Womens IPL
-
ముగిసిన మినీ వేలం.. అత్యంత ఖరీదైన ప్లేయర్ ఎవరంటే..?
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ మినీ వేలంలో బెంగళూరు నగరంలో ఇవాళ (డిసెంబర్ 15) జరిగింది. ఈ వేలంలో దేశ విదేశాలకు చెందిన 120 మంది ప్లేయర్లు పాల్గొనగా.. ఖాళీగా ఉన్న 19 స్థానాలు భర్తీ అయ్యాయి. వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా షేక్ సిమ్రన్ నిలిచింది. సిమ్రన్ను గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. సిమ్రన్ తర్వాత అత్యధిక ధర విండీస్ ఆల్‌రౌండర్ డియాండ్రా డొట్టిన్‌కు దక్కింది. డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో మరో ఇద్దరు భారతీయ అన్క్యాప్డ్ ప్లేయర్లకు కోటి పైన ధర లభించింది. జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు.. ప్రేమా రావత్‌ను ఆర్సీబీ రూ.1.2 కోట్లకు సొంతం చేసుకున్నాయి.డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్లుషేక్ సిమ్రన్-1.9 కోట్లు (గుజరాత్ జెయింట్స్)డియాండ్రా డొట్టిన్-1.7 కోట్లు (గుజరాత్ జెయింట్స్)జి కమలిని-1.6 కోట్లు (ముంబై ఇండియన్స్)ప్రేమా రావత్-1.2 కోట్లు (ఆర్సీబీ)నల్లపురెడ్డి చరణి-55 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)డబ్ల్యూపీఎల్ 2025 వేలంలో ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే..!ముంబై ఇండియన్స్:జి కమిలిని-1.6 కోట్లునడినే డి క్లెర్క్-30 లక్షలుఅక్షిత మహేశ్వరి-20 లక్షలుసంస్కృతి గుప్తా-10 లక్షలుఆర్సీబీ:ప్రేమా రావత్-1.2 కోట్లుజోషిత-10 లక్షలురాఘ్వి బిస్త్-10 లక్షలుజాగ్రవి పవార్-10 లక్షలుఢిల్లీ క్యాపిటల్స్:నల్లపురెడ్డి చరణి-55 లక్షలునందిని కశ్యప్-10 లక్షలుసారా బ్రైస్-10 లక్షలునికీ ప్రసాద్-10 లక్షలుయూపీ వారియర్జ్:అలానా కింగ్-30 లక్షలుఆరుషి గోయెల్-10 లక్షలుక్రాంతి గౌడ్-10 లక్షలుగుజరాత్ జెయింట్స్:షేక్ సిమ్రన్-1.9 కోట్లుడియాండ్రా డొట్టిన్-1.7 కోట్లుడేనియెల్ గిబ్సన్-30 లక్షలుప్రకాషిక నాయక్-10 లక్షలు -
మినీ వేలం.. విండీస్ అల్రౌండర్కు భారీ మొత్తం
మహిళల ఐపీఎల్ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్ ఆల్‌రౌండర్, లేడీ యూనివర్సల్ బాస్‌గా పిలువబడే డియాండ్రా డొట్టిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్ ఔటైన ప్లేయర్ డొట్టినే. డొట్టిన్‌ను 2023 డబ్ల్యూపీఎల్ ఇనాగురల్ ఎడిషన్‌లో కూడా గజరాత్ జెయింట్సే సొంతం చేసుకుంది. ఆ సీజన్లో జెయింట్స్ డొట్టిన్‌ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్ ప్రారంభానికి ముందే జెయింట్స్ డొట్టిన్‌ను వదిలేసింది. డొట్టిన్ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్‌లో డొట్టిన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్ జెయింట్సే అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్ వద్ద రూ.4.4 కోట్ల పర్స్ బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్ కోసం జెయింట్స్‌తో పాటు యూపీ వారియర్జ్ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్‌ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్‌కు విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్‌గానూ పేరుంది. అందుకే డొట్టిన్‌కు వేలంలో భారీ మొత్తం దక్కింది.ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్ షేక్‌కు గుజరాత్ జెయింట్స్ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. -
గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా ప్రవీణ్ తాంబే
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన గుజరాత్ జెయింట్స్ తమ నూతన బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేను నియమించుకుంది. మాజీ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ప్రవీణ్ నియామకం జరిగింది. గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం బౌలింగ్ కోచ్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ నియామకం కూడా చేపట్టింది. గుజరాత్ బ్యాటింగ్ కోచ్ స్థానానికి ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ మార్ష్ ఎంపికయ్యాడు. గుజరాత్ జెయింట్స్ తమ హెడ్ కోచ్‌గా మైఖేల్ క్లింగర్కు కొనసాగించనుంది. క్లింగర్ గత సీజన్లోనే జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.కాగా, ప్రవీణ్ తాంబే 41 ఏళ్ల వయసులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2013 సీజన్లో అతను రాజస్థాన్ రాయల్స్ తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. తాంబేకు ఐపీఎల్లో కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల తరఫున కోచింగ్ బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉంది.డేనియల్ మార్ష్ విషయానికొస్తే.. ఇతను 2013-17 మధ్యలో టాస్మానియా పురుషుల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. మార్ష్.. 2022లో ఆస్ట్రేలియా మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించబడ్డాడు.షాకిచ్చిన మిథాలీడబ్ల్యూపీఎల్ 2025 వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ బాధ్యతల నుంచి తప్పుకుంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే తప్పుకుంది. మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.అట్టడుగు స్థానంలో..గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది.డిసెంబర్ 15న వేలండబ్ల్యూపీఎల్ 2025 వేలం రానున్న ఆదివారం (డిసెంబర్ 15) బెంగళూరు వేదికగా జరుగనుంది. వేలానికి ముందు గుజరాత్ జెయింట్స్ ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ లాంటి సీనియర్ ప్లేయర్లను రీటైన్ చేసుకుంది.గుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు: ఆష్లే గార్డ్నర్, బెత్ మూనీ, దయాళన్ హేమలత, హర్లీన్ డియోల్, లారా వోల్వార్డ్, షబ్నమ్ షకీల్, తనూజా కన్వర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, భారతీ ఫుల్మాలీ, సయాలీ సత్గరేగుజరాత్ జెయింట్స్ వదులుకున్న ప్లేయర్లు: స్నేహ్ రాణా, క్యాథరిన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నమ్ పఠాన్, లీ తహుహు. -
గుజరాత్ జెయింట్స్ నుంచి వైదొలిగిన టీమిండియా మాజీ కెప్టెన్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి (డిసెంబర్ 15) ముందు గుజరాత్ జెయింట్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు మెంటార్ మరియు అడ్వైజర్ మిథాలీ రాజ్ (భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్) బాధ్యతల నుంచి తప్పుకొంది. వాస్తవానికి మిథాలీ కాంట్రాక్ట్ మరో ఏడాది పాటు ఉండింది. అయితే ఇతరత్రా కారణాల చేత మిథాలీ మరో ఏడాది కాంట్రాక్ట్ ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకుంది. మిథాలీ ఇటీవలే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మిథాలీతో పాటు గుజరాత్ జెయింట్స్ బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ కూడా తన బాధ్యతల నుంచి తప్పుకుంది. అల్ ఖదీర్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితోనే ముగిసింది. అయితే అల్ ఖదీర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించమని ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కోరలేదు. అల్ ఖదీర్ ప్రస్తుతం భారత అండర్-19 మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తుంది. మెంటార్ మరియు బౌలింగ్ కోచ్ ప్రత్యామ్నాయాలను గుజరాత్ జెయింట్స్ రేపటి లోగా ప్రకటించవచ్చు. హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్, ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ యధావిధిగా తమ బాధ్యతల్లో కొనసాగుతారని జెయింట్స్ యాజమాన్యం ప్రకటించింది. కాగా, గుజరాత్ జెయింట్స్ జట్టు గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీ రెండు సీజన్లలో అట్టడుగు స్థానాల్లో నిలిచింది. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతనిథ్యం వహించే పెర్రీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో, బంతితో ఇరగదీసింది.డబ్యూబీబీఎల్ 2024 సీజన్లో పెర్రీ ఇప్పటివరకు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన పెర్రీ.. రెండో మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. మూడో మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయమైన 31 పరుగులు చేసిన పెర్రీ.. ఓ వికెట్ పడగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో 62 బంతుల్లో 86 పరుగులు చేసిన పెర్రీ.. తాజాగా జరిగిన ఐదో మ్యాచ్‌లో 44 బంతుల్లో అజేయమైన 48 పరుగులు చేసి ఓ వికెట్ తీసింది.ఓవరాల్‌గా పెర్రీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 100 సగటున, 152.28 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 300 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు తీసింది. మహిళల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పెర్రీ సూపర్ ఫామ్ ఆర్సీబీకి శుభ శకునమని చెప్పాలి. పెర్రీ గత ఐపీఎల్ సీజన్లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీసింది. పెర్రీ 2024 సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు) నిలిచి బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసింది. కాగా, మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరుగనుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి. అలాగే తాము రిలీజ్ చేసిన పేర్లను కూడా ప్రకటించాయి.డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
14 మందిని రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కెప్టెన్‌గా మళ్లీ..!
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ 14 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఆరుగురిని వేలానికి వదిలేసింది. వేలానికి వదిలేసిన వారిలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓ జట్టుకు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్ల రూల్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్‌కు వేలానికి వదిలేసింది. డి క్లెర్క్ స్థానంలో ఆర్సీబీ గత నెలలో ఇంగ్లండ్ అటాకింగ్ బ్యాటర్ డ్యానీ వాట్‌ను యూపీ వారియర్జ్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ముంబై యాజమాన్యం వాట్‌ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన మరో ఐదుగురు ప్లేయర్లు (దిషా కసత్, ఇంద్రాణి రాయ్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్) భారతీయ ప్లేయర్లే కావడం విశేషం.ఓవరాల్‌గా చూస్తే ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించిందనే చెప్పాలి. ఆర్సీబీ మరో సీజన్‌కు స్మృతి మంధననే కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్, సోఫీ మోలినెక్స్ వచ్చే సీజన్లో కూడా కొనసాగనున్నారు. వీరితో పాటు దేశీయ స్టార్లు రిచా ఘోష్, రేణుక సింగ్ ఠాకూర్ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రిటెన్షన్ల ప్రక్రియ అనంతరం ఆర్సీబీ పర్స్‌లో ఇంకా రూ. 3.25 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో ఆర్సీబీ మరో నలుగురు లోకల్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, ఎల్లిస్ పెర్రీ మాత్రమే ఉండటంతో ఈసారి వేలంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పేసర్లపై గురి పెట్టవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. కాగా, తొలి సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
హ్యాట్రిక్ తీసిన బౌలర్‌నే వదిలేసిన ముంబై ఇండియన్స్
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) ఇవాళ రిటెన్షన్ జాబితాలను విడుదల చేశాయి. దాదాపుగా అన్ని ఫ్రాంచైజీలు నలుగురి నుంచి ఆరుగురిని వేలానికి వదిలేసి మిగతా ప్లేయర్లను అలాగే అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం నలుగురిని వేలానికి వదిలేసి, 14 మంది ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. ముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్‌లో ముగ్గురు భారత అన్క్యాప్డ్ ప్లేయర్లు కాగా.. ఓ విదేశీ స్టార్ ప్లేయర్ ఉంది. వచ్చే సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్‌ను అనూహ్యంగా వేలానికి వదిలేసింది. 22 ఏళ్ల ఇస్సీ డబ్ల్యూపీఎల్ డెబ్యూ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున హ్యాట్రిక్ తీసింది. మహిళల ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన తొలి క్రికెటర్ ఇస్సీనే కావడం విశేషం. 2023 సీజన్లో యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇస్సీ ఈ ఘనత సాధించింది. హ్యాట్రిక్ తీయడంతో పాటు తొలి సీజన్లో ఓ వెలుగు వెలిగిన ఇస్సీ 2024 సీజన్లో మరో స్టార్ విదేశీ పేసర్ (షబ్నిమ్ ఇస్మాయిల్) రావడంతో మరుగున పడిపోయింది. షబ్నిమ్ ఎంట్రీతో ఇస్సీకి అవకాశాలు కరువయ్యాయి. షబ్నిమ్ అద్భుతమైన ప్రదర్శనలతో రాణించడంతో ఈ ఏడాది వేలానికి ముందు ఇస్సీని వదిలేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంఐ మేనేజ్మెంట్ ఇస్సీని వదులుకోక తప్పలేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఇస్సీతో పాటు స్వదేశీ అన్క్యాప్డ్ ప్లేయర్లు ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్లను కూడా వేలానికి వదిలేసింది. ముంబై ఇండియన్స్ ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఎంఐ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్వదేశీ, విదేశీ స్టార్లు ఉన్నారు. వేలంలో పాల్గొనేందుకు ముంబై ఇండియన్స్ పర్స్‌లో ఇంకా 2.65 కోట్ల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో ముంబై ఇండియన్స్ మరో నలుగురు ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే, తొలి సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్.. రెండో సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ముంబైని ఇంటికి పంపించిన ఆర్సీబీనే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇస్సీ వాంగ్ -
మహిళల ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా ఇదే..!
మహిళల ఐపీఎల్ (WPL) 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) విడుదల చేశాయి. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది.ఏ ఫ్రాంచైజీ ఎవరిని రీటైన్ చేసుకుంది, ఎవరిని వేలానికి విడిచిపెట్టింది..?ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగెజ్, తానియా భాటియా, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, మారిజన్ కాప్, రాధా యాదవ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, జెస్ జొనాస్సెన్, టైటాస్ సాధు, మిన్నూ మణి, స్నేహ దీప్తిఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వీళ్లే..లారా హ్యారిస్, అశ్వని కుమారి, పూనమ్ యాదవ్, అపర్ణ మొండల్ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..హార్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యస్తికా భాటియా, అమెలియా కెర్, క్లో టైరాన్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సంజనా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాఖీ, అమన్‌జోత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, కీర్తనముంబై ఇండియన్స్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..ప్రియాంక బాలా, హుమైరా ఖాజీ, ఫాతిమా జాఫర్, ఇసబెల్ వాంగ్ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్యూపీ వారియర్జ్ రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..అలైసా హీలీ (కెప్టెన్), కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, చమారీ ఆటపట్టు, గ్రేస్ హ్యారిస్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అంజలి సర్వని, గౌహెర్ సుల్తానా, పూనమ్ ఖెమ్నార్, ఉమా ఛెత్రీ, వ్రింద దినేశ్యూపీ వారియర్జ్ వదిలేసిన ప్లేయర్స్ వీళ్లే..లారెన్ బెల్, పర్షవీ చోప్రా, లక్ష్మీ యాదవ్, ఎస్ యషశ్రీగుజరాత్ జెయింట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వీళ్లే..బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్, లారా వోల్వార్డ్ట్, దయాలన్ హేమలత, తనూజా కన్వర్, షబ్నిమ్ షకీల్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, మన్నత్ కశ్యప్, మేఘన సింగ్గుజరాత్ జెయింట్స్ వదిలేసిన ప్లేయర్స్ జాబితా ఇదే..స్నేహ్ రాణా, కేథరీన్ బ్రైస్, త్రిష పూజిత, వేద కృష్ణమూర్తి, తరన్నుమ్ పఠాన్, లియా తహుహుఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది..గుజరాత్- 4.4 కోట్లుయూపీ వారియర్జ్- 3.9 కోట్లుఆర్సీబీ- 3.25 కోట్లుముంబై ఇండియన్స్- 2.65 కోట్లుఢిల్లీ క్యాపిటల్స్- 2.5 కోట్లుఏ ఫ్రాంచైజీ ఇంకా ఎంత మందిని కొనగోలు చేయొచ్చంటే..?ఆర్సీబీ- 4ముంబై ఇండియన్స్- 4ఢిల్లీ క్యాపిటల్స్- 4యూపీ వారియర్జ్- 3గుజరాత్ జెయింట్స్- 4 -
గుజరాత్ జెయింట్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు (రెండవది) ముందు గుజరాత్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లింగర్ గుజరాత్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్ స్థానాన్ని క్లింగర్ భర్తీ చేస్తాడు. క్లింగర్ ఎంపిక విషయాన్ని గుజరాత్ జెయింట్స్ మేనేజ్మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది. తొలి సీజన్ నుంచి జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న క్లింగర్ .. మెంటార్ మిథాలీ రాజ్, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌తో ఇదివరకే జాయిన్ అయినట్లు జెయింట్స్ మేనేజ్మెంట్ తెలిపింది. క్లింగర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ అసిస్టెంట్ కోచ్‌గా, అదే సిడ్నీ థండర్స్ రిక్రూటర్‌గా, 2019-2021 వరకు మెల్బోర్న్ రెనెగేడ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. 43 ఏళ్ల క్లింగర్ 2019లో బిగ్‌బాష్ లీగ్‌కు రిటైర్మెంట్ (ఆటగాడిగా) పలికాడు. నాటికి క్లింగర్ బీబీఎల్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు. Coach saheb padharya! 🤩 We are delighted to welcome former Australian cricketer @maxyklinger as our head coach for the upcoming WPL season. 🙌🧡#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/iJjqnSUo9K — Gujarat Giants (@Giant_Cricket) February 6, 2024 ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో (2023) గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి, తొలి WPL టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 2024 సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో మ్యాచ్‌లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్ట్‌ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. జెయింట్స్‌లో త్రిష పూజిత, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్, మన్నత్ కశ్యప్, స్నేహ్ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు. -
WPL Auction 2023: అన్ సోల్డ్‌గా మిగిలిపోయిన తెలంగాణ అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లు అనూహ్య ధరలు దక్కించుకున్నారు. తొలి రౌండ్ వేలం పూర్తయ్యే సరికి అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా స్మృతి మంధాన ఉంది. స్టార్ ఓపెనర్ అయిన స్మృతిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. ఈమె తర్వాత దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. మెగా వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్లేయర్లు ఇప్పటివరకు లిస్టింగ్‌లోకి రాగా.. కర్నూలుకు చెందిన కేశవరాజుగారి అంజలి శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష 10 లక్షల బేస్‌ప్రైజ్ విభాగంలో లిస్టింగ్‌కు వచ్చినప్పటికీ ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చ లేదు. వేలం ట్రెండ్‌ను బట్టి త్రిషకు భారీ ధర దక్కుతుందని అంతా ఊహించారు. అయితే, ఈ అమ్మాయిని జట్టులో చేర్చుకునేందుకు ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వేలంలో మరో దఫా లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో చివర్లో అయినా ఏదో ఒక జట్టు ఈ అమ్మాయిని దక్కించుకోవచ్చు. 17 ఏళ్ల స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన త్రిష ఇటీవల జరిగిన అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌లో సత్తా చాటడం ద్వారా వెలుగులోకి వచ్చింది. సీనియర్ జట్టుకు ఆడకపోవడం ఈ అమ్మాయికి మైనస్ అయ్యుండవచ్చని క్రికెట్ ఫాలోవర్స్ అనుకుంటున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన త్రిష.. అండర్-19 వరల్డ్‌కప్-2023 ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ (24 నాటౌట్) ఆడి టీమిండియాను జగజ్జేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, లెగ్ బ్రేక్ బౌలింగ్ చేసే త్రిష.. ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. వేలం ప్రక్రియ ఇవాళ రాత్రి వరకు సాగనుండటంతో ఏదో ఒక జట్టు త్రిషను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. కాగా, వేలంలో తొలి రౌండ్ పూర్తయ్యే సరికి త్రిషతో పాటు భారత్‌కు చెందిన క్రికెటర్లు తాన్యా భాటియా, సుష్మ వర్మ, పూనమ్ యాదవ్, హ్రిషిత బసు, సౌమ్య తివారి, అర్చనా దేవి, మన్నత్ కశ్యప్, నజ్లా సీఎంసీ, సోనమ్ యాదవ్, షబ్నమ్ షకీల్, ఫలక్ నాజ్, సోనియా మెందియా, శిఖా షాలోట్, హర్లీ గాలా అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు. ఇప్పటివరకు కేవలం 78 మాత్రమే వేలానికి రాగా.. ఇంకా 412 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంది. -
WPL వేలంలో జాక్‌పాట్ కొట్టిన కర్నూలు అమ్మాయి
ముంబై వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 13) జరుగుతున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (WPL) మెగా వేలంలో టీమిండియా క్రికెటర్లపై కనక వర్షం కురుస్తుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 3.4 కోట్లకు సొంతం చేసుకోగా.. దీప్తి శర్మ (యూపీ వారియర్జ్, 2.6 కోట్లు), జెమీమా రోడ్రిగెజ్ (ఢిల్లీ క్యాపిటల్స్, 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (ఢిల్లీ క్యాపిటల్స్, 2 కోట్లు), రిచా ఘోష్ (ఆర్సీబీ, 1.9 కోట్లు), పూజా వస్త్రాకర్ (ముంబై ఇండియన్స్, 1.9 కోట్లు), టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (ముంబై ఇండియన్స్, 1.8 కోట్లు), రేణుకా సింగ్ (ఆర్సీబీ, 1.5 కోట్లు), యస్తికా భాటియా (ముంబై ఇండియన్స్, 1.5 కోట్లు) భారీ ధర పలికిన వారిలో ఉన్నారు. Young Anjali Sarvani is next with a base price of INR 30 Lakh She is SOLD to @UPWarriorz for INR 55 Lakh #WPLAuction — Women's Premier League (WPL) (@wplt20) February 13, 2023 వేలంలో ఊహించని ధర పలికిన వారిలో కర్నూలు అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి కూడా ఉంది. 25 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన శర్వాణిని యూపీ వారియర్జ్ 55 లక్షలకు దక్కించుకుంది. 30 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పోటీపడ్డ అంజలీని యూపీ వారియర్జ్ పోటీపడి మరీ సొంతం చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఆదోనికి చెందిన శార్వాణి ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, సత్తా చాటింది. ఆ సిరీస్‌లో శర్వాణి ఆడిన 5 మ్యాచ్‌ల్లో 8.73 సగటున 3 వికెట్లు పడగొట్టింది. టీమిండియా తరఫున ఓవరాల్‌గా 6 టీ20లు ఆడిన శర్వాణి 2/34 అత్యుత్తమ ప్రదర్శనతో 3 వికెట్లు తీసుకుంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో కూడా శర్వాణి సభ్యురాలిగా ఉంది. -
ఐపీఎల్ వేలం నిర్వహించనున్న మహిళ ఎవరో తెలుసా..?
మహిళల ఐపీఎల్ (WPL) తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళను బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఇనాగురల్ WPL యొక్క వేలం ఇవాళ (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగనుంది. ఈ నేపథ్యంలో వేలం నిర్వహించనున్న మల్లిక గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ముంబైకి చెందిన మల్లిక అడ్వానీ పురాతన పెయింటింగ్స్ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్ అండ్ కాన్టెంపరరీ ఇండియన్ ఆర్ట్ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్ కలెక్టర్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్ ఇండియా కన్సల్టెంట్స్ ఫర్మ్‌లో పార్ట్నర్గా కూడా ఉన్నారు. ఆక్షన్లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. 🥁🥁🥁 Doubling the #vivoProKabaddiPlayerAuction excitement is our auctioneer Mallika Sagar! Let's welcome our first Indian auctioneer and get ready for a 🤯 auction this season. pic.twitter.com/Qhw1YkC1rP — ProKabaddi (@ProKabaddi) August 26, 2021 పుండోల్స్ అనే ముంబై బేస్డ్ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. వృత్తి రిత్యా మల్లికకు సంబంధించిన వివరాలు ఇవి. కాగా, పురుషుల ఐపీఎల్ వేలం ప్రక్రియను గతంలో హగ్ ఎడ్మియాడెస్, రిచర్డ్ మ్యాడ్లీ లేక చారు శర్మ నిర్వహించిన విషయం తెలిసిందే. మహిళల లీగ్ కోసం మహిళా ఆక్షనీర్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో బీసీసీఐ మల్లిక పేరును కొద్ది రోజుల కిందటే తెరపైకి తెచ్చింది. ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే WPL వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు పాల్గొననుండగా.. కేవలం 90 స్లాట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. లీగ్‌లో పాల్గొనబోయే 5 జట్లు కనీసం 15 మంది ప్లేయర్లను కొనుగోలు చేస్తాయి. ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్ల కోసం 9 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫుల్ పర్స్ వ్యాల్యూ 12 కోట్లుగా ఉంది. ఒక్కో జట్టుకు కేవలం ఆరుగురు ఫారిన్ ప్లేయర్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వేలంలో పాల్గొంటున్న క్రికెటర్లలో 24 మంది 50 లక్షల కనీస ధరకు, 30 మంది 40 లక్షల బేస్ ప్రైజ్ విభాగంలో పేర్తు రిజిస్టర్ చేసుకున్నారు. 50 లక్షల విభాగంలో ఉన్నప్లేయర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు.. ఎలైస్ పెర్రీ(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్) వంటి విదేశీ ప్లేయర్లు ఉన్నారు. వేలం ప్రక్రియ ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభంకానుంది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి WPL మొదలు కానుంది. ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ జరుగుతుంది. -
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్‌కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్‌కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు.. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్ -
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జత కట్టనున్న టీమిండియా దిగ్గజం
టీమిండియా దిగ్గజ బౌలర్, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ పేసర్ ఝులన్ గోస్వామి మహిళల ఐపీఎల్ (WPL)లో కాలు మోపనుంది. గతేడాది క్రికెట్లోకి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఝులన్.. WPLలో ముంబై ఫ్రాంచైజీ మెంటార్‌గా, బౌలింగ్ కోచ్‌గా నియమితురాలైంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఆదివారం (ఫిబ్రవరి 5) అధికారికంగా ప్రకటించింది. ముంబై యాజమాన్యం ఝులన్‌తో పాటు మరో ముగ్గురిని కూడా కోచింగ్, ఇతరత్రా సిబ్బందిలో చేర్చుకుంది. చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకున్న ముంబై ఫ్రాంచైజీ.. భారత మహిళల జట్టు మాజీ ఆల్‌రౌండర్ దేవిక పల్షికార్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ తృప్తి భట్టాచార్యను టీమ్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్ మహిళల టీమ్ చార్లెట్ నేతృత్వంలో, ఝులన్ మెంటార్షిప్లో, దేవిక బ్యాటింగ్ గైడ్‌లైన్స్‌ను ఫాలో అవుతూ ముంబై ఇండియన్స్ మెన్స్ టీమ్ లెగసీని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, 43 ఏళ్ల చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో పలు జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. 2022లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్‌గా ఎంపికైన ఎడ్వర్డ్స్ మహిళల బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), ద హండ్రెడ్ (ఇంగ్లండ్) లీగ్‌ల్లో వివిధ జట్లకు కోచ్‌గా పని చేశారు. ఝులన్ విషయానికొస్తే.. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక వికెట్ల ఘనత ఈమె పేరిటే ఉంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఆమె ఖాతాలో 350కి పైగా వికెట్లున్నాయి. గతేడాది ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత ఝులన్ ఆట నుంచి తప్పుకుంది. మరోవైపు, WPLలో అదానీ ఫ్రాంచైజీ గుజరాత్ కూడా కోచింగ్ సిబ్బందిని నియమించుకుంది. ఆ ఫ్రాంచైజీ రేచల్ హేన్స్‌ను హెడ్ కోచ్‌గా.. ఇటీవల అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు హెడ్ కోచ్ నూషిన్ అల్ ఖాదిర్‌ను బౌలింగ్ కోచ్.. తుషార్ అరోథ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా.. గవన్ ట్వినింగ్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకుంది. -
అతివల క్రికెట్‌కు అందలం...
మహిళల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం. మన దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన లీగ్ పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు తొలి అంకం పూర్తయింది. అదీ అలాంటి ఇలాంటి తరహాలో కాదు. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించేలా, అతివల ఆటను అందలం ఎక్కించేలా లీగ్ దూసుకొచ్చింది. అనూహ్య రీతిలో ఐదు జట్లను ఏకంగా రూ. 4669.99 కోట్లకు అమ్మిన బోర్డు తమ ఖజానాను మరింత పటిష్టం చేసుకోగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు బంగారు భవిష్యత్తును ఆశించేలా ఉన్న లీగ్ విలువ కొత్త ఆశలు రేపింది. పురుషుల లీగ్‌తో పోలిస్తే ‘ఇండియన్’ లేకుండా ‘ఉమెన్ ప్రీమియర్ లీగ్’ అనే కొత్త పేరుతో లీగ్ జరగనుంది. ఇక మిగిలింది వేలం ద్వారా ప్లేయర్ల ఎంపిక... ఆపై తొలి టోర్నీ సమరానికి సర్వం సిద్ధం! ముంబై: దాదాపు ఐదున్నరేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన నాటినుంచి అంతకంతకూ తమ స్థాయిని పెంచుకుంటూ వచ్చిన భారత మహిళల క్రికెట్లో ఇదే మేలిమలుపు... పురుషుల ఐపీఎల్ తరహాలోనే తమకంటూ ఒక లీగ్ ఉండాలంటూ కోరుకుంటూ వచ్చిన మహిళల స్వప్నం భారీ స్థాయిలో సాకారం కానుంది. ఐపీఎల్ తరహాలో నిర్వహించే తొలి లీగ్ కోసం జట్లను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ నిర్వహించిన వేలం అద్భుతం చేసింది. మొత్తం రూ. 4666.99 కోట్లకు ఐదు టీమ్‌లను వేర్వేరు సంస్థలు సొంతం చేసుకున్నాయి. లీగ్‌కు ‘హోం గ్రౌండ్’లుగా నిలిచే ఐదు నగరాలుగా అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఖరారయ్యాయి. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ సంస్థ అత్యధికంగా రూ. 1289 కోట్లు వెచ్చించింది. మూడు పురుషుల ఐపీఎల్ టీమ్ యాజమాన్యాలు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడా భారీ మొత్తాలను మహిళల టీమ్‌లను సొంతం చేసుకోగా... ఐదో జట్టును క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ గెలుచుకుంది. భారీ డిమాండ్‌తో... మహిళల లీగ్ జట్లను సొంతం చేసుకునేందుకు 17 సంస్థలు బిడ్లను కొనుగోలు చేసి పోటీ పడ్డాయి. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్ ప్రకటించినప్పుడు జట్ల కొనుగోలుకు సంబంధించి బీసీసీఐ కనీస విలువను నిర్ణయించింది. ఈసారి అలాంటిది లేకుండా ఆసక్తి ఉన్నవారు తాము అనుకున్న మొత్తానికి బిడ్లు వేశారు. ఇటీవలే మహిళల లీగ్ ప్రసార హక్కులను రూ. 951 కోట్లకు వయాకామ్ 18 గ్రూప్ సొంతం చేసుకోవడం మహిళల మ్యాచ్‌లకూ పెరిగిన ఆదరణను చూపించింది. దాంతో ఫ్రాంచైజీలపై కూడా ఆసక్తి నెలకొంది. నిబంధనల ప్రకారం లీగ్ ప్రసార హక్కుల్లో 80 శాతం మొత్తాన్ని ఐదేళ్ల పాటు ఐదు ఫ్రాంచైజీలకు పంచుతారు. అందువల్ల కూడా ఎలా చూసినా నష్టం లేదని భావన బిడ్లర్లలో కనిపించింది. పురుషుల లీగ్‌లో టీమ్‌ను దక్కించుకోవడంలో విఫలమైన అదానీ గ్రూప్ ఈసారి మహిళల క్రికెట్లో అడుగు పెట్టగా, గుజరాత్ టైటాన్స్ స్పాన్సర్లలో ఒకటైన క్యాప్రి గ్రూప్ కూడా టీమ్‌ను సొంతం చేసుకుంది. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్లో ఎనిమిది జట్లకు కలిపి రూ. 28,943.6 కోట్లు (అప్పటి డాలర్ విలువ ప్రకారం) బోర్డు ఖాతాలో చేరాయి. ఇప్పుడు మారిన విలువ ప్రకారం చూసినా మహిళల లీగ్‌లో వచ్చిన మొత్తం చాలా ఎక్కువని, నాటి రికార్డు బద్దలైందని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. మార్చిలో టోర్నీ... డబ్ల్యూపీఎల్ నిర్వహణకు సంబంధించిన తేదీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికాలో మహిళల టి20 వరల్డ్‌కప్ ముగిసిన వెంటనే సాధ్యమైంత తొందరగా మ్యాచ్‌లు జరిపే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించి వేలం నిర్వహిస్తారు. ఒక్కో జట్టుకు ప్లేయర్ల కోసం గరిష్టంగా రూ. 12 కోట్లు ఖర్చు చేయవచ్చు. కనీసం 15 మందిని, గరిష్టంగా 18 మందిని టీమ్‌లోకి తీసుకోవచ్చు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఉంటారు. తొలి సీజన్లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. మహిళల క్రికెట్లో ఈ రోజునుంచి కొత్త ప్రయాణం మొదలైందంటూ వ్యాఖ్యానించిన బోర్డు కార్యదర్శి జై షా కొత్త లీగ్‌కు ‘మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ‘ఉమెన్ బిగ్‌బాష్ లీగ్’ తరహాలో ‘ఉమెన్ ఐపీఎల్’ అంటూ ఇప్పటి వరకు ప్రచారంలో ఉండగా... డబ్ల్యూఐపీఎల్ అని కాకుండా కాస్త భిన్నంగానే పేరును ‘డబ్ల్యూపీఎల్’కే బోర్డు పరిమితం చేసింది. FIVE TEAMS FIVE VENUES 🏟️ Welcome to the Women's Premier League 🙌🙌#WPL pic.twitter.com/29MNGEDDXe — BCCI (@BCCI) January 25, 2023 వివరాలు ఇలా ఉన్నాయి.. 1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు) 2. ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు) 3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు) 4. జేఎస్‌డబ్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు) 5. క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు) 𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞. The combined bid valuation is INR 4669.99 Cr A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH — BCCI (@BCCI) January 25, 2023 -
వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌కు ఊహించని భారీ ధర
Women's IPL Media Rights: 2023-27 మహిళల ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన మీడియా హక్కులను వయాకామ్18 సంస్థ రికార్డు ధర (రూ.951 కోట్లు) కోట్ చేసి దక్కించుకుంది. బిడ్డింగ్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ నెట్వర్క్, అమెజాన్ ప్రైమ్ వంటి బడా కంపెనీలు పోటీ పడినప్పటికీ వయాకామ్18 ఎంతమాత్రం తగ్గకుండా టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. వయాకామ్18 సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించి వుమెన్స్ ఐపీఎల్ మీడియా రైట్స్‌ను సొంతం చేసుకోవడం శుభపరిణామమని, ఇది మహిళా క్రికెట్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని షా ట్వీట్ చేశాడు. Congratulations @viacom18 for winning the Women’s @IPL media rights. Thank you for your faith in @BCCI and @BCCIWomen. Viacom has committed INR 951 crores which means per match value of INR 7.09 crores for next 5 years (2023-27). This is massive for Women’s Cricket 🙏🇮🇳 — Jay Shah (@JayShah) January 16, 2023 కాగా, మహిళల ఐపీఎల్‌ను బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది (2023) నుంచే ప్రవేశపెట్టాలని డిసైడైన విషయం తెలిసిందే. అరంగేట్రం సీజన్లో మొత్తం ఐదు ఫ్రాంచైజీలు బరిలోకి దిగబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు తెగ ఆసక్తి చూపుతున్నాయి. క్రికెటర్ల వేలం ప్రక్రియకు సంబంధించిన తేదీలు త్వరలోనే వెలువడనున్నాయి. క్రికెటర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 26 ఆఖరి తేదీగా ఉంది. మహిళల ఐపీఎల్ మీడియా రైట్స్ వేలం ద్వారా బీసీసీఐకి ఒక్కో మ్యాచ్‌కు రూ.7.09 కోట్ల ఆదాయం సమకూరనుంది. -
వుమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల కనీస ధర ఎంతంటే?
ఐపీఎల్ మరో లెవల్‌కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్‌తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది. దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు మార్కెట్లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్ డాక్యుమెంట్ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. -
BCCI: దాదాకు గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బోర్డు కీలక నిర్ణయాలివే!
91st Annual General Meeting of BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి 91వ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ నియామకాన్ని ఖరారు చేసిన బీసీసీఐ నూతన ఆఫీస్ బేరర్ల పేర్లను కూడా వెల్లడించింది. అదే విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి పలు కీలక అంశాల గురించి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నాటి ముంబై మీటింగ్‌కు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేసింది. బీసీసీఐ సర్వసభ్య సమావేశం- ముఖ్యాంశాలు ►బీసీసీఐ అధ్యక్షుడు- రోజర్ బిన్నీ ►ఉపాధ్యక్షుడు- రాజీవ్ శుక్లా ►కార్యదర్శి- జై షా ►సంయుక్త కార్యదర్శి- దేవజిత్ సైకియా ►కోశాధికారి(ట్రెజరర్)- ఆశిష్ షేలార్ ►బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో జనరల్ బాడీ ప్రతినిధిగా ఎంకేజే మజూందార్ ►ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రతినిధులుగా అరుణ్ ధుమాల్ సింగ్, అవిషేక్ దాల్మియా ►2022-23 ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్‌కు ఆమోదం ►2023-2027 మధ్య కాలంలో భారత పురుషుల జట్టు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్, 2022-2025 మహిళల జట్టు ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ధ్రువీకరణ ►మహిళల ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం చేసిన జనరల్ బాడీ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! అతడు ప్రపంచ అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు: సచిన్ -
Womens IPL: ఐదు జట్లు, రెండు వేదికలు.. 20 మ్యాచ్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎంత పాపులారిటీ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాది మార్చి చివరి నుంచి జూన్ మొదటివారం వరకు బీసీసీఐ నిర్వహించే పురుషుల ఐపీఎల్‌కు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే 16 సీజన్లు పూర్తి చేసుకున్న ఐపీఎల్ ఇకపై మహిళల విభాగంలోనూ అలరించనుంది. ఈ ఏడాది మహిళల ఐపీఎల్ నిర్వహించినప్పటికీ కేవలం ఐదు రోజుల్లోనే టోర్నీ ముగిసింది. కానీ వచ్చే ఏడాది మెన్స్ ఐపీఎల్ లాగానే మహిళల ఐపీఎల్‌ను కూడా నిర్వహించనున్నారు. వచ్చే సంవత్సరం జరగనున్న మహిళల ఐపీఎల్లో ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఎన్ని మ్యాచ్‌లు, ఎక్కడెక్కడ నిర్వహిస్తారు? టీమ్‌లో విదేశీ ప్లేయర్స్ సంఖ్య లాంటి అంశాలపై బీసీసీఐ దృష్టి సారించింది. తొలిసారి నిర్వహించబోతున్న ఈ లీగ్‌ను మొదట ఐదు టీమ్స్‌తో ప్రారంభించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కో టీమ్‌లో తుది జట్టులో ఐదుగురు విదేశీ ప్లేయర్స్‌ను అనుమతించాలన్న ఆలోచనలో బోర్డు ఉంది. పురుషుల ఐపీఎల్లో నలుగురు ప్లేయర్స్‌కే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. వుమెన్స్ ఐపీఎల్లో నలుగురు ప్లేయర్స్ ఐసీసీలో ఫుల్‌టైమ్ మెంబర్ టీమ్స్ నుంచి.. ఒకరు అసోసియేట్ టీమ్ నుంచి ఉండేలా రూల్ తీసుకురానుంది. ఇక ఈ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా వచ్చే ఏడాది ఆరంభంలోనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత వుమెన్స్ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇక టీమ్స్ ఎలా ఉండాలన్నదానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మెన్స్ ఐపీఎల్లో ఉన్నట్లుగా నగరాలకు అంటే అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలకు ఇవ్వాలా లేక జోన్ వారీగా అంటే నార్త్ (ధర్మశాల/జమ్ము), సౌత్ (కొచ్చి/వైజాగ్), సెంట్రల్ (ఇండోర్/నాగ్‌పూర్/రాయ్‌పూర్), ఈస్ట్ (రాంచీ/కటక్), నార్త్ఈస్ట్ (గువాహటి), వెస్ట్ (పుణె/రాజ్‌కోట్)లకు ఇవ్వాలన్నదానిపై చర్చించనున్నారు. మొదటి పద్ధతిలో మ్యాచ్‌లు ఐపీఎల్ వేదికల్లోనే జరుగుతాయి. ఒకవేళ జోన్ వారీగా టీమ్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఐపీఎల్ వేదికలు కాని వాటిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. దీనిపై తుది నిర్ణయం ఐపీఎల్ ఛైర్పర్సన్, బీసీసీఐ ఆఫీస్ బేరర్లు తీసుకుంటారు. ఇక లీగ్ స్టేజ్‌లో ఒక్కో టీమ్ మరో టీమ్‌తో రెండేసిసార్లు ఆడతాయి. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన టీమ్స్ ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఈ వుమెన్స్ ఐపీఎల్‌ను రెండు వేదికల్లోనే జరిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే 2023 ఐపీఎల్ రెండు వేదికల్లో, 2024 ఐపీఎల్ మరో రెండు వేదికల్లో, ఇక 2025 ఐపీఎల్ మిగిలిపోయిన ఒక్క వేదిక, 2023లో ఆడిన మరో వేదికలో ఆడే అవకాశం ఉంది. చదవండి: థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్ -
మహిళల ఐపీఎల్‌కు రంగం సిద్ధం
ముంబై: మహిళల క్రికెట్‌ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక అడుగు ముందుకు వేసింది. 2023లో సీజన్లో తొలిసారి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గతంలోనూ పలుమార్లు మహిళల లీగ్ నిర్వహణకు సంబంధించి బోర్డు పెద్దలు ఎన్నో వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా వాస్తవానికి వచ్చేసరికి అవి అమల్లోకి రాలేదు. ఈసారి మాత్రం ఐపీఎల్ కోసం ‘ప్రత్యేక విండో’ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహిళల దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్లో బోర్డు మార్పులు చేసింది. సాధారణంగా భారత్ మహిళల దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో దీనికి ఒక నెల రోజులు ముందుకు జరిపారు. 2022–23 సీజన్ అక్టోబర్ 11న ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే మార్చి నెలలో పూర్తి స్థాయి ఐపీఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. టి20 చాలెంజ్ టోర్నీ తర్వాత... సాధారణ దేశవాళీ మ్యాచ్‌లకు భిన్నంగా లీగ్ రూపంలో 2018 నుంచి బీసీసీఐ ‘టి20 చాలెంజ్’ టోర్నీ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది కేవలం రెండు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగ్గా, ఆ తర్వాత దానిని మూడు జట్లకు పెంచారు. కరోనా కారణంగా 2021లో మినహా నాలుగుసార్లు నిర్వహించారు. ఇందులో విదేశీ క్రికెటర్లు కూడా భాగమయ్యారు. అయితే మరింత ఆకర్షణీయంగా మారుస్తూ పూర్తి స్థాయిలో ఐపీఎల్ తరహాలో లీగ్ జరపాలనే డిమాండ్ ఇటీవల చాలా పెరిగిపోయింది. టి20 ఫార్మాట్లో గత కొంత కాలంగా మన అమ్మాయిల మెరుగైన ప్రదర్శన కూడా అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో మన జట్టు రజతం సాధించగా... బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్‌లలో కూడా భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గత మే నెలలో బోర్డు కార్యదర్శి జై షా చెప్పినదాని ప్రకారం లీగ్‌లో గరిష్టంగా ఆరు జట్ల వరకు ఉండే అవకాశం ఉంది. మహిళల టీమ్‌లను కూడా సొంతం చేసుకునేందుకు ప్రస్తుత ఐపీఎల్ టీమ్‌ల యాజమాన్యాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వరకు జట్లను కేటాయిస్తే మొదటి ప్రాధాన్యత ఐపీఎల్ టీమ్‌లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం వచ్చే సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకుంటారు. చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు -
మహిళల టీ20 ఛాలెంజ్.. జట్టులను ప్రకటించిన బీసీసీఐ
మహిళల టీ20 ఛాలెంజ్-2022 కోసం బీసీసీఐ జట్టులను సోమవారం ప్రకటించింది. టీ20 ఛాలెంజ్ కప్ మే 23న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ట్రైల్‌బ్లేజర్స్‌తో సూపర్నోవాస్ తలపడనుంది. ఫైనల్ మే 28న జరుగుతుంది. కాగా మ్యాచ్‌లు అన్నీ పూణెలోని ఎంసీఎ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ట్రైల్‌బ్లేజర్స్‌కు స్మృతి మందాన సారథ్యం వహిస్తుండగా.. సూపర్నోవాస్కు హర్మన్‌ప్రీత్ కౌర్, వెలాసిటీకు దీప్తి శర్మ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక మహిళ టీ20 ఛాలెంజ్ చివరగా 2020లో జరిగింది. గతేడాది కరోనా కారణంగా బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహించలేదు. ట్రైల్బ్లేజర్స్ స్మృతి మంధాన (కెప్టెన్), పూనమ్ యాదవ్ (వైస్ కెప్టెన్), అరుంధతి రెడ్డి, హేలీ మాథ్యూస్, జెమీమా రోడ్రిగ్స్, ప్రియాంక ప్రియదర్శిని, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎస్. మేఘన, సైకా ఇషాక్, సల్మా ఖాతున్, షర్మిన్ అక్టర్, సోఫియా బ్రౌన్, సోఫియా బ్రౌన్, మల్లిక్, ఎస్.బి.పోఖార్కర్ వెలాసిటీ: దీప్తి శర్మ (కెప్టెన్), స్నో రానా (వైస్ కెప్టెన్), షఫాలి వర్మ, అయాబొంగా ఖాకా, కె.పి. నవ్‌గిరే, కాథరిన్ క్రాస్, కీర్తి జేమ్స్, లారా వోల్వార్డ్, మాయా సోనావానే, నత్తకాన్ చంతమ్, రాధా యాదవ్, ఆర్తీ కేదార్, సిమ్రాన్ షిండే, సిమ్రాన్ షిండే యాస్తిక భాటియా, ప్రణవి చంద్ర సూపర్నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), తానియా భాటియా (వైస్ కెప్టెన్), అలనా కింగ్, ఆయుష్ సోని, చందు వి, డియాండ్రా డోటిన్, హర్లీన్ డియోల్, మేఘనా సింగ్, మోనికా పటేల్ ముస్కాన్ మాలిక్, పూజా వస్త్రాకర్, ప్రియా పునియా, రాశి కనోజియా, సోఫీ ఎక్లెస్టోన్, సునే లూస్, మాన్సీ జోషి చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్.. సీనియర్ ఆటగాడు దూరం..! -
బ్లాక్మెయిల్ చేస్తున్నారా: బీసీసీఐ
ముంబై : మమ్మల్నే బ్లాక్ మెయిల్ చేస్తారా? అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)పై భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మే 6 నుంచి జరగబోయే మహిళ ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపించకుండా సీఏ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. తమ మహిళా క్రికెటర్లను పంపించాలంటే ఎఫ్టీపీ (ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం) వివాదం తేల్చాలని మెలిక పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు పర్యటించాల్సి ఉంది. అయితే, దీనిని వాయిదా వేయాలని భావించింది. దీనికి బీసీసీఐ ససేమిరా అనడంతో.. మహిళా ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపకుండా బీసీసీఐపై ఒత్తిడి పెంచాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిణి బెలిందా క్లార్క్ బీసీసీఐకి ఈమెయిల్ పంపారు. 2020లో భారత్‌తో ఆడాల్సిన సిరీస్‌పై ఉన్న వివాదం పరిష్కారమైతే తప్ప మహిళా ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లను పంపడం సాధ్యం కాదన్నారు. సీఏ ఈమెయిల్‌పై స్పందించిన బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెన్స్ క్రికెట్‌కు మహిళా ఐపీఎల్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించింది. బెలిందా ఈమెయిల్ చూస్తేంటే తమను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందని మండిపడింది భవిష్యత్తు పర్యటన ప్రణాళిక (ఎఫ్టీపీ) ప్రకారం ఆసీస్‌తో సిరీస్ జరగాల్సి ఉందని, ఇప్పుడు వెనకడుగు వేయడం ఏమిటని నిలదీసింది. వచ్చే నెల 6 నుంచి 11 వరకు జైపూర్ వేదికగా జరగనున్న మహిళల ఐపీఎల్లో ఆసీస్ మహిళా క్రికెటర్లు లానింగ్, ఎలిస్ పెర్రీ, అలిసీ హీలీలు ఆడాల్సి ఉండగా, వారిని భారత్ పంపాల్సిందిగా బీసీసీఐ కోరడంతో సీఏ ఇలా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. -
మహిళల ఐపీఎల్ : హర్మన్ ప్రీత్ సేన విజయం
-
మహిళల ఐపీఎల్ : హర్మన్ ప్రీత్ సేన విజయం
ముంబై : మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలు ఐపీఎల్ మజాను చూపించింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టుతో జరిగిన ఈ టీ20 చాలెంజింగ్ గేమ్‌లో సూపర్ నోవాస్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్‌బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మంధాన(14) నిరాశపరచగా.. సుజీ బేట్స్(32), దీప్తీ శర్మ(21)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్నోవాస్ జట్టుకి ఓపెనర్లు మిథాలీ, వైట్లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఏక్తా బిస్త్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన మిథాలీ(22) తాహుహుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ వైట్(24) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో మూనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టింది. హర్మన్‌ప్రీత్(21) సైతం ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అనంతరం సూపర్ నోవాస్ విజయానికి 21 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. పెర్రీ(13 నాటౌట్) కడవరకు నిలిచి పుజావస్రాకర్(2) సాయంతో ఆఖరి బంతికి విజయాన్నందించింది. విజయానికి నాలుగు పరుగు కావాల్సి ఉండగా ఏడో వికెట్‌గా మష్రామ్ (4) రనౌట్‌గా వెనుదిరిగింది. ఇక చివరి ఓవర్‌ను వేసిన బేట్స్ కట్టుదిట్టమైన బంతులేయడంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. తొలి రెండు బంతులు ఎదుర్కొన్న పెర్రీ సింగిల్ మాత్రమే తీసింది. పుజావస్రాకర్ సైతం రెండు బంతులు ఎదుర్కొని సింగిల్ తీసింది. పెర్రీ మరో పరుగు తీసి స్కోర్‌ను సమం చేసింది. చివరి బంతికి విజయానికి ఒక పరుగు కావాల్సి ఉండగా పుజా పని పూర్తి చేసింది. 7 వికెట్లు కోల్పోయి సూపర్ నోవాస్ లక్ష్యాన్ని చేధించింది. -
మహిళల ఐపీఎల్‌కు ఇదే సరైన సమయం..
లార్డ్స్: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఇదే సరైన సమయమని భారత మహిళల కెప్టెన్ మిథాలీరాజ్ అభిప్రాయపడింది. భారత్ మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించాలని అది మహిళా క్రికెట్‌కు ఆర్థికంగానే కాకుండా ఆట నైపుణ్యాలను పెంపొందిస్తుందని మిథాలీ పేర్కొంది. ఇక భారత మహిళలు ఒత్తిడి తట్టుకోలేకపోయారని దీనికి సరైన కారణం అనుభవం లేకపోవడమనే మిథాలీ పేర్కొంది. భారత మహిళలు రాణించాలంటే ఐపీఎల్ లాంటి లీగ్‌లు ఆడే అవకాశం కల్పించాలని ఈ లేడీ కెప్టెన్ వాపోయింది. ఇంగ్లండ్ మహిళలకు ఇక్విలెంట్ సూపర్ లీగ్, ఆస్ట్రేలియాకు బిగ్ బాష్ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని మిథాలీ అభిప్రాయపడింది. బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన స్మృతి మంధన, హర్మన్ ప్రీత్ కౌర్ టోర్నిలో అద్భుతంగా రాణించారని గుర్తు చేస్తూ.. మిగిలిన మహిళలు కూడా లీగ్‌లు ఆడటం ద్వారా అనుభవంతో పాటు ఆటను మెరుగు పరుచుకుంటారని మిథాలీ పేర్కొంది. ఈ లీగ్‌లతో మంచి ప్రాక్టీస్ లభించడంతో పాటు మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతుందని మిథాలీ వ్యాఖ్యానించింది. ఇంగ్లండ్ గత రెండు సంవత్సరాల నుంచి ఫ్రోఫెషనల్ మ్యాచ్‌లు ఆడుతున్నారని అది వారికి కలిసొచ్చిందని తెలిపింది. మ్యాచ్‌లు టీవీలో ప్రసారం కావడం మహిళా క్రికెటర్లుగా మేం గర్విస్తున్నామని మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది. పూనమ్, కౌర్ పోరాటం అద్భుతమని.. ఆ భాగస్వామ్యాన్ని నిలబెట్టలేకపోయామని వారి ప్రదర్శనను ప్రశంసించింది. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, బీసీసీఐ మహిళల ప్రదర్శన పట్ల సుముఖంగా ఉందని భావిస్తున్నామని మిథాలీ తెలిపింది.