వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ దూరం | West Indies Releases Test Squad For Bangladesh Series, Kraigg Brathwaite To Lead And Check Other Names Inside | Sakshi
Sakshi News home page

BAN vs WI: వెస్టిండీస్‌ జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ దూరం

Published Sat, Nov 16 2024 1:47 PM | Last Updated on Sat, Nov 16 2024 2:48 PM

West Indies Releases Test Squad For BAN Series

బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. బ్రాత్‌వైట్ డిప్యూటీగా జాషువ డి సిల్వా ఎంపిక‌య్యాడు.

అయితే ఈ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండ‌ర్ జాసన్ హోల్డర్ భుజం గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. గ‌త కొంత‌కాలంగా హోల్డర్ భుజం గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. బంగ్లా సిరీస్ స‌మ‌యానికి కోలుకుంటాడ‌ని అంతా భావించారు. కానీ అత‌డు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో సెల‌క్ట‌ర్లు జ‌ట్టు ఎంపికకు పరిగ‌ణ‌లోకి తీసుకోలేదు. 

మ‌రోవైపు విండీస్ దేశీవాళీ టోర్నీ యునైటెడ్ సూపర్50 కప్‌లో మూడు సెంచరీలు సాధించిన జస్టిన్ గ్రీవ్స్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్పిన్న‌ర్ కెవిన్ సింక్లైర్ కూడా జ‌ట్టులోకి వ‌చ్చాడు. న‌వంబ‌ర్ 22 నుంచి ఆంటిగ్వా వేదిక‌గా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. విండీస్ ప్ర‌స్తుతం స్వ‌దేంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో త‌ల‌ప‌డుతోంది.

బంగ్లాతో టెస్టులకు విండీస్‌ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), జాషువా డా సిల్వా (వైస్‌ కెప్టెన్‌), అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జోమెల్, జోమెల్ వారికన్  

చదవండి: IND vs SA: చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement