టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్‌దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు.
ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్‌లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.
పీఎన్‌జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్‌జీని వలా, బావు అదుకున్నారు.
వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్‌జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు.
SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!
📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024
Comments
Please login to add a commentAdd a comment