డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(Sophie Devine) ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యారు. డొమాస్టిక్ క్రికెట్‌కు కొంత కాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు.
ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్‌ది కీలక పాత్ర.
2024 డబ్ల్యూపీఎల్ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన డివైన్.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ స్టార్ ఆల్‌రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్‌మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"ఆటగాళ్ల ఫిట్‌నెస్, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేము భావిస్తున్నాము. సోఫీకి ఇప్పుడు విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్‌కు సానుకూల ఆంశమని" గ్రీన్ వెల్లడించారు.
కాగా డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బరోడా వేదికగాగుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ టోర్నీకి వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యమివ్వనున్నాయి.
డబ్ల్యూపీఎల్-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..
స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, , రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్ నుంచి ట్రేడ్).
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment