'ఇదే ఫామ్ను కొనసాగించు' | Full credit to Chase for manner in which he batted, jason Holder | Sakshi
Sakshi News home page

'ఇదే ఫామ్ను కొనసాగించు'

Published Thu, Aug 4 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

'ఇదే ఫామ్ను కొనసాగించు'

'ఇదే ఫామ్ను కొనసాగించు'

కింగ్ స్టన్(జమైకా): నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన రెండో టెస్టును డ్రా చేయడంలో కీలక పాత్ర పోషించిన వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్పై కెప్టెన్ జాసన్ హోల్డర్ ప్రశంసలు కురిపించాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఛేజ్ నమోదు చేయడం వల్లే తాము మ్యాచ్ను కాపాడుకున్నామని హోల్డర్ అభినందించాడు.

ఈ తరహా ఇన్నింగ్స్ను ఒక మ్యాచ్కే పరిమితం చేయకుండా మిగతా మ్యాచ్ల్లో కూడా కొనసాగించాలన్నాడు. ప్రత్యేకంగా రెండో టెస్టును నిలబెట్టింది మాత్రం ఛేజ్ అని, ఇదే ఫామ్ను మిగిలి ఉన్న రెండు టెస్టుల్లో  కొనసాగిస్తాడని హోల్డర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో పాటు బ్లాక్ వుడ్, డోవ్రిచ్లను హోల్డర్ అభినందించాడు. ప్రత్యేకంగా తమ ఇన్నింగ్స్లో మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు కావడంతో టెస్టు మ్యాచ్ పై పట్టు సాధించమన్నాడు. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయిన తరుణంలో ఛేజ్తో కలిసి బ్లాక్ వుడ్, డోవ్రిచ్లు జత చేసిన పరుగులు చాలా విలువైనవిగా హోల్డర్ తెలిపాడు. ఈ మ్యాచ్లో బౌలర్లపై బ్లాక్ వుడ్ విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉందన్నాడు. అతను బ్యాటింగ్ కు వెళ్లే ముందు సహజ సిద్ధమైన ఆటను ఆడమని తాను చెప్పినట్లు హోల్డర్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement