్డా అతను ఊరుకోడని.. వారి సమస్యను తీర్చేందుకు ముందుకు వస్తాడని తెలిసింది. ఈ విషయం మాకు ఆనందాన్ని కలిగించింది. అయితే మాకు కరోనా సోకిన మరుసటి రోజే లీగ్ వాయిదా పడడంతో కాస్త బాధ వేసింది. ఈ సమయంలో షారుక్ మాకు ఫోన్ చేసి.. ముందు మీరు త్వరగా కోలుకోండి.. ఈ సీజన్‌ను రద్దు అయిందని బాధపడకండి.. ఒకవేళ నిర్వహించే అవకాశం ఉంటే మీరు ఆడవచ్చు.. ఈ విషయం గురించి మర్చిపోయి రెస్ట్ తీసుకోండి అని ఫోన్లో చెప్పారు.'' అని సందీప్ తెలిపాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ సీజన్లో కేకేఆర్ ప్రదర్శన చెప్పుకునేంత స్థాయిలో లేదు. మోర్గాన్ సారధ్యంలోని కేకేఆర్ 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే కరోనా కారణంగా రద్దు అయిన సీజన్‌ను సెప్టెంబర్- అక్టోబర్‌లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుంది. చదవండి: కోహ్లి నన్ను స్లెడ్జ్ చేశాడు.. సంతోషం! ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్ చక్రవర్తి -
ఇంకా పూర్తిగా కోలుకోలేదు: వరుణ్ చక్రవర్తి
కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ప్రాక్టీస్ చేసే ఫిట్నెస్ లేదన్నాడు. ఇంకా నీరసం, మగత అలాగే ఉన్నాయని...కోవిడ్ తర్వాతి లక్షణాలతో సతమతమవుతున్నానని 29 ఏళ్ల చక్రవర్తి తెలిపాడు. నైట్‌రైడర్స్ యజమాని షారుక్‌ఖాన్ వ్యక్తిగతంగా మాట్లాడారని, వైరస్ నుంచి కోలుకునేందుకు తనలో స్థైర్యం నింపారని వరుణ్ చెప్పాడు. ఐపీఎల్లో చక్రవర్తి కరోనా బారిన పడ్డాడు. వరుణ్‌కు కరోనా రావడమే ఆ తర్వాత ఐపీఎల్ వాయిదాకు కారణమైంది. -
IPL 2021: ఇంటికి చేరుకున్న వరుణ్, సందీప్
న్యూఢిల్లీ: ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడిన కోల్‌కతా నైట్‌రైడర్స్ క్రికెటర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్స్ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. పది రోజుల క్వారంటైన్ ముగియడంతో వరుణ్ బెంగళూరుకు, సందీప్ త్రిచూర్‌కు వెళ్లిపోయారు. వారు మళ్లీ కోవిడ్–19 పరీక్షకు హాజరవుతారు. మరో వైపు పాజిటివ్‌గా తేలిన న్యూజిలాండ్ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్ ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నాడు. వరుణ్, సందీప్ కేసులు బయటపడిన అనంతరమే 2021 ఐపీఎల్ వాయిదా వరకు వెళ్లింది. కాగా బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఈ సీజన్‌ను నిరవధింకగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా స్థానికంగా టోర్నీ నిర్వహించే అవకాశం లేదని, యూఏఈ లేదా ఇంగ్లండ్‌లోనే మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్-2021లో ఇప్పటి వరకు 29 మ్యాచ్‌లు జరుగగా, ఇంకా 31 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 విజయాలు నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. చదవండి: కోవిడ్‌పై పోరు: సన్‌రైజర్స్ భారీ విరాళం IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! -
IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్!
