![Director Sukumar Interesting Comments Pushpa Part one Movie](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/Sukumar.jpg.webp?itok=uGWi_uq0)
పుష్ప సినిమా గురించి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని అసలు రెండు పార్టులు కాదని అన్నారు. ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయ్యేసరికి 3 గంటలు రావడంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపారు. పుష్ప సినిమాకు జరిగిన మిరాకిల్ ఇదే అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి రూ.1800 కోట్లు తీసుకు వచ్చింది చెర్రీగానే అని నవ్వుతూ మాట్లాడారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి.. ఫస్ట్ హాఫ్‌ను పుష్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని సుకుమార్ వివరించారు. దీనికంతా చెర్రీనే కారణం.. ఒక్క సినిమాతో పోయేదానికి పుష్ప సిరీస్‌గా మార్చేశారు అని సరదాగా అన్నారు.
![cherry](https://www.sakshi.com/s3fs-public/inline-images/cherry_0.jpg)
సుకుమార్ మాట్లాడుతూ..' నా ఫస్ట్ ప్రేక్షకుడు చెర్రీగారే. ప్రతి సీన్‌ను గమనిస్తూ ఉంటారు. మైత్రి మూవీ మేకర్స్‌కి డబ్బులు వచ్చాయంటే కారణం ఆయనే. నిజానికి అందరూ అనుకున్నట్లు రెండు పార్టులు కాదు. మొదట పుష్ప అనుకున్నది ఒక్క సినిమానే. ఫస్ట్ హాఫ్ 3 గంటలు వచ్చిందని చెర్రీ అన్నారు. ముందు రిలీజ్ చేసేయండి చెప్పాడు. ఇదే పుష్ప సినిమాలో జరిగిన అద్భుతం. ఒక్క సినిమాతో పోయేదానికి మూడు పార్టులు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చెర్రీ గారిదే' అని నవ్వుతూ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment