బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ ఆల్రౌండర్ డారెన్ సామీ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. విండీస్ క్రికెట్ కెప్టెన్గా ఉద్వాసనకు గురైన సామీ అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. గత శుక్రవారం సామీని కెప్టెన్గా తొలగించి వికెట్ కీపర్ దినేశ్ రాందిన్ను నియమించారు.
టెస్టు క్రికెట్ నుంచి సామీ దూరమైనా ఇతర ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డుకు తెలియజేశాడని పేర్కొంది. విండీస్ టి-20 జట్లుకు సామీనే సారథ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 2010 నుంచి మే 2014 వరకు టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. తన సారథ్యంలో ఆడిన 30 టెస్టుల్లో 8 విజయాలు, 12 పరాజయాలు, 10 డ్రాలు నమోదు చేశాడు.
టెస్టు క్రికెట్కు సామీ గుడ్ బై
Published Sat, May 10 2014 5:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement
Advertisement