Australia vs West Indies
-
WI vs Aus: పదేళ్ల తర్వాత తొలిసారిగా.. షెడ్యూల్ విడుదల
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద ఈ ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో పోటీపడనున్నాయి. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు త్వరలోనే తమ దేశంలో పర్యటించనుందని తెలిపింది.డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో తొలి సిరీస్మరోవైపు.. ఈ విషయం గురించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి బెన్ ఓలివర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా- వెస్టిండీస్ క్రికెట్ బోర్డులకు ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత ఇరుజట్లు టెస్టు సిరీస్ ఆడటం శుభసూచకమని.. ఈ సిరీస్‌ను మూడు మ్యాచ్‌లకు పెంచినట్లు వెల్లడించారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2025-2027 ఎడిషన్‌లో ఇదే తమకు ఇదే తొలి సిరీస్ అని.. ఈసారీ ఫ్రాంక్ వొరిల్ ట్రోఫీని తామే సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.అదే విధంగా ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఐదు టీ20లు కూడా ఆడనున్నట్లు ఓలివర్ తెలిపారు. ఏడాది తర్వాత జరునున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇదే ఆరంభ సన్నాహకం కానుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ ప్రస్తుతంశ్రీలంక పర్యటనలో ఉంది. అనంతరం చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది. ఇక ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.వెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లకు షెడ్యూల్మూడు టెస్టులుతొలి టెస్టు: జూన్ 25- 20- బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్రెండో టెస్టు: జూలై 3-7- సెయింట్ జార్స్, గ్రెనెడామూడో టెస్టు: జూలై 12- 16- కింగ్స్టన్, జమైకాటీ20 సిరీస్‌తొలి టీ20- జూలై 20- కింగ్స్టన్, జమైకారెండో టీ20- జూలై 22- కింగ్స్టన్, జమైకామూడో టీ20- జూలై 25- బసెటెరె, సెయింట్ కిట్స్నాలుగో టీ20- జూలై 26- బసెటెరె, సెయింట్ కిట్స్ఐదో టీ20- జూలై 28- బసెటెరె, సెయింట్ కిట్స్అతడి జ్ఞాపకార్థంవెస్టిండీస్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో విజేతకు ఫ్రాంక్ వొరిల్ అవార్డు ప్రదానం చేస్తారు. వెస్టిండీస్ జట్టు తొలి నల్లజాతి కెప్టెన్‌గా పేరొందిన వొరిల్ జ్ఞాపకార్థం ఈ ట్రోఫీని ప్రవేశపెట్టారు. 1960-61లో తొలిసారి ఆస్ట్రేలియాలో ఈ ట్రోఫీని ప్రదానం చేశారు.ఇక 1995 నుంచి ఇప్పటి దాకా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే, గతేడాది జరిగిన టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ ఆసీస్ ఆధిపత్యాన్ని తగ్గించింది. గబ్బాలో అనూహ్య విజయంతో సిరీస్‌ను 1-1తో డ్రా చేసి.. దాదాపు పదిహేడేళ్ల తర్వాత తొలిసారి ఆసీస్‌పై టెస్టు విజయం నమోదు చేసింది.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో సిరీస్‌లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ పాకిస్తాన్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రిజ్వాన్ బృందంతో సొంతగడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. జూలై 31 నుంచి టీ20లు, ఆగష్టు 8 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. -
టీ20ల్లో ఆస్ట్రేలియా విధ్వంసం.. ఏకంగా 274 పరుగులు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఆస్ట్రేలియా తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా వెస్టిండీస్‌తో ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో బెన్ డంక్, క్రిస్టియన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు.డంక్ కేవలం 35 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో సెంచరీ మార్క్‌ను అందుకోగా.. క్రిస్టియన్ 35 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 99 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆసీస్ సాధించినదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో ఎమిరిట్ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం 275 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సైతం ధీటుగా బదులిచ్చింది. కానీ ఇంతటి భారీ లక్ష్యాన్ని విండీస్ చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు మాత్రమే చేయగల్గింది. విండీస్ బ్యాటర్లలో డ్వేన్ స్మిత్(64), నర్స్(70) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఆసీసీ బౌలర్లలో కెప్టెన్ బ్రెట్‌లీ రెండు, సిడిల్, దోహర్టీ, కౌల్టర్ నైల్,క్రిస్టియన్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో జూలై 12న ఇండియా ఛాంపియన్స్‌తో ఆసీస్ తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన రసెల్, రూథర్‌ఫోర్డ్ జోడీ
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్‌లో రసెల్, రూథర్‌ఫర్డ్ జోడీ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్‌లో పపువా జోడీ ఆరో వికెట్‌కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్‌కు అజేయమైన 101 పరుగులు జోడించింది. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్‌ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్‌ఫోర్డ్‌తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్‌ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్‌మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్‌వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్‌లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్‌లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్‌లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్‌లు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్‌కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్‌పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
WI Vs AUS 3rd T20I : రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. 29 బంతుల్లోనే!
Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్ వెటరన్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్ మ్యాచ్‌లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్‌రేటుతో 71 రన్స్ సాధించాడు. ఆసీస్ బౌలింగ్‌ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. Bang! Andre Russell is seeing them nicely at Perth Stadium. Tune in on Fox Cricket or Kayo #AUSvWI pic.twitter.com/DoUaQghJiZ — cricket.com.au (@cricketcomau) February 13, 2024 కాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్.. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రూథర్‌ఫర్డ్, రసెల్ దంచికొట్టారు టాపార్డర్ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్ చేజ్(20 బంతుల్లో 37), కెప్టెన్ రోవ్‌మన్ పావెల్(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్‌ఫర్డ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్‌ఫర్డ్ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్‌ఫర్డ్‌కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో రసెల్.. స్పెన్సర్ జాన్సెన్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డే సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. చదవండి: IPL 2024- SRH: సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! -
తప్పతాగి ఆసుపత్రిపాలైన ఘటనపై స్పందించిన మ్యాక్స్‌వెల్
తప్ప తాగి ఆసుపత్రిపాలైన ఘటనపై ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్పందించాడు. తన కెరీర్లో అదో చీకటి అధ్యాయమని అన్నాడు. అలా జరిగినందుకు సిగ్గుపడుతున్నానని తెలిపాడు. ఆ దురదృష్టకర ఘటన తనకంటే ఎక్కువగా తన ఇంట్లోని వాళ్లను ప్రభావితం చేసిందని పశ్చాత్తాపపడ్డాడు. గడ్డు పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నవారంతా మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. తన పరిస్థితి అర్ధం చేసుకుని అండగా నిలిచిన ఆసీస్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపాడు. చుట్టూ ఉన్న వారందరి సహకారం వల్లే త్వరగా కోలుకుని, తిరిగి మైదానంలో అడుగుపెట్టానని తెలిపాడు. విండీస్‌పై సుడిగాలి శతకం (55 బంతుల్లో 120 నాటౌట్; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) బాదిన అనంతరం మ్యాక్స్‌వెల్ పై విధంగా స్పందించాడు. కాగా, మ్యాక్స్‌వెల్ గత నెలలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రెట్ లీ హోస్ట్ చేసిన సంగీత కచేరీకి హాజరై తప్ప తాగి కుప్పకూలిపోయాడు. ఈ ఘటన అనంతరం మ్యాక్సీని ఆసుపత్రికి తరలించారు. మ్యాక్సీకి తప్పతాగి వార్తల్లోకి ఎక్కడం ఇది కొత్తేమీ కాదు. 2022లో స్నేహితుడి బర్త్‌డే పార్టీలో తప్పతాగి కాలు విరుగగొట్టుకున్నాడు. మ్యాక్సీకి సంబంధించి బయటపడని ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయని అంటుంటారు. ఇదిలా ఉంటే, తాజా ఘటన అనంతరం వేగంగా కోలుకున్న మ్యాక్స్‌వెల్.. విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన రెండో టీ20 మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సుడిగాలి శతకం బాది తన జట్టును ఒంటిచేత్తో గెలిపించడమే కాకుండా రోహిత్ శర్మ పేరిట ఉన్న అత్యధిక టీ20 శతకాల రికార్డును (5) సమం చేశాడు. -
క్రికెట్ చరిత్రలోనే విచిత్ర ఘటన.. ఇప్పటి వరకు చూసుండరు!
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో 34 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో ఆసీస్ సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ విచిత్రకర సంఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో రనౌట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయకపోవడంతో అంపైర్ ఔట్ ఇవ్వలేదు. ఇది మీకు వినడానికే కొత్తగా ఉండవచ్చు.. అసలేం ఏం జరిగిందో ఓ లూక్కేద్దాం. అసలేం ఏం జరిగిందంటే? విండీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లో పేసర్ అల్జారీ జోసెఫ్ కవర్స్ వైపు ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టిమ్ డెవిడ్ బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌కు అందించాడు. బంతిని అందుకున్న స్పెన్సర్ జాన్సన్ బెయిల్స్‌ను పడగొట్టాడు. అయితే అది క్లియర్‌గా ఔట్ అనుకుని జాన్సన్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత రిప్లేలో బిగ్ స్క్రీన్‌పై కూడా బెయిల్స్ కిందపడేటప్పటికి జోషఫ్ క్రీజుకు దూరంగా ఉన్నట్లు కన్పించింది. దీంతో ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌తో పాటు డేవిడ్ సైతం సెలబ్రేషన్స్‌లో మునిగితేలిపోయారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ మాత్రం అతడిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు అంపైర్‌ను ప్రశ్నించగా.. రనౌట్‌కు ఎవరూ అప్పీల్ చేయకపోవడంతో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించానని బదులిచ్చాడు. అయితే టిమ్ డేవిడ్ మాత్రం తను అప్పీల్ చేశానని అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అతడితో కెప్టెన్ మార్ష్ కూడా అంపైర్ నిర్ణయం పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘటన అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఏంసీసీ రూల్స్‌లోని సెక్షన్ 31.1 ప్రకారం, అప్పీల్ లేకుండా అంపైర్లు బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించకూడదు. చదవండి: Ravindra Jadeja: మా కోడలి వల్లే ఇదంతా... మండిపడ్డ రివాబా! ONE OF THE RAREST MOMENTS ...!!! Johnson attempted the run out, big screen showed its out, but nobody appealed so the on-field umpire dismissed the decision. pic.twitter.com/5b0x6y6KaF — Mufaddal Vohra (@mufaddal_vohra) February 12, 2024 -
మ్యాక్స్‌వెల్ మెరుపు శతకం.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్ విధ్వంకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో జేసన్ హొల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేయగలిగింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ (63) అర్దసెంచరీతో రాణించగా.. ఆండ్రీ రసెల్ (37), జేసన్ హోల్డర్ (28 నాటౌట్), జాన్సన్ చార్లెస్ (24) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ ఇన్నింగ్స్‌లో అందరూ తలో చేయి వేసినా లక్ష్యం పెద్దది కావడంతో ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ 3 వికెట్లతో చెలరేగగా.. హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్ చెరో 2 వికెట్లు, బెహ్రెన్‌డార్ఫ్, జంపా తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు మూడో టీ20 ఫిబ్రవరి 13న జరుగనుంది. -
సుడిగాలి శతకం.. మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకంతో (55 బంతుల్లో 120; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ శతకం మ్యాక్సీకి టీ20ల్లో ఐదవది. పొట్టి క్రికెట్ చరిత్రలో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని సెంచరీలు చేశాడు. మ్యాక్సీ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. జోష్ ఇంగ్లిస్ (4) విఫలం కాగా.. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ ధాటిగానే ఆడుతున్నప్పటికీ ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ (5), జాన్సన్ చార్లెస్ (24), పూరన్ (18), హోప్ (0), రూథర్‌ఫోర్డ్ (0) ఔట్ కాగా.. రోవ్‌మన్ పావెల్ (13), రసెల్ (30) క్రీజ్‌లో ఉన్నారు. 13 బంతుల్లోనే 30 పరుగులు చేసిన రసెల్ మాంచి ఊపుమీదున్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్, స్పెన్సర్ జాన్సన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారంతా ఒకవైపు.. మ్యాక్స్‌వెల్ ఒక్కడే ఒకవైపు టీ20ల్లో ఐదో సెంచరీ పూర్తి చేసిన మ్యాక్స్‌వెల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లంతా కలిసి సాధించినన్ని సెంచరీలను ఒక్కడే సింగిల్ హ్యాండెడ్‌గా చేశాడు. టీ20ల్లో ఆసీస్ క్రికెటర్లంతా కలిపి ఐదు శతకాలు చేయగా.. మ్యాక్సీ ఒక్కడే ఐదేశాడు. పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా తరఫున మ్యాక్స్‌వెల్ తర్వాత ఆరోన్ ఫించ్ అత్యధికంగా రెండు సెంచరీలు చేయగా.. డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్, జోష్ ఇంగ్లిస్ తలో సెంచరీ బాదారు. టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున మొత్తం 95 మంది ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించగా.. కేవలం కేవలం ఐదుగురు మాత్రమే సెంచరీలు చేశారు. మిగతా నలుగురు చేసిన సెంచరీలను మ్యాక్సీ ఒక్కడే చేయడం విశేషం. అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్‌వెల్ చేసిన సెంచరీలు.. - 145 (65)vs శ్రీలంక - 120(55) vs వెస్టిండీస్ - 113(55) vs ఇండియా - 104(48) vs ఇండియా - 103(58) vs ఇంగ్లండ్ -
మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం.. విధ్వంసకర శతకం
అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేశాడు. ఫలితంగా ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీ20ల్లో మ్యాక్స్‌వెల్‌కు ఇది ఐదో శతకం. అంతర్జాతీయ టీ20ల్లో కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఇన్ని శతకాలు చేశాడు. మ్యాక్సీ ఊచకోత ధాటికి విండీస్ బౌలర్లు విలవిలలాడిపోయారు. మ్యాక్స్‌వెల్ వచ్చిన బంతిని వచ్చినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ 120 పరుగులు (55 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాక్సీకి జతయ్యాడు. వీరిద్దరూ విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. SWITCH HIT FOR SIX BY MAXWELL 🤯🔥pic.twitter.com/wZ73ZsmhBm — Johns. (@CricCrazyJohns) February 11, 2024 వార్నర్ (19 బంతుల్లో 22; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ మిచెల్ మార్ష్ (12 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తమదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడగా.. జోష్ ఇంగ్లిస్ (4) విఫలమయ్యాడు. స్టోయినిస్ 15 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. మొత్తంగా ఆసీస్ బ్యాటర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో విండీస్ బౌలింగ్ లైనప్ కకావికలమైంది. ఆ జట్టు బౌలర్లలో జేసన్ హోల్డర్ 2, అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అల్జరీ జోసఫ్ ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచింది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరిదైన మూడో టీ20 పెర్త్ వేదికగా ఫిబ్రవరి 13న జరుగనుంది. -
అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్ రికార్డు!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తన వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో వార్నర్.. కరేబియన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో వార్నర్ కేవలం 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ భాయ్ 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70 పరుగులు చేశాడు. కాగా వార్నర్‌కు ఇది టీ20ల్లో 100వ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను వార్నర్ తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో వంద అర్ధశతకాల మార్క్‌ను అందుకున్న తొలి క్రికెటర్‌గా వార్నర్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఓవరాల్‌గా 367 టీ20లు ఆడిన వార్నర్ 100 హాఫ్ సెంచరీలను సాధించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో వార్నర్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(91) ఉన్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో వార్నర్ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆస్ట్రేలియా క్రికెటర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. అయితే ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన మూడో ప్లేయర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ కంటే ముందు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఉన్నాడు. చదవండి: 'ప్లీజ్.. నా కొడుకును జడేజాతో పోల్చవద్దు' -
వందో మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన వార్నర్.. తొలి టీ20 ఆసీస్‌దే
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో విండీస్ చివరివరకు అద్భుతంగా పోరాడింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎంతటి భారీ స్కోర్లనైనా ఛేదిస్తుందని అనిపించింది. జట్టులో దాదాపుగా అందరూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించగల సమర్ధులే. ఇంతటి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా విండీస్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. కెరీర్లో వందో మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్ (70) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37 నాటౌట్), వేడ్ (21) వేగంగా పరుగులు సాధించగా.. మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ (10), స్టోయినిస్ (9), అబాట్ (0) నిరాశపరిచారు. విండీస్ బౌలరల్లో రసెల్ 3 వికెట్లు, అల్జరీ జోసఫ్ 2, హోల్డర్, షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. నిర్ణీత ఓవర్లలో 202 పరుగులకు పరిమితమై (8 వికెట్లు కోల్పోయి) 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విండీస్ ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (53), జాన్సన్ చార్లెస్ (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తొలి వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చివారు తుస్సుమనిపించడంతో విండీస్ చేతులెత్తేసింది. ఆఖర్లో జేసన్ హోల్డర్ (34 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి విండీస్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. పూరన్ (18), పావెల్ (14), హోప్ (16), రసెల్ (1), రూథర్‌ఫోర్డ్ (7), షెపర్డ్ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జంపా 3, స్టోయినిస్ 2, బెహ్రెన్‌డార్ఫ్, మ్యాక్స్‌వెల్, అబాట్ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఫిబ్రవరి 11న అడిలైడ్‌లో జరుగనుంది. -
WC 2024: ఈసారి ప్రపంచకప్ వెస్టిండీస్‌దే: డారెన్ సామీ
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్ డారెన్ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్ సొంతం. కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్‌కప్-2023లో గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్ బోర్డు డారెన్ సామీకి కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్ గతేడాది వరుస టీ20 సిరీస్‌లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడుతోంది. డారెన్ సామీ (PC: WC) ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందుకు డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్‌లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరుగనున్న ప్రపంచకప్-2024 ఈవెంట్‌కు యూఎస్ఏతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం -
AUS VS WI 1st T20: వార్నర్ 'ట్రిపుల్ ‘సెంచరీ’
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో 100కు పైగా మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా, తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న తొలి మ్యాచ్ వార్నర్ టీ20 కెరీర్లో 100వది. ఇటీవలే వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన 37 ఏళ్ల వార్నర్ ఇప్పటివరకు 112 టెస్ట్‌లు, 161 వన్డేలు, 100 టీ20లు ఆడాడు. వార్నర్‌కు ముందు ఈ ఘనత న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మాత్రమే సాధించారు. రాస్ టేలర్ 112 టెస్ట్‌లు, 236 వన్డేలు, 102 టీ20లు ఆడగా.. కోహ్లి 113 టెస్ట్‌లు, 292 వన్డేలు, 117 టీ20లు ఆడాడు. ఇదిలా ఉంటే, వార్నర్ తన 100వ టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆసీస్ భారీ స్కోర్ సాధించేందకు గట్టి పునాది వేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వార్నర్.. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 70 పరుగులు చేసి అల్జరీ జోసఫ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వార్నర్ ఔటయ్యాక ఆసీస్ వరసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ వేగం మందగించింది. 17 ఓవర్ల తర్వత ఆ జట్టు స్కోర్ 173/5గా ఉంది. వార్నర్, జోష్ ఇంగ్లిస్ (39), మిచెల్ మార్ష్ (16), మ్యాక్స్‌వెల్ 10), స్టోయినిస్ (9) ఔట్ కాగా.. టిమ్ డేవిడ్ (18), మాథ్యూ వేడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలరల్లో అల్జరీ జోసఫ్ 2, జేసన్ హోల్డర్, ఆండ్రీ రసెల్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
విధ్వంసం సృష్టించిన డేవిడ్ వార్నర్
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరీర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్.. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాది ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ఆసీస్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జోష్ ఇంగ్లిస్ 39 పరుగులు (5 ఫోర్లు, సిక్స్) చేసి ఔట్ కాగా.. వార్నర్ (57), మిచెల్ మార్ష్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లిస్ వికెట్ జేసన్ హోల్డర్‌కు దక్కింది. 10 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 110/1గా ఉంది. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ కోవిడ్‌తో బాధపడుతున్నప్పటికీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో మార్ష్‌కు బదులు వార్నర్ టాస్కు వచ్చాడు. Mitchell Marsh is leading Australia but as he is COVID positive, David Warner came for the toss. pic.twitter.com/MBBgZ1z6RE — Johns. (@CricCrazyJohns) February 9, 2024 ఇదిలా ఉంటే, 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టెస్ట్ సిరీస్ 1-1తో సమం కాగా.. వన్డే సిరీస్‌ను ఆసీస్ క్లీన్‌స్వీప్ (3-0) చేసింది. రెండు, మూడు టీ20లు ఫిబ్రవరి 11, 13 తేదీల్లో అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనున్నాయి -
విండీస్‌తో టీ20 సిరీస్.. ఆసీస్ ‘సంచలన’ బౌలర్ రీఎంట్రీ
Australia vs West Indies T20 Series 2024: వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా తదుపరి టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఇరుజట్ల మధ్య హోబర్ట్ వేదికగా శుక్రవారం(ఫిబ్రవరి 9) నుంచి ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. పేసర్ నాథన్ ఎల్లిస్ స్థానాన్ని సెన్సర్ జాన్సన్‌తో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఫాస్ట్ బౌలర్ భాగం కానున్నాడని బుధవారం వెల్లడించింది. నాథన్ ఎల్లిస్‌ను తప్పించారు కాగా బిగ్ బాష్ లీగ్ 2023-24లో హోబర్ట్ హారికేన్స్కు ప్రాతినిథ్యం వహించిన నాథన్ ఎల్లిస్ మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు. పక్కటెముకల నొప్పి కారణంగా గత కొంతకాలంగా అతడు ఆటకు దూరంగా ఉన్నాడు. అయితే, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నాటికి ఎల్లిస్ కోలుకుంటాడని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి ప్రధాన జట్టులో చోటిచ్చింది. కానీ.. గాయం తీవ్రత దృష్ట్యా అతడికి మరికొంత కాలం విశ్రాంతి అవసరమని భావించి తాజాగా జట్టు నుంచి తప్పించింది. ఈ క్రమంలో స్పెన్సర్ జాన్సన్.. సొంతగడ్డపై విండీస్‌తో సిరీస్ సందర్భంగా జట్టులో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ముంగిట నిలిచాడు. కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ మీడియం పేసర్.. టీమిండియాతో సిరీస్ సందర్భంగా వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. బీబీఎల్-2024లో సంచలన ప్రదర్శనతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున ఒక వన్డే, రెండు టీ20లు ఆడిన స్పెన్సర్ పొట్టి ఫార్మాట్లో కేవలం రెండు వికెట్లు తీశాడు. వన్డేల్లో ఇంకా ఖాతా తెరవనేలేదు. అయితే, బీబీఎల్ తాజా సీజన్లో మాత్రం దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బ్రిస్బేన్ హీట్‌కు ఆడిన స్పెన్సర్ జాన్సన్.. ఆ జట్టు టైటిల్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిస్బేన్ తరఫున 11 మ్యాచ్‌లలో 19 వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ సిక్సర్‌తో జరిగిన ఫైనల్లో 4-0-26-4 గణాంకాలతో మెరిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో సంచలన బౌలర్ స్పెన్సర్ జాన్సన్‌ను విండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక ఈ సిరీస్‌లో గనుక రాణిస్తే టీ20 వరల్డ్‌కప్-2024 రేసులో స్పెన్సర్ ముందుకు దూసుకురావడం ఖాయం. ఆస్ట్రేలియా టీ20 జట్టు మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. వెస్టిండీస్ టీ20 జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: పక్షిలా.. గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో సంచలన క్యాచ్! వీడియో వైరల్ -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్‌తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్‌తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్‌ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్‌కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్‌తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్‌గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్‌ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్‌కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 3-0తో వైట్‌వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక విమర్శలు -
ODI: ఆసీస్ బ్యాటర్ల విధ్వంసం.. 6.5 ఓవర్లలోనే ఖేల్ ఖతం
వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రతాపం చూపించారు. మూడో వన్డేలో కేవలం 6.5 ఓవర్లలోనే విండీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటారు. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డేల్లో మాత్రం కంగారూల చేతిలో చిత్తుగా ఓడింది. తొలి రెండు వన్డేల్లో వరుసగా 8 వికెట్లు.. 81 పరుగులతో పరాజయం పాలైన షాయీ హోప్ బృందం.. తాజాగా ఆఖరి మ్యాచ్‌లోనూ ఓడి వైట్‌వాష్‌కు గురైంది. కాన్బెర్రా వేదికగా మనుకా ఓవల్ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక విండీస్ కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. యువ పేసర్ జేవియర్ బ్రాట్‌లెట్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఏకంగా నాలుగు వికెట్లు తీయగా.. లాన్స్ మోరిస్, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. సీన్ అబాట్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఆసీస్‌కు ఓపెనర్లు జేక్ ఫ్రాసెర్ మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్ అదిరిపోయే ఆరంభం అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ విండీస్ బౌలింగ్‌లో పరుగుల విధ్వంసం సృష్టించారు. జేక్ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్‌లతో 41 రన్స్ చేయగా.. ఇంగ్లిస్ 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్) సాధించాడు. ఇక జేక్ జోరుకు అల్జారీ జోసెఫ్ బ్రేకులు వేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2)ని ఒషానే థామస్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో ఇంగ్లిస్‌కు జతైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ నేపథ్యంలో 6.5 ఓవర్లలోనే 87 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఆసీస్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకున్నాడు. -
క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్
కాన్బెర్రా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ అద్బుతమైన ఫీల్డింగ్ విన్యాసంతో అకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కార్టీని పెవిలియన్‌కు పంపాడు. విండీస్ ఇన్నింగ్స్ 11 ఓవర్ వేసిన లాన్స్ మోరిస్ బౌలింగ్‌లో మూడో బంతిని కార్టీ.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్‌కు కొంచెం వైడ్‌గా ఉన్న లబుషేన్.. పక్షిలా గాల్లో ఎగురుతూ మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అదే విధంగా ఆసీస్ ఆటగాళ్లందరూ లబుషేన్‌కు వద్దకు వెళ్లి అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు క్లీన్ స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అనంతరం 87 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 6.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. చదవండి: IND vs ENG: శ్రీకర్ భరత్‌కు బైబై.. యువ వికెట్ కీపర్ అరంగేట్రం పక్కా!? MARNUS! Whatta catch - and first international wicket for Lance Morris too!#PlayOfTheDay | #AUSvWI pic.twitter.com/KwZP43hEFd — cricket.com.au (@cricketcomau) February 6, 2024 -
మొన్ననేమో సంచలనం.. ఇప్పుడు 86 పరుగులకే ఆలౌట్!
వెస్టిండీస్.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటుంది. అయితే మరోసారి వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కరేబియన్ బ్యాటర్లు ఘెరంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆసీస్ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ 4 వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. లాన్స్ మోరిస్, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఓపెనర్ ఆథ్నాజ్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన విండీస్ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. అంతకుముందు గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విండీస్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ అద్బుత ప్రదర్శనతో 27 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. -
సీన్ అబాట్ ఆల్‌రౌండ్ షో.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 4) జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఆసీస్ ఆటగాడు సీన్ అబాట్ ఆల్‌రౌండ్ షోతో (69 పరుగులు, 3 వికెట్లు) విండీస్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో వచ్చిన అబాట్ 63 బంతుల్లో 4 సిక్సర్లు, బౌండరీ సాయంతో 69 పరుగులు చేసి ఆసీస్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో గ్రీన్ (33), షార్ట్ (41), లబూషేన్ (26), ఆరోన్ హార్డీ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలరల్లో గుడకేశ్ మోటీ 3 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాశించగా.. అల్జరీ జోసఫ్, రొమారియో షెపర్డ్ తలో 2 వికెట్లు, మాథ్యూ ఫోర్డ్, ఒషేన్ థామస్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. సీన్ అబాట్ (3/40), జోష్ హాజిల్‌వుడ్ (3/43) విజృంభించడంతో 43.3 ఓవర్లలో 175 పరుగులకు కుప్పకూలింది. సదర్‌ల్యాండ్ 2, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కీసీ కార్టీ (40) టాప్ స్కోరర్‌గా నిలువగా.. అలిక్ అథనాజ్ (11), షాయ్ హోప్ (29), రోస్టన్ చేజ్ (25), అల్జరీ జోసఫ్ (19) రెండంకెల స్కోర్ చేశారు. ఈ సిరీస్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఫిబ్రవరి 6న జరుగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్‌గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్‌లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
27 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా! వీడియో
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై విండీస్‌కు ఇది 27 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఈ విజయంలో విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. తన బొటన వేలు విరిగినప్పటికి జోసెఫ్ అద్భత ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా.. కాగా చారిత్రాత్మక విజయం అనంతరం ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా భావోద్వేగానికి లోనయ్యాడు. లారా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర కామెంటేటర్ గిల్ క్రిస్ట్.. లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కోర్లు విండీస్ తొలి ఇన్నింగ్స్: 310/10 ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 289/9(డిక్లెర్) విండీస్ రెండో ఇన్నింగ్స్: 193/10 ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207/7 ఫలితం: 8 పరుగుల తేడాతో విండీస్ విజయం The 3 Kings…@gilly381 @BrianLara #Smithy ❤️ test cricket…@FoxCricket pic.twitter.com/rQBxho9z3B — Mark Howard (@MarkHoward03) January 28, 2024 The moment Shamar Joseph breached Fortress Gabba and sealed a stunning victory for West Indies beating Australia🔥 pic.twitter.com/HSwnpBfpwR — Devanayagam (@Devanayagam) January 28, 2024 -
పెను సంచలనం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన విండీస్
టెస్ట్ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను శోభ తగ్గిన విండీస్ వారి సొంత దేశంలోనే చిత్తుగా ఓడించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో విండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. WEST INDIES HAS WON A TEST MATCH AT GABBA 🤯 - Shamar Joseph is the hero. pic.twitter.com/d9zqVfcOpP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను గెలిపించేందుకు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్ జోసఫ్ (7/68) విజృంభించడంతో ఆసీస్‌కు పరాభవం తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్‌కు ఇది మొదటిసారి. ఈ మ్యాచ్‌లో షమార్ జోసఫ్ బొటనవేలి ఫ్రాక్చర్‌తో బాధపడుతూనే అద్భుతం చేశాడు. The celebration by West Indies is emotional. - World cricket needs powerful West Indies. 🦁pic.twitter.com/QwbbO9VxHP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 ఇదే సిరీస్‌లోని తొలి మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన షమార్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్‌లో కూడా షమార్ బంతితో, బ్యాట్‌తో రాణించాడు. పదకొండో నంబర్ ఆటగాడిగా వచ్చి అతి మూల్యమైన పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అత్యంత పటిష్టమైన ఆసీస్‌ను వారి సొంత దేశంలో ఓడించడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. Gilchrist hugging Lara in commentary box after the historic win in West Indies at Gabba. - What a moment. 👌pic.twitter.com/8T9N1qjf8J — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ జనం ఈ గెలుపుతో పండుగ చేసుకుంటున్నారు. ఇటీవలికాలంలో చిన్న జట్ల చేతుల్లో కూడా పరాజయాలు ఎదుర్కొని, కనీసం వన్డే వరల్డ్‌కప్‌కు (2023) అర్హత సాధించలేకపోయిన విండీస్... ఈ గెలుపుతో పూర్వవైభవం సాధించేలా కనిపిస్తుంది. Ian Bishop describing the journey of Shamar Joseph. - This is lovely. 👏pic.twitter.com/tyjjFzt83i — Johns. (@CricCrazyJohns) January 28, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. Lara hugging Shamar Joseph. - What a moment for the youngster, he has started a new chapter. pic.twitter.com/fnn411HZ92 — Johns. (@CricCrazyJohns) January 28, 2024 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. Shamar Joseph said "I told my captain that I will bowl till the last wicket falls no matter what happens to my toe". pic.twitter.com/Col1wTPJQI — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను షమార్ మ్యాజిక్ స్పెల్‌తో ఇబ్బంది పెట్టాడు. షమార్ ధాటికి ఆసీస్ 193 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. షమార్తో పాటు అల్జరీ జోసఫ్ (2/62), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
AUS VS WI 2nd Test: వేలు విరిగినా ఇరగదీసిన విండీస్ పేసర్
బ్రిస్బేన్ వేదికగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ను గెలుపు ఊరిస్తుంది. యువ పేసర్ షమార్ జోసఫ్ (6/65) ధాటికి ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు 191 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. స్టీవ్ స్మిత్ (90 నాటౌట్) ఆసీస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్మిత్‌కు జతగా హాజిల్‌వుడ్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. బొటన వేలు విరిగినా ఇరగదీసిన షమార్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే సమయంలో స్టార్క్ బౌలింగ్ విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టార్క్ సంధించిన యార్కర్ నేరుగా షమార్ కాలి బొటన వేలిని తాకింది. దీంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. స్వల్పంగా ఫ్రాక్చర్ ఉందని డాక్టర్లు చెప్పినా షమార్ బౌలింగ్‌కు దిగాడు. బౌలింగ్ చేయడమే కాకుండా ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. షమార్తో పాటు అల్జరీ జోసఫ్ (2/50), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు తీయడంతో ఆసీస్ ఓటమి దిశగా పయనిస్తుంది. Shamar Joseph has to retire hurt after this toe-crusher from Mitch Starc! Australia need 216 to win #AUSvWI pic.twitter.com/3gAucaEfwg — cricket.com.au (@cricketcomau) January 27, 2024 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. Shamar Joseph helped from the field to end West Indies’ innings #AUSvWI pic.twitter.com/YZPUcmQ7s6 — Andrew McGlashan (@andymcg_cricket) January 27, 2024 విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హాజిల్‌వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
లక్ అంటే నీదే బ్రో.. బౌల్డయినా కింద పడని బెయిల్స్! వీడియో వైరల్
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పేసర్లు నిప్పులు చేరుగుతున్నారు. విండీస్ ఫాస్ట్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లావిల్లాడుతున్నారు. 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను.. ఖ్వాజా(75), ఆలెక్సీ క్యారీ(65) అదుకున్నారు. ప్రస్తుతం 50 ఓవర్లకు ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో అసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(53), నాథన్ లయోన్(3) పరుగులతో ఉన్నారు. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, అల్జారీ జోషప్ 3 వికెట్లు పడగొట్టగా.. షమీర్ జోషప్, కెవిన్ తలా వికెట్ సాధించారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీని ఆదృష్టం వరించింది. బంతి వికెట్లను తాకినప్పటికీ క్యారీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్లో షమీర్ జోషఫ్.. క్యారీకి అద్బుతమైన డెలివరీని సంధించాడు. సూపర్ డెలివరీ క్యారీ ను బీట్ చేస్తూ బ్యాట్, స్టంప్స్‌కు దగ్గరగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశారు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌కు కాకుండా స్టంప్స్‌కు తాకినట్లు కన్పించింది. 140 కిలోమీటర్ల వేగంతో స్టంప్స్ ను తాకినా బెయిల్స్ మాత్రం ఇంచు కూడా కదల్లేదు. ఇది చూసిన అందరూ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న క్యారీ ఏకంగా 65 పరుగులు చేశాడు. The bail spun in its groove - but didn't fall! 😱#AUSvWI pic.twitter.com/t6XgOibdqr — cricket.com.au (@cricketcomau) January 26, 2024 -
వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ డెబ్యూ ఆటగాడు కెవిన్ సింక్లైర్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను సంచలన క్యాచ్‌తో సింక్లైర్ పెవిలియన్‌కు పంపాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన కీమర్ రోచ్ బౌలింగ్‌లో లబుషేన్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో నాలుగో స్లిప్‌లో ఉన్న సింక్లైర్ డైవ్ చేస్తూ కళ్లుచెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన లబుషేన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. చేసేదేమి లేక లబుషేన్(3) నిరాశతో మైదాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కీమర్ రోచ్ 4 వికెట్లతో ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఖ్వాజా(24), ఆలెక్సీ క్యారీ(22) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తమ మొదట ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. A fourth-slip SCREAMER! Kevin Sinclair is having a debut to remember! #PlayOfTheDay | @nrmainsurance | #AUSvWI pic.twitter.com/jrwK4jmkuD — cricket.com.au (@cricketcomau) January 26, 2024 -
నిప్పులు చెరుగుతున్న కీమర్ రోచ్.. విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్లను (0) పెవిలియన్‌కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్‌లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది. స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
ఆసీస్‌తో రెండో టెస్ట్.. విండీస్‌ను ఆదుకున్న లోయర్ ఆర్డర్ బ్యాటర్లు
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక విండీస్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. 16 పరుగులతో కెవిన్ సింక్లెయిర్ క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాశించగా.. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు.. ఇలా దూరం పెట్టడమెందుకు..?
