Roston Chase's stunning diving catch ends Tilak Varma's debut T20I series - Sakshi
Sakshi News home page

IND vs WI: క్రికెట్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌.. తిలక్‌ వర్మ మైండ్‌ బ్లాక్‌! వీడియో వైరల్‌

Published Mon, Aug 14 2023 2:12 PM | Last Updated on Mon, Aug 14 2023 2:40 PM

Roston Chases stunning diving catch ends Tilak Varma - Sakshi

ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టీ20లో వెస్టిండీస్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. దూకుడుగా ఆడుతున్న తిలక్‌ వర్మను రిటర్న్‌ క్యాచ్‌తో ఛేజ్‌ పెవిలియన్‌కు పంపాడు. తన క్యాచ్‌తో మ్యాచ్‌ స్వరూపాన్నే ఛేజ్‌ మార్చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ అదిలోనే ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, యశస్వీ జైశ్వాల్‌ వికెట్లను కోల్పోయింది.

ఈ క్రమంలో సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన జోషఫ్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మ.. ఏకంగా 19 పరుగులు రాబట్టి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తిలక్‌ను అడ్డుకునేందుకు విండీస్‌ కెప్టెన్‌ స్పిన్నర్‌ ఛేజ్‌ను తీసుకువచ్చాడు.

అస్సలు ఊహించలేదు..
అయితే రోవ్‌మన్‌ పావెల్‌ నమ్మకాన్ని ఛేజ్‌ వమ్ము చేయలేదు. తన వేసిన తొలి ఓవర్‌లోనే సంచలన ఫామ్‌లో ఉన్న తిలక్‌ను పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్‌ వేసిన ఛేజ్‌ బౌలింగ్‌లో ఐదో బంతిని వర్మ లాంగ్‌ఆఫ్‌ దిశగా ఫ్లిక్‌ చేశాడు. ఈ క్రమంలో ఛేజ్‌ అద్భుతంగా డైవ్‌చేస్తూ రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే అది బంప్‌బాల్‌ అని అంతా అనుకున్నారు.

కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్‌ చోటుచేసుకుంది. బెన్‌ఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద ఫీల్డ్‌ అంపైర్‌లు థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకి నేరుగా ఛేజ్‌ చేతికి వెళ్లి నట్లు తేలింది. దీంతో 27 పరుగులు చేసిన తిలక్‌ వర్మ నిరాశతో మైదానాన్ని వీడాడాడు. ఛేజ్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సిరీస్‌ను 3-2 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
చదవండి#Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement