చెన్నై వేదికగా రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా, ఇంగ్లండ్ జట్లు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్‌లు గాయాల బారిన పడ్డారు. ప్రాక్టీస్ సెషన్‌లో నితీశ్‌కు ప్రక్కెటెముకల(సైడ్ స్ట్రెయిన్) గాయానికి గురయ్యాడు.
దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు మొత్తానికి ఈ ఆంధ్ర ఆటగాడు దూరమయ్యాడు. మరోవైపు రింకూ సింగ్ ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో రింకూ రెండో, మూడో టీ20 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించింది.
"జనవరి 24న చెన్నైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి ప్రక్కెటెముకల నొప్పితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఐదు టీ20ల సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. నితీశ్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి వెళ్లనున్నాడు.
అదేవిధంగా తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తుండగా రింకూ సింగ్‌కు వెన్నునొప్పి వచ్చింది. అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రింకూ ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే అతడు ఈ సిరీస్‌లో రెండు, మూడు టీ20లకు దూరం కానున్నాడు" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా నితీశ్, రింకూ స్ధానాలను బీసీసీఐ శివమ్ దూబే, రమణ్‌దీప్ సింగ్‌లతో భర్తీ చేసింది.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి అప్‌డేటడ్ భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రమణదీప్ సింగ్.
చదవండి: WPL 2025: ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment