darren sammy
-
వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా వరల్డ్‌కప్ విన్నర్..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్ కోచ్‌గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భర్తీ చేయనున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చితో ముగయనుంది.కాగా సామీ సారథ్యంలోనే రెండు టీ20 వరల్డ్‌కప్(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్‌బాల్ హెడ్ కోచ్‌గా నియమించింది. విండీస్ వైట్‌బాల్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో కరీబియన్ టీమ్ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్‌పై ఘన విజయాలు సాధించి గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు, 2022 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో విండీస్ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోచ్‌గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్‌కు అదనంగా కలిసొస్తుంది.ఇదిలా ఉంటే, సూపర్-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 19న ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో కరీబియన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. సూపర్-8 రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజం..?
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాట్సన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వాట్సన్ సమాధానం కోసం పీసీబీ ఎదురు చూస్తున్నట్లు నివేదికలు ద్వారా తెలుస్తుంది. వాట్సన్ త్వరలోనే పీసీబీ అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వి కలుస్తాడని సమాచారం. ప్రస్తుతం వాట్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ అయిన క్వెట్టా గ్లాడియేటర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. పీసీబీ ప్రతిపాదనకు వాట్సన్ నో చెప్పినా వారి వద్ద ప్రత్యామ్నాయ ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పీసీబీ అధికారుల దృష్టిలో విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో సామి పీఎస్ఎల్ ఫ్రాంచైజీ పెషావర్ జల్మీకి కెప్టెన్‌గా వ్యవహరించి ఉండటంతో అతనికి పాక్‌లో భారీ క్రేజ్ ఉంది. పాక్ హెచ్ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే పీసీబీ సామినే కోచ్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, పాకిస్తాన్ టీమ్ డైరెక్టర్‌గా మొహమ్మద్ హఫీజ్ తొలగించబడినప్పటి నుంచి పాక్ జట్టు కోచ్ లేకుండానే ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన అనంతరం పీసీబీ నాటి విదేశీ కోచింగ్ సిబ్బంది మొత్తాన్ని తొలగించింది. ప్రస్తుతం పాకిస్తాన్లో పీఎస్ఎల్ సీజన్ నడుస్తుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ నాకౌట్ దశకు క్వాలిఫై అయ్యాయి. లాహోర్ ఖలందర్స్ లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
WC 2024: ఈసారి ప్రపంచకప్ వెస్టిండీస్‌దే: డారెన్ సామీ
టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచేది తమ జట్టేనని వెస్టిండీస్ మాజీ కెప్టెన్, పరిమిత ఓవర్ల ప్రస్తుత కోచ్ డారెన్ సామీ అన్నాడు. సొంతగడ్డపై పొట్టి ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది తాము టీ20 ఫార్మాట్లో అద్భుత విజయాలు సాధించామని.. ఆ జోరును అలాగే కొనసాగించి విశ్వవిజేతలుగా నిలుస్తామని పేర్కొన్నాడు. కాగా అత్యధికంగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్(2012,2016) గెలిచిన ఘనత వెస్టిండీస్ సొంతం. కానీ.. గత ఐసీసీ ఈవెంట్లలో దారుణ ప్రదర్శనతో విమర్శల పాలైంది . టీ20 ప్రపంచకప్-2022, వన్డే వరల్డ్‌కప్-2023లో గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన విండీస్ బోర్డు డారెన్ సామీకి కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో పుంజుకున్న వెస్టిండీస్ గతేడాది వరుస టీ20 సిరీస్‌లు గెలిచింది. సౌతాఫ్రికా(2-1), టీమిండియా(3-2), ఇంగ్లండ్ (3-2)లను చిత్తు చేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో తలపడుతోంది. డారెన్ సామీ (PC: WC) ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందుకు డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘‘గతేడాది మా జట్టు అద్భుతమైన పురోగతి సాధించింది. 2023లో మేము ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. జైత్రయాత్రను కొనసాగించాలని భావిస్తున్నాం. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచే తొలి జట్టు మాదే అవుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాం’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. తమ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర లీగ్‌లలో సత్తా చాటుతున్న విషయాన్ని డారెన్ సామీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. కాగా ఈ ఏడాది జూన్‌లో జరుగనున్న ప్రపంచకప్-2024 ఈవెంట్‌కు యూఎస్ఏతో కలిసి వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు వెస్టిండీస్ టీ20 జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షాయీ హోప్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, జాసన్ హోల్డర్, అకీల్ హొసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటి, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒషానే థామస్. చదవండి: విభేదాలు ఉంటేనేం.. తను నా రక్తం.. మిస్సవుతున్నా: షమీ భావోద్వేగం -
WC: 2012లో వెస్టిండీస్ అలా.. 2022లో పాకిస్తాన్ ఇలా! విండీస్ గెలిస్తే.. పాక్ మాత్రం
T20 World Cup: 2012 Winner West Indies- 2022 Winner England: వరల్డ్‌కప్ ఫైనల్ ఈసారి ‘టై’ కాలేదు... సూపర్ ఓవర్లు కూడా సమం కాలేదు... క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి, సగం గెలుపు అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేయడానికి ఇంగ్లండ్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి చర్చే రాకుండా అద్భుత ఆటతో అందరికంటే శిఖరాన నిలిచింది. టోర్నీ ఆరంభంలో వర్షం తమ అవకాశాలను దెబ్బకొట్టినా, ఒక్కసారిగా పుంజుకొని మ్యాచ్‌లు వానపాలైన వేదికపైనే విశ్వ విజేతగా ఆవిర్భవించింది. వన్డే, టి20 వరల్డ్‌కప్‌లు రెండూ ఒకే సమయంలో తమ వద్ద కలిగి ఉన్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది. మూడేళ్ల క్రితం వన్డే వరల్డ్‌కప్ గెలిచినా వివాదం వెంట తీసుకొచ్చి ఆనందం కాస్త మసకబారగా... అంతకుముందే ఆరేళ్ల క్రితం టి20 వరల్డ్‌కప్ ఆఖరి మెట్టుపై అనూహ్య రీతిలో ఓడింది. వాటిని మరిచేలా తాజా విజయం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లండ్ ఆధిపత్యాన్ని చూపించింది. వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో 8 ఫోర్లు, 2 సిక్సర్లు... తొలుత బ్యాటింగ్ చేస్తూ.. పాకిస్తాన్ చూపిన పేలవ బ్యాటింగ్ ఇది... టి20ల్లో చివరి నాలుగు ఓవర్లంటే బౌలర్లకు డెత్ ఓవర్లు! కానీ పాక్ దానిని రివర్స్‌గా మార్చింది. ఆఖరి 4 ఓవర్లలో కనీసం 40 పరుగులు చేస్తే విజయంపై ఆశలు ఉంచుకోగలిగే చోట 18 పరుగులకే పరిమితమైంది. ముగింపు స్కోరుతోనే పాక్ ఓటమికి పునాది పడింది. టోర్నీ ఆసాంతం చెలరేగిన స్యామ్ కరన్ బౌలింగ్ పదును ముందు పాక్ తేలిపోయింది. 2012 ఫైనల్లో కూడా విండీస్ 137 పరుగులే చేసి విజేతగా నిలిచిన తీరు గుర్తుకొచ్చిందేమో... పాక్‌లో కాస్త ఆశలు పెరిగాయి! పైగా తొలి ఓవర్లోనే హేల్స్ అవుట్ కావడం, మెల్బోర్న్ మైదానం మొత్తం హోరెత్తిపోవడం ఆ జట్టును మరింత ఉత్సాహపరచింది. మధ్య ఓవర్లలో ప్రత్యర్థిని పాక్ కట్టడి కూడా చేయగలిగింది కూడా. అయితే పాక్ ఆశించినట్లుగా 1992 పునరావృతం కాలేదు. బెన్ స్టోక్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. 43 మ్యాచ్‌ల టి20 కెరీర్లో తన తొలి అర్ధసెంచరీ చేసేందుకు అతను సరైన సమయాన్ని ఎంచుకున్నట్లున్నాడు. చివరి వరకూ నిలబడి మరోసారి తన చేతుల మీదుగా ఇంగ్లండ్‌ను వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిపాడు. 2012లో వెస్టిండీస్ అలా విజేతగా.. శ్రీలంక వేదికగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీ20 ప్రపంచకప్-2012 ఫైనల్లో వెస్టిండీస్ ఆతిథ్య శ్రీలంకతో తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు జాన్సన్ చార్ల్స్(0), క్రిస్ గేల్ (3) వికెట్లు కోల్పోయినా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్లన్ సామ్యూల్స్ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో డ్వేన్ బ్రావో 19, కెప్టెన్ డారెన్ సామీ 26(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి సామీ బృందం 137 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్ మహేల జయవర్దనే 33 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ తిలకరత్నె దిల్షాన్ డకౌట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ సంగక్కర 22 పరుగులు చేయగా.. నువాన్ కులశేఖర 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్ల స్కోరు కనీసం ఐదు పరుగులు కూడా దాటకుండా విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో18.4 ఓవర్లలో 101 పరుగులకే లంక ఆలౌట్ అయింది. నాడు అదరగొట్టిన విండీస్ బౌలర్లు వెస్టిండీస్ బౌలర్లలో సునిల్ నరైన్ 3.4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు కూల్చగా.. సామీ రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సామ్యూల్ బద్రీకి ఒకటి, రవి రాంపాల్‌కు ఒకటి, మార్లన్ సామ్యూల్స్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆల్‌రౌండ్ ప్రతిభతో మార్లన్ సామ్యూల్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2022లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ ఇలా టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆదివారం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. షాన్ మసూద్ (28 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ బాబర్ ఆజమ్ (28 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామ్ కరన్ (3/12) పాక్‌ను పడగొట్టగా... ఆదిల్ రషీద్, జోర్డాన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 138 పరుగులు చేసి గెలిచింది. బెన్ స్టోక్స్ (49 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. 6 మ్యాచ్‌లలో 11.38 సగటు, 6.52 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ టైటిల్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్యామ్ కరన్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా కూడా నిలిచాడు. అంతా విఫలం... ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ (15) పాక్‌కు దూకుడైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. తొలి నాలుగు ఓవర్లలో ఆ జట్టు ఒకే ఒక బౌండరీ (సిక్స్) కొట్టగా, తర్వాతి ఓవర్లో రిజ్వాన్ వెనుదిరిగాడు. పవర్‌ప్లేలో స్కోరు 39 పరుగులకు చేరింది. ధాటిగా ఆడగల హారిస్ (8)ను రషీద్ తన తొలి బంతికే అవుట్ చేయగా, 10 ఓవర్లు ముగిసేసరికి జట్టు 68 పరుగులు చేసింది. ఇందులో మూడు ఫోర్లే ఉన్నాయి! లివింగ్‌స్టోన్ ఓవర్లో 4, 6తో మసూద్ జోరును పెంచే ప్రయత్నం చేయగా, బాబర్‌ను చక్కటి రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసి రషీద్ మళ్లీ దెబ్బ కొట్టాడు. ఇఫ్తికార్ (0) కూడా చేతులెత్తేయడంతో పాక్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లండ్ పదునైన బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన పాక్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడటంలో పూర్తిగా విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో జట్టు పరిస్థితి మరీ ఘోరంగా కనిపించింది. చివరి 4 ఓవర్లలో పాక్ కేవలం 18 పరుగులు మాత్రమే జోడించి ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున 4 వికెట్లు కోల్పోయింది. దాంతో కనీస స్కోరును కూడా సాధించలేక పాక్ ఇన్నింగ్స్ ముగించింది. హేల్స్ విఫలం... ఛేదనలో ఇంగ్లండ్ కూడా గొప్పగా ఆడలేదు. అయితే లక్ష్యం బాగా చిన్నది కావడంతో జాగ్రత్తగా, తగిన ప్రణాళికతో ఆ జట్టు విజయాన్నందుకుంది. తొలి ఓవర్లోనే ప్రమాదకరమైన హేల్స్ (1)ను షాహిన్ అఫ్రిది అవుట్ చేయగా, జోస్ బట్లర్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆపై నసీమ్ తొలి ఓవర్లోనే ఇంగ్లండ్ మూడు ఫోర్లతో ఎదురుదాడి చేసింది. రవూఫ్ తన రెండు వరుస ఓవర్లలో సాల్ట్ (10), బట్లర్‌లను అవుట్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 49/3 వద్ద నిలిచింది. ఈ దశలో పాక్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. బౌండరీలు రావడం కష్టంగా మారిపోయింది. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఇంగ్లండ్ బౌండరీ కొట్టలేకపోయింది! అయితే స్టోక్స్ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. హ్యారీ బ్రూక్ (23 బంతుల్లో 20; 1 ఫోర్) అవుటైనా... సింగిల్స్‌తోనే పరుగులు రాబడుతూ తన వికెట్ మాత్రం అప్పగించకుండా జాగ్రత్త పడ్డాడు. గాయంతో అఫ్రిది అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఆ ఓవర్ పూర్తి చేసేందుకు ఇఫ్తికార్ రాగా వరుసగా 4, 6 బాదాడు. 24 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో వసీమ్ వేసిన 17వ ఓవర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 19; 3 ఫోర్లు) 3 ఫోర్లు కొట్టడంతో పని సులువైంది. వసీమ్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతికి ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న స్టోక్స్... చివరి బంతిని మిడ్ వికెట్ దిశగా సింగిల్ తీసి ఇంగ్లండ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిపాడు. చదవండి: T20 WC 2022 Final: అఫ్రిది గాయపడకుంటే టైటిల్ గెలిచేవాళ్లం: పాక్ కెప్టెన్ టీ20 వరల్డ్‌కప్-2022 అత్యుత్తమ జట్టులో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు View this post on Instagram A post shared by ICC (@icc) -
వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి పాకిస్తాన్ క్రికెట్‌కు చేసిన అద్భుతమైన సేవలుకుగాను ‘సితార-ఎ-పాకిస్తాన్’ పౌర పురస్కారం అందుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పెషావర్ జల్మీ జట్టుకు డారెన్ సామి హెడ్ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి పెషావర్ అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది సీజన్లో మూడో స్ధానంలో నిలిచింది. అంతే కాకుండా యువ ఆటగాళ్లలో ప్రతిభను వెలికితీసి.. పాకిస్తాన్ క్రికెట్‌కు అత్యుత్తమ ఆటగాళ్లను అందించడంలో సామి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అందుకుగాను పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డుతో అతడిని సత్కరించింది. ఇక వెస్టిండీస్ తరపున 38 టెస్టులు, 126 వన్డేలు,68 టీ20 మ్యాచ్‌లు సమీ ఆడాడు.సమీ సారథ్యంలో విండీస్ జట్టు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ విషయాన్ని సమీ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. "నేను సితార-ఈ-పాకిస్తాన్ అవార్డును అందుకుంటున్నాను. నాకు చాలా గర్వంగా ఉంది" అని సమీ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ‘ప్రపంచకప్ అందుకోవడమే లక్ష్యం’ -
IND Vs WI: టీమిండియా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది.. అయినా మాతో అంత ఈజీ కాదు..!
Darren Sammy: త్వరలో టీమిండియాతో ప్రారంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో విండీస్ మాజీ సారధి డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తమ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయరాదని భారత్‌ను హెచ్చరించాడు. గతంలో చాలా సందర్భాల్లో టీమిండియా కంటే బలమైన జట్లకు షాకిచ్చామని, ఈ విషయాన్ని భారత్ గుర్తు చేసుకోవాలని సూచించాడు. భారత్ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నుంచైనా త్వరగా బయటపడగలదని, ప్రస్తుతం ఆ జట్టు రోహిత్ శర్మ లాంటి గొప్ప నాయకుడి చేతుల్లో సేఫ్‌గా ఉందని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో వరుస ఓటములు, కెప్టెన్సీ వివాదం వంటివి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవని, స్వదేశంలో రోహిత్ సేన బెబ్బులిలా గర్జిస్తుందని తమ జట్టును అలర్ట్ చేశాడు. ఫిబ్రవరి 6 నుంచి 20 వరకు జరిగే 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లో పోలార్డ్ సేనకు ప్రధాన ముప్పు కెప్టెన్, మాజీ కెప్టెన్ల నుంచి ఉంటుందని హెచ్చరించాడు. రోహిత్ నేతృత్వంలో టీమిండియా బలంగా కనిపిస్తుందని, విండీస్ జట్టు సైతం ఆల్‌రౌండర్లతో నిండి ఉందని ప్రస్తావించాడు. విండీస్ జట్టులోని కొందరు ఆటగాళ్లకు భారత్‌లో ఆడిన అనుభవం ఉందని, ముఖ్యంగా కెప్టెన్ పోలార్డ్‌కు భారత్‌లో పరిస్థితులపై మంచి అవగాహన ఉందని, ఇది ఓ రకంగా తమకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రాణిస్తున్న కుర్రాళ్లు విండీస్‌కు అదనపు బలంగా మారతారని, యువకులు, అనుభవజ్ఞుల కలియకలో కరీబియన్ జట్టు టీమిండియాకు గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడుతూ.. సామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..! -
ఇండియన్ మహరాజా టీమ్ కెప్టెన్‌గా సెహ్వాగ్
జనవరి 20 నుంచి ఒమన్ వేదికగా జరగనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్సీ) టి20 టోర్నమెంట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో ఇండియన్ మహారాజా, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ టీమ్‌లు పాల్గొంటున్నాయి. కాగా షెడ్యూల్‌తో పాటు ఆయా జట్ల కెప్టెన్లను ప్రకటించారు. ఎల్ఎల్సీలో పాల్గొననున్న ఇండియన్ మహారాజా టీమ్‌కు.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా మరో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ ఎంపిక కాగా.. జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు జాన్ బుచానన్ ఎంపికయ్యాడు. ఇక సెహ్వాగ్ ఇంతకముందు ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. చదవండి: 'ఫుల్‌టైం టెస్టు కెప్టెన్'.. పెద్ద బాధ్యత మీద పడ్డట్టే ► ఇక ఆసియన్ లయన్స్ కెప్టెన్‌గా పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా-ఉల్ హక్ ఎంపిక కాగా.. ఈ జట్టులో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తరపున ఆడిన మాజీ క్రికెటర్లు ఉన్నారు. వారిలో షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్, మహ్మద్ హఫీజ్, ఉమర్ గుల్, సనత్ జయసూర్య, తిలకరత్నే దిల్షాన్, చమిందా వాస్, హబీబుల్ బషర్ లాంటి పేరున్న క్రికెటర్లు ఉండడంతో ఆసియా లయన్స్ బలంగా కనిపిస్తుంది. వైస్ కెప్టెన్‌గా దిల్షాన్ ఎంపికవగా.. 1996 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ► వరల్డ్ జెయింట్స్ టీమ్‌కు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డారెన్ సామీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోనూ పలువురు వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. బ్రెట్ లీ, డానియెల్ వెటోరి, కెవిన్ పీటర్సన్, ఇమ్రాన్ తాహిర్ ఉన్నారు. వీరితో పాటు జాంటీ రోడ్స్ ప్లేయర్ కమ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. జనవరి 20న ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియా లయన్స్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ సోనీ టెన్ వన్, టూ, త్రీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో అద్భుతం.. ప్రతీ ఆటగాడి కాలికి తగిలిన బంతి ఎల్ఎల్సీ టోర్నీ షెడ్యూల్: 20/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ ఆసియన్ లయన్స్ 21/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఏషియన్ లయన్స్ 22/01/22: వరల్డ్ జెయింట్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ 24/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 26/01/22: ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ 27/01/22: ఆసియన్ లయన్స్ వర్సెస్ ఇండియా మహారాజాస్ -
ఫన్ 88 బ్రాండ్ కోసం.. విండీస్ క్రికెటర్ డారెన్ సామి
మరో విండీస్ క్రికెటర్ ఇండియన్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. గత కొంత కాలంగా విదేశీ క్రికెటర్లకు మన దేశంలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు తమ సంస్థలకు ప్రచార కర్తలుగా పలు సంస్థలు ఉత్సాహం చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో ప్రముఖ స్పోర్ట్స్ ఫ్లాట్‌ఫామ్ ఫన్88, తమ బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామిని నియమించుకుంది. కెప్టెన్‌గా వెస్టిండీస్ టీమ్‌ను టీ20 వల్డ్ కప్ విజేతగా రెండుసార్లు నిలవడంలో కీలకంగా వ్యవహరించిన సామికి, ఆయన ఆటతీరుకు భారత్, ఉపఖండంలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో హైదరాబాద్ జట్టుకు కూడా సామి ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ ఫన్88. క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్, కబడ్డి, ఇంకా ఎన్నో క్రీడలకు సంబంధించిన విశేషాలను అందించే ఫన్ 88 తరపున సామి పలు రకాల ప్రచార కార్యక్రమాల్లో భాగం పంచుకోనున్నాడు. ‘రెండు దశాబ్దాలుగా 88 సంఖ్య నా జెర్సీ నెంబర్‌గా ఉంది. అందుకే ఈ ఒప్పందం నాకు మరింత ప్రత్యేకం. ఇప్పుడు ఫన్88 ద్వారా భారత క్రీడాభిమానులకు మరో రూపంలో చేరువకాబోతున్నాననేది నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది అంటున్నారు సామి. -
ఇషాంత్ ఇప్పటికీ నా సోదరుడే
న్యూఢిల్లీ: గతంలో భావించినట్లే ఇషాంత్ శర్మను ఇప్పుడు కూడా సోదరునిలానే ఆదరిస్తున్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చెప్పాడు. భారత పేసర్ ఇషాంత్ శర్మపై తనకు ఎలాంటి కోపం, పగ లేదని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం (2013, 2014) వహించిన సమయంలో జాతి వివక్షకు గురైనట్లు ఇటీవలే గుర్తించిన స్యామీ... తనను ‘కాలూ’(నల్లవాడు) అని సంబోధించిన ఇషాంత్‌ను క్షమించినట్లు తెలిపాడు. ‘నేను పగలు ప్రతీకారాలు పెట్టుకోను. ఇషాంత్‌తో దీని గురించి మాట్లాడాను. ఇది ముగిసిన అధ్యాయం. ఇంతకుముందు ఇషాంత్‌ను ఎలా భావించానో ఇప్పుడు కూడా సోదరునిలాగే ఆదరిస్తా. కానీ ఇకపై భవిష్యత్‌లో ఇలాంటి వాటిని సహించను. అది ఎవరైనప్పటికీ నేను నిలదీస్తా. జాతివివక్షను సహించను. ఇప్పటికే దీని గురించి పోరాడుతున్నా. ఇక ముందూ కొనసాగిస్తా. క్రికెట్ వర్గాల్లోనూ దీనిపై అవగాహన కల్పిస్తున్నాం’ అని విండీస్‌కు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించిన స్యామీ పేర్కొన్నాడు. స్యామీ తన కెరీర్లో 232 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
'ఎన్గిడి... నిజంగా నువ్వు మూర్ఖుడివి'
జోహన్నెస్‌బర్గ్ : అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య తరువాత ప్రపంచవ్యాప్తంగా జాతి వివక్షపై నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం తర్వతా బ్లాక్ లైవ్స్ మేటర్ అంశంపై ప్రచారం విస్తృతంగా పెరిగింది. దీనిపై పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు కూడా తమ గళం విప్పారు. క్రికెట్లోనూ వర్ణ వివక్ష ఎదుర్కొన్నామంటూ డారెన్ సామి, క్రిస్ గేల్, మైఖేల్ హోల్డింగ్ లాంటి ఆటగాళ్లు పేర్కొన్నారు. తాజాగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి శుక్రవారం పేర్కొన్నాడు. ఎన్గిడి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి.(అండర్సన్.. మొన్ననేగా పొగిడాం ఇంతలోనే) 'బ్లాక్ లైవ్స్ మేటర్‌కు నేను మద్దతు ఇస్తున్నా.. ఈ అంశంలో ఇతర ఆటగాళ్ల మద్దతు నాకు ఉంటుందనే ఆశిస్తున్నా. గడిచిన కొన్ని సంవత్సరాల్లో దక్షిణాఫ్రికాలోనూ జాత్యాహంకారం జరగుతుంది.. క్రికెట్లోనూ ఇది కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మా జట్టులోని ఆటగాళ్లు కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నా’అని తెలిపాడు.' అయితే ఎన్గిడి వ్యాఖ్యలపై పలువురు మాజీ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. 'ఎన్గిడి నువ్వు నిజంగా మూర్ఖుడివి.. బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతు ఇవ్వాలా వద్దా అనేది నీ ఇష్టం. నువ్వు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. కానీ మొత్తం దక్షిణాఫ్రికా ప్రజలను ఇందులోకి లాగొద్దు.' అంటూ దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్ పాట్ సిమ్‌కాక్స్ పేర్కొన్నాడు. ' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారం వెనుక రాజకీయ ఉద్యమం తప్ప మరొకటి లేదని నేను భావిస్తున్నా. ఎన్గిడి.. మద్దతు ఇచ్చే ముందు థామస్ సోవల్, లారీ ఎల్డర్, వాల్టర్ విలిమమ్స్ లాంటి తెల్లజాతి రైతులపై జరిగిన దారుణాలను గుర్తు తెచ్చుకోవాలి. ఈ విషయంలో నువ్వు సానుభూతి ప్రకటిస్తే బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారంలో నేను నీతో పాటు వస్తా 'అంటూ మాజీ బ్యాట్స్‌మన్ బొటా డిప్పెనార్ తెలిపాడు. అయితే ఎన్గిడి వ్యాఖ్యలకు తాను మద్దతిస్తున్నట్లు విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి తెలిపాడు.' బ్లాక్ లైవ్స్ మేటర్ ప్రచారానికి ఎన్గిడి మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉంది. నీ వెనుక ఎవరు లేకున్నా మేమంతా నీతోనే ఉన్నాం . ఈ విషయలంలో కలిసి పోరాడుదాం' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. ఒకప్పుడు వర్ణ వివక్ష అన్న కారణంతోనే దక్షిణాఫ్రికా దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడలేదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.('ధోనికున్న మద్దతు కోహ్లికి లేదు..') -
‘నల్లవారిని’ నిరోధించేందుకే...
సెయింట్ లూసియా: ప్రపంచ క్రికెట్లో నల్లజాతి ఫాస్ట్ బౌలర్లు తమ వేగంతో చెలరేగిపోతున్న సమయంలో వారిని అడ్డుకునేందుకే బౌన్సర్ల నిబంధనలో మార్పులు తెచ్చారని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వ్యాఖ్యానించాడు. ఇతర దేశాల పేసర్లు బౌన్సర్లు వేసినా ఎవరూ పట్టించుకోలేదని, నల్లవారిని మాత్రం కట్టి పడేశారని అతను పరోక్షంగా తమ విండీస్ జట్టు గురించి అన్నాడు. ప్రపంచ క్రికెట్‌పై వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలపాటు వారు తమ భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థులను పడగొట్టి ఆటపై ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే 90ల్లోకి వచ్చిన తర్వాత విండీస్ జోరు తగ్గింది. ‘ఒక ఓవర్‌కు ఒక బౌన్సర్ మాత్రమే’ అనే నిబంధనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1991లో తీసుకొచ్చింది. యాదృచ్ఛికం కావచ్చు కానీ అప్పటినుంచే విండీస్ క్రికెట్ పతనం ప్రారంభమైంది. ‘ఫైర్ ఇన్ బేబీలాన్ డాక్యుమెంటరీని చూడండి. జెఫ్ థాంప్సన్, డెన్నిస్ లిల్లీ తదితరులంతా కూడా బౌన్సర్లతో చెలరేగిపోయారు. అమిత వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ శరీరంపై దాడి చేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. అయితే ఆ తర్వాత నల్లవారి జట్టు అదే తరహా దూకుడైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై చెలరేగింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అప్పుడే బౌన్సర్ల గురించి వారికి ఈ తరహా ఆలోచన వచ్చి ఉంటుంది. నల్ల జట్టును కట్టడి చేయాలనే కొత్త నిబంధన తెచ్చి ఉంటారు. నేను చెప్పేది పూర్తిగా నిజం కాకపోవచ్చు గానీ నాకు మాత్రం అలాగే అనిపించింది’ అని స్యామీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. -
‘అతను’ నాతో మాట్లాడాడు
కింగ్స్టన్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు వర్ణ వివక్షకు గురయ్యానంటూ వ్యాఖ్యలు చేసిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ ఇప్పుడు ఆ వివాదానికి ముగింపునిచ్చే ప్రయత్నం చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ జట్టు సహచరుడొకరు తనను కాలూ (నల్లోడు) అన్నాడని, ఇప్పటికైనా అతను తనతో మాట్లాడి క్షమాపణ చెప్పాలని ఇటీవల డిమాండ్ చేశాడు. తాజాగా స్యామీ శుక్రవారం దీనిపై ఒక ప్రకటన చేశాడు. సదరు క్రికెటర్ తనతో అభిమానంగా మాట్లాడాడని, ఇక ప్రత్యేకంగా క్షమాపణ కోరాల్సిన అవసరం లేదని చెప్పాడు. ‘వివాదంలో భాగమైన ఆ క్రికెటర్ నాతో మాట్లాడాడు. మా సంభాషణ బాగా సాగింది. ఈ అంశంలో చెడును చూడటంకంటే వివక్షపై తగిన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలని నిర్ణయించాం. నా సోదరుడు ప్రేమతోనే అలా మాట్లాడానని చెప్పాడు. అతని మాటలు నమ్ముతున్నాను. ఉద్దేశపూర్వంగా చేయలేదని అర్థమైంది. ఇక నేను క్షమాపణ కోరుకోవడం లేదు. అతని పేరు కూడా నేను చెప్పను. ఇకపై అలాంటిది జరగకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లజాతీయుడిగా ఉండటం నాకు ఎప్పటికీ గర్వకారణమే’ అని స్యామీ పేర్కొన్నాడు. -
ఆ మాటన్నది ఇషాంతేనా!
న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే సమయంలో తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013–14 సీజన్లలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ’ (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న స్యామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. పాత ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి చూస్తే ఈ మాటలన్నది భారత పేసర్ ఇషాంత్ శర్మ అని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్... ‘నేను, భువీ, కాలూ, గన్ సన్‌రైజర్ (స్టెయిన్)’ అంటూ పోస్ట్ చేశాడు. ‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్ నంబర్ ఉంది. ఇతర సోషల్ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. విండీస్ ఆటగాడి ఆరోపణలపై ఇషాంత్ గానీ, సన్‌రైజర్స్ యాజమాన్యం గానీ స్పందించలేదు. -
దక్షిణాది ప్లేయర్లపైనే వర్ణ వివక్ష: పఠాన్
న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్లో దక్షిణాది ప్లేయర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు మ్యాచ్‌ల నిమిత్తం వెళ్లినపుడు వారు వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు’ అని పఠాన్ అన్నాడు. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా విండీస్ ప్లేయర్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు గురైన అంశం తనకు తెలియదని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ‘2014లో స్యామీతో పాటు నేనూ సన్‌రైజర్స్‌కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు’ అని ఇర్ఫాన్ వివరించాడు. అప్పట్లో రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్ పటేల్, వేణుగోపాలరావు కూడా స్యామీపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. -
నన్ను ‘కాలూ’ అని పిలిచారు
కింగ్స్టన్: ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా తాను కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. ‘సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను ‘కాలూ... కాలూ’ (నల్లోడు) అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో ‘కాలూ’ అంటే ‘బలమైన వ్యక్తి’ అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది’ అని స్యామీ ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నాడు. అయితే ఏ ఐపీఎల్ సీజన్ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్మెన్ క్రీడ క్రికెట్లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.... విండీస్‌కు కెప్టెన్‌గా రెండు టి20 ప్రపంచకప్‌లను అందించాడు. -
'నన్ను చాలా దారుణంగా అవమానించారు'
జమైకా : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్‌కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా సామి పేర్కొన్నాడు.('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది') 'నేను ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు. (షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు) అంతకుముందు ట్విటర్ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు. కాగా విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ కూడా ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలిపాడు .తాను కూడా జాత్యహంకారానికి గురయ్యాడని ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్లో జాత్యహంకారం లేదనేది ఒక అపోహ మాత్రమే అని గేల్ చెప్పుకొచ్చాడు. -
క్రికెట్ ప్రపంచం గళం విప్పాల్సిందే
కింగ్స్టన్: జాత్యహంకారంపై క్రీడా లోకం మండిపడుతోంది. సోమవారం ఫార్ములావన్ రేసర్లు గళం విప్పగా... మంగళవారం క్రికెట్, గోల్ఫ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వర్గాలు శ్రుతి కలిపాయి. వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వర్ణ వివక్ష హత్యపై ఘాటుగా స్పందించాడు. గతవారం అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్ అధికారి కర్కశంగా ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి తీశాడు. దీన్ని ఫార్ములావన్ చాంపియన్ హామిల్టన్ ఖండించాడు. తాజాగా స్యామీ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో పాటు సభ్యదేశాలన్నీ ఈ దారుణ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ జాత్యహంకారంలో వీళ్లంతా భాగస్వాములేనని భావించాల్సి వస్తుంది’ అని తీవ్ర స్థాయిలో ట్వీట్ చేశాడు. ఇది కేవలం అమెరికాకే పరిమి తం కాలేదని, జాతి వివక్ష అనేది ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి అని పేర్కొన్నాడు. తను కూడా ఈ వివక్షకు గురైనట్లు డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ చెప్పాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర మాట్లాడుతూ పక్షపాతానికి, జాత్యహంకారానికి చోటు లేని సంస్కృతి కోసం మనమంతా కృషి చేయాలన్నాడు. నిజమైన స్వేచ్ఛ, సమానత్వం ఉన్న ప్రపంచాన్ని నిర్మించాలని, అమెరికాలో ప్రస్తు తం ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు మనందరికీ ఓ గుణపాఠం లాంటిదని అన్నాడు. దిగ్గజ గోల్ఫర్ టైగర్ వుడ్స్ మౌనం వీడి మాట కలిపాడు. ‘నేను ఎల్లప్పుడూ చట్టాన్ని గౌరవిస్తాను. శాంతిభద్రతల కోసం సుశిక్షితులైన అధికార్లు ఇలా తమ పరిధిని నిర్దయగా అతిక్రమించడం నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఫ్లాయిడ్ హత్య నన్ను కలచివేసింది. అతని కుటుంబసభ్యుల మీదే నా ధ్యాస, సానుభూతి వెళుతోంది’ అని ట్వీట్ చేశాడు. బాక్సింగ్ లెజెండ్, అజేయ చాంపియన్ ఫ్లాయిడ్ మేవె దర్... జాత్యహంకారానికి బలైన జార్జ్ అంతి మ సంస్కారాల్లో పాల్గొంటానని, ఖర్చులు భరిస్తానని చెప్పాడు. దీనికి జార్జ్ కుటుంబసభ్యులు అంగీకరించారు. ఈ నెల 9న అతని అంత్యక్రియలు జరుగుతాయి. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) నిరసన గళమెత్తే ఆటగాళ్లను నిరోధించరాదని, మ్యాచ్‌లకు అనుమతించాలని కోరింది. ప్రజల్లో బలమైన ఈ సెంటిమెంటును అణచివేయరాదని కోరింది. జర్మనీలో ఈ వారాంతంలో మ్యాచ్‌లు జరగను న్నాయి. కొందరు ఆటగాళ్లు జార్జ్‌కు న్యాయం చేయాలని నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగనున్న నేపథ్యంలో ‘ఫిఫా’ ఇలా స్పందించింది. -
పాక్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు!
కరాచీ: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ డారెన్ సామీ త్వరలో పాకిస్తాన్ పౌరునిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ పౌరసత్వం కోసం సామీ దరఖాస్తు చేసుకున్నాడట. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పాకిస్తాన్ పౌరసత్వాన్ని పొందుతాడు. 2004లో విండీస్ తరఫున అరంగ్రేటం చేసిన సామీ ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2016లో డారెన్ సామీ కెప్టెన్సీలో విండీస్ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. విండీస్ తరఫున 38 టెస్టుల్లో, 126 వన్డేల్లో, 68 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించిన సామీ.. 2017 సెప్టెంబర్‌లో చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. కాగా విండీస్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో విదేశీ లీగ్‌ల్లో ఆడుతూ సత్తాచాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్రారంభమైన్పపటికి నుంచి రెగ్యులర్‌గా ఆడుతున్నాడు. పీఎస్ఎల్లో పెషావర్ జెల్మీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పీఎస్ఎల్ మెరుపులు మెరిపిస్తూ అక్కడి అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఎంతలా అంటే.. సామి తమ దేశం తరుపున ఆడాలని కోరుకునే ఫ్యాన్స్‌కు కొదవేలేదు.ఇదిలా ఉండగా.. అతనికి గౌరవ పౌరసత్వం ఇవ్వాలని ఆ దేశ ప్రెసిడెంట్‌కు దరఖాస్తు అందింది. పీఎస్ఎల్ జట్టు పెషావర్ జల్మీ ఓనర్ జావిద్ ఆఫ్రిది తాజాగా సామీ దరఖాస్తును పరిశీలనకు పంపించాడు. -
పాక్ అభిమానులను ఫూల్స్ చేసిన క్రికెటర్
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 1 సందర్భంగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ అభిమానులను సరదాగా ఆటపట్టించాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో అదరగొట్టిన ఈ విండీస్ స్టార్.. అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పీఎస్ఎల్లో సామీ పెష్వార్జల్మీ జట్టుకి సారథ్యం వహించిన విషయం తెలిసందే. అయితే గత కొన్నాళ్లుగా విండీస్ జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సామీ.. తాను మళ్లీ తన దేశానికి పాత్రినిధ్యం వహించాలనుకుంటున్నానని, పాక్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాల్గొంటానని ట్వీట్ చేశాడు. ‘మీరు ఇది నమ్మలేరు.. నేను మెరున్(విండీస్ జెర్సీ) జెర్సీ వేసుకొని పాక్‌లో మెరుస్తాను.’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌తో షాక్‌కు గురైన అభిమానులు ఆనందంతో పరవశించిపోయారు. ముఖ్యంగా పాక్ నెటిజన్లు సామీ రాకను స్వాగతిస్తూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. మీ జల్మీ జట్టు సహచరుడు హసన్ అలీ నిన్ను తొలి బంతిని అవుట్ చేయడానికి సిద్దంగా ఉన్నాడు.’ అని ఒకరనగా నీ మాటలు నాకు తియ్యని పాటగా వినబుడుతున్నాయని మరొకరు కామెంట్ చేశారు. అయితే మరికొద్ది సేపట్లోనే వారి ఆనందం ఆవిరయ్యేలా చేశాడు ఈ విండీస్ మాజీ కెప్టెన్. ‘ఇది నేను ఊహించలేదు.. ఇంతటితో మెరున్ జెర్సీలో ఆడాలనే నా ఆలోచన ముగిసింది.’ అని ఏప్రిల్ ఫూల్ చేశాడు. అయితే ఈ ప్రాంక్‌పై సామీ క్షమాపణలు కోరుతూ చాలా మంది తాను జట్టులోకి తిరిగి రావలని కోరుకుంటున్నారని మరో ట్వీట్ చేశాడు. సామీ ట్వీట్‌కు పాక్ అభిమానులు స్పందించడానికి కూడా ఓ కారణం ఉంది. 9 ఏళ్ల తర్వాత విండీస్ జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. పైగా ఈ సిరీస్‌కు విండీస్ సీనియర్ ఆటగాళ్లు సైతం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే సామీ ట్వీట్‌కు వారు అంతగా స్పందించారు. I am sorry guys... but wow so many ppl want to see me back.. #AprilFoolsPrank pic.twitter.com/vzJiCTQFfN — Daren Sammy (@darensammy88) April 1, 2018 Sammy you are welcome always. But this time round your Zalmi mate HASSAN ALI will be waiting to get youout the first ball. Will be good to see you on the field again. I can say on behalf of all Pakistanis that Pakistan genuinely loves you for the way you have loved Pakistan. — MasoodSharif Khattak (@MSharifKhattak) April 1, 2018 -
సూపర్ డ్యాన్స్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
-
వైరల్ : ఇక్కడ బ్రావో.. అక్కడ సామీ
సాక్షి, స్పోర్ట్స్ : మైదానంలో వైవిధ్యమైన డ్యాన్స్‌లతో ఆడుతూ..పాడుతూ ప్రేక్షకులను అలరించే విషయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ఎప్పుడూ ముందుంటారు. వినూత్నమైన డ్యాన్స్‌లను పరిచయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఇలాంటి డ్యాన్స్‌లను విండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో ఐపీఎల్లో మనకెన్నో సార్లు చూపించాడు. అయితే పాకిస్తాన్ సూపర్‌లీగ్‌లో ఈ బాధ్యతను మరో ఆల్‌రౌండర్ డారెన్ సామీ తీసుకున్నాడు. తన ఆట పాటతో చిందేస్తూ అభిమానులు, తోటి ఆటగాళ్లలో జోష్ నింపుతున్నాడు. ఈ లీగ్‌లో పెష్వార్ జల్మీ జట్టుకు సారథ్యం వహిస్తున్న ఈ ఆల్ రౌండర్ తమ జట్టు ఫైనల్‌కు చేరిందన్న ఆనందంతో తోటి దేశవాళి ఆటగాడైన ఆండ్రూ ఫ్లెచర్‌తో కలిసి హోటల్ గదిలో సందిడి చేశాడు. ఫేమస్ బ్రిటీష్ కమెడియన్ మైఖల్ డపా ఆలపించిన ‘మ్యాన్స్ నాట్ హాట్’ అనే ర్యాప్ సాంగ్ పాడుతూ డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పీఎస్ఎల్ లీగ్ మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగగా.. ఫైనల్ మ్యాచ్‌కు కరాచీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం జరిగే తుది పోరులో పెష్వార్ జల్మీ, ఇస్లామాబాద్ యూనైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
గాయంతో క్రీజులోకి.. కెప్టెన్ కీలక ఇన్నింగ్స్!
-
గాయంతో క్రీజులోకి.. కీలక ఇన్నింగ్స్!
షార్జా: గాయంతో బాధపడుతూ క్రీజులోకి దిగినా భారీ హిట్టింగ్తో జట్టును గెలిపించాడు పెషావర్ జల్మీ కెప్టెన్ డారెన్ స్యామీ. గురువారం సాయంత్రం జరిగిన ఉత్కంఠపోరులో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుపై పెషావర్‌ను విజేతగా నిలిపాడు స్యామీ. గాయంతో ఉన్న స్యామీ ఏం ఆడతాడులే అనుకుంటే భారీ షాట్లతో ఏకంగా మ్యాచ్‌నే దూరం చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లాడి 142 పరుగులు చేసి పెషావర్‌కు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. 143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన డారెన్ స్యామీ జట్టు తొలుత బాగానే పరుగులు సాధించినా చివర్లో ఒత్తిడికి లోనైంది. తమీమ్ ఇక్బాల్-మహ్మద్ హఫీజ్ లు 54 పరుగుల భాగస్వామ్యం అనంతరం పెషావర్ టీమ్ వికెట్ కోల్పోయింది. పరుగులు రాకపోవడం, వికెట్ పడటంతో స్యామీ సేన విజయానికి 7 బంతుల్లో 16 పరుగులు కావాలి. ఎడకాలికి గాయంతో బాధపడుతున్నా స్యామీ క్రీజులోకి వచ్చాడు. 19వ ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాది పెషావర్‌లో ఆశలు నింపాడు. గ్లాడియేటర్ బౌలర్ అన్వర్ అలీ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన స్యామీ, నాలుగో బంతిని లాంగాఫ్ దిశగా ఫోర్ కొట్టగానే సంబరాలు మొదలయ్యాయి. కేవలం 4 బంతులాడిన కెప్టెన్ స్యామీ 2 సిక్సర్లు, ఫోర్ బాది 16 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెషావర్ జల్మీ నాలుగో స్థానంలో నిలిచింది. -
ఇదే నా మీ తొలి చర్య?
ఆంటిగ్వా: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్‌ను అర్థాంతరంగా తొలగించడంపై ఆ జట్టు మాజీ టీ 20 కెప్టెన్ డారెన్ స్యామీ తీవ్రంగా ధ్వజమెత్తాడు. అనవసరపు పట్టింపులకు పోయి జట్టును సర్వం నాశనం చేయడమే విండీస్ క్రికెట్ బోర్డు లక్ష్యంగా కనబడుతుందని విమర్శనాస్త్రాలు సంధించాడు. మరో రెండు రోజుల్లో యూఏఈలో పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని కోచ్ పదవి నుంచి సిమ్మన్స్ తప్పించడం బోర్డు అనాలోచిత చర్యగా స్యామీ పేర్కొన్నాడు. విండీస్ క్రికెట్ ను గాడిలో పెట్టడానికి చేపట్టిన తొలి చర్య ఇదేనా? అంటూ బోర్డు పెద్దలను ప్రశ్నించాడు. 'నన్ను తొలగించడంతో బోర్డు పెద్దల నైజం బయటపడింది. ఇప్పుడు ఒక పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా కోచ్‌నే తీసేశారు. అది కూడా ఒక పర్యటనకు రెండు రోజుల ముందు కావడం బోర్డు దురుసు ప్రవర్తనకు అద్దం పడుతుంది. గుడ్డిగా వెళితే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామన్న సంగతి గుర్తించుకుంటే మంచిది' అని స్యామీ చురకలంటిచాడు.