
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా ఫైనల్లో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ సేన సోమవారం సొంతగడ్డపై అడుగుపెట్టింది.
అయితే ఐపీఎల్-2025 సీజన్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఈసారి ఎటువంటి విక్టరీ పరేడ్‌లను నిర్వహించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. స్వదేశానికి చేరిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా తమ ఐపీఎల్ జట్లతో కలుస్తున్నారు. ఇక ఇది ఇలా ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రను ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయడం పట్ల భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.
ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు అందుకునేందుకు భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఆర్హడుని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. "ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ రచిన్ రవీంద్రను ఎంపిక చేసుండొచ్చు. కానీ దృష్టిలో మాత్రం ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వరుణ్ చక్రవర్తినే. అతడు టోర్నీ మొత్తం ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. అతడు భారత్‌కు ఎక్స్‌ఫ్యాక్టర్‌గా మారాడు. వరుణ్ లేకపోయింటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.
ఈ టోర్నీలో ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నేను జడ్జిని అయివుంటే ఆ అవార్డు వరుణ్‌కి ఇచ్చేవాడిని. ఫైనల్ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌ను చక్కవర్తి ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. గూగ్లీతో ఫిలిప్స్‌ను వరుణ్ బోల్తా కొట్టించాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు అతడు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ తరహా ప్రదర్శన చేశాడు.
అతడు ఆడిన మ్యాచ్‌లను పరిగణలోకి తీసుకుని ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా ఎంపిక చేయాల్సింది. ఈ అవార్డుకు వరుణ్ కచ్చితంగా ఆర్హుడు" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశ్విన్ పేర్కొన్నాడు. కాగా వరుణ్ ఈ టోర్నీలో తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు.
తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన చక్రవర్తి.. కివీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే వరుణ్ ఇంపాక్ట్ చూపించాడు. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టి కివీస్ పతానాన్ని శాసించాడు. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్లో రెండేసి వికెట్లు పడగొట్టి భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. మరోవైపు రచిన్ రవీంద్ర.. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 263 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: అద్భుతంగా రాణించాను.. టెస్టు రీఎంట్రీకి సిద్ధం
Comments
Please login to add a commentAdd a comment