టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహచర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాళ (నవంబర్ 13) జరుగబోయే మూడో టీ20లో వరుణ్ మరో రెండు వికెట్లు తీస్తే.. టీమిండియా తరఫున ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. నాటి నుంచి ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో ఏ భారత స్పిన్నర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ఇప్పుడు అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం వరుణ్‌కు వచ్చింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 5.25 సగటున 8 వికెట్లు తీశాడు.
డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసిన వరుణ్.. గెబెర్హా వేదికగా జరిగిన రెండో టీ20లో ఐదు వికెట్లు పడగొట్టాడు. సెంచూరియన్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి టీ20లో భారత్ గెలువగా.. రెండో టీ20లో సౌతాఫ్రికా గెలిచిన విషయం తెలిసిందే.
రెండో టీ20లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 124 పరుగులకే పరిమితమైనా.. వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి విజయావకాశాలు సృష్టించాడు. అయితే ఆఖర్లో కొయెట్జీ, స్టబ్స్ కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి టీమిండియాకు గెలుపును దూరం చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ డేంజరెస్ బ్యాటర్లైన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment