వెస్టిండీస్ జట్టు (PC: Windies Cricket X)
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్ డారెన్ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్ సొంతం.
కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్‌కప్-2023లో గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్ బోర్డు డారెన్ సామీకి కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్ గతేడాది వరుస టీ20 సిరీస్‌లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడుతోంది.
డారెన్ సామీ (PC: WC)
ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందుకు డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు.
ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు.
అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్‌లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరుగనున్న ప్రపంచకప్-2024 ఈవెంట్‌కు యూఎస్‌ఏతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీ20 జట్టు:
రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్.
చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment