Women's Premier League
-
ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం
షేక్ సిమ్రన్ బాను, కమిలిని, ప్రేమా రావత్ వీళ్ల పేర్లు మనకే కాదు... ప్రస్తుత భారత మహిళల జట్టు ప్లేయర్లకూ తెలియదు. ఎందుకంటే వీరెప్పుడు జాతీయ జట్టుకు ఆడలేదు. అసలు ఎంపికే కాలేదు. అలాగని జోనల్ ఈవెంట్లలో దంచేసిన రికార్డులేం లేవు. మైదానంలో పెద్దగా ఆడింది లేదు... ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొంది లేదు. అయినా సరే రెండు గంటల వేలంలో కోటీశ్వరులయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విశ్లేషకులు సైతం నివ్వెరపోయెలా వారి కొనుగోలు జరిగింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం ఒకింత ఆశ్చర్యంగా.. అనూహ్యంగా జరిగిపోయింది. జాతీయ స్థాయిలో భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు కనీసం దేశవాళీ క్రికెట్లోనూ కనిపించని ప్లేయర్లపై భారీ మొత్తమే ఖర్చు చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్లను అందలం ఎక్కించాయి.పేలవంగా ఆడిన ప్లేయర్‌కు భారీ ధరబెంగళూరులో ఆదివారం జరిగిన ఈ వేలంలో 22 ఏళ్ల ముంబై బ్యాటర్ షేక్ సిమ్రన్ బానుకు ఏకంగా రూ. 1 కోటీ 90 లక్షలు లభించాయి. మినీ వేలంలో మేజర్ అమౌంట్ ఆమెకే దక్కింది. గుజరాత్ జెయింట్స్ ఆమె కోసం అంతమొత్తం వెచ్చించింది. అలాగనీ ఆమె ఒక మెరుపు బ్యాటర్గానీ, నిప్పులు చెరిగే బౌలర్ కానీ కాదు. రెండేళ్ల క్రితం 2022 సీజన్లో యూపీ వారియర్స్ తరఫున పేలవంగా ఆడి నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో 29 పరుగులే చేసింది. దీంతో తర్వాత రెండు రెండు సీజన్లకు పక్కన బెట్టారు. ఇప్పుడేమో జెయింట్స్ పెద్దమొత్తానికి ఆమెను అక్కును చేర్చుకోవడం విశేషం.టీనేజ్ వికెట్‌కీపర్ బ్యాటర్‌కూ జాక్పాట్ఇక ముంబై ఇండియన్స్ కూడా 16 ఏళ్ల టీనేజ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జి.కమలినిని రూ. 1 కోటి 60 లక్షలతో కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె భారత అండర్–19 జట్టు తరఫున అది కూడా వేలం జరిగిన రోజే (ఆదివారం కౌలాలంపూర్‌లో ఆసియా కప్ అండర్–19 టోర్నీ) ఒక మ్యాచ్ ఆడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 44 పరుగులు చేసింది.మరోవైపు.. 23 ఏళ్ల ఉత్తరాఖండ్ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ ప్రేమా రావత్‌ను వేలంలో రూ. 1 కోటి 20 లక్షలకు పాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకుంది. రూ. కోటి పైచిలుకు పలికిన ఈ ముగ్గురు క్రికెటర్ల బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. కానీ మినీ వేలం వారి పాలిట మెగా జాక్‌పాట్‌గా మారింది.వారి వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదుఇక వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ రూ. కోటి మార్క్ దాటిన ఏకైక విదేశీ ప్లేయర్. రూ. 1 కోటి 70 లక్షలకు ఆమెను గుజరాత్ జెయంట్స్ కొనుక్కుంది. 33 ఏళ్ల వెటరన్ కరీబియన్ క్రికెటర్ బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు కాగా... యూపీ వారియర్స్, గుజరాత్‌లు పోటీపడ్డాయి.గతంలో ఆమెను (2023 సీజన్) రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా ప్లేయర్లు స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్‌లపై ఐదు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కనీస ధరకైనా ఎవరూ తీసుకోకపోవడంతో వీరంతా అన్‌సోల్డ్ (అమ్ముడుపోని) క్రికెటర్లుగా మిగిలిపోయారు. వేలం తర్వాత ఫ్రాంచైజీలకు మిగిలింది?వేలానికి ముందు 15 మందిని అట్టిపెట్టుకున్న యూపీ వారియర్స్ ముగ్గురు ప్లేయర్లను తక్కువ ధరకే తీసుకొని మినీ వేలంలో మమ అనిపించింది. అలనా కింగ్ (రూ. 30 లక్షలు), క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు), ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు)... ఈ ముగ్గురికి కలిపి రూ. అరకోటి మాత్రమే ఖర్చు చేసింది. మొత్తం పర్సు రూ. 15 కోట్లు కాగా... అందరికంటే తక్కువగా రూ. 11 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసిన ఈ ఫ్రాంచైజీ అందరికంటే ఎక్కువ (రూ.3 కోట్ల 40 లక్షలు) మొత్తాన్ని మిగుల్చుకుంది. గుజరాత్ (రూ.14 కోట్ల 60 లక్షలు) ఎక్కువగా ఖర్చు చేసింది. ఆ ఫ్రాంచైజీ వద్ద కేవలం రూ. 40 లక్షలే మిగిలున్నాయి. ఇక ఆర్సీబీ రూ. 13 కోట్ల 25 లక్షలు వెచ్చించి రూ. 1 కోటి 75 లక్షలు మిగుల్చుకుంది. రూ. 13 కోట్ల 35 లక్షలు ఖర్చు చేసిన ఢిల్లీ ఖాతాలో రూ. 1 కోటి 65 లక్షలు మిగిలున్నాయి. ముంబై రూ. 14 కోట్ల 55 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం రూ. 45 లక్షలే ఆ ఫ్రాంచైజీ వద్ద ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ కూడా గరిష్ట సభ్యుల సంఖ్య (18)ను భర్తీచేసుకున్నాయి.మూడు ముక్కల్లో... ఇది వచ్చే 2025 సీజన్‌కు ముందు మినీ వేలం. 91 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు కలిపి మొత్తం 124 మంది వేలానికి వచ్చారు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు సహా 19 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు రూ. 9.05 కోట్లకు కొనుక్కున్నాయి. అమ్ముడైన క్రికెటర్లు వీరే... (గరిష్టం నుంచి కనిష్ట వరుసలో) సిమ్రన్ బాను (రూ. 1.90 కోట్లు; గుజరాత్) డియాండ్రా డాటిన్ (రూ. 1.70 కోట్లు; గుజరాత్) కమలిని (రూ. 1.60 కోట్లు; ముంబై) ప్రేమా రావత్ (రూ. 1.20 కోట్లు; బెంగళూరు) శ్రీచరణి (రూ. 55 లక్షలు; ఢిల్లీ) నడిన్ డిక్లెర్క్ (రూ. 30 లక్షలు; ముంబై) డానియెల్లె గిబ్సన్ (రూ. 30 లక్షలు; గుజరాత్) అలానా కింగ్ (రూ. 30 లక్షలు; యూపీ) అక్షిత (రూ.20 లక్షలు; ముంబై) రాఘవి బిస్త్ (రూ. 10 లక్షలు; బెంగళూరు) జాగ్రవి పవార్ (రూ. 10 లక్షలు, బెంగళూరు) సంస్కృతి (రూ. 10 లక్షలు; ముంబై) క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు; యూపీ) ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు; యూపీ) నందిన్ కశ్యప్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) నికీ ప్రసాద్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) సారా బ్రిస్ (రూ.10 లక్షలు; ఢిల్లీ) ప్రకాశిక నాయక్ (రూ. 10 లక్షలు; గుజరాత్) జోషిత (రూ. 10 లక్షలు; బెంగళూరు) చదవండి: WPL 2025: ఏ జట్టులో ఎవరు? -
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై! -
డబ్ల్యూపీఎల్ మినీ వేలానికి 120 మంది ప్లేయర్లు
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఈ నెల 15న జరగనున్న డబ్ల్యూపీఎల్ వేలంలో అందుబాటులో ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది ప్లేయర్లు, విదేశాల నుంచి 29 మంది ప్లేయర్లు బరిలో ఉన్నారు. ఇందులో అసోసియేషన్ దేశాలకు చెందిన ముగ్గురు ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ ఫ్రాంచైజీ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. గుజరాత్ నలుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకోవాల్సి ఉండగా... యూపీ వారియర్స్ జట్టు ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసుకోనుంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు తలా నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేయనున్నాయి. భారత ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ స్నేహ్ రాణా రూ. 30 లక్షల కనీస ధరతో వేలానికి రానుండగా... విదేశీ ప్లేయర్లలో డాటిన్ (వెస్టిండీస్), హీథర్ నైట్ (ఇంగ్లండ్)పై అదరి దృష్టి నిలవనుంది. వీరిద్దరూ రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొంటున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్‌ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్‌ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్‌గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్‌గా, కెప్టెన్‌గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్‌గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్‌లో 10 మ్యాచ్‌లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది. -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
WPL 2024: సూపర్ షబ్నమ్...
న్యూఢిల్లీ: వరుసగా మూడో మ్యాచ్‌లోనూ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగినా... యూపీ వారియర్స్‌ను గెలిపించలేకపోయింది. ఫలితంగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో యూపీ ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలను దాదాపుగా చేజార్చుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 8 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెపె్టన్ బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ సాధించగా, లౌరా వోల్వార్ట్ (30 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకెల్‌స్టోన్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షబ్నమ్ షకీల్ (3/11) కీలక వికెట్లతో ఆరంభంలోనే యూపీని దెబ్బ తీసింది. దాంతో స్కోరు 35/5 వద్ద నిలిచింది. అయితే దీప్తి, పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడి జట్టును విజయానికి చేరువగా తెచ్చారు. వీరిద్దరు 78 బంతుల్లో అభేద్యంగా 109 పరుగులు జోడించారు. చివరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా, దీప్తి 2 సిక్సర్లతో సహా మొత్తం 17 పరుగులే వచ్చాయి. పట్టికలో మూడో స్థానం కోసం ఇంకా పోటీ మిగిలే ఉంది. యూపీ, బెంగళూరుకు చెరో 6 పాయింట్లు ఉండగా, యూపీ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఓడిపోకున్నా బెంగళూరుకే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంది. ఇక 4 పాయింట్లున్న గుజరాత్ చివరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు భారీ రన్‌రేట్ సాధించాలి. -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్‌కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్‌కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) పవర్‌ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్‌గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండగే... WPI షెడ్యూల్ వచ్చేసింది
-
క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.. డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది
క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డబ్ల్యూపీఎల్-2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు వేదికగా జరగనున్న తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తొలి సీజన్లో కేవలం ముంబైకే పరిమితమైన . డబ్ల్యూపీఎల్.. ఈ సారి రెండు నగరాల్లో జరగనుంది. ఈ సీజన్లో మొదటి దశ మ్యాచ్‌లు బెంగళూరులో రెండో దశ మ్యాచ్‌లు దిల్లీలో జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం మార్చి 5 నుంచి మిగిలిన దశ మ్యాచ్‌లు ఢిల్లీలో జరగనున్నాయి. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి. మొత్తం అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. కాగా భారత్‌లో మహిళల క్రికెట్‌ను అభివృద్ది చేసేందుకు గతేడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది డబ్ల్యూపీల్ షెడ్యూల్ 2024 ►ఫిబ్రవరి 23- ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 24- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 25- గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 26- యూపీ వారియర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 27- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 28- ముంబై ఇండియన్స్ vs యూపీ వారియర్స్ (బెంగళూరు) ►ఫిబ్రవరి 29- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►మార్చి 1- యూపీ వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు) ►మార్చి 2- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు) ►మార్చి 3- గుజరాత్ జెయింట్స్ vs దిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు) ►మార్చి 4- యూపీ వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (బెంగళూరు) ►మార్చి 5- దిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) ►మార్చి 6- గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 7- యూపీ వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) ►మార్చి 8- దిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ) ►మార్చి 9- ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ) ►మార్చి 10- దిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 11- గుజరాత్ జెయింట్స్ vs యూపీ వారియర్స్ (ఢిల్లీ) ►మార్చి 12- ముంబయి ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ) ►మార్చి 13- దిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ) ►మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ) ►మార్చి 17- ఫైనల్ (ఢిల్లీ) చదవండి: అయోధ్యలో కోహ్లిని పోలిన వ్యక్తి.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం! వీడియో -
డబ్ల్యూపీఎల్: అవార్డులు ఎవరికి? విన్నర్ ప్రైజ్‌మనీ ఎంతంటే! పీఎస్ఎల్ విజేత కంటే..
Womens Premier League 2023: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ విజేతగా నిలిచి ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్ర చాంపియన్‌గా రికార్డులకెక్కింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి హర్మన్ సేన ఈ మేరకు చరిత్ర సృష్టించింది. నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయింది. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రవేశపెట్టిన డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‌ను మధుర జ్ఞాపకంగా మిగుల్చుకుంది. ఇక ఈ విజయంతో చాంపియన్ ముంబై, వివిధ విభాగాల్లో సత్తా చాటిన క్రికెటర్లు గెలుచుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?! డబ్ల్యూపీఎల్-2023 అవార్డులు, ప్రైజ్‌మనీ ►విజేత- ముంబై ఇండియన్స్ వుమెన్- గోల్డెన్ ట్రోఫీ- రూ. 6 కోట్లు ►రన్నరప్- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- రూ. 3 కోట్లు ►మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- రూ. 5 లక్షలు ►ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు)- మెగ్ లానింగ్(ఢిల్లీ క్యాపిటల్స్)- 9 ఇన్నింగ్స్‌లో 345 పరుగులు- రూ. 5 లక్షలు ►పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు)- హేలీ మాథ్యూస్(ముంబై ఇండియన్స్)- 16 వికెట్లు ►ఫెయిర్ ప్లే అవార్డు- ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ►క్యాచ్ ఆఫ్ ది సీజన్: హర్మన్‌ప్రీత్ కౌర్(ముంబై)- యూపీ వారియర్జ్ దేవికా వైద్య క్యాచ్- రూ. 5 లక్షలు ►సఫారీ పవర్ఫుల్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- సోఫీ డివైన్ (ఆర్సీబీ)- 8 ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు- రూ. 5 లక్షలు ►ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- యస్తికా భాటియా(ముంబై)- రూ. 5 లక్షలు. పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత కంటే మహిళా ప్రీమియర్ లీగ్ విజేతకు అందిన మొత్తం పీఎస్ఎల్ చాంపియన్ లాహోర్ కలందర్స్ గెల్చుకున్న మొత్తం కంటే దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ ఏడాది పీఎస్ఎల్ విన్నర్‌గా అవతరించిన లాహోర్ రూ. 3.4 కోట్లు ప్రైజ్‌మనీ అందుకోగా.. రన్నరప్ ముల్తాన్ సుల్తాన్స్ సుమారు 1.37 కోట్ల రూపాయలు గెలుచుకుంది. The young promising wicketkeeper-batter shined bright in a victorious season for @mipaltan 👏👏@YastikaBhatia becomes the emerging player of the season 👌#TATAWPL pic.twitter.com/hO8qMDUkty — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 చదవండి: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ప్రకటన.. జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు షాక్.. భరత్‌కు చోటు IPL 2023: ఐపీఎల్ తోపులు వీరే.. సింహభాగం రికార్డులు యూనివర్సల్ బాస్‌వే..! Raw emotions 🎥 A moment to savor for @mipaltan 👌 👌 #TATAWPL | #Final | #DCvMI pic.twitter.com/wdf7t07NMJ — Women's Premier League (WPL) (@wplt20) March 26, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023 Final: తొలి టైటిల్ కొట్టేదెవరు?
ముంబై: ప్రతిష్టాత్మకంగా తొలి సారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) చివరి ఘట్టానికి చేరింది. టోర్నీ మొదటి విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. టోర్నీ ఆరంభంలో దూకుడు కనబర్చి దూసుకెళ్లిన ముంబై ఆ తర్వాత వెనుకబడటంతో ఫైనల్ చేరేందుకు ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చింది. ఢిల్లీ మాత్రం సరైన సమయంలో సత్తా చాటి వరుస విజయాలతో పాటు రన్‌రేట్‌ను పెంచుకొని అగ్రస్థానంతో తుది పోరుకు అర్హత సాధింది. ఢిల్లీ బ్యాటింగ్ భారం ఓపెనర్ లానింగ్‌తో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లపై ఉంది. ఆల్‌రౌండర్‌గా మరిజాన్ కప్ ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించింది. మరో వైపు హర్మన్‌ప్రీత్ ఫామ్‌లో లేకపోయినా నాట్ సివర్, హీలీ మాథ్యూస్ ముంబైకి భారీ స్కోరు అందించగలరు. అమేలియా కెర్ రూపంలో ధాటిగా ఆడే మరో బ్యాటర్ కూడా ఉంది. ప్రత్యర్థి కంటే బలమైన బౌలింగ్ లైనప్ ముంబై ఆశలను పెంచుతోంది. సైకా ఇషాక్ 15 వికెట్లతో ఫామ్‌లో ఉండగా, పేసర్ ఇసీ వాంగ్ పదునేమిటో ఎలిమినేటర్‌లో కనిపించింది. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఫైనల్ సమరం ఖాయం. -
Womens Premier League 2023:ప్లేఆఫ్‌కు యూపీ వారియర్స్
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో చివరిదైన మూడో ప్లేఆఫ్ బెర్త్ కూడా ఖరారైంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ దశకు అర్హత పొందగా... ఈ రెండు జట్ల సరసన యూపీ వారియర్స్ చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. యూపీ గెలుపుతో గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు సాధించింది. హేమలత (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీలు చేశారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పార్శవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి విజయం సాధించింది. 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన యూపీ వారియర్స్‌ను తాలియా (38 బంతుల్లో 57; 11 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్రేస్ హారిస్ (41 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. తాలియా అవుటయ్యాక గ్రేస్ హారిస్ యూపీని విజయం దిశగా నడిపించింది. ఏడు బంతులు మిగిలి ఉండగా హారిస్ పెవిలియన్ చేరగా... సోఫీ ఎకిల్‌స్టోన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) యూపీ విజయాన్ని ఖాయం చేసింది. ముంబై ఇండియన్స్‌కు ఢిల్లీ షాక్ సోమవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ టోర్నీలో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అందరికంటే ముందుగా ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న ముంబై ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం. ముందుగా ముంబై జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేసింది. పూజ వస్త్రకర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (26 బంతుల్లో 23; 3 ఫోర్లు), ఇసీ వాంగ్ (24 బంతుల్లో 23; 1 సిక్స్), అమన్‌జ్యోత్ కౌర్ (16 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కప్ (2/13), శిఖా పాండే (2/21), జెస్ జొనాసెన్ (2/25) ముంబైని కట్టడి చేశారు. అనంతరం ఢిల్లీ దూకుడుగా ఆడి 9 ఓవర్లలో వికెట్ నష్టపోయి 110 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్) అవుటవ్వగా.. మెగ్ లానింగ్ (22 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), అలైస్ క్యాప్సీ (17 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. ‘ఫైనల్ బెర్త్’ రేసులో ముంబై, ఢిల్లీ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై 10 పాయింట్లతో సమంగా ఉన్నా... మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్ ర్యాంక్‌లో, ముంబై రెండో ర్యాంక్‌లో నిలిచాయి. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో బెంగళూరుతో ముంబై (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)... యూపీతో ఢిల్లీ (రాత్రి గం. 7:30 నుంచి) ఆడతాయి. ముంబై, ఢిల్లీ జట్లలో భారీ తేడాతో నెగ్గిన జట్టు ‘టాప్’ ర్యాంక్‌తో నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మూడో స్థానంలో నిలిచిన యూపీ వారియర్స్‌తో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది. -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్‌లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్‌కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్‌ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్‌గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
హర్మన్ ధనాధన్ హాఫ్ సెంచరీ.. ప్లే ఆఫ్స్‌కు ముంబై
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఓటమెరుగని ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 55 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. ముంబైకిది వరుసగా ఐదో విజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీ బాదింది. ఓపెనర్ యస్తిక భాటియా (37 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, గుజరాత్ బౌలర్లలో ఆష్లే గార్డ్నెర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులే చేయగలిగింది. హర్లీన్ డియోల్ (23 బంతుల్లో 22; 3 ఫోర్లు), కెపె్టన్ స్నేహ్ రాణా (19 బంతుల్లో 20; 3 ఫోర్లు) కష్టంగా రెండు పదుల స్కోరు దాటారు. మిగతావారంతా చేతులెత్తేశారు. నట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు తీయగా, అమెలియా కెర్‌కు 2 వికెట్లు దక్కాయి. నేడు జరిగే మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక (రనౌట్) 44; హేలీ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; నట్ సీవర్ (ఎల్బీ) (బి) గార్త్ 36; హర్మన్‌ప్రీత్ (సి) హర్లీన్ (బి) గార్డ్నెర్ 51; అమెలియా (సి) గార్త్ (బి) కన్వార్ 19; ఇసి వాంగ్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 0; హుమైరా (రనౌట్) 2; ధార (నాటౌట్) 1; అమన్‌జోత్ (సి) డన్క్లే (బి) గార్డ్నెర్ 0; కలిత (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–75, 3–84, 4–135, 5–136, 6–145. బౌలింగ్: గార్డ్నెర్ 4–0–34–3, కిమ్ గార్త్ 4–0–31–1, స్నేహ్ రాణా 4–0–17–1, తనూజ 4–0–32–1, అనాబెల్ 4–0–42–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సోఫియా (ఎల్బీ) (బి) నట్ సీవర్ 0; మేఘన (సి) నట్ సీవర్ (బి) హేలీ 16; హర్లీన్ (ఎల్బీ) (బి) వాంగ్ 22; అనాబెల్ (ఎల్బీ) (బి) హేలీ 0; గార్డ్నెర్ (సి) కలిత (బి) అమెలియా 8; స్నేహ్ (ఎల్బీ) (బి) నట్ సీవర్ 20; హేమలత (సి) వాంగ్ (బి) అమెలియా 6; సుష్మ (నాటౌట్) 18; గార్త్ (సి) హర్మన్ (బి) నట్ సీవర్ 8; తనూజ (సి) యస్తిక (బి) హేలీ 0; మాన్సి (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–0, 2–34, 3–34, 4–48, 5–48, 6–57, 7–85, 8–95, 9–96. బౌలింగ్: నట్ సీవర్ 4–0–21–3, సయిక 4–0–20–0, ఇసి వాంగ్ 3–0–19–1, హేలీ మాథ్యూస్ 4–0–23–3, అమెలియా కెర్ 4–0–18–2, అమన్‌జోత్ 1–0–6–0. -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్‌గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Gujarat Giants vs Delhi Capitals Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అసాధారణ విజయం సాధించింది. బౌలింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజన్ కాప్ (5/15), బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (28 బంతుల్లో 76 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. దీంతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లోయర్ ఆర్డర్లో కిమ్ గార్త్ (37 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. హర్లీన్ డియోల్ (14 బంతుల్లో 20; 4 ఫోర్లు), జార్జియా వేర్హామ్ (25 బంతుల్లో 22; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. ఢిల్లీ మీడియం పేసర్ మరిజన్ (4–0–15–5) బెంబేలెత్తించింది. శిఖాపాండేకు 3 వికెట్లు దక్కాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లోని తొలి 4 వికెట్లను మరిజనే పడగొట్టింది. దీంతో 28 పరుగులకే గుజరాత్ 5 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా కేవలం 7.1 ఓవర్లలో 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు షఫాలీ, కెప్టెన్ మెగ్ లానింగ్ (15 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయం అందించారు. గార్డ్నెర్ వేసిన 4వ ఓవర్లో షఫాలీ, లానింగ్ కలిసి 4, 4, 6, 1, 4, 4లతో 23 పరుగులు రాబట్టడం విశేషం. షఫాలీ 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో నేడు ముంబై ్ఠ Vs యూపీ వారియర్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
లానింగ్, జొనసెన్ చెలరేగగా...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్ మరోసారి భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన పోరులో ఢిల్లీ 42 పరుగుల తేడాతో యూపీ వారియర్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల స్కోరు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 70; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెస్ జొనసెన్ (20 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. సహచరులు తడబడినా... తాహ్లియా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) అసాధారణ పోరాటం చేసి అజేయంగా నిలిచింది. లానింగ్ అర్ధ సెంచరీ తొలి రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్లు లానింగ్, షఫాలీ ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. షబ్నిమ్ ఐదో ఓవర్లో లానింగ్ ఒక సిక్స్, రెండు బౌండరీలతో 16 పరుగులు పిండుకుంది. రాజేశ్వరి వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఫోర్ కొడితే లానింగ్ మూడు బౌండరీలతో రెచ్చిపోయింది. పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు 62/0. మరుసటి ఓవర్లోనే షఫాలీ (17; 1 ఫోర్, 1 సిక్స్) ఆటను తాహ్లియా ముగించగా, మెగ్ లానింగ్ మాత్రం తన ధాటిని కొనసాగించి 32 బంతుల్లో (7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించింది. తర్వాత కాసేపు వాన ఆటంకపరిచింది. ఆట తిరిగి మొదలయ్యాక 11వ ఓవర్లో ఢిల్లీ స్కోరు 100 దాటింది. స్వల్ప వ్యవధిలో మరిజన్ (16; 2 ఫోర్లు), లానింగ్ నిష్క్రమించారు. తర్వాత వచ్చిన జెమిమా (22 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు), క్యాప్సీ (10 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఢిల్లీ వేగాన్ని కొనసాగించారు. ఆఖర్లో జొనసెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. దీంతో ఆఖరి 4 ఓవర్లలో ఢిల్లీ 58 పరుగులు సాధించడంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 200 మార్క్ దాటింది. మెక్‌గ్రాత్ ఒంటరి పోరాటం కొండంత లక్ష్యం ముందుంటే యూపీ వారియర్స్ టాపార్డర్ నిర్లక్ష్యంగా వికెట్లను పారేసుకుంది. కెప్టెన్ అలీసా హీలీ (17 బంతుల్లో 24; 5 ఫోర్లు), శ్వేత (1), కిరణ్ నవ్‌గిరే (2) ‘పవర్ ప్లే’లోనే పెవిలియన్కెళ్లారు. తర్వాత వచ్చిన వారిలో తాహ్లియా ఒంటరిపోరాటం చేసింది. దీప్తి శర్మ (12), దేవిక వైద్య (21 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు దూకుడుగా ఆడబోయి వెనుదిరిగారు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన జొనసెన్ స్పిన్ బౌలింగ్‌తో యూపీని చావుదెబ్బ తీసింది. మెక్‌గ్రాత్ 36 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్... ఆఖరి ఓవర్లలో ఆమె ఫోర్లు, సిక్సర్లు బాదడంతో యూపీ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: మెగ్ లానింగ్ (బి) రాజేశ్వరి 70; షఫాలీ (సి) నవ్‌గిరే (బి) తాహ్లియా 17; మరిజన్ (సి) దీప్తిశర్మ (బి) ఎకిల్‌స్టోన్ 16; జెమిమా నాటౌట్ 34; క్యాప్సీ (సి) ఎకిల్‌స్టోన్ (బి) షబ్నిమ్ 21; జొనసెన్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1–67, 2–96, 3–112, 4–144. బౌలింగ్: షబ్నమ్ 4–0–29–1, అంజలీ 3–0–31–0, రాజేశ్వరి గైక్వాడ్ 2–0–31–1, తాహ్లియా మెక్‌గ్రాత్ 3–0–37–1, దీప్తిశర్మ 4–0–40–0, సోఫీ ఎకిల్‌స్టోన్ 4–0–41–1. యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి) జెమిమా (బి) జొనసెన్ 24; శ్వేత (సి) తానియా (బి) మరిజన్ 1; కిరణ్ నవ్‌గిరే (సి) క్యాప్సీ (బి) జొనసెన్ 0; తాహ్లియా మెక్‌గ్రాత్ నాటౌట్ 90; దీప్తిశర్మ (సి) రాధ (బి) శిఖా 12; దేవిక (సి) రాధ (బి) జొనసెన్ 23; సిమ్రన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–29, 2–31, 3–31, 4–71, 5–120. బౌలింగ్: మరిజన్ 4–1–29–1, శిఖాపాండే 4–0–18–1, జెస్ జొనసెన్ 4–0–43–3, నోరిస్ 2–0–25–0, క్యాప్సీ 4–0–25–0, రాధ 1–0–11–0, అరుంధతి 1–0–14–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు గుజరాత్ జెయింట్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్, వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లలో ముంబై బేస్డ్, రిలయన్స్ ఓన్డ్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్, డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ రెండూ ప్రపంచంలోనే మేటి జట్లు అన్న విషయంతో అందరూ ఏకీభవించాల్సిందే. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఈ విషయాన్ని ఇదివరకే ప్రూవ్ చేసుకోగా.. డబ్ల్యూపీఎల్ ప్రారంభమైన కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్ వుమెన్స్ టీమ్ ఈ విషయాన్ని రుజువు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఎంఐ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసి టైటిల్ రేసులో ముందువరుసలో నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్ విషయానికొస్తే.. 15 ఐపీఎల్ ఎడిషన్లలో 5 సార్లు ఛాంపియన్‌గా, ఐదు ఛాంపియన్స్ లీగ్ ఎడిషన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఈ జట్టు.. కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేనప్పటికీ, కొన్ని గడ్డు పరిస్థితుల దృష్ట్యా గత రెండు సీజన్లుగా దారుణంగా విఫలమవుతూ వస్తుంది. స్టార్ ఆటగాళ్లు అందుబాటు లేకపోవడం, జూనియర్లు ఇప్పుడిప్పుడే కుదురుకుంటుండటం వల్ల ఎంఐ టీమ్‌కు ఈ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ఎలా ఉన్నా , వెంటనే సర్దుకుని తిరిగి గెలుపు ట్రాక్‌పై ఎక్కడం ఆ జట్టుకు ఇది కొత్తేమీ కాదు. కాబట్టి గత సీజన్ల గెలుపోటములతో పని లేకుండా, రాబోయే సీజన్లో ఎంఐ మెన్స్ టీమ్ సత్తా చాటి మరో టైటిల్ సాధిస్తుందని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. రాబోయే సీజన్లో బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయం తప్పిస్తే.. ఆ జట్టు అన్ని విభాగాల్లో పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆల్‌రౌండర్ల కోటాలో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, డుయాన్ జన్సెస్, పియుష్ చావ్లా లాంటి ఆటగాళ్లతో ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ పటిష్టంగా ఉంది. గాయపడిన బుమ్రా, జై రిచర్డ్సన్ స్థానాల్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పేసర్లు దొరికితే ఈ విభాగంలోనూ ఆ జట్టు పటిష్టంగా మారుతుంది. ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర పరిణామం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. అదేంటంటే.. తొట్టతొలి ఐపీఎల్‌ను ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో ప్రారంభించగా.. అందుకు భిన్నంగా డబ్ల్యూపీఎల్‌లో ఎంఐ వుమెన్స్ టీమ్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ విషయాన్ని నెటిజన్లు, ముఖ్యంగా ముంబై ఇండియన్స్ అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే 4 వరుస పరాజయాలతో అరంగేట్రం ఐపీఎల్ సీజన్‌ను ప్రారంభించిన ఎంఐ మెన్స్ టీమ్.. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ఐపీఎల్ ఛాంపియన్‌గా.. 2011, 2013 ఛాంపియన్స్ లీగ్ విజేతగా నిలిచింది. ఎంఐ మెన్స్ టీమ్‌కు భిన్నంగా వుమెన్స్ టీమ్ ప్రస్తానం సాగుతుండటంతో వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని ఎంఐ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎంఐ వుమెన్స్ టీమ్ స్టార్లతో నిండి ఉంది కాబట్టి, ఆ జట్టే తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ ఎగురేసుకుపోతుందని కొందరు ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. -
WPL 2023 GG Vs RCB: స్పెషల్ డే.. ‘స్పెషల్ మ్యాచ్’.. అందరికి ఎంట్రీ ఫ్రీ
WPL 2023- International Women's Day 2023: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రికెట్ ప్రేమికులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బంపరాఫర్ ఇచ్చింది. వుమెన్ ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా మార్చి 8 నాటి మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ టీమ్ మధ్య బుధవారం మ్యాచ్ జరుగనుంది. అందరికీ ఉచిత ప్రవేశం మహిళా దినోత్సవ కానుకగా ఈ ఆసక్తికర పోరును నేరుగా చూసేందుకు వీలు కల్పించారు నిర్వాహకులు. ఈ మేరకు.. ‘‘మహిళా దినోత్సవాన్ని మేము ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం. మార్చి 8, 2023న టాటా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ఆర్సీబీ మధ్య జరిగే మ్యాచ్ వీక్షించేందుకు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ముంబై- ఆర్సీబీ మధ్య సోమవారం నాటి మ్యాచ్ సందర్భంగా స్క్రీన్ మీద ఈ మేరకు ప్రకటన చేసిన నిర్వాహకులు.. సోషల్ మీడియా వేదికగా మరోసారి ఈ శుభవార్తను పంచుకున్నారు. దీంతో బీసీసీఐపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టిక్కెట్లు ఉచితంగా ఇవ్వడం కంటే కూడా మహిళా క్రికెటర్లకు సమున్నత గౌరవం కల్పిస్తున్న తీరుకు ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా స్టేడియం పరిమితికి తగ్గట్లు కొన్ని షరతులతో ఫ్రీగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ముంబై టాప్ భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బీసీసీఐ మహిళా ప్రీమియర్ లీగ్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మార్చి 4న ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ మ్యాచ్‌తో లీగ్ ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన గుజరాత్‌పై 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ తలపడగా.. లానింగ్ బృందం 60 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. స్పెషల్ డే.. స్పెషల్ మ్యాచ్ మూడో మ్యాచ్‌లో గుజరాత్- యూపీ వారియర్స్ పోటీ పడగా.. యూపీ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక నాలుగో మ్యాచ్ ముంబై- ఆర్సీబీ మధ్య జరుగగా.. స్మృతి మంధాన సేనకు ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. ఇక ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరుగగా.. ముంబై రెండింటిలో ఘన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంతవరకు రెండేసి మ్యాచ్‌లు ఆడి రెండింట్లోనూ ఓడిన గుజరాత్- ఆర్సీబీ మార్చి 8న గెలుపు కోసం పోటీపడనున్నాయి. మహిళలకు ప్రత్యేకమైన రోజున మరి విజయం ఎవరిని వరిస్తుందో!! చదవండి: WPL 2023: ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్‌లోనూ నిరాశ తప్పదా..? PSL 2023: మార్టిన్ గప్తిల్ వీరవిహారం.. 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో.. View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
WPL 2023: ముంబై సూపర్ షో
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ధనాధన్ ఆల్‌రౌండ్ షోతో వరుసగా రెండో విజయం సాధించింది. సోమవారం జరిగిన పోరులో 9 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన హేలీ మాథ్యూస్ బ్యాటింగ్‌లో (38 బంతుల్లో 77 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. టాపార్డర్ బ్యాటర్ నట్ సీవర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా మెరుపు అర్ధ సెంచరీ సాధించడంతో ఛేదన సులువైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. రిచా ఘోష్ (26 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, సయిక ఇషాక్, అమెలియా కెర్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ హేలీ, బ్రంట్‌ల అజేయ అర్ధ సెంచరీలతో 14.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసింది. అందరూ అంతంతే! బెంగళూరు స్కోరైతే 150 దాటింది కానీ... ఏ ఒక్క బ్యాటర్‌ది చెప్పుకోదగ్గ స్కోరుగానీ, ఇన్నింగ్స్‌ను కుదుటపర్చిన భాగస్వామ్యంగానీ లేవు. అదే బెంగళూరు పాలిట శాపమైంది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (17 బంతుల్లో 23; 5 ఫోర్లు) మొదలు మేగన్ షట్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) దాకా ఐదుగురు బ్యాటర్లు రిచా, కనిక ఆహుజా (13 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాంక పాటిల్ (15 బంతుల్లో 23; 4 ఫోర్లు) 20 పైచిలుకు పరుగులు చేశారు. అందరు ఇలా వచ్చి అలా షాట్లు బాదేసి పెవిలియన్‌కు వెళ్లినవారే! ఇందులో ఏ ఒక్కరు నిలబడినా, మెరుపుల భాగస్వామ్యం నమోదైనా పరిస్థితి మరోలా ఉండేది. అయితే ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో సమష్టిగా సఫలమయ్యారు. హేలీ, బ్రంట్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ముంబై ముందున్న లక్ష్యం 156 పరుగులు. అంత సులభమైందేమీ కాదు. కానీ యస్తిక భాటియా (19 బంతుల్లో 23; 4 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన హేలీ మాథ్యూస్ తొలి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. స్కోరు జోరందుకున్న సమయంలో యస్తికను ప్రీతి బోస్ వికెట్ ముందు దొరకబుచ్చుకుంది. 45 పరుగుల వద్ద తొలి వికెట్ కూలగా, బెంగళూరుకు అదే ఆఖరి ఆనందం అయ్యింది. తర్వాత నట్ సీవర్ వచ్చాక హేలీ వేగం మరో దశకు చేరింది. బెంగళూరు కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. అటు బ్రంట్, ఇటు హేలీ బౌండరీలను అవలీలగా బాదేస్తుంటే ఆద్యంతం ‘పవర్ ప్లే’నే కనిపించింది. పదో ఓవర్లోనే హేలీ 26 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 10.2 ఓవర్లోనే జట్టు స్కోరు 100 దాటింది. మేగన్ షట్ వేసిన 12, శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లలో బ్రంట్, హేలీలు ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే ముంబై 40 పరుగులు చేయడంతో లక్ష్యాన్ని 5.4 ఓవర్ల ముందే ఛేదించింది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) వాంగ్ (బి) హేలీ 23; సోఫీ (సి) అమన్‌జోత్ (బి) సయిక 16; దిశ (బి) సయిక 0; ఎలైస్ పెర్రీ రనౌట్ 13; హీథెర్‌నైట్ (బి) హేలీ 0; రిచాఘోష్ (సి) నట్ సీవర్ (బి) హేలీ 28; కనిక (సి) యస్తిక (బి) పూజ 22; శ్రేయాంక (ఎల్బీ) (బి) నట్ సీవర్ 23; మేగన్ (స్టంప్డ్) యస్తిక (బి) అమెలియా 20; రేణుక (బి) అమెలియా 2; ప్రీతి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–43, 4–43, 5–71, 6–105, 7–112, 8–146, 9–154, 10–155. బౌలింగ్: హేలీ 4–0–28–3, నట్ సీవర్ 3–0–34–1, సయిక ఇషాక్ 4–0–26–2, ఇసి వాంగ్ 2–0–18–0, అమెలియా కెర్ 3.4–0–30–2, కలిత 1–0–10–0, పూజ 1–0–8–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ నాటౌట్ 77; యస్తిక (ఎల్బీ) (బి) ప్రీతి 23; నట్ సీవర్ నాటౌట్ 55; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159. వికెట్ల పతనం: 1–45. బౌలింగ్: రేణుక 3–0–28–0, ప్రీతి బోస్ 4–0–34–1, మేగన్ షట్ 3–0–32–0, ఎలైస్ పెర్రీ 1.2–0–18–0, శ్రేయాంక 2–0–32–0, సోఫీ డివైన్ 1–0–11–0. డబ్ల్యూపీఎల్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ X లక్నో విజార్డ్స్ రాత్రి గం. 7:30 నుంచి స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
WPL 2023: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
WPL 2023- Smriti Mandhana: ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. రోజురోజుకు ఆర్సీబీ అభిమానగణం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన కోహ్లి ట్రోఫీ గెలవకపోయినా తన అద్భుత ఆట తీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత సీజన్‌తో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్మృతి సారథ్యంలో ఇదిలా ఉంటే.. భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మహిళా ప్రీమియర్ లీగ్ మార్చి 4న ఆరంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్‌లో ఆర్సీబీ వుమెన్ టీమ్‌కు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మార్చి 5న మ్యాచ్ పూర్తి చేసుకున్న స్మృతి సేన.. సోమవారం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లితో తనను పోలుస్తూ వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్మృతి ఈ విధంగా సమాధానమచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పోలికలు నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే కోహ్లి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు సాధించాడు. నేను ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకోవడమే తప్ప.. కనీసం కోహ్లి రికార్డులకు దరిదాపుల్లో కూడా లేను. ముఖ్యంగా ఆర్సీబీకి కోహ్లి అందిస్తున్న సేవలు అమోఘం. నేను కూడా తనలా ఉండేందుకు, జట్టును గొప్ప స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా’’ అని స్మృతి పేర్కొంది. కాగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో భాగంగా ఆర్సీబీ అత్యధికంగా 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్మృతి మంధానను కొనుగోలు చేసింది. ఇక కోహ్లి, స్మృతి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లి ఘనత.. ఇక 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి.. 2021 సీజన్ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. సారథిగా 140 మ్యాచ్‌ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు నమెదు చేశాడు. మరో 4 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2016లో రన్నరప్‌గా నిలిచింది. మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఫామ్‌లోకి వచ్చిన ఈ రన్‌మెషీన్ అంతర్జాతీయ క్రికెట్లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. చదవండి: WPL 2023: ఎంఎస్డీ పేరును బ్యాట్‌పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్ Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్ -
డబ్ల్యూపీఎల్‌లో సందడి చేయనున్న బాలీవుడ్ హీరోయిన్లు
మహిళల ప్రీమియర్ లీగ్ అరంగేట్ర సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పాల్గొననున్నాయి. ఇక తొలి డబ్ల్యూపీఎల్ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు కృతి సనన్, కియారా అద్వానీ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ అందాల భామల డ్యాన్స్‌తో పాటు పంజాబీ రాప్ సింగర్ ఏపీ దిల్లాన్ కూడా సందడి చేయునున్నాడు. కాగా ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు కియారా, కృతి సనన్, దిల్లాన్ రిహార్స్ల్స్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్ల్యూపీఎల్ పూర్తి షెడ్యూల్? మార్చి 4: గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 5: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్, (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 5: UP వారియర్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 6: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 7: ఢిల్లీ క్యాపిటల్స్ vs UP వారియర్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 8: గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30) PM) , బ్రబౌర్న్) మార్చి 9: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 10: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs UP వారియర్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 11: గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7: 30 PM) , డివై పాటిల్) మార్చి 12: UP వారియర్స్ vs ముంబై ఇండియన్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 13: ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 14: ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 21: UP వారియర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 24: ఎలిమినేటర్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 15: UP వారియర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (7:30 PM, డివై పాటిల్) మార్చి 16: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 18: ముంబై ఇండియన్స్ vs UP వారియర్స్ (3:30 PM, DY పాటిల్ ) మార్చి 18: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ (7:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: గుజరాత్ జెయింట్స్ vs UP వారియర్స్ (3:30 PM, బ్రబౌర్న్) మార్చి 20: ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (7:30 PM, డివై పాటిల్) మార్చి 21: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ (3:30 PM, డివై పాటిల్) మార్చి 26: ఫైనల్ (7:30 PM, బ్రబౌర్న్) లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: WPL 2023: తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం! -
తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్‌కు భారీ షాక్.. స్టార్ క్రికెటర్ దూరం!
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్దమైంది. గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ లీగ్ షురూ కానుంది. ఈ మ్యాచ్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా శనివారం సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్‌కు ముందే గుజరాత్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైంది. ముంబై వేదికగా జరిగిన వేలంలో డాటిన్‌ను రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగొలు చేసింది. ఇక గుజరాత్ తమ జట్టులో డాటిన్ స్థానాన్ని ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా గుజరాత్ ప్రకటించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కిమ్ గార్త్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు డాటిన్ దూరం కావడంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్ గార్త్‌కు దక్కింది. రూ.60 లక్షల కనీస ధరకు గార్త్‌తో గుజరాత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక లీగ్‌లో గుజరాత్ జట్టు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ బెత్ మూనీ వ్యవహరించనుంది. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు.. భరత్‌కు నో ఛాన్స్! కిషన్ అరంగేట్రం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
WPL 2023 Full Schedule- Where To Watch: మహిళా క్రికెట్ అభివృద్ధిలో భాగంగా బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌కు శనివారం(మార్చి 4) తొలి అడుగుపడనుంది. ముంబై ఇండియన్స్- గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య పోటీతో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. డబ్ల్యూపీఎల్ తొలి టైటిల్ కోసం ఐదు జట్లు పోటీపడనున్నాయి. ముంబైలో జరుగనున్న ఈ టీ20 లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ట్రోఫీ కోసం అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కాగా లీగ్ దశలో డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో ఐదు జట్లు పోటీపడతాయి. అగ్రస్థానంలో నిలిచిన మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి. పాయింట్ల పట్టికలో ప్రథమస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో మరో ఫైనలిస్టు ఖరారవుతుంది. ఈ నేపథ్యంలో డివై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియం వేదికగా జరుగననున్న 22 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు.. పూర్తి షెడ్యూల్.. ఎవరితో ఎవరు? మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం).. 1. మార్చి 4- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 2. మార్చి 5- ఆదివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు.. 3. మార్చి 5- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 4. మార్చి 6- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 5. మార్చి 7- మంగళవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 6. మార్చి 8- బుధవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 7. మార్చి 9- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 8. మార్చి 10- శుక్రవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 9. మార్చి 11- శనివారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 10. మార్చి 12- ఆదివారం- యూపీ వారియర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్ - బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 11. మార్చి 13- సోమవారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ - డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 12. మార్చి 14- మంగళవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 13. మార్చి 15- బుధవారం- యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 14. మార్చి 16- గురువారం- ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 15. మార్చి 18- శనివారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ యూపీ వారియర్స్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 16. మార్చి 18- శనివారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్- బ్రబౌర్న్ స్టేడియం- రాత్రి 7.30 గంటలకు 17. మార్చి 20- సోమవారం- గుజరాత్ జెయింట్స్ వర్సెస్ యూపీ వారియర్స్- బ్రబౌర్న్ స్టేడియం- మధ్యాహ్నం 3.30 గంటలకు 18. మార్చి 20- సోమవారం- ముంబై ఇండియన్స్ వుమెన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 19. మార్చి 21- మంగళవారం- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వుమెన్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- మధ్యాహ్నం 3.30 గంటలకు 20. మార్చి 21- మంగళవారం- యూపీ వారియర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు 21. మార్చి 24- శుక్రవారం- ఎలిమినేటర్ మ్యాచ్- డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ- రాత్రి 7.30 గంటలకు 22. మార్చి 26- ఆదివారం- ఫైనల్ మ్యాచ్- బ్రబౌర్న్ స్టేడియం-రాత్రి 7.30 గంటలకు లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. టీవీ: స్పోర్ట్స్18 నెట్వర్క్ డిజిటల్ మీడియా: జియో సినిమా యాప్, వెబ్సైట్ చదవండి: IND vs AUS: టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజులా? దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రోహిత్ శర్మ IND Vs AUS: చిరాకు తెప్పించాలనుకున్నాడు.. అశ్విన్ చర్యకు మైండ్‌బ్లాక్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });