
పుష్ప2 ఫైనల్ కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను రప్పా.. రప్పా.. రప్పా అంటూ దాటుకుంటూ వచ్చేసింది. 75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల (గ్రాస్) వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలవడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీగా నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' (రూ.2024 కోట్లు) టాప్‌లో కొనసాగుతుంది. రెండో స్థానంలో 'పుష్ప2' (రూ. 1871 కోట్లు), మూడో స్థానంలో బాహుబలి-2 (రూ.1810 కోట్లు) ఉంది. తర్వాతి స్థానాల్లో ఆర్‌ఆర్‌ఆర్ (రూ.1387 కోట్లు), కేజీయఫ్- 2 (రూ.1250 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.1153 కోట్లు), జవాన్ (రూ.1148 కోట్లు), పఠాన్ (రూ.1050 కోట్లు) వరుసగా ఉన్నాయి.
ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్‌లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్‌లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్‌లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గుర్తుండిపోయే రికార్డ్‌లను నమోదు చేసింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment