Roston Chase
-
దంచికొట్టిన రోస్టన్, జోన్స్.. కింగ్స్‌దే సీపీఎల్ టైటిల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)-2024 చాంపియన్‌గా సెయింట్ లూసియా కింగ్స్ జట్టు అవతరించింది. గయానా అమెజాన్ వారియర్స్‌తో జరిగిన ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. లూసియా కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.ఆకట్టుకోలేకపోయిన బ్యాటర్లుగయానా వేదికగా.. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున సెయింట్ లూసియా కింగ్స్- గయానా అమెజాన్ వారియర్స్ మధ్య సీపీఎల్ టైటిల్ పోరు జరిగింది. టాస్ గెలిచిన కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.దెబ్బ కొట్టిన నూర్ అహ్మద్వారియర్స్ బ్యాటర్లలో టెయిలెండర్ ప్రిటోరియస్ 25 పరుగులతో టాప్ స్కోర్‌గా నిలవడం గమనార్హం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ షాయీ హోప్ 22 పరుగులు సాధించాడు. ఇక కింగ్స్ బౌలర్లలో స్పిన్నర్ నూర్ అహ్మద్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి.. మూడు వికెట్లు కూల్చాడు.ఓపెనర్ మొయిన్ అలీ(14), హిట్టర్ షిమ్రన్ హెట్మెయిర్(11) రూపంలో కీలక వికెట్లు తీసి.. వారియర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు. కింగ్స్ జట్టులోని మిగిలిన బౌలర్లలో ఖారీ పియరీ, మాథ్యూ ఫోర్డ్, అల్జారీ జోసెఫ్, రోస్టన్ ఛేజ్, డేవిడ్ వీస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.దంచికొట్టిన రోస్టన్, జోన్స్ఇక వారియర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ లూసియా కింఘ్స్ 18.1 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ దంచికొట్టడంతో విజయం సాధ్యమైంది. ఓపెనర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(21) ఫర్వాలేదనిపించగా.. జాన్సన్ చార్ల్స్(7) నిరాశపరిచాడు. వన్‌డౌన్ బ్యాటర్ టిమ్ సిఫార్ట్ 10 బంతులు ఎదుర్కొని మూడు పరుగులే చేశాడు.ఇలాంటి దశలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోస్టన్ ఛేజ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 39 పరుగులతో దుమ్ములేపాడు. ఐదో స్థానంలో వచ్చిన ఆరోన్ జోన్స్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు బాది 48 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి అజేయంగా నిలిచి.. లూసియా కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. PC: SLK Xవిజేతల జాబితా ఇదేకాగా సీపీఎల్‌లో లూసియా కింగ్స్‌కు ఇదే మొట్టమొదటి టైటిల్. ఇక 2013లో వెస్టిండీస్ వేదికగా మొదలైన ఈ టీ20 టోర్నీలో జమైకా తలైవాస్ అరంగేట్ర విజేతగా నిలిచింది. తర్వాత వరుసగా బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో రెడ్‌స్టీల్, జమైకా తలైవాస్, ట్రింబాగో నైట్ రైడర్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, బార్బడోస్ ట్రిడెంట్స్, ట్రింబాగో నైట్ రైడర్స్, సెయింట కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, జమైకా తలైవాస్, గయానా అమెజాన్ వారియర్స్.. తాజాగా సెయింట్ లూసియా కింగ్స్ ట్రోఫీలు కైవసం చేసుకున్నాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ The wait is over 🙌 The Saint Lucia Kings are CPL Champions 🇱🇨🏆#CPL24 #CPLFinals #SLKvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/nqVbnilsAH— CPL T20 (@CPL) October 7, 2024 -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్‌లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్‌డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షాయీ హోప్‌తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్‌రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్‌రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. తిలక్ వర్మ మైండ్ బ్లాక్! వీడియో వైరల్
ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మను రిటర్న్ క్యాచ్‌తో ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. తన క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే ఛేజ్ మార్చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అదిలోనే ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్ వికెట్లను కోల్పోయింది. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన జోషఫ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్‌ను అడ్డుకునేందుకు విండీస్ కెప్టెన్ స్పిన్నర్ ఛేజ్‌ను తీసుకువచ్చాడు. అస్సలు ఊహించలేదు.. అయితే రోవ్‌మన్ పావెల్ నమ్మకాన్ని ఛేజ్ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్లోనే సంచలన ఫామ్‌లో ఉన్న తిలక్‌ను పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్ వేసిన ఛేజ్ బౌలింగ్‌లో ఐదో బంతిని వర్మ లాంగ్‌ఆఫ్ దిశగా ఫ్లిక్ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్ అద్భుతంగా డైవ్‌చేస్తూ రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అది బంప్బాల్ అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకి నేరుగా ఛేజ్ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్‌ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. చదవండి: #Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్? Roston Chase that was an absolutely fantastic catch! pic.twitter.com/tfa7X55Ttm — Q Sports Sport Reporter🇹🇹 (@yannickatnite) August 13, 2023 -
సెంచరీ కొట్టకపోతే వేస్ట్!
సౌతాంప్టాన్: త్వరలో ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే ద్వైపాక్షిక సిరీస్‌లో కనీసం సెంచరీ కొట్టాల్సిందేనని వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోస్టన్ ఛేజ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌పై సీరియస్‌గా దృష్టిపెట్టిన ఛేజ్.. ఆ జట్టుపై వారి దేశంలో సెంచరీ చేయాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నాడు. ఇప్పటివరకూ 32 టెస్టులు ఆడి ఐదు సెంచరీ సాయంతో 1,695 పరుగులు సాధించిన ఛేజ్.. ఒక ఉన్నతస్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ‘ ఇంగ్లండ్‌లో సెంచరీ చేయడమంటే అది కచ్చితంగా ప్రత్యేకంగానే నిలుస్తుంది. దాంతో కనీసం సెంచరీ కొట్టడంపై దృష్టి పెట్టా. ఒకవేళ సెంచరీ చేయకపోతే మాత్రం అది నాలో నిరాశనే మిగులుస్తుంది. ఇంగ్లండ్‌లో ఒక్క సెంచరీ చేస్తే చాలు. ఇక్కడ శతకం సాధిస్తే ఆల్ రౌండర్‌గా నాకు మరింత ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. దాంతో పాటు బ్యాట్స్‌మన్‌గా రేటింగ్ కూడా పెరుగుతుంది. (‘నీకు అబ్బాయిలు ఇష్టమా’ వివాదం ముగిసింది!) మా మధ్య ఒక మంచి సిరీస్ జరుగుతుందని, అందులో నేను బ్యాట్‌తో మెరవాలని కోరుకుంటున్నా. సాధ్యమైనన్ని పరుగులు సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం మా టాపార్డర్ అంత బాలేదు. మా జట్టులోని సభ్యులు 30, అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడటంతో వారి అనుభవం పనికొస్తుంది. మేము ఎప్పుడూ మెరుగు పడటంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ సిరీస్‌లో కరీబియన్‌కు చెందిన జోఫ్రా ఆర్చర్‌తో పోటీ పడాలని విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నా’ అని ఛేజ్ తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌తో సిరీస్‌కు గురించి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెనాల్ గాబ్రియెల్ మాట్లాడాడు. ప్రధానంగా గతేడాది కరీబియన్ దీవుల్లో జోరూట్‌ను ‘ నీకు అబ్బాయిలు ఇష్టమా’ అని స్లెడ్జింగ్ చేసి నిషేధానికి గురైన అంశాన్ని ప్రస్తావించాడు. అది ఒక ముగిసిన అధ్యాయమని, ఆ తరహా కామెంట్లు ఇక చేయదలుచుకోలేదన్నాడు. వ్యక్తిగత పరిహాసంలో భాగంగానే రూట్‌ను ఆ రకంగా స్లెడ్జ్ చేసినట్లు తెలిపాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌పై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నాడు. ఒకవేళ తనకు తుది జట్టులో చోటు దక్కితే ఓవరాల్‌గా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానన్నాడు. జూలై8వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టుకు సౌతాంప్టాన్ వేదిక కానుంది. -
ఛేజ్కు 8 వికెట్లు: విండీస్ జయభేరి
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్ ఆఫ్‌స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ (8/60) తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్‌ను తిప్పేశాడు. విండీస్‌కు తొలి టెస్టులో భారీ విజయాన్నందించాడు. నాలుగు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 381 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. 628 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్‌నైట్ స్కోరు 56/0తో నాలుగోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 246 పరుగుల వద్ద ఆలౌటైంది. 85 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ 161 పరుగుల వ్యవధిలో మిగతా 9 వికెట్లను కోల్పోయింది. రోరి బర్న్స్ (84; 15 ఫోర్లు) అర్ధసెంచరీ తర్వాత మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. స్టోక్స్ (34), బెయిర్‌స్టో (30), బట్లర్ (26), కెప్టెన్ రూట్ (22) రెండంకెల స్కోరు చేశారు. జట్టు స్కోరు 200 దాటాక... ఛేజ్ స్పిన్‌కు మోకరిల్లిన ఇంగ్లండ్ వడివడిగా వికెట్లను కోల్పోయింది. 217/6 స్కోరు వద్ద టీ విరామానికెళ్లిన ఇంగ్లండ్ తర్వాత 10 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. గాబ్రియెల్, జోసెఫ్ చెరో వికెట్ తీశారు. వీరోచిత ద్విశతకం చేసిన వెస్టిండీస్ కెప్టెన్ హోల్డర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్‌లో విండీస్ 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు ఈ నెల 31 నుంచి నార్త్‌సౌండ్‌లో జరుగుతుంది. -
రెండో టెస్ట్: పుంజుకున్న వెస్టిండీస్ జట్టు
-
తొలిరోజు విండీస్‌దే
సాక్షి, హైదరాబాద్: తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పర్యాటక వెస్టిండీస్ జట్టు పుంజుకుంది. శుక్రవారం ఆరంభమైన రెండో టెస్టులో విండీస్ బ్యాట్స్‌మెన్ తొలుత తడబడినా.. చివరికి నిలబడి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. టీమిండియాతో ఉప్పల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో రోస్టన్ ఛేజ్ (98 బ్యాటింగ్), కెప్టెన్ హోల్డర్(52) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి కరీబియన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక్క వికెట్ సాధించాడు. రాణించిన కుల్దీప్, ఉమేశ్ టాస్ గెలిచిన విండీస్ సారథి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అరంగేట్ర టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ పది బంతులేసిన అనంతరం గాయపడటంతో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను సారథి విరాట్ కోహ్లి రంగంలోకి దింపాడు. అశ్విన్ వచ్చీ రాగనే ఓపెనర్ పావెల్(22)ను వెనక్కి పంపించారు. మరో వైపు ఆచితూచి ఆడుతున్న బ్రాత్‌వైట్(14)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కుల్దీప్ దెబ్బకి విండీస్ మిడిలార్డర్ మరోసారి విఫలమవ్వడంతో 113 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ వీలు చిక్నిప్పుడల్లా వికెట్లు తీస్తూ కరీబియన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. చేజ్, హోల్డర్ల పోరాటం అదుర్స్ విండీస్ తొలి రోజు నిలబడిందంటే క్రెడిట్ మొత్తం రోస్టన్ చేజ్దే. ఓ వైపు వికెట్లు పడుతున్న పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. వికెట్ కీపర్ డౌరిచ్(30)తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు. డౌరిచ్ ఔటైన అనతంరం క్రీజులోకి వచ్చిన సారథి జాసన్ హోల్డర్(52) చేజ్‌కు జతకలిశాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ ఇరువురూ అర్థశతకాలు సాధించారు. ప్రమాదకరంగా మారుతున్న హోల్డర్‌ను ఉమేశ్ ఔట్ చేశాడు. దీంతో ఏడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆటముగిసే సమయానికి ఛేజ్కు తోడుగా దేవేంద్ర బిషూ(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నాడు. చదవండి: హైదరాబాద్ టెస్ట్: శార్ధుల్ ఠాకుర్ అరంగేట్రం అరంగేట్రం అంతలోనే గాయం! -
'ఇదే ఫామ్‌ను కొనసాగించు'
కింగ్ స్టన్(జమైకా): నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన రెండో టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్పై కెప్టెన్ జాసన్ హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఛేజ్ నమోదు చేయడం వల్లే తాము మ్యాచ్‌ను కాపాడుకున్నామని హోల్డర్ అభినందించాడు. ఈ తరహా ఇన్నింగ్స్‌ను ఒక మ్యాచ్‌కే పరిమితం చేయకుండా మిగతా మ్యాచ్‌ల్లో కూడా కొనసాగించాలన్నాడు. ప్రత్యేకంగా రెండో టెస్టును నిలబెట్టింది మాత్రం ఛేజ్ అని, ఇదే ఫామ్‌ను మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో కొనసాగిస్తాడని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో పాటు బ్లాక్ వుడ్, డోవ్రిచ్లను హోల్డర్ అభినందించాడు. ప్రత్యేకంగా తమ ఇన్నింగ్స్‌లో మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు కావడంతో టెస్టు మ్యాచ్ పై పట్టు సాధించమన్నాడు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ఛేజ్‌తో కలిసి బ్లాక్ వుడ్, డోవ్రిచ్లు జత చేసిన పరుగులు చాలా విలువైనవిగా హోల్డర్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో బౌలర్లపై బ్లాక్ వుడ్ విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉందన్నాడు. అతను బ్యాటింగ్ కు వెళ్లే ముందు సహజ సిద్ధమైన ఆటను ఆడమని తాను చెప్పినట్లు హోల్డర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. -
విండీస్ బ్యాట్స్‌మన్ సూపర్ : కుంబ్లే
కింగ్స్టన్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ అద్భుత సెంచరీ(137 నాటౌట్) ఇన్నింగ్స్ ను టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే ప్రశంసించాడు. ఛేజ్ ఇన్నింగ్స్ కారణంగా రెండో టెస్టు బుధవారం డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. టెస్టులో 100 ఓవర్లకు పైగా కోల్పోవడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగిందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. 2-0 ఆధిక్యంలో నిలుస్తామని భావించినా.. విండీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు డౌరిచ్, జాసన్ హోల్డర్ హాఫ్ సెంచరీలు చేసి ఛేజ్ తో కలిసి స్కోరు బోర్డుకు పరుగులు జతచేయడంతో మ్యాచ్ ఫలితం మారిపోయిందన్నాడు. 'మా జట్టు 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. అప్పుడు రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విండీస్ కేవలం 50 పరుగుల లోపే 4 కీలక వికెట్లు కోల్పోయింది. అయినా విండీస్ ఆటగాళ్లు సమయోచితంగా రాణించారు. వారి ఆటతీరును నిజంగానే మెచ్చుకుని తీరాల్సిందే. కచ్చితంగా గెలుస్తామన్న మ్యాచ్‌ను డ్రాగా ముగించారంటే ఈ క్రెడిట్ విండీస్ బ్యాట్స్‌మన్‌కే చెందుతోంది. ఆంటిగ్వా టెస్టుతో పోల్చితే రన్ రేట్ ఇక్కడ చాలా తక్కువగా నమోదైంది' అని భారత కోచ్ కుంబ్లే వివరించాడు. -
ఆ విండీస్ ప్లేయర్ అసాధ్యుడు..!!
భారత్ విజయాన్ని అడ్డుకున్న రోస్టన్ ఛేజ్ కింగ్స్టన్: భారత్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ చెప్పినమాట నిరూపించుకున్నాడు. రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వాస్తవానికి తాను బౌలర్‌ను కాదని, ప్రధానంగా తన బలం బ్యాటింగ్ అని తెలిపాడు. బౌలర్‌ను కాదంటూనే తొలి ఇన్నింగ్స్ లో (5/121) తో ఆకట్టుకున్న ఛేజ్.. బ్యాటింగ్ లోనూ రాణించి విండీస్ ను ఓటమి గండం నుంచి గట్టెక్కించాడు. రెండో టెస్టులో విండీస్ కు కలిసొచ్చిన అంశం ఏంటంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాలలో ఛేజ్ రాణించడం. 304 పరుగులు వెనుకంజలో ఉన్న దశలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ టాపార్డర్ చేతులెత్తిసినా తన కెరీర్ లో తొలి సెంచరీ (269 బంతుల్లో 137; 15ఫోర్లు, 1 సిక్స్)తో నాటౌట్‌గా నిలిచి భారత బౌలర్లను ఆశ్చర్యపరిచాడు. ఐదు వికెట్లు తీయడంతో పాటు అజేయ సెంచరీ సాధించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. భారత బౌలర్లు ఎంత శ్రమించినా విండీస్ మాత్రం అంత సులువుగా వికెట్లు సమర్పించుకోలేదు. దాంతో తొలిటెస్టు ఫలితం పునరావృతం కాలేదు. 48/4 దశలో క్రీజులోకి వచ్చిన ఛేజ్, బ్లాక్‌వుడ్ తో కలిసి ఐదో వికెట్‌కు 17.4 ఓవర్లలోనే 93 పరుగులు జోడించాడు. బ్లాక్‌వుడ్‌ను అవుటయ్యాక షేన్ డౌరిచ్ (114 బంతుల్లో 74; 6 ఫోర్లు, 1సిక్స్)తో కలిసి ఆరో వికెట్‌కు 144 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ క్రమంలో తన తొలి సెంచరీ నమోదు చేసుకోవడంతో పాటు చివరగా కెప్టెన్ జాసన్ హోల్డర్(99 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1సిక్స్) తో కలిసి అజేయంగా క్రీజులో నిలిచి జట్టును మరో ఒటమి నుంచి తప్పించాడు. -
'నిజానికి నేను బౌలర్‌ను కాదు'
కింగ్స్టన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రాణించిన వెస్టిండీస్ ఏకైక బౌలర్ రోస్టన్ ఛేజ్. విండీస్ స్పిన్నర్ ఛేజ్ 5 వికెట్ల ఇన్నింగ్స్ (5/121) తో ఆకట్టుకున్నాడు. మూడోరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత ఛేజ్ మీడియాతో మాట్లాడాడు. భారత్ లాంటి జట్టుపై ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది తనకు మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నాడు. తాను పార్ట్ టైం బౌలర్ గా జట్టులోకి వచ్చానని, అయితే తాను ప్రధానంగా బ్యాట్స్ మన్ అని తెలిపాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచులలో పెద్దగా బౌలింగ్ చేసేవాడిని కాదని, అయితే జట్టు అవసరాల మేరకు అక్కడ తన చేతికి బంతిని అందించారని వెల్లడించాడు. ఆంటిగ్వా టెస్టుతోనే జాతీయ జట్టులో కెరీర్ ప్రారంభించానని, అయితే టెస్టుల్లో రాణించడం అంత సులువుకాదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో తాను లైన్ అండ్ లెంగ్త్ పట్టించుకోకుండా కాస్త వేగంగా బంతులు విసిరాను... ఈ టెస్టులో ఆ లోపాలను సవరించుకుని వికెట్లు పడగొట్టానన్నాడు. బంతి వేగాన్ని తగ్గించడంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపాడు. 304 పరుగులు వెనుకబడి ఉన్న తమ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో సమిష్టిగా రాణిస్తేనే మ్యాచ్ ఫలితాన్ని మార్చగలడం సాధ్యమవుతుందని స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ అభిప్రాయపడ్డాడు.