PC: Cricket Times
చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను అద్బుతమైన బంతితో వరుణ్ బోల్తా కొట్టించాడు. చక్రవర్తి వేసిన బంతికి బ్రూక్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన చక్రవర్తి మూడో బంతిని అద్బుతమైన గూగ్లీగా సంధించాడు.
బంతి పిచ్ అయిన వెంటనే షార్ప్‌గా టర్న్ అయింది. బంతి ఎటువైపు తిరుగుతుందో బ్రూక్ అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో బంతి హ్యారీ బ్రూక్ బ్యాట్, ప్యాడ్ గ్యాప్‌లో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్ చేసేదేమి లేక అలా నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా తొలి టీ20లో ఇదే తరహాలో బ్రూక్‌ను వరుణ్ ఔట్ చేశాడు. ఇక రెండో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్ బట్లర్(45) టాప్ స్కోరర్‌గా నిలవగా.. బ్రైడన్ కార్సే(31), జేమీ స్మిత్(22) రాణించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించగా.. అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ సాధించారు. కాగా తొలి టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.
చదవండి: BCCI: టీమిండియాకు భారీ షాక్.. ఇంగ్లండ్ సిరీస్ నుంచి ఇద్దరు స్టార్లు ఔట్
Through the gates! 🎯
The in-form Varun Chakaravarthy strikes in his very first over ⚡️⚡️
Follow The Match ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @chakaravarthy29 pic.twitter.com/NddoPmTlDo— BCCI (@BCCI) January 25, 2025
Comments
Please login to add a commentAdd a comment