ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్‌ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్‌కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్‌లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.
ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.
కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.
డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..
ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధు
గుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్‌నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్
ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్‌దీప్ కౌర్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్
ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్
యూపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్
Comments
Please login to add a commentAdd a comment