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి ఎలా సోకిందో బోర్డుకు అంతుచిక్కడం లేదు. ఎక్కడో ఏదో చిన్న నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యాన్నే బోర్డు చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ బయోబబుల్ లీక్‌కు.. మొదట కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తికి.. అక్కడి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా తమకిష్టమైన ఐపీఎల్ వాయిదాకి వరుణ్ కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయోబబుల్ ఉల్లంఘన ఎక్కడ జరిగింది? ఇటీవల ఓ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరణ్‌ని గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భుజం గాయం కావడంతో స్కానింగ్ చేసినట్లు అందరికి చెప్పారు. కానీ అతనికి భుజ గాయం కాలేదని, కడుపులో మంటతో బాధపడడంతో చికిత్స అందించారని తెలుస్తోంది. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్లోకి వెళ్లాలి. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. నేరుగా వెళ్లి సందీప్‌తో కలిశాడు. ఇక్కడ రూల్ బ్రేక్ అయ్యింది. అదే క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైనట్లు భావిస్తున్నారు. అందుకే బోర్డు దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు బయోబబుల్ లీక్ పై విచారణ జరిపిస్తోంది. వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్ ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు వరుణ్ చక్రవర్తి కారణమంటూ అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమంలో వరుణ్‌పై సెటైరికల్ మీమ్స్, కామెంట్స్ పెడుతున్నారు.‘గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తి’ అని ఒకరంటే.. ‘డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని’ మరొకరు వ్యంగ్యంగా అతనిపై ట్వీట్ చేస్తున్నారు. వాళ్లు వరుణ్ ఫొటోను ఎడిటింగ్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వరుణ్ నెటిజన్లుకు ఇలా బుక్కయ్యాడు. ( చదవండి: భారత్‌ను విడిచిపెట్టి వెళ్తున్నా.. నన్ను క్షమించండి ) #iplcancel #iplpostponed #COVIDSecondWaveInIndia #COVIDEmergencyIndia #VarunChakravarthy pic.twitter.com/Rh3ZzamrmT— Gotu Manthan Dave (@GotuDave) May 4, 2021 Dream11 Game Changer of the tournament #ipl2021 goes to #VarunChakravarthy pic.twitter.com/6BZTQ6wPta— Hibernator 🐺 (@PrestigiouStark) May 4, 2021 Suspending IPL is ok but What about suspending @KKRiders . For not following rules & allowing #VarunChakravarthy to join team without quarantine & played match. Bcoz of this 1 wrong decision & match jeetne ki lalach best playing11 ko leke Result- Whole #IPL2021 suspended@BCCI — Jadhav Ashish (@im_jadhavashish) May 4, 2021 -
సందీప్ ఓకే.. కానీ వరుణ్ కోలుకోవాల్సి ఉంది
కోల్‌కతా: ఐపీఎల్ 14వ సీజన్లో కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్ఆర్హెచ్, సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ కరోనా కేసులు వెలుగుచూడడంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరోనా పాజిటివ్‌గా తేలిన వరుణ్, సందీప్‌ల పరిస్థితి గురించి వివరించారు. 'కరోనా బారిన పడిన సందీప్, వరుణ్ చక్రవర్తిలు కోలుకుంటున్నారు. సందీప్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. వరుణ్‌కు మాత్రం ఇంకా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే వరుణ్ పరిస్థితి కాస్త మెరుగైంది. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరుగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ కూడా ఎప్పటికప్పుడు ఆటగాళ్ల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేకేఆర్ ఆటగాళ్లతో సహా సిబ్బందిని ఐసోలేషన్‌కు పంపించాం. వారందరికి కరోనా టెస్టులు నిర్వహించామని... ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని' చెప్పుకొచ్చాడు. ఇక ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్-2021 సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్-19 సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. చదవండి: IPL 2021 సీజన్ రద్దు: బీసీసీఐ -
IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా!
-
IPL 2021: ఇద్దరు ప్లేయర్లకు కరోనా, మ్యాచ్ వాయిదా!
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు కరోనా సెగ తగిలింది. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో నేడు జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. కాగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు వైరస్ సోకినట్లు తేలింది. అదే విధంగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో, టీం మొత్తం ఐసోలేషన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మ్యాచ్‌ను వాయిదా వేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు ఏఎన్ఐతో వ్యాఖ్యానించారు. కాగా భారత్‌లో రోజువారీ కరోనా కేసులు మూడున్నర లక్షలకు పైగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను వీడి స్వదేశాలకు వెళ్లిపోయారు. మరికొందరు బయో బబుల్‌లో ఉండలేక లీగ్ నుంచి వైదొలిగారు. ఇక అత్యంత జాగ్రత్తల నడుమ బయో బబుల్ వాతావరణంలో టోర్నీ నిర్వహిస్తున్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. చదవండి: వార్నర్ హ్యాపీగా లేడు.. ఉండడు కూడా పంజాబ్ కింగ్స్‌కు షాక్: రాహుల్ ఔట్! -
నీలాంటి కెప్టెన్‌ను చూడలేదు.. చాలా విచిత్రంగా ఉన్నావ్!
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం మ్యాచ్‌లో ఆర్సీబీ 205 పరుగుల టార్గెట్‌ను బోర్డుపై ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మ్యాక్స్‌వెల్(78; 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదిరిపోయే ఇన్నింగ్స్‌తో అలరించగా, ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఏబీ డివిలియర్స్(76 నాటౌట్; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును రెండొందల పరుగులు దాటించాడు. ఇందుకు కారణం కేకేఆర్ ఇయాన్ మోర్గాన్ చేసిన తప్పిదాలేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ వేలెత్తి చూపాడు. ప్రధానంగా కోహ్లి(5), రజత్ పాటిదార్(1)లను రెండో ఓవర్లోనే ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని సరిగా వినియోగించుకోలేకపోవడమేనని గంభీర్ ధ్వజమెత్తాడు. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో గంభీర్ మాట్లాడుతూ.. మోర్గాన్‌పై చిందులు తొక్కాడు. ‘ నీ కెప్టెన్సీ నువ్వు.. నీలాంటి కెప్టెన్‌ను నా జీవితంలో చూడలేదు. ఒక బౌలర్ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం. అతన్నే కొనసాగిస్తాం. అలా కోహ్లి, పాటిదార్లను ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి షకీబుల్ హసన్‌ను ఎందుకు తీసుకొచ్చావ్. ఒక ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌలర్‌ను కాదని అతని స్పెల్‌నే మార్చేశావ్. వరుణ్‌తో రెండో ఓవర్ వేయించి, నాల్గో ఓవర్‌ను షకీబుల్‌కు చేత వేయించావు. నీలాంటి కెప్టెన్సీని నేను ఎక్కడా చూడలేదు. నా జీవితంలోనే ఈ తరహా కెప్టెన్సీ ఎరుగను. చాలా విచిత్రమైన కెప్టెన్సీ నీది. ఆపై వెంటనే వరుణ్ చక్రవర్తి చేతికి బంతి ఇచ్చి ఉంటే, మ్యాక్స్‌వెల్ వికెట్‌ను తీసే అవకాశం ఉండేది. అప్పుడు మ్యాచ్ కేకేఆర్ వైపు ఉండేది’ అని తీవ్రంగా విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను హర్భజన్ సింగ్ వేయగా, రెండో ఓవర్‌ను వరుణ్ వేశాడు. ఇక మూడో ఓవర్‌ను షకీబుల్‌తో వేయించిన మోర్గాన్.. మళ్లీ ఎనిమిదో ఓవర్ వరకూ వరుణ్‌కు ఇవ్వలేదు. ఇది విషయాన్ని గంభీర్ తీవ్రంగా తప్పుపడుతున్నాడు. గాయాల బారిన ‘సన్‌రైజర్స్’ ఇక్కడ చదవండి: నా ప్లేయర్ ద ఆఫ్ మ్యాచ్ అవార్డు అతనికే: యువీ స్టోక్స్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ అందజేసిన రాజస్థాన్ రాయల్స్.. రోహిత్ షూపై ఈసారి ఏం రాసుకొచ్చాడో తెలుసా.. -
మిస్టరీ స్పిన్నర్ పెళ్లి.. వైరలవుతున్న వీడియో
ఢిల్లీ : కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. సుదీర్ఘకాలంగా నేహా ఖడేఖర్తో ప్రేమాయణం నడుపుతున్న వరుణ్ చక్రవర్తి శనివారం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు వరుణ్ చక్రవర్తికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా కేకేఆర్ ఫ్రాంచైజీ వరుణ్ చక్రవర్తికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కేకేఆర్ ఒక వీడియోను విడుదల చేసింది. రిసెప్షన్ సందర్భంగా దంపతులిద్దరితో క్రికెట్ ఆడిపించారు. వరుణ్ బంతి విసరగా... అతని భార్య నేహా బ్యాటింగ్ చేస్తుండడం వైరల్‌గా మారింది. (చదవండి : బంతి జెర్సీలో దాచి పరుగు పెట్టాడు) కాగా ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడిన వరుణ్ చక్రవర్తి మంచి ప్రదర్శన నమోదు చేశాడు. సీజన్లో 13 మ్యాచ్‌లాడిన వరుణ్ 6.84 ఎకానమీతో బౌలింగ్ చేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన వరుణ్ చక్రవర్తికి టీమిండియా సెలెక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌కి తొలుత వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు.. అనూహ్యంగా అతను గాయపడడంతో అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్‌కు అవకాశం కల్పించారు. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
అభిమాన హీరోను కలిసిన వరుణ్
సినిమాకు క్రికెట్‌కు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు రంగాలకు ఓ తెలీని కనెక్షన్ ఉంటుంది. సినీ సెలబ్రిటీలు తమకు నచ్చిన క్రికెటర్ ఆటతీరును చూసేందుకు స్టేడియానికి వెళ్తారు. అలాగే క్రికెటర్లు తమ అభిమాన నటులను కలవాలని తాపత్రయపడతారు. ఇదిగో అలానే క్రికెటర్ వరుణ్ చక్రవర్తి కూడా తన అభిమాన హీరో విజయ్ను ఎప్పటినుంచో కలవాలనుకున్నారు. చివరికి కాలం కలిసొచ్చింది. దళపతి విజయ్ ఆఫీసుకు వెళ్లి మరీ వరుణ్ హీరోను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: హీరో విజయ్ అభిమానుల అత్యుత్సాహం!) ఒకే ఫ్రేములో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులకు రెండు కళ్లు చాలడం లేదు. విజయ్ నటిస్తోన్న మాస్టర్ చిత్రం కోసం ఆయన అభిమానులతో పాటు వరుణ్ కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా విజయ్ కూడా క్రికెట్‌కు వీరాభిమాని. 2008 ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. మాస్టర్ సినిమా విషయానికి వస్తే అందులో విజయ్ బాధ్యత లేని కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారు. మాళవిక మోహనన్ ఆయనకు జోడీగా నటించనున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక క్రికెటర్ వరుణ్ చక్రవర్తి విషయానికొస్తే.. ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌లో ఆడి మంచి పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు అతడి పేరును ఖరారు చేశారు. కానీ భుజం నొప్పితో బాధపడుతున్నందు వల్ల ఈ స్పిన్నర్‌ను టీ 20 సిరీస్‌కు దూరమయ్యారు. (చదవండి: ఆసీస్ టూర్‌కు వరుణ్ దూరం! సెలక్టర్లపై విమర్శలు) Ulla vandha powera-di, Anna yaaru?… THALAPATHY.. #vaathicoming#vaathiraid #master #ThalapathyVijay 🤩😘 pic.twitter.com/TFoPqxn65J — Varun Chakaravarthy (@chakaravarthy29) November 17, 2020 -
టీ20 సిరీస్‌కు వరుణ్ దూరం! సెలక్టర్లపై విమర్శలు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి భారత సెలక్షన్ కమిటీ వ్యవహారంపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. తొడ కండరాలకు గాయాన్ని సాకుగా చూపి రోహిత్ శర్మను పక్కన పెట్టిన సెలక్టర్లు.. భుజం నొప్పితో బాధపడుతున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని టీ20 సిరీస్‌కు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కేకేఆర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తి భుజం నొప్పి కారణంగా ఆస్ట్రేలియా పర్యటకు దూరం కానున్నాడని ఓ స్టడీ రిపోర్టు వెల్లడించడంతో ఈ విషయం వెలుగు చూసింది. అన్‌ఫిట్‌గా ఉన్న వరుణ్ని ఆసీస్ టూర్‌కు ఎంపిక చేశారని తెలిపింది. బీసీసీఐ, ఐపీఎల్ నిర్వాహకుల మధ్య సమన్వయం లోపం కారణంగా ఈ పొరపాట్లు జరిగాయని స్పష్టం చేసింది. కాగా, ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా పలు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో రోహిత్ పాల్గొనలేదు. అనంతరం ఢిల్లీతో జరిగిన ప్లేఆఫ్స్‌లో క్రీజులోకొచ్చాడు. ఐపీఎల్లో ఏ ఆటగాడైనా గాయపడితే నిర్వాహకులు బీసీసీఐకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆటగాళ్ల ఫిట్నెస్ సామర్థ్యాన్ని బీసీసీఐ ఫిజియో టీమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఐపీఎల్లో వరుణ్ గాయపడినా సమాచారం ఇవ్వని ఐపీఎల్ నిర్వాహకులు.. అతన్ని మిగతా మ్యాచ్‌లలోనూ కొనసాగించారు. బంతిని దూరం విసరడానికి ఇబ్బందిపడ్డ వరుణ్ని 30 మీటర్ల సర్కిల్లోనే ఫీల్డింగ్ చేయించినట్టు స్టడీ రిపోర్టు పేర్కొంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగనుంది. (చదవండి: రేపే ఐపీఎల్ ఫైనల్.. బుమ్రా, రబడకు కూడా!) -
ధోనీ క్లీన్‌బౌల్డ్ : ప్రత్యర్థికి పాఠాలు
దుబాయ్ : ఐపీఎల్-2020 సీజన్లో ప్లే ఆఫ్స్ నుంచి దాదాపు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పోతూపోతూ కోల్కత్తా నైట్ రైడర్స్‌కు షాకిచ్చింది. కేకేఆర్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై ఆటగాళ్లు వీరోచిత ఇన్సింగ్స్‌తో కోల్కత్తా ఆశలపై నీళ్లు చల్లారు. 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించారు. అయితే సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వైఫల్యం ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. 33 బంతుల్లో 52 పరుగుల చేయాలన్న దశలో క్రిజ్‌లోకి అడుగుపెట్టిన ధోనీ.. తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం ఒకేఒక్క పరుగుకే పరిమితమై.. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా వరుణ్ బౌలింగ్‌లో ధోనీ క్లీన్ బౌల్డ్ కావడం వరుసగా ఇది రెండోసారి. (కోల్‌కతాకు చెన్నై దెబ్బ) ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ తొలి మ్యాచ్‌లోనూ ధోనీ ఇదే విధంగా అవుట్ అయ్యాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అతని డెలివరీకి కంగుతిన్న సారథి.. వెనక్కి తిరిగి చూడకుండానే పెవీలియన్ బాటపట్టాడు. అయిత్ మ్యాచ్ అనంతరం తన అభిమాన ఆటగాడు ధోనీ వద్దకు వెళ్లిన వరుణ్ చక్రవర్తి కాసేపు ముచ్చటించాడు. ప్రత్యర్థి ఆటగాడు అయినప్పటికీ ధోనీ అతనికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఆటలోని మెళకువలను వివరించాడు. అనంతరం తన జెర్సీపై ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకుని మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోని కేకేఆర్ తన ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత మ్యాచ్‌లో ధోనీని అవుట్ చేయడమే కాకుండా వరుణ్ కట్టుదిట్టమైన బౌలింత్తో సీఎస్కే ఒత్తిడిలో నెట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పటడొట్టాడు. కాగా తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి కేకేఆర్ జట్టులో కీలక ఆటగాడికి గుర్తింపు పొందాడు. విజయ్ హాజరే ట్రోపీ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఆటగాడిని 2019 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు అనుహ్యంగా 8 కోట్లుకు కొనుగోలు చేయడంతో క్రీడా అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆ సీజన్లో అంతగా రాణించకపోవడంతో పంజాబ్ వదులుకుంది. అనంతరం తాజా సీజన్లో కోల్కత్తా జట్టును వరుణ్‌ను సొంతం చేసుకుంది. చక్కటి ప్రదర్శనతో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఈ తమిళనాడు ఆటగాడిని బీసీసీఐ సైతం త్వరగానే గుర్తించింది. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ-20ల సీరిస్‌కు ఎంపిక చేసింది. సెలక్టర్ల పిలుపుతో వరుణ్ ఆనందానికి అవధులులేకుండా పోతోంది. From admiring him from the stands at Chepauk, to now...😍@chakaravarthy29's fairytale continues!#KKR #Dream11IPL #CSKvKKR pic.twitter.com/rk37xW3OQ7 — KolkataKnightRiders (@KKRiders) October 29, 2020 -
ఆ క్షణం ఎంతో మధురం...
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని వికెట్‌ను దక్కించుకోవడం మధురమైన క్షణమని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక సమయంలో ధోనిని బౌల్డ్ చేసిన వరుణ్ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం సహచరుడు రాహుల్ త్రిపాఠితో మాట్లాడుతూ వరుణ్ ఆ సంగతిని గుర్తు చేసుకున్నాడు. ‘మూడేళ్ల క్రితం కేవలం ధోని బ్యాటింగ్ చూసేందుకే చెపాక్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఇప్పుడు అతని ప్రత్యర్థిగా ఆడుతున్నా. దీన్ని నమ్మలేకపోతున్నా. జట్టును గెలిపించేందుకు మహి భాయ్ పోరాడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని సంధిస్తే అతని వికెట్ దక్కించుకోవచ్చు అని ఆశించా. అలాగే చేసి వికెట్ సాధించా. మ్యాచ్ తర్వాత ధోని సర్‌తో ఫొటో కూడా తీసుకున్నా’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. -
‘ధర’వంతుడైన ఆటగాడు... ఒక్క మ్యాచ్‌కే
మొహాలి: వేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో తమిళనాడు స్పిన్నర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్‌కు దూరమయ్యాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకున్న 27 ఏళ్ల లెగ్ స్పిన్నర్ వరుణ్‌ను... పంజాబ్ వేలంలో ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతడిని ఎక్కువ మ్యాచ్‌లు ఆడించలేక పోయింది. గత నెలలో కోల్‌కతాపై మ్యాచ్‌కు బరిలో దించగా వరుణ్ వికెట్ పడగొట్టి 35 పరుగులిచ్చాడు. ‘వరుణ్ కోలుకుని చివరి మ్యాచ్‌లకైనా అందుబాటులో ఉంటాడని ఆశించాం. కానీ, అలా జరగలేదు. దీంతో ఇంటిబాట పట్టాడు. అతడు త్వరగా కోలుకుని తర్వాత జరిగే టోర్నీల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని కింగ్స్ ఎలెవెన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఐపీఎల్: రూ.8.40 కోట్ల క్రికెటర్ ఔట్
మొహాలి: కింగ్స్ పంజాబ్ యువ ఆటగాడు వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐపీఎల్ మిగతా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కొద్ది రోజుల క్రితం ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ప్రాక్టీస్‌లో భాగంగా చేతి వేలికి తీవ్ర గాయమైంది. దీంతో వైద్యులు వరుణ్‌కు విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు. తాజాగా మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ తమిళనాడు లెగ్ స్పిన్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో తాజా ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సీజన్లో ఒకేఒక మ్యాచ్ ఆడిన ఈ యువ స్పిన్నర్.. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. కేకేఆర్ మ్యాచ్ అనంతరం వరుణ్‌కు కింగ్స్ పంజాబ్ మరో అవకాశం ఇవ్వలేదు. గతేడాది చివర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు తమిళనాడు యువ క్రికెటర్ వరుణ్ చక్రవర్తి. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 8.4 కోట్లకు వరుణ్ చక్రవర్తిని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. విశేషమేమిటంటే ఇతని ధర కేవలం రూ.20 లక్షలుగా మాత్రమే నిర్ణయించడం జరిగింది. కానీ, ఊహించని రీతిలో 8.4 కోట్లకు ధర పలకడం విశేషం. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ఆకట్టుకోవడంతో వరుణ్‌కు ఈ బంపర్ ఆఫర్ లభించింది. -
ఐపీఎల్ 2019: వరుణ్ చక్రవర్తి అరంగేట్రం
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019 భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బుధవారం స్థానిక ఈడెన్ గార్డెన్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్ చేజింగ్‌కే మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతుంది. కానీ పంజాబ్ పలు మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సామ్ కర్రన్ స్థానంలో హర్దుస్ విలోజెన్‌కు అవకాశం కల్పించింది. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. నికోలసన్ పూరన్‌ను తప్పించి డేవిడ్ మిల్లర్‌కు చోటు కల్పించారు. ఇక మన్కడింగ్ వివాదం తరువాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అందరి దృష్టి పంజాబ్ సారథి రవిచంద్రన్ అశ్విన్‌పైనే ఉంది. (చదవండి: ఎవరీ వరుణ్ చక్రవర్తి?) ఇప్పటికే ఇరు జట్లు తాము ఆడిన తొలి మ్యాచ్‌ల్లో గెలిచి శుభారంభం చేశాయి. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘన విజయం సాధించగా.. రాజస్తాన్ రాయల్స్‌పై కింగ్స్ పంజాబ్ జయకేతం ఎగరేసింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో నితీష్ రాణా, ఆండ్రీ రసెల్ అద్భుతంగా రాణించారు. ఇక దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పలు కూడా రాణిస్తే కేకేఆర్‌కు ఎదురేఉండదు. కింగ్స్ పంజాబ్ విషయానికొస్తే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రిస్ గేల్ మరోసారి తన బ్యాట్‌కు పదునుపెట్టాలని పంజాబ్ జట్టు ఆశిస్తోంది. గేల్‌కు తోడుగా రాహుల్ కూడా రాణిస్తే పంజాబ్‌కు ఎదురేవుండదు. బౌలింగ్ విషయంలో ఇరుజట్లలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. దీంతో లీగ్‌లో రెండో విజయమే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు కేకేఆర్: దినేశ్ కార్తీక్(కెప్టెన్), రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, నితీష్ రాణా, శుభ్‌మన్ గిల్, ఆండ్రీ రసెల్, కుల్దీప్ యాదవ్, పీయుష్ చావ్లా, సునీల్ నరైన్, ప్రసీద్ కృష్ణ, ఫెర్గుసన్ కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, మయాంక్ అగర్వాల్, మన్దీప్ సింగ్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై, వరుణ్ చక్రవర్తి, హర్దుస్ విలోజెన్, డేవిడ్ మిల్లర్ -
రూ.8.4 కోట్లు రికార్డు ధర: ఎవరీ వరుణ్ చక్రవర్తి?
సాక్షి, హైదరాబాద్ : వరుణ్ చక్రవర్తి.. నిన్నటి వరకు అంతగా తెలియని పేరు. కానీ మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలం అతన్నీ ప్రపంచానికి పరిచయం చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కూడా చేసింది. తమిళ ఆల్‌రౌండర్ అయిన వరుణ్ చక్రవర్తి.. జాతీయ జట్టుకైతే ఇంతవరకు ఆడలేదు. అంతెందుకు రంజీ మ్యాచ్ కూడా అడింది ఒక్కటే. అదీ ఈ ఏడాదే. నిజానికి బాల్యం నుంచే అతనేమీ క్రికెట్ పిచ్చోడు కాదు. చాలా ఆలస్యంగా తన 13వ ఏట ఆటకు పరిచయమయ్యాడు. 17 ఏళ్ల వయసు వరకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా ఆడాడు. కానీ ఆయా వయో విభాగం పోటీల్లో తరచూ అతన్ని నిరాకరించడంతో ఆటకు బైబై చెప్పి ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో ఐదేళ్ల డిగ్రీ పూర్తిచేశాడు. కొన్నాళ్లు ఆర్కిటెక్చర్‌గా పనిచేశాడు. టెన్నిస్ బాల్‌తో.. అప్పుడప్పుడు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతుండటం వల్ల మళ్లీ ఆటపై మనసు పెట్టాడు. అంతే ఈసారి వరుణ్ జాబ్‌కు టాటా చెప్పి ఆటకు సై అన్నాడు. క్రోమ్‌బెస్ట్ క్రికెట్ క్లబ్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా చేరాడు. కానీ మోకాలి గాయంతో పేస్‌ను వదిలేసి స్పిన్నరయ్యాడు. జూబ్లీ క్రికెట్ క్లబ్ తరఫున చెన్నైలో ఫోర్త్ డివిజన్ లీగ్ క్రికెట్ ఆడాడు. గత 2017–18 సీజన్లో ఆ క్లబ్ జట్టు తరఫున ఏడు వన్డేలాడిన వరుణ్ 3.06 ఎకానమీతో 31 వికెట్లు తీశాడు. టీఎన్పీల్తో.. బ్యాటింగ్‌లోనూ రాణించే చక్రవర్తి ఈ ఏడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)తో అందరికంటా పడ్డాడు. రెండేళ్లుగా ఒక్క మ్యాచ్ గెలవని సీచెమ్ మధురై పాంథర్స్‌ను ఈ ఏడాది విజేతగా నిలపడంతో అతని ప్రతిభ బయటపడింది. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు తరఫున ఛాన్స్ కొట్టేశాడు. అక్కడ 9 మ్యాచ్‌లాడి లీగ్ దశలో అత్యధిక వికెట్లు (22) తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఐపీఎల్–11 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్‌లో బౌలింగ్ వేసేవాడు. స్థానిక వివాదం కారణంగా సీఎస్కే పుణే వేదికకు మారడంతో కొన్ని రోజులు ఖాళీగా ఉన్నా... మళ్లీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్, జట్టు విశ్లేషకుడు శ్రీకాంత్‌ల పిలుపుమేరకు ఆ జట్టు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ ట్రయల్స్‌లోనూ పాల్గొన్నాడు. కానీ ఏమైందో వాళ్లు రిలీజ్ చేయడంతో వేలానికి వచ్చాడు. ఈ లక్కీ క్రికెటర్ రూ. 20 లక్షల ప్రాథమిక ధర నుంచి ఏకంగా కోట్లు కొల్లగొట్టాడు. ‘రూ. 20 లక్షలకు ఎవరో ఒకరు కొంటారనే నమ్మకం ఉంది. కానీ 40 రెట్లు పలుకుతానని అస్సలు ఊహించలేదు’ అని ఉబ్బితబ్బిబ్బయ్యాడు వరుణ్. సునీల్ నరైన్ టిప్స్.. కోల్‌కతా నైటరైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌కు నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తుండగా.. ఆ జట్టు ఆటగాడు సునీల్ నరైన్ తనకు బౌలింగ్‌లో మెలకువలు నేర్పాడని అవి తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వరుణ్ చెప్పుకొచ్చాడు. ‘క్రికెట్ కెరీర్లో తొలి నాళ్లలో నేను వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడిని. ఆ తర్వాత క్రికెట్ మానేసి రెండేళ్ల పాటు వేరే పనిలో నిమగ్నమయ్యాను. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్‌గా మళ్లీ ఆడటం మొదలుపెట్టాను. దాంతో నా మోకాళ్లపై భారం అధికమైంది. ఓ మ్యాచ్‌లో మోకాలికి గాయమైంది. దాంతో ఆర్నెళ్ల పాటు ఆటకు విరామం తీసుకున్నాను. స్పిన్ బౌలింగ్‌తో మళ్లీ ఆడటం మొదలు పెట్టాను’ అని వరుణ్ తెలిపాడు.