మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫిబ్రవరి 14వ తేదీన మొదలవుతుంది. వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) నగరాల్లో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడా వేదికగా ఫిబ్రవరి 14న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతుంది. మార్చి 15న ముంబైలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. గుజరాత్, బెంగళూరు జట్లతోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. తదుపరి డబ్ల్యూపీఎల్ గడిచిన రెండు సీజన్ల (2023, 2024) తరహాలో రెండు వేదికలపై కాకుండా నాలుగు వేదికల్లో జరుగనుంది.
ఓపెనింగ్ లెగ్ మ్యాచ్‌లకు కొటాంబి స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా.. రెండో వారం మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకు షిఫ్ట్ అవుతాయి. అనంతరం నాలుగు లీగ్ మ్యాచ్‌లు లక్నోలోని ఎకానా స్టేడియంలో జరుగనుండగా.. ఎలిమినేటర్ (మార్చి 13), ఫైనల్ మ్యాచ్‌లు (మార్చి 15) సహా నాలుగు మ్యాచ్‌లకు ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.
మహిళల ఐపీఎల్-2025 పూర్తి షెడ్యూల్..
వడోదర లెగ్:
14 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
15 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
16 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్
17 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
18 ఫిబ్రవరి 2025 గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్
19 ఫిబ్రవరి 2025 యుపి వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్
బెంగళూరు లెగ్:
21 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్
22 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs యుపి వారియర్జ్
23 ఫిబ్రవరి 2025 బ్రేక్
24 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యుపి వారియర్జ్
25 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్
26 ఫిబ్రవరి 2025 ముంబై ఇండియన్స్ vs యుపి వారియర్జ్
27 ఫిబ్రవరి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్
28 ఫిబ్రవరి 2025 ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్
1 మార్చి 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
2 మార్చి 2025 బ్రేక్
లక్నో లెగ్:
3 మార్చి 2025 యుపి వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్
4 మార్చి 2025 బ్రేక్
5 మార్చి 2025 బ్రేక్
6 మార్చి 2025 యుపి వారియర్జ్ vs ముంబై ఇండియన్స
7 మార్చి 2025 గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
8 మార్చి 2025 యుపి వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
9 మార్చి 2025 బ్రేక్
ముంబై లెగ్:
10 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్
11 మార్చి 2025 ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
12 మార్చి 2025 బ్రేక్
13 మార్చి 2025 ఎలిమినేటర్
14 మార్చి 2025 బ్రేక్
15 మార్చి 2025 ఫైనల్
Comments
Please login to add a commentAdd a comment