ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌.. ఓటమి తప్పదా? | WI Vs AUS: Bowlers Make Merry Again In Fast Moving Barbados Test, Check Out Full Story For More Details | Sakshi
Sakshi News home page

WI vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న విండీస్‌.. ఓటమి తప్పదా?

Jun 27 2025 8:54 AM | Updated on Jun 27 2025 10:46 AM

WI vs AUS: Bowlers make merry again in fast moving Barbados Test

బ్రిడ్జ్‌టౌన్‌ వేదిక‌గా వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి టెస్టు నువ్వా నేనా అన్న‌ట్లు సాగుతోంది. రెండో రోజులో ఆట‌లో కూడా బార్బ‌డోస్ పిచ్‌పై బౌల‌ర్లు పండ‌గ చేసుకున్నారు. 57/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆరంభించిన వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే కుప్పకూలింది. దీంతో కేవలం​ 10 పరుగుల ఆధిక్యం మాత్రమే విండీస్‌కు లభించింది.

విండీస్ బ్యా టర్లలో షై హోప్‌ (91 బంతుల్లో 48; 5 ఫోర్లు), కెప్టెన్‌ చేజ్‌ (108 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. బ్రాత్‌వైట్‌ (4), క్యాంప్‌బెల్‌ (7), కార్టీ (20), వారికన్‌ (0), బ్రాండన్‌ కింగ్‌ (26) విఫలమయ్యారు. ఆఖర్లో అల్జారీ జోసెఫ్‌ (20 బంతుల్లో 23 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పరుగులు చేశాడు. . ఆ్రస్టేలియా బౌలర్లలో స్టార్క్‌ 3, హాజల్‌వుడ్, కమిన్స్, వెబ్‌స్టర్‌ తలా 2 వికెట్లు పడగొట్టారు.

ఆసీస్ మళ్లీ అదే తీరు..
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన కంగారులు.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. 10 పరుగుల వెనకంజతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ తడబడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.

క్రీజులో ట్రావిస్ హెడ్‌(13), వెబ్‌స్టెర్‌(19) ఉన్నారు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 82 పరుగుల ఆధి​క్యంలో కొనసాగుతోంది.  మూడో రోజు ఆటలో ఆసీస్‌కు తొలి సెషన్‌ చాలా కీలకం. ఈ సెషన్‌లో కమ్మిన్స్‌ సేన వికెట్లు కోల్పోతే స్వల్ప ఆధిక్యానికే పరిమితమవుతోంది.

ఇక విండీస్ బౌలర్లలో ఇప్పటివరకు జైడన్ సీల్స్‌, జోషఫ్‌, అల్జారీ జోషఫ్‌, గ్రీవ్స్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. మొత్తంగా రెండో రోజు ఆటలో 10 వికెట్లు నేలకూలాయి.
చదవండి: భార‌త్‌-ఇంగ్లండ్ వ‌న్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్‌, జ‌ట్లు తదితర వివరాలు ఇవే
 

Advertisement
 
Advertisement
Advertisement