క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్‌తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ కోవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విండీస్‌తో మ్యాచ్‌లో గ్రీన్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది. కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్‌కు కోవిడ్ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్ సహచరులతో పాటు లైన్లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు. Hazlewood shoos away the Covid-positive Green! 🤪 #AUSvWI pic.twitter.com/iQFbbKfpwV— cricket.com.au (@cricketcomau) January 25, 2024 కోవిడ్ ఉందన్న కారణంగా గ్రీన్ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్ మేనేజ్మెంట్ తెలిపినట్లు సమాచారం. గ్రీన్ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్ మేనేజ్మెంట్పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు. మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్ మేనేజ్మెంట్ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్ జట్టులో గ్రీన్‌తో పాటు హెడ్ కోచ్ మెక్ డోనాల్డ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 38/1గా ఉంది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (17), కిర్క్ మెక్కెంజీ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. -
విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (జనవరి 24) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం ఆసీస్ సెలెక్టర్లు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు విశ్రాంతి కల్పించారు. కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. ఈ సిరీస్‌కు కమిన్స్‌తో పాటు రెగ్యులర్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్,స్టీవ్ స్మిత్ కూడా దూరంగా ఉండనున్నారు. సెలెక్టర్లు స్టార్క్, స్మిత్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఇటీవలే టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ జట్టులో చోటు పదిలం చేసుకోగా.. ఇటీవలే ఆసుపత్రిపాలైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, పేసర్ నాథన్ ఇల్లిస్ తిరిగి జట్టులోకి వచ్చారు. బిగ్‌బాష్ లీగ్ 2023-24లో భీకర ఫామ్‌లో ఉండిన మ్యాట్ షార్ట్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, విండీస్‌తో టీ20 సిరీస్ ఫిబ్రవరి 9, 11, 13 తేదీల్లో హోబర్ట్, అడిలైడ్, పెర్త్ వేదికలుగా జరుగనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్.. విండీస్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. టెస్ట్ సిరీస్ అనంతరం ఆసీస్-విండీస్‌లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. వన్డే సిరీస్ మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా వేదికలుగా ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో జరుగనుంది. వన్డే సిరీస్ కోసం ఆసీస్ జట్టును ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్‌కు కూడా కమిన్స్ దూరంగా ఉండనుండగా.. అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ వన్డే జట్లును ముందుండి నడిపించనున్నాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఆసీస్ జట్టు.. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా విండీస్‌తో సిరీస్‌కు ఆసీస్ వన్డే జట్టు.. స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా -
29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు!
స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే అనుహ్యంగా ఈ జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్, జో రిచర్డ్సన్ గాయం కారణంగా దూరమయ్యారు. ఇక తాజాగా వీరిద్దరి స్ధానాన్ని యువ సంచలనం ఫ్రేజర్-మెక్‌గర్క్, ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్‌తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ఫ్రేజర్-మెక్‌గర్క్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే టోర్నీలో వరల్డ్ రికార్డు సెంచరీతో మెక్‌గర్క్ చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న మెక్‌గర్క్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. మెక్‌గర్క్ ప్రస్తుతం యూఏఈ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో తన అరంగేట్ర మ్యాచ్‌లోనే మెక్‌గర్క్ అదరగొట్టాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు పేసర్ బార్ట్లెట్ కూడా దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. బిగ్‌బాష్ లీగ్-2023 సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కాగా ఆసీస్-విండీస్ మధ్య వన్డే సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఆసీస్ వన్డే జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా. చదవండి: టెస్టు సిరీస్‌కు బ్రూక్ దూరం -
AUS Vs WI: హాజిల్‌వుడ్ విజృంభణ.. విండీస్‌ను చిత్తు చేసిన ఆసీస్
టెస్ట్‌ల్లో వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇటీవలే స్వదేశంలో పాక్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఛాంపియన్ టీమ్.. తాజాగా అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌ల్లో (తొలి) విండీస్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. హాజిల్‌వుడ్ (9/79), ట్రవిస్ హెడ్ (119) విజృంభించడంతో మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. కఠినమైన పిచ్‌పై అద్భుత సెంచరీ చేసిన ట్రవిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (50), 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (36) మాత్రమే ఓ మోస్తరుగా రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ సెంచరీతో కదంతొక్కడంతో 283 పరుగులకు ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. విండీస్ ఆరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ (5/94) ఆసీస్‌ను దెబ్బతీశాడు. 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ఈసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో విండీస్ 120 పరుగులకే కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (26) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 26 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. ఆడుతూపాడుతూ వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. స్టీవ్ స్మిత్ 11, లబూషేన్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఉస్మాన్ ఖ్వాజా (9) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. -
AUS VS WI 1st Test: సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి సంచలన పేసర్‌గా..!
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ పలు రికార్డులు కొల్లగొట్టాడు. టెస్ట్ కెరీర్లో మొదటి బంతికే వికెట్ (స్టీవ్ స్మిత్) తీసిన షమార్.. టైరెల్ జాన్సన్ (1939లో ఇంగ్లండ్‌పై) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 23వ బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్, లబూషేన్, కెమరూన్ గ్రీన్ లాంటి హేమాహేమీ బ్యాటర్లు సహా ఐదు వికెట్ల ఘనత సాధించిన షమార్.. టెస్ట్ అరంగేట్రంలోనే ఈ ఘనత సాధించిన 11వ విండీస్ బౌలర్‌గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో 11వ నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు ఎంతో అవసరమైన 36 పరుగులు చేసిన షమార్.. విండీస్ తరఫున టెస్ట్‌ల్లో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసిన 11వ నంబర్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ ప్రదర్శనలతో షమార్ మరిన్ని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ అరంగేట్రంలోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి విండీస్ బౌలర్‌గా.. ఆస్ట్రేలియాలో టెస్ట్ అరంగేట్రంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన పదో పర్యాటక బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. కాగా, షమార్ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/94) విజృంభించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ (119) సెంచరీ చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. అంతకుముందు హాజిల్‌వుడ్ (4/44), కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో కిర్క్ మెక్కెంజీ (50), షమార్ జోసఫ్ (36) మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 95 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్‌ను హాజిల్‌వుడ్ (4/18) మరోసారి దారుణంగా దెబ్బకొట్టాడు. హాజిల్‌వుడ్ ధాటికి విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. విండీస్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 22 పరుగుల దూరంలో ఉంది. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం వదిలి.. ఆసీస్‌తో తొలి టెస్ట్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేసిన షమార్ జోసఫ్.. తనకెంతో ఇష్టమైన క్రికెట్ కోసం తన జీవనాధారమైన సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. కరీబియన్ దీవుల్లోని ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన షమార్.. టెస్ట్ అరంగేట్రానికి ముందు కేవలం ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 24 ఏళ్ల రైట్ ఆర్మ్ పేసర్ అయిన షమార్ అంతర్జాతీయ అరంగేట్రంలో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుని పలు రికార్డులు కొల్లగొట్టాడు. -
Aus vs WI : శతక్కొట్టిన ట్రావిస్ హెడ్..
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 95 పరుగుల విలువైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. ట్రావిస్ హెడ్ (119) సెంచరీతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి ఆలౌటైంది. హెడ్ మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్‌పై సెంచరీ తర్వాత హెడ్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌లో 15వ పరుగుతో హెడ్ టెస్ట్‌ల్లో మూడు వేల పరుగులు పూర్తి చేశాడు. ఉస్మాన్ ఖ్వాజా (45), నాథన్ లయోన్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. స్టీవ్ స్మిత్ 12, లబూషేన్ 10, కెమరూన్ గ్రీన్ 14, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 15, మిచెల్ స్టార్క్ 10, పాట్ కమిన్స్ 12 స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్ల ప్రదర్శనను నమోదు చేయగా.. కీమర్ రోచ్, మరో అరంగ్రేటం బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ తలో రెండు వికెట్లు, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్.. మూడో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి కేవలం 7 పరుగులు మాత్రమే చేసి, కష్టాల్లో చిక్కుకుంది. ఇంకా ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 88 పరుగులు వెనుకపడి ఉంది. తేజ్‌నరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్ డకౌట్లు కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఒక్క పరుగులు చేసి ఔటయ్యారు. కిర్క్ మెక్కెంజీ (5), కవెమ్ హాడ్జ్ క్రీజ్‌లో ఉన్నారు. విండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్ దారుణంగా దెబ్బతీశాడు. ఈ ఇన్నింగ్స్‌లో విండీస్ కోల్పోయిన మూడు వికెట్లు హాజిల్వుడే తీశాడు. అంతకుముందు విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లోనూ హాజిల్వుడే (4/44) దెబ్బకొట్టాడు. హాజిల్, కమిన్స్ (4/41) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్‌వైట్ (13), తేజ్‌నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. -
విండీస్ అరంగేట్ర పేసర్ సంచలనం: స్మిత్ నమ్మలేకపోయాడు!
#Shamar Joseph: ‘‘టెస్టు కెరీర్లో ఇంతకంటే గొప్ప ఆరంభం ఉండాలని ఎవరైనా కలగనగలరా?! ఈ అబ్బాయి చరిత్ర సృష్టించాడు’’.. వెస్టిండీస్ అరంగేట్ర పేసర్ షమార్ జోసెఫ్ గురించి కామెంటేటర్ అన్న మాటలు. నిజమే.. జాతీయ జట్టుకు ఆడాలన్న చిరకాల కోరిక నెరవేర్చుకున్న 24 ఏళ్ల ఈ యువ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో.. అది కూడా పటిష్ట ఆస్ట్రేలియాతో టెస్టులో.. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ రూపంలో దిగ్గజ బ్యాటర్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 85 ఏళ్ల రికార్డు సమం అంతేకాదు.. వెస్టిండీస్ చరిత్రలో 85 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సమం చేశాడు కూడా! విండీస్ తరఫున టెస్టు క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. అంతకు ముందు.. 1939లో టిరెల్ జాన్సన్.. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా 23వ స్థానం ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో 23వ బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు షమార్ జోసెఫ్. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా షమార్ జోసెఫ్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు ఇక టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 188 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. కంగారూ జట్టు పేసర్లు ప్యాట్ కమిన్స్, హాజిల్‌వుడ్ నాలుగేసి వికెట్లు తీసి విండీస్‌ను కోలుకోని దెబ్బకొట్టారు. వీరి ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా పదకొండో స్థానంలో బరిలోకి దిగిన షమార్ జోసెఫ్ కీమర్ రోచ్‌తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 41 బంతుల్లో 36 పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. స్మిత్‌ను బోల్తా కొట్టించి మరీ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో తిప్పలు పెట్టాడు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి స్మిత్‌ను బోల్తా కొట్టించాడు షమార్. గుడ్ లెంగ్త్ డెలివరీతో స్మిత్‌ను డిఫెన్స్‌లో పడేసి వికెట్ సమర్పించుకునేలా చేశాడు. కాగా షమార్ బౌలింగ్‌లో బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. FIRST BALL! Shamar Joseph gets Steve Smith with his first ball in Tests! #OhWhatAFeeling | @Toyota_Aus | #AUSvWI pic.twitter.com/XLelMqZHrG — cricket.com.au (@cricketcomau) January 17, 2024 ఇదిలా ఉంటే... పదిహేనో ఓవర్ ఐదో బంతికి మార్నస్ లబుషేన్(10) రూపంలో రెండో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు షమార్. ఇక.. తొలి రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసిన ఆస్ట్రేలియా విండీస్ కంటే 129 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు