![WPL To Be Held In Mumbai From March 4th To 26th - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/7/Untitled-4_1.jpg.webp?itok=lRN7RLeD)
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్‌కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.
లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్‌కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు..
- అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్
- ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్
- రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్
- క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్
Comments
Please login to add a commentAdd a comment