
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు (రెండవది) ముందు గుజరాత్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లింగర్ గుజరాత్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్ స్థానాన్ని క్లింగర్ భర్తీ చేస్తాడు. క్లింగర్ ఎంపిక విషయాన్ని గుజరాత్ జెయింట్స్ మేనేజ్‌మెంట్ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది.
తొలి సీజన్ నుంచి జెయింట్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న క్లింగర్ .. మెంటార్ మిథాలీ రాజ్, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్‌తో ఇదివరకే జాయిన్ అయినట్లు జెయింట్స్ మేనేజ్‌మెంట్ తెలిపింది. క్లింగర్.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ అసిస్టెంట్ కోచ్‌గా, అదే సిడ్నీ థండర్స్ రిక్రూటర్‌గా, 2019-2021 వరకు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు.
43 ఏళ్ల క్లింగర్ 2019లో బిగ్‌బాష్ లీగ్‌కు రిటైర్మెంట్ (ఆటగాడిగా) పలికాడు. నాటికి క్లింగర్ బీబీఎల్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్నాడు.
Coach saheb padharya! 🤩
— Gujarat Giants (@Giant_Cricket) February 6, 2024
We are delighted to welcome former Australian cricketer @maxyklinger as our head coach for the upcoming WPL season. 🙌🧡#BringItOn #GujaratGiants #Adani pic.twitter.com/iJjqnSUo9K
ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో (2023) గుజరాత్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్ నుంచి నిష్క్రమించింది.
గత సీజన్ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్ కోచ్ రేచల్ హేన్స్‌పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి, తొలి WPL టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.
2024 సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్ గతేడాది ఫైనలిస్ట్‌ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. జెయింట్స్‌లో త్రిష పూజిత, హర్లీన్ డియోల్, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్, మన్నత్ కశ్యప్, స్నేహ్ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment