సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. బుధవారం సెంచూరియన్ వేదికగా సఫారీలతో జరిగిన మూడో టీ20లో రెండు వికెట్లతో సత్తాచాటాడు. గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే పరుగులు కాస్త ఎక్కువగా ఇచ్చినప్పటికీ రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌కు మరో విజయాన్ని అందించాడు.
ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఐడైన్ మార్‌క్రమ్‌లను సరైన సమయంలో పెవిలియన్‌కు పంపి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపు తిరిగేలా చేశాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అశ్విన్ రికార్డు బద్దలు...
ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చరిత్ర సృష్టించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ తమిళనాడు స్టార్ స్పిన్నర్ 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
తద్వారా ఈ రేర్ ఫీట్‌ను తన పేరిట వరుణ్ లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉండేది. 2016లో శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అశ్విన్ 9 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌తో అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డును చక్రవర్తి బద్దలు కొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment