![Director Sukumar Comments About](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Sukumar_0.jpg.webp?itok=niwuwpHn)
పుష్ప-2 ది రూల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ నేపథ్యంలో పుష్ప టీమ్ థ్యాంక్ యూ మీట్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం.
దేవీశ్రీ ప్రసాద్ లేకుండా తాను ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదని సుకుమార్ అన్నారు. భవిష్యత్తులో కూడా చేయనేమో అని వెల్లడించారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీత దర్శకుడని పరోక్షంగా హింట్ ఇచ్చేశారు. దీంతో రామ్ చరణ్- సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రానికి డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ మాట్లాడుతూ.. 'నా పేరుతో పాటు ఉండే మరొక పేరు దేవీశ్రీ ప్రసాద్. నాపేరు సుకుమార్ కాదు.. దేవీశ్రీ ప్రసాద్ సుకుమార్. తను లేకుండా ఎప్పుడు సినిమా చేయలేదు. భవిష్యత్తులో కూడా తీయనేమో. అందుకే ముఖ్యంగా తను నా ఫస్ట్ ఆడియన్. పుష్ప 2 కూడా ఫస్ట్ హాఫ్ గురించి చెప్పగానే దేవీశ్రీ కథ అయిపోయింది అన్నాడు. సినిమా ఇంతే అనేశాడు. అలా పుష్ప-2 కూడా ఫస్ట్ హాఫ్ మాత్రమే రిలీజ్ చేశాను.. అది దేవీశ్రీకి మాత్రమే తెలుసు' అని అన్నారు. దీంతో తన రాబోయే ప్రాజెక్ట్‌లో కూడా డీఎస్పీనే మ్యూజిక్ డైరెక్టర్ అని హింట్ ఇచ్చేశారు.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే చెర్రీ సైతం సెట్‌లో తన కూతురితో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్.. సుకుమార్‌తో జతకట్టనున్నారు. తాజాగా పుష్ప డైరెక్టర్ చేసిన కామెంట్స్‌తో ఈ ప్రాజెక్ట్‌లో దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో ఓపెనింగ్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా రాజమౌళి తనయుడు కార్తికేయ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ క్లైమాక్స్ షూటింగ్ సమయంలోనే సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్ చరణ్ చెప్పారని వెల్లడించారు. ఓపెనింగ్ సీన్ దాదాపు ఐదు నిమిషాల పాటు ఉంటుందని తెలిపారు. కాగా..రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్‌సీ17పